Breaking News

Daily Archives: February 24, 2016

ఉర్దూభాషకు హలి, శిబ్లి సేవలు మరువలేనివి

  – రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉర్దూ భాషకు ప్రఖ్యాత ఉర్దూ రచయితలు హలి, శిబ్లిలు చేసిన సేవలు మరువలేనివని, వారికీర్తి మరిన్ని తరాలకు చేరాల్సి ఉందని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో హలి, శిబ్లి హిందుస్థాన్‌లో ఇద్దరు గొప్ప మేధావులు అనే అంశంపై రెండ్రోజుల జాతీయ సెమినార్‌ బుధవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ హలి, శిబ్లి అనే ఉర్దూ రచయితలు ...

Read More »

తెరాసలో చేరిన ఎంపిపి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని పెర్కిట్‌ గ్రామ శివారులోగల బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి గృహంలో బుధవారం మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, తిమ్మాపూర్‌ సర్పంచ్‌ ఉగ్గెర భూమేశ్వర్‌, దొన్కల్‌ సర్పంచ్‌ పడాల సత్తమ్మ, ఉప సర్పంచ్‌ హనుమాగౌడ్‌, దోన్‌పాల్‌, ఒడ్యాట్‌గ్రామాల ఎంపిటిసి డాక్టర్‌ జైవీర్‌, వేల్పూర్‌ మండలంలోని జాన్కంపేట గ్రామ సర్పంచ్‌ పలువురు ఎమ్మెల్యే సమక్షంలో తెరాసలో చేరారు. తెరాసలో చేరిన ప్రజాప్రతినిదులకు పార్టీ కండువాలతో స్వాగతించారు. తెరాస ప్రభుత్వం అభివృద్ది చేస్తున్న ...

Read More »

దుమ్ములేపిన విద్యార్థుల చిందులు

  కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం నిర్వహించిన ఆర్యభట్ట జూనియర్‌ కళాశాల వార్షికోత్సవంలో విద్యార్తులు చిందులు వేస్తూ దుమ్ములేపారు. విద్యార్థినిలు, విద్యార్థులు పలు సినీ, జానపద, ప్రయివేటు గేయాలపై కేరింతలతో నృత్యాలు చేశారు. సోలో, గ్రూప్‌ పర్‌ఫార్మెన్స్‌లతో ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. తోటి విద్యార్థులు కేరింతల నడుమ ఉత్సాహంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్తులు పాల్గొన్నారు.

Read More »

సామాజిక సమస్యల స్పందనే కవిత్వం

  కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక సమస్యల స్పందనే కవిత్వమని, సగటు మనిషికి బాసటగా నిలిచే కవిత్వాన్ని అందించడం సామాజిక బాధ్యతకు నిదర్శనమని ప్రముఖ రచయిత కొల్లు రంగారావు అన్నారు. బుధవారం కామారెడ్డి రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ కార్యాలయంలో సాహితీ సమాలోచనం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి గంగాప్రసాద్‌ రాసిన ఆక్రందన, మొర అనే రెండు కవితా సంపుటులను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంగాప్రసాద్‌ కవిత్వంలో, ...

Read More »

జివో 727 రద్దు చేయాలని ఆర్డీవోకు వినతి

  కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికులకు అన్యాయం చేసేలా ఉన్న జివో 727 రద్దు చేయాలని బుధవారం బిఎస్‌పి నాయకులు కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు శివరాజ్‌ మాట్లాడుతూ బీడీ కార్మికులు ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు చెందినవారు ఉన్నారని, వారికి న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే జివో 727 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బిఎస్‌పి నాయకులు బాగయ్య, ...

Read More »

పైప్‌లైన్‌ పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 10వ వార్డు డెయిలీ మార్కెట్లో బుధవారం పైప్‌లైన్‌ నిర్మాణ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు లక్ష రూపాయల వ్యయంతో పైప్‌లైన్‌ పనులు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కైలాస్‌ లక్ష్మణ్‌రావు, నిమ్మ దామోదర్‌రెడ్డి, ఏఇ. గంగాధర్‌, కాలనీవాసులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులకు సాప్ట్‌స్కిల్స్‌పై అవగాహన

  కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో బుధవారం సాప్ట్‌స్కిల్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. దేశ్‌పాండే ఫౌండేషన్‌ ఆద్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు. ఫౌండేషన్‌ ట్రేనర్‌ కెనడా దేశస్థుడైన అన్నా బర్క్‌ శిక్షణ ఇచ్చారు. విద్యార్తులను అడిగి సందేహాలను నివృత్తి చేశారు. సాప్ట్‌స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకుంటే విద్యార్థులు భవిష్యత్తులో రాణిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల సిఇవో హరిస్మరణ్‌రెడ్డి,డైరెక్టర్‌ బాలాజీరావు, ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

14వ వార్డులో ఛైర్‌పర్సన్‌ పర్యటన

  కామరెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డులో బుధవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పర్యటించారు. పర్యటనలో భాగంగా వార్డులో తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సూచించారు. వార్డులోనెలకొన్న సమస్యను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిస్కాసానికి శాయశక్తులా కృసి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శానిటరీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిపివో హరి, వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

పన్నుల వసూలు వేగవంతం చేయాలి

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి రావాల్సిన పన్నుల బకాయిల వసూలు వేగవంతం చేయాలని డిపివో కృష్ణమూర్తి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం మండలంలోని బంజేపల్లి గ్రామపంచాయతీలో కార్యదర్శులతో సమావేశమయ్యారు. జిల్లాలో 4 కోట్ల 26 లక్షల 68 వేలు పన్నులు వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 2 కోట్లు వసూలు అయినట్టు ఆయన తెలిపారు. 88 గ్రామ పంచాయతీలకు నూతనంగా భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరైనట్టు చెప్పారు. కార్యక్రమంలో ...

Read More »

గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లు పూర్తిచేయాలి

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డివిజన్‌లోని అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని పైలట్‌ గ్రామంగా ఎంపిక చేయడంజరిగిందని, వీటిలో వందశాతం మరుగుదొడ్లు నిర్మిండానికి చర్యలు తీసుకుంటున్నామని బోదన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం స్థానిక తహసీల్‌ కార్యాలయంలో మండలాధికారులతో సమావేశమయ్యారు. ఆయా శాకల పనితీరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బోధన్‌ డివిజన్‌లో భూపంపిణీ కోసం 330 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగిందని, మరో 200 ఎకరాలు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ...

Read More »

మత్తుపదార్థాలు స్వాధీనం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాందేడ్‌-సంగారెడ్డి జాతీయ రహదారి గుండా క్లోరో హైడ్రేటు, మాదక ద్రవ్యాలను తరలిస్తున్న వాహనాన్ని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు మెదక్‌జిల్లా సంగారెడ్డి ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 8 గంటలకు మహారాష్ట్ర నుంచి మెదక్‌ జిల్లాకు కారులో క్లోరో హైడ్రేటు, మత్తుపదార్థాలు తరలిస్తుండగా గమనించిన ఎక్సైజ్‌ అధికారులు వెంబడించారు. కారు డ్రైవర్‌ వెంకట్‌రెడ్డి కారును వెలగనూరు శివారులో ఆపి మత్తు పదార్థాల బస్తాలను కిందపారేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. కారును ...

Read More »

డాక్టర్లు విదుల పట్ల అశ్రద్ద వహిస్తే కఠిన చర్యలు

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా ఆర్మూర్‌,, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది పనివేళలకు అనుకూలంగా విధుల్లో ఖచ్చితంగా ఉండాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా హెచ్చరించారు. బుధవారం ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనికీ సమయంలో విధుల్లో లేని డాక్టర్‌ నారాయణకు షోకాజ్‌ నోటీసులు జారీచేయాలని, ఉదయం విధులు నిర్వహించి మధ్యాహ్నం విధులకు రాని దంత సహాయ సర్జన్‌ ...

Read More »

నర్సింగాపూర్‌ గ్రామాన్ని డిజిట్‌ఆన్‌ గ్రామంగా దత్తత తీసుకున్న తెవివి

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం నర్సింగాపూర్‌ గ్రామంలో ప్రతి ఇంటికి ఒక డిజిటల్‌ అక్షరాస్యున్ని తయారుచేయడానికి ఆ గ్రామాన్ని తెలంగాణ యూనివర్సిటీ దత్తత తీసుకుందని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. మొత్తం 274 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో మొత్తం 20 గంటల శిక్షణ ద్వారా ప్రతి ఇంట్లో ఒకరికి డిజిటల్‌ అక్షరాస్యత నేర్పిస్తామన్నారు. ఇది డిజిటాన్‌ కార్యక్రమం కింద చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. సర్పంచ్‌ సువర్ణ, కార్యక్రమ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సి.హెచ్‌.ఆర్తి, ...

Read More »

ఉల్లాసంగా.. ఉత్సాహంగా… వీడ్కోలు

  పిట్లం, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బాలికల పాఠశాలలో విద్యార్తులు బుధవారం ఉల్లాసంగా ఉత్సాహంగా వీడ్కోలు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్తులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థినిలు ఆటలు-పాటలతో, ఉపన్యాసలతో నాటికలతో అదరగొట్టారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సుజాత మాట్లాడుతూ విద్యార్తులకు చదువుతోపాటు ఆటలు, పాటలు కూడా ముఖ్యమేనన్నారు. 10వ తరగతి విద్యార్తులు ఇన్నిరోజుల పాటు ఇక్కడ చదువుకుని వెళ్లిపోతున్నందుకు బాధగా ఉందన్నారు. వారు ఉన్నత ...

Read More »

బాసరలో 34 రోజుల హుండి లెక్కింపు

  బాసర, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 34 రోజులకు సంబంధించిన బాసర అమ్మవారి హుండిని బుధవారం లెక్కించినట్టు ఆలయ సూపరింటెండెంట్‌ సాయిలు తెలిపారు. ఈ మేరకు లెక్కింపులో 37 లక్షల 78 వేల 87 రూపాయల నగదు వచ్చిందని, అదేవిధంగా మిశ్రమ బంగారం 91 గ్రాములు, వెండి 2 కిలోల 486 గ్రాములు, విదేశీ కరెన్సీ 7 డాలర్లు వచ్చినట్టు తెలిపారు.

Read More »

రైతులకు కరువు నిధులు వెంటనే విడుదల చేయాలి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండు సంవత్సరాలుగా వర్షాభావ పరిస్థితులు సరిగా లేక వేసిన పంటలు చేతికి రాక ఎండిపోయి, అప్పు, సొప్పులు చేసి పంటలు పండకపోవడంత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతాంగానికి ఎకరానికి 20 వేల చొప్పున కరువు నిదులను తెరాస ప్రభుత్వం అందించాలని మాజీ ప్రభుత్వ విప్‌ ఈరవత్రి అనిల్‌ అన్నారు. బుధవారం మోర్తాడ్‌ సర్పంచ్‌ దడివె నవీన్‌ నిర్వహించిన పుట్టుపంచల కార్యక్రమానికి విచ్చేసి చిన్నారులను ఆశీర్వధించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ...

Read More »

హరితహారంలో 453 లక్షల మొక్కలు నాటడానికి కార్యాచరణ

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా ఆర్మూర్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే సంవత్సరం రాష్ట్రంలో నిర్వహించే తెలంగాణ హరిత హారం కార్యక్రమానికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వికాస్‌రాజ్‌ జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖాధికారులను కోరారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా కలెక్టర్లు , సంబందిత అధికారులతో హరితహారం కార్యాచరణ ప్రణాళికపై మాట్లాడారు. అందుబాటులో ఉన్న నర్సరీలు, విత్తిన మొక్కలు, మొక్కలు నాటడానికి గుర్తించిన స్థలాలు ...

Read More »

ప్చ్..!: ఎమ్మెల్యేల, మంత్రులపై కెసిఆర్ రహస్య సర్వే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజకవర్గాలలో రహస్యంగా సర్వే నిర్వహించారని తెలుస్తోంది. ఈ సర్వేల్లో ముప్పై శాతం మంది ప్రజాప్రతినిధుల పైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కెసిఆర్ గుర్తించారని తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాలలోను కెసిఆర్ రహస్య సర్వే చేయించారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో కెసిఆర్ పైన ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో సానుకూలంగా ఉంది. కె సిఆర్‌తో పాటు మంత్రులు ...

Read More »

ఘనంగా గంగమ్మ ఉత్సవాలు

కామారెడ్డి పట్టణం,: గంగమ్మా.. మముగనుమా అంటూ కామారెడ్డిలో ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. పట్టణంలో గంగామాత చతుర్దశ వార్షికోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. బోనాలు, వలతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం పెద్దచెరువు వద్దకు వెళ్లి గంగమ్మ ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. ఆలయం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Read More »

సీతారాముల వన విహారం

డిచ్‌పల్లి : జిల్లాలోనే ప్రసిద్ధి పొందిన డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సీతారాముల వనవిహారం వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు హోమం, పూర్ణాహుతి, మధ్యాహ్నం గ్రామ శివారులోని మామిడితోటలో సీతారాముల ఉత్సవ మూర్తులను వనవిహారం చేయించారు. జి ల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చక్రతీర్థం(జాతర)ను ఘనంగా నిర్వహించారు. జాతరలో తినుబండారాలు, ఆట వస్తువుల దుకాణాలు భారీగా వెలిశాయి. పి ల్లలు ఉయ్యాలలు ఎక్కి ఊగుతూ కేరింతలు కొట్టారు. వేలాది మంది భక్తులతో ...

Read More »