Breaking News

Daily Archives: February 25, 2016

నిజాంసాగర్‌ ప్రాజెక్టులో పూడికతీత

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పూడికతీత పనులు చేపట్టడం జరుగుతుందని ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో పూడికతీత పనులు మొదటిసారిగా నిజామాబాద్‌ జిల్లాలో ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎకరానికి 20 ట్రిప్పులను, ట్రాక్టర్‌ల ద్వారా మట్టిని తరలించడం జరుగుతుందని, ఒక ట్రిప్పు ట్రాక్టర్‌ వెళ్ళి రావడానికి 5 కి.మీల దూరంలో ఉంటే ఒక ట్రిప్పుకు 180 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందన్నారు. ముందస్తుగా ...

Read More »

అపరిచితులకు ఎటిఎం పిన్‌కోడ్‌లు చెప్పొద్దు

నందిపేట, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేము ఆంధ్రాబ్యాంకు మెయిన్‌ నుంచి మాట్లాడుతున్నామని ఆగంతకులు ఓ వ్యక్తికి ఫోన్‌చేశారు. వివరాలన్ని అడిగి తెలుసుకొని తీరా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు డ్రా చేశారు. ఈ సంఘటన నందిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నందిపేట మండలం బాద్గుణ గ్రామానికి చెందిన జె.రవికి ఫోన్‌కాల్‌వచ్చింది. తాము ఆంధ్రాబ్యాంకు మెయిన్‌ బ్రాంచ్‌ నుంచి మాట్లాడుతున్నామని ఆధార్‌కార్డునెంబరు, ఏటిఎం పిన్‌ నెంబరు, అకౌంట్‌నెంబర్లన్ని అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా రూ. 12500 నగదు డ్రాచేశారు. విషయం తెలుసుకున్న ...

Read More »

అక్రమంగా అమ్మిన శిశువు స్వాధీనం

నందిపేట, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం మండలంలోని వన్నెల్‌ (కె) గ్రామంలో ఐసిడిఎస్‌ అధికారులు అక్రమంగా కొనుగోలు చేసిన మగశిశువును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... 28.12.2015 రోజున ఆర్మూర్‌లో డాక్టర్‌ సంతోష్‌ ఆర్‌ఎంపి మధ్యవర్తిగా ఉండి గుర్తు తెలియని మహిళ ప్రసవించిన రెండురోజుల మగ శిశువును రూ. 35 వేలకు గట్టడి ఇందిరా, రాజు దంపతులకు విక్రయించారు. ఈ విషయం గురువారం ఐసిడిఎస్‌ అధికారులకు 1098 కాల్‌సెంటరు ద్వారా అపరిచిత వ్యక్తి ఫిర్యాదు చేశారు. అధికారులు గ్రామానికి ...

Read More »

వైభవంగా బోనాల ఊరేగింపు

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్కనూరు మండలం పొందుర్తి గ్రామంలో గురువారం గ్రామ దేవతలకు బోనాల ఊరేగింపు నిర్వహించారు. శ్రీపెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా ముదిరాజ్‌ సంఘం ఆద్వర్యంలో మహిళలు బోనాల ఊరేగింపు వైభవంగా జరిపారు. మూడు రోజుల పాటు పెద్దమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ముదిరాజ్‌ సంఘం ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం శ్రీపెద్దమ్మ కళ్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు గంగాకిషన్‌, నర్సింలు, రవి, ఎల్లయ్య, విఠల్‌, స్వామి, శేఖర్‌, చంద్రం, తదితరులు పాల్గొన్నారు.

Read More »

సిసి డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో గురువారం మురికి కాలువల నిర్మాణం, కల్వర్టు నిర్మాణ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు రూ. 4 లక్షలతో కాలువ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కుంబాల రవి, ముప్పారపు ఆనంద్‌, ఎ.ఇ. గంగాధర్‌, వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు కిషన్‌, రవిందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

హైడర్‌ రాళ్లపై పడి వ్యక్తి మృతి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒరిస్సాకు చెందిన మాన్సూ (40) అనే వ్యక్తి హైడర్‌ రాళ్లపై పడి మృతి చెందినట్టు ఆర్మూర్‌ ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ గురువారం తెలిపారు. వివరాల్లోకి వెళితే మాన్సూ, రామునాహక్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఒరిస్సా నుంచి బతుకు దెరువు కోసం ఆర్మూర్‌ వచ్చి సురేశ్‌ నాయుడు కు చెందిన ఇటుక బట్టిలో పనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఆర్మూర్‌ కు వచ్చి మద్యం సేవించి తిరిగి ఇటుక బట్టికి వెళుతుండగా మాన్సూ నల్లపోచమ్మ ...

Read More »

నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటాం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో నెలకొన్న నీటి ఎద్దడి నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ పట్టణంలో నెలకొన్న నీటి సమస్యను తీర్చేందకు ట్యాంకర్ల ద్వారా నీటి సరపరా చేస్తున్నట్టు ఆమె వివరించారు. ఎక్కడెక్కడ నీటి సమస్య ఉందో ఆయా వార్డులను గుర్తించి రోజువారిగా నీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

Read More »

ప్రశాంతంగా మునిసిపల్‌ సమావేశం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పురపాలక సాధారణ సమావేశం ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు అద్యక్షతన గురువారం మునిసిపల్‌ సమావేశ గదిలో జరిగింది. సమావేశానికి మునిసిపల్‌ కౌన్సిలర్లు, ఫ్లోర్‌ లీడర్లు, అధికారులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం నుంచే నీటి ఎద్దడిపై వివిధ పార్టీల కౌన్సిలర్లు పాలకవర్గాన్ని నిలదీశారు. నీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఛైర్మన్‌ను కోరారు.

Read More »

ఆహారభద్రతకు పరిశోధనలు అవసరం

- వైస్‌ఛాన్స్‌లర్‌ సి.పార్థసారధి డిచ్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశ జనాభా 2030 సంవత్సరం వరకు 130 కోట్లకు చేరుకుంటుందని, వారందరికి ఆహారభద్రత సమకూర్చాలంటే మరిన్ని పరిశోధనలు అవసరమని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ సి.పార్థసారధి అన్నారు. గురువారం బయోటెక్నాలజి సెమినార్‌ ప్రారంభిస్తూ ఆయన దేశజనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులు పెరగాలంటే కొత్త టెక్నాలజీలు మరింతగా రావాల్సిన అవసరముందన్నారు. వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులతో, వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొనుందని, కొత్త తరహా పరిశోధనలు, టెక్నాలజీతో ఆహారభద్రత ...

Read More »

అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తిచేయాలి

మోర్తాడ్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చేపడుతున్న డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌, స్వచ్ఛభారత్‌ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయా గ్రామాల సర్పంచ్‌ల నుద్దేశించి మోర్తాడ్‌ ఎంపిడివో శ్రీనివాస్‌ అన్నారు. గురువారం మండలంలోని రామన్నపేట్‌, సుంకెట్‌ గ్రామాలను సందర్శించి పలు అభివృద్ది పనులను పరిశీలించారు. సుంకెట్‌లో తాగునీటి ఎద్దడి నెలకొందని, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా జిపి పాలకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి వెంటనే ...

Read More »

ముగిసిన ఉర్దూ సెమినార్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో జరిగిన రెండ్రోజుల జాతీయ సెమినార్‌ గురువారంతో ముగిసింది. హలి, శిబ్లి కవుల సాహిత్యసేవపై జరిగిన రెండ్రోజుల జాతీయ సెమినార్‌లో దాదాపు 200 మంది ఉర్దూ అధ్యాపకులు, సాహితీ వేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. వారు వివిధ అంశాలపై సిద్ధాంత పత్రాలు చదివి వినిపించారు. వారికి సర్టిఫికెట్లు ఉర్దూ విభాగం తరఫున ప్రదానం చేశారు. విభాగం హెడ్‌ డాక్టర్‌ అతర్‌ సుల్తానా, బిఓఎస్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ అబ్దుల్‌ ఖవి, ...

Read More »

నేటి నుండి గాండ్లపేట్‌లో శివపార్వతుల విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు

మోర్తాడ్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గాండ్లపేట్‌ గ్రామ శివారులోగల పెదవాగు పక్కనే గాండ్ల పేట్‌ గ్రామస్తులు శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని నూతనంగా నిర్మించారు. శుక్రవారం నుంచి ఆలయంలో మూడురోజుల పాటు శ్రీశివపార్వతుల విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం అష్ట నక్షత్రం, శివపంచాయతన ప్రతిష్ట, 27న పుణ్యాహవచనం, రుద్ర హోమం, హారతి, మంత్ర పుష్పం, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. 28న హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి తీర్థస్వామి జగద్గురు శంకరాచార్య కరకమలములచే శివపార్వతుల విగ్రహ ప్రతిష్ట, ...

Read More »

రెవెన్యూ భూముల వివరాలు కంప్యూటరైజ్డ్‌ చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూముల వివరాలు సరైన పద్దతిలో నమోదు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర భూమి కొలతల ముఖ్య కమీషనర్‌ రేమండ్‌ పీటర్‌ జిల్లాల కలెక్టర్లకు తెలిపారు. గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెవెన్యూ అంశాలపై జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఫారం-1, 1బి, 7, కాస్లా రిజిష్టర్లను మా భూమి పోర్టర్‌లో రికార్డుచేసి అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఈ సమాచారాన్ని ప్రజలకు ఉపయోగకరంగా ...

Read More »

కాళేశ్వరం ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు

- ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి సదాశివనగర్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్పు చేసి కాళేశ్వరం ద్వారా సదాశివనగర్‌ మండలంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందేవిధంగా కృషి చేస్తున్నామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం మండలంలో ధర్మారావుపేట, ముద్దోజివాడి గ్రామాల్లోని రిజర్వాయర్‌కు స్థలపరిశీలన చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలంగాణ ప్రాంతంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడానికి విశేష కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో దర్మారావుపేట సర్పంచ్‌ వాణి విద్యాధర్‌రావు, ఉప సర్పంచ్‌ ...

Read More »

పదిలో మంచి ఫలితాలు సాధించాలి

పిట్లం, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 10వ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వందకు వందశాతం ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎంపిపి రజనీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బాలికల ఉర్దూ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలని, ఇక్కడ విజయం సాధిస్తేనే ముందకు వెళతామన్నారు. ముస్లిం యువతులు చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రస్తుతం 36 మంది విద్యార్థులు ఉండగా, వచ్చే సంవత్సరం అధికంగా ఉండేట్లు ఉపాద్యాయులు చూడాలన్నారు. ...

Read More »

ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా చెరువు మట్టి సరఫరా

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఎస్సీ, ఎస్టీ సన్నకారు రైతులకు ఉచితంగా పంట భూములకు చెరువు మట్టి సరఫరా చేస్తున్నట్టు ఎపివో సుదర్శన్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఉపాధి హామీ కార్యాలయంలో క్షేత్ర సహాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంసాగర్‌, సింగీతం, మత్తడి, నల్లవాగు లనుండి పూడికతీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సన్న, చిన్న కారు రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పంట ...

Read More »

విద్యార్థులు ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్లాలని ప్రముఖ వక్త అప్పాల ప్రసాద్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో గురువారం శ్రీభారతి, శ్రీవిజ్ఞాన్‌ కళాశాలల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన ప్రసాద్‌ మాట్లాడారు. అరుంధతి ప్రాశస్త్యం, అంబేడ్కర్‌ విలువలు, అబ్దుల్‌ కలాం కర్తవ్య నిర్వహణ గురించి విద్యార్థులకు వివరించారు. నేటియువత వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. కళాశాల డైరెక్టర్‌ అశోక్‌రావు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అభ్యసించి యువత జీవితంలో ...

Read More »

శీతల మృత్యు గహ్వరం సియాచిన్

యాచిన్’’అంటే స్థానిక భాషలో గులాబీల తోట! బహుశః మృత్యుదేవతకది గులాబీల తోటయ్యుంటుంది! సైనికులకది మృత్యు గహ్వరమే… ప్రపంచం మొత్తం మీద అత్యున్నత అత్యంత శీతల సైనిక స్థావరం అదే! సముద్ర మట్టానికి ఐదువేల ఏడువందల యాభై మూడు మీటర్ల ఎత్తున వున్న రుూ మంచు శిఖరం మీద అకస్మాత్తుగా చెలరేగే మంచు తుఫానుల వేగం గంటకి 160 కిలోమీటర్లుంటుంది. సియాచిన్ స్థావరాన్ని 1984లో పాక్ సైన్యాలను తరిమికొట్టి ఆక్రమించుకున్న మన పదాతి దళం- వీరజవాన్‌లు అప్పటినుంచీ, అహర్నిశలూ కాపలా కాస్తూనే వున్నారు. ఈ నిర్జీవ ...

Read More »

ఎవరీ ఛమ్మక్ చంద్ర? ఎక్కడివాడు? మోసగాడే?

హైదరాబాద్ : తెలుగులో టీవి చూసే చాలా మందికి పరిచయం అక్కర్లేని పేరు ఛమ్మక్ చంద్ర. అయితే ఆయన ఈ రోజు కొన్ని ఊహించని కారణాలతో వార్తలకు ఎక్కారు. స్వాతి నాయుడు అనే ఆమె ఛమ్మక్ చంద్రపై పచ్చి మోసగాడని, అమ్మాయిలను గెస్ట్ హౌస్ లకు పిలిపించుకుంటాని ఆరోపణలు చేసింది. ఆమె ఈ విషయాలని వివరిస్తూ వీడియో విడుదల చేసి సంచలనం రేపింది. తన గెస్ట్ హౌస్ లకు పిలిచి లైంగిక దాడులకు పాల్పడుతున్న చంద్ర..చాలా మంది ఆడవాళ్లని మోసం చేసాడని, వేషం ఇప్పిస్తానని ...

Read More »

పచ్చని సంసారాలను బుగ్గి పాల్జేస్తున్న సామాజిక మాధ్యమాలు

దుబాయ్ లో గత ఏడాది నమోదు కాబడిన పలు వైవాహిక విభేదాలకు సామాజిక మాధ్యమాలు ముఖ్య కారణమవుతున్నట్లు ఒక అధ్యయనం తెలిపింది. ‘  పేస్ బుక్ ,  ట్విట్టర్ , వాట్సాప్ ‘ తదితర సామాజిక మాధ్యమాలు భార్య భర్తల అనుబంధం మధ్య అనుమాన కుంపట్లు రగిలిస్తున్నాయి. ఇంటర్నెట్ లో ఇరువురి నడుమ రహస్య పరిచయాలు వైవాహితెర స్నేహాలు అనేక సమస్యలను సృష్టించడమే కాక కొన్ని సందర్భాలలో అవి విడాకులతో ముగుస్తున్నాయి. ఈ విషయాలను ఇటీవల ‘ దుబాయ్ కమ్యునిటీ అభివృద్ధి సంస్థ ‘ ...

Read More »