Breaking News

Daily Archives: February 26, 2016

ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట ధర్నా

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి డిఎం నిరంకుశ వైఖరి నిరసిస్తూ శుక్రవారం కామారెడ్డి ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమ చార్జిషీట్లు, యూనియన్‌ నాయకులపై డిఎం కక్ష సాధింపు చర్యలు నిరసిస్తూ ధర్నా చేపట్టమన్నారు. డిఎం తన వైఖరి మార్చుకోవాలని, చార్జిషీట్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జేఏసి నాయకులు రమేశ్‌, మూర్తి, రాంచందర్‌, తిరుపతి, శేఖర్‌, సంగారెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.

Read More »

ఉత్సాహంగా చాటర్‌నైట్‌ ఉత్సవాలు

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోటరీక్లబ్‌ 40 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలో చాటర్‌ నైట్‌ ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుతున్నారు. నాటి నుంచి నేటి వరకు విధి నిర్వహణలో సేవలందించిన పూర్వ అధ్యక్షులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసిస్టెంట్‌ గవర్నర్‌ వేద్‌ప్రకాశ్‌ మిఠల్‌ మాట్లాడుతూ అందరి అభిమానంతో 40 ఏళ్ళుగా క్లబ్‌ ఆధ్వర్యంలో సేవాదృక్పథంతో ముందుకెళుతున్నామన్నారు. ప్రజల ఆదరణతో స్వచ్చంద కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగ్గవిషయమన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిదులు శ్రీశైలం, ...

Read More »

తాగునీటి ఎద్దడి నివారణకు కృషి

కామరెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తున్నామని మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ తెలిపారు. పట్టణంలోని 8వ వార్డు రాజీవ్‌నగర్‌ కాలనీలో శుక్రవారం ఆమె బోరుమోటారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మునిసిపల్‌ సాధారణ నిధులు రూ. 2 లక్షలతో కాలనీలో వేసవి దృష్టిలో ఉంచుకొని బోరు తవ్వించినట్టు తెలిపారు. బోరు తవ్వించి మోటారు బిగించి నీటి సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ యాదమ్మ, నాయకులు ప్రసాద్‌, కాలనీవాసులు సురేశ్‌, ...

Read More »

వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయండి

బీర్కూర్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలోగల మంజీర నదిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆయన వంతెన నిర్మాణ పనులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర, తెలంగాణకు అనుసంధానంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతం చేయాలని గుత్తేదారును ఆదేశించారు. నిర్మాణ పనుల దృష్ట్యా దెగ్లూర్‌, మద్నూర్‌, జుక్కల్‌, బీర్కూర్‌ గ్రామాల ప్రజలు ప్రస్తుతం ఈ దారినే ఆశ్రయిస్తున్నారని, వంతెన ...

Read More »

పెంట ఎరువుల ఎగుమతి

బాన్సువాడ, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల అవగాహన లేమి వారికి శాపంగా మారుతోంది. తాత్కాలిక ప్రయోజనం కోసం సారవంతమైన ఎరువులను అమ్ముతూ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. బోధన్‌ ప్రాంతంలో పెంట ఎరువుల విక్రయాలు ఊపందుకున్నాయి. ప్రతీయేటా ఇక్కడి రైతులు పెంట ఎరువులు విక్రయిస్తుంటారు. ఆర్మూర్‌, కోరుట్ల ప్రాంతాలకు చెందిన కొందరు ఇక్కడ ఎరువులను కొనుగోలు చేస్తూ ఆయా ప్రాంతాలకు తరలించుకుపోతారు. పశువుల పేడ, ఇతర వ్యర్థాల నుంచి సారవంతమైన ఎరువు తయారవుతుంది. భూసారాన్ని పెంపొందించడానికి ఈ ఎరువులు ఎంరతో ఉపయోగపడతాయి. ...

Read More »

మంటల్లో ఇల్లు దగ్ధం

సదాశివనగర్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలరలోని ధర్మారావుపేట గ్రామంలో ప్రమాదవశాత్తు మంటల్లో ఇల్లు దగ్దమైనట్టు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గొల్ల కిష్టవ్వ, నర్సింలు కు చెందిన నివాసపు ఇల్లు దగ్దమైందన్నారు. ఇంట్లో దీపం వెలిగించి కూలిపనికి వెళ్ళి వచ్చేసరికి మంటలు వ్యాపించాయని, దీంతో పక్కనే ఉన్న నర్సింలు ఇంట్లోని సామాన్లు కాలిపోయాయని అన్నారు. ప్రమాదంలో 40 వేల నగదు, 5 క్వింటాళ్ళ బియ్యం, 30 వేల విలువగల బట్టలు అగ్నికి ఆహుతయ్యాయని అన్నారు. ...

Read More »

సైన్స్‌డే సందర్భంగా క్విజ్‌ పోటీలు

బీర్కూర్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సైన్స్‌డే పురస్కరించుకొని వారధి సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని నెమ్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. సైన్స్‌ ప్రశ్నలు అడిగారు. విద్యార్థుల్లో సృజనాత్మక వెలికితీయడంలో భాగంగా సైన్స్‌డే సందర్భంగా పోటీలు నిర్వహించామని సంస్థ అద్యక్షుడు మహేందర్‌రెడ్డి తెలిపారు. పోటీల్లో 6 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా, ప్రథమ స్థానంలోదుర్కి పాఠశాల, ద్వితీయ స్థానంలో దామరంచ పాఠశాల విద్యార్థులు నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో వారది సంస్థ సభ్యులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ...

Read More »

విద్యతోనే దేశ, రాష్ట్ర ప్రగతి

- రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్య అనేది దేశ, రాష్ట్ర ప్రగతికి ప్రధాన అంశమని, విద్యలేని సమాజం అభివృద్ది చెందడానికి అవకాశం ఉండదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం బాన్సువాడ మండలం దేశాయిపేటలో నూతనంగా నిర్మించిన పాఠశాల అదనపు గదులను ప్రారంభించి అనంతరం మాట్లాడారు. అమెరికా, ఢిల్లీ, హైదరాబాద్‌లో చదువుకున్న వారికి ఉన్న గౌరవం, డబ్బున్నవారికి లేదని తెలిపారు. ఈనెల ప్రారంభంలో 1వ తేదీ ...

Read More »

తెవివిని సందర్శించిన మానవ వనరుల మంత్రిత్వశాఖ ప్రతినిధి

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ కన్సల్టెంట్‌ ఎన్‌.పరమేశ్వరన్‌ శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శించారు. ఆయన తెలంగాణ యూనివర్సిటీలోని వైఫై సౌకర్యాన్ని పరిశీలించడానికి వచ్చారు. తెలంగాణ యూనివర్సిటీ అందిస్తున్న వైఫై సౌకర్యం దేశానికే ఆదర్శమని ప్రశంసించారు. శుక్రవారం ఉదయం క్యాంపస్‌కు చేరుకున్న పరమేశ్వరన్‌ను రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి స్వాగతం పలికి క్యాంపస్‌లోని వివిధ కళాశాలలకు తీసుకెళ్లారు. అన్ని చోట్లా వారు ప్రతీ హాట్‌స్పాట్‌ వద్ద ఇంటర్నెట్‌ స్పీడ్‌ను క్షుణ్నంగా పరిశీలించారు. ...

Read More »

సురక్షితమైన నాణ్యతతో కూడిన 100 నగరాలలో దోహ స్థానం ’70’

మెర్సెర్’స నాణ్యతతో కూడిన జీవనం 2016 సూచిక ప్రకారం దోహ స్థానం ’70’  గా ఉంది. అంతే కాక  మధ్య తూర్పు మరియు ఆఫ్రికా ప్రాంతాల కంటే విదేశాల నుండి వచ్చి ఉద్యోగ ఉపాధి చేసుకొంతున్నవారికి   వ్యక్తిగత భద్రతను కల్పించే దేశాలలో దోహా సైతం ఉంది  మరో ఆరేళ్లలో జరగబోయే” ఫిఫా 2022 ప్రపంచ ఫుట్ బాల్ కప్ కు ”  ఆతిధ్య దేశం.   వ్యక్తిగత భద్రత కోసం టాప్ 100 లో ఈ ప్రాంత నగరాల్లో  అబూ ధాబీ 23 వ ...

Read More »

సైన్స్‌ అండ్‌ నాలెడ్స్‌ ఆయుధాలు: ప్రిన్స్‌ ఖలీఫా

దేశంలోని యువత సైన్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ అనే ఆయుధాలను కలిగి ఉండడం దేశానికి మంచిదని ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ కలీఫా చెప్పారు.అల్‌ అహిలా యూనివర్సిటీ కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రిన్స్‌ ఖలీఫా ఈ వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీలు మరియు హై ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన చెప్పారు. దేశంలోని యూనివర్సిటీలపై అచంచలమైన విశ్వాసం తమకుందని ఆయన అన్నారు. విద్య అత్యవసరమైన విషయంగా తాము భావిస్తున్నామనీ, ఇదే విషయమై ...

Read More »

మధ్య ప్రాచ్య ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన యు.ఎ.ఇ. పాస్ పోర్ట్

మధ్య ప్రాచ్య ప్రాంతంలో అత్యంత శక్తివంతమైనదిగా యు.ఎ.ఇ. పాస్ పోర్ట్ నిలిచింది. అరబ్ మరియు మధ్య తూర్పు దేశాలలో మొదటి స్థానంలో ఉంది. రిస్ట్రిక్షన్ ఇండెక్స్ ప్రకారం హెన్లీ మరియు భాగస్వామి నివాస పౌరసత్వం ప్రణాళిక విశ్వనేతగా వరుసగా రెండవ ఏడాది ఈ గౌరవాన్నిదక్కించుకొంది. యు.ఎ.ఇ. పాస్ పోర్ట్ తో 122 దేశాలకు సులభ సాధ్యంగా వీసా రహితంగా ప్రయాణించవచ్చు. 2015 లో  యు.ఎ.ఇ. ఐరోపా దేశాల కూటమితో ఒక ఒప్పందం కుదుర్చుకొంది. దీని ప్రకారం వీసా లేకుండా 36 దేశాలకు వెళ్లేందుకు అనుమతిని ...

Read More »

దుబాయ్‌ బస్‌స్టాప్‌లో ఉచిత వైఫై

జెమైరాలో తొలి స్మార్ట్‌ ఎయిర్‌ కండిషన్డ్‌ షెల్టర్‌ని బస్సు ప్రయాణీకుల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ బస్‌ షెల్టర్‌ని డైరెక్టర్‌ జనరల్‌, ఛైర్మన్‌ ఆఫ్‌ది బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్స్‌ ఆఫ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ మట్టర్‌ అల్‌ తాయెర్‌ ప్రారంభించారు. దుబాయ్‌లోని 15 డిస్ట్రిక్ట్స్‌లో నిర్మించనున్న 100 స్మార్ట్‌ షెల్టర్స్‌లో ఇది మొదటిది. స్మార్ట్‌ షెల్టర్స్‌లో అత్యాధునిక సౌకర్యాలు ప్రయాణీకులకు నఅందుబాటులో ఉంటాయి. ‘డు’ సంస్థ ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించింది. ఎన్‌ఓఎల్‌ టాప్‌ అప్‌ కార్డ్స్‌, లోకల్‌, ఇంటర్నేషనల్‌ నెట్‌వర్క్‌ ...

Read More »

గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికులలోనే రక్తపోటు,మధుమేహం,ఊబకాయ కేసులు

మొత్తం గల్ఫ్ దేశాల్లోనే కేవలం భారతీయ కార్మికులకు ఎక్కువుగా రక్తపోటు , మధుమేహం, ఊబకాయ సమస్యలతో బాధపడుతున్నట్లు ఒక భారతీయ వైద్యురాలు తన పరిశోధనలో వెల్లడి చేశారు.   ఇటీవల ఒక ఇండెక్స్ పత్రికలో ( వలస మైనారిటి హెల్త్ జర్నల్ ) లో  ఈ కధనం ప్రచురించబడింది. పలువురిపై  డాక్టర్ శమిం బేగం పరిశోధన చేశారు. ఈమె  భారతదేశం లో శ్రీ చిత్ర తిరునల్  ఇన్స్టిట్యూట్ మరియు టెక్నాలజీలలో ఒక ప్రజా ఆరోగ్య రీసెర్చ్ స్కాలర్.

Read More »

బాలికపై అత్యాచారం ఆపై సజీవదహనం

లూథియాన: పంజాబ్‌లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి సజీవదహనం చేశాడో మృగాడు. షేర్‌పూర్‌ ప్రాంతాకి చెందిన సురేశ్‌ అనే వ్యక్తి బుధవారం రాత్రి పొరుగున ఉండే ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని స్థానిక ఎస్సై సురీందర్‌ మోహన్‌ తెలిపారు. బాధితురాలు తల్లిదండ్రులకు తన దురాగతం గురించి చెపుతుందని ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడన్నారు. 90శాతం కాలిన గాయాలైన బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందిందన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు దినసరి కూలీలని చెప్పారు. ఆసుపత్రిలో న్యాయమూర్తి ఎదుట బాధితురాలు మరణ వాంగ్మూలం ...

Read More »

పాకిస్థాన్‌ వస్తోంది

కరాచి: టీ20 ప్రపంచకప్‌లో పోటీపడేందుకు గాను పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటించేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. ‘‘పాకిస్థాన్‌ జట్టు భారత్‌లో ఆడేందుకు మాకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఐతే టోర్నీ సందర్భంగా మా జట్టుకు ప్రత్యేక భద్రత కల్పించాలని ఐసీసీని కోరాం’’ అని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ షహర్యర్‌ ఖాన్‌ చెప్పాడు. మార్చి 16న క్వాలిఫయర్‌తో తొలి మ్యాచ్‌ ఆడనున్న పాకిస్థాన్‌, మార్చి 19న ధర్మశాలలో ఆతిథ్య భారత్‌ను ఢీకొంటుంది. భారత్‌లో తమ ఆటగాళ్ల భద్రతపై ఇంతకుముందు పీసీబీ ...

Read More »

బడి బాధ్యత పంచాయతీలకు

నిజామాబాద్ :పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను గ్రామపంచాయతీ పాలక వర్గాలకు అప్పగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో చట్టం తెచ్చేందుకు ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. ఇప్పటి వరకు పని చేసిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు, స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీలు నామమాత్రంగా పని చేస్తున్నాయి. కమిటీ ఛైర్మన్ సహా సభ్యులెవరైనా పాఠశాలకు వచ్చినా పట్టించుకునే పరిస్థితిలేదు. ప్రభుత్వ పాఠశాలలతో సరిసమానంగా ఈ కమిటీలు కూడా నిర్వీర్యమైపోయాయి. మండలస్థాయిలో ఎంఈవోలు, డివిజన్ స్థాయిలో డిప్యూటీ ఈవోలతోపాటు జిల్లా విద్యాశాఖాధికారి ఉన్నా రు. జిల్లాలో ...

Read More »

త్వరలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు , హెల్త్‌కార్డులు

ఆర్మూర్ : త్వరలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు అందనున్నాయని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ అ న్నారు. ఆర్మూర్ పట్టణంలోని విపంచి సంగీత నృత్యశాలలో బుధవారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల ప్రధానమైన మూడు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తుందని చెప్పారు. అక్రిడిటేషన్ల సమస్య దాదాపు పూర్తయ్యిందన్నారు. మార్చి నెలాఖరు వరకు జిల్లా అక్రిడేషన్ కమిటీలో ప్రతినిధులుగా ఎవరిని తీసుకోవాలనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. మార్చి నెలాఖరు, ఏప్రిల్‌లో అక్రిడిటేషన్లు అందుతాయన్నారు. డెస్క్ మిత్రులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు ...

Read More »

అల్ఫాజోలం, డైజోఫాం పట్టివేత

లింగంపేట: మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో బుధవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు దాడి చేసి రెండు కిలోల అల్ఫాజోలం, రెండు కిలోల డైజోఫాం పట్టుకున్నట్లు ఎల్లారెడ్డి ఎక్సైజ్ ఎస్సై సృజన తెలిపారు. కామారెడ్డికి చెందిన ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు ఫీర్‌సింగ్ ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు గ్రామానికి చెందిన బట్టికాడి లలిత ఇంటిపై దాడి నిర్వహించినట్లు చెప్పారు. లలిత ఇంటిని సోదా చేయగా బీరువాలో అల్ఫాజోలం, డైజోఫాం లభించినట్లు తెలిపారు. లలిత సోదరుడు కిషన్‌గౌడ్ కల్లులో కలిపే మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. లలిత నివాసంలో ...

Read More »

ఇకనైనా పద్ధతి మార్చుకోండి..

ఆర్మూర్ టౌన్ : సమయపాలన పాటించకుండా ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తూ ప్రభుత్వ దవాఖానను ని ర్లక్ష్యం చేస్తే ఎలా.. అన్ని చూసుకోవాల్సిన మీరే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎలా, ఉదయం వ చ్చి వెళ్లిపోయి ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ పద్ధతులు మానుకోండి అంటూ ఆర్మూర్ వైద్యశాల సూపరింటెండెంట్ నారాయణకు కలెక్టర్ హితవు పలికారు. ఆర్మూర్ దవాఖానను బుధవారం కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ వచ్చిన సమాచారం తెలుసుకున్న సూపరింటెండెంట్ అరగంట తర్వా త రావటంతో కలెక్టర్ ఆయనపై మండిపడ్డారు. ఈ సందర్భంగా హాజరు రిజిష్టర్లను ...

Read More »