Breaking News

Daily Archives: February 28, 2016

అనాథ పిల్లలకు బట్టల పంపిణీ

బోధన్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచన్‌పల్లి గ్రామంలోగల అపూర్వ అనాథ శరణాలయం పిల్లలకు విహెచ్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివారం ప్రపంచ వృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అనాథలకు దుస్తులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం వృద్దుల దినోత్సవం రోజు అనాథలకు తమ ఆధ్వర్యంలో సహాయం చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అపూర్వ అనాథ శరణాలయం వ్యవస్తాపకులు అశోక్‌కుమార్‌ రోడే, సరిత సూర్యవంశీ, కృష్ణ, శివకుమార్‌, తదితరులు ...

Read More »

ఏకాగ్రతతో ఉన్నత లక్ష్యాలు అధిరోహించాలి

- తెవివి వైస్‌చాన్స్‌లర్‌ పార్థసారధి కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి మనిషిలో అద్భుతమైన శక్తి దాగుందని, ఏకాగ్రతతో కూడిన నిరంతర శ్రమ వల్ల ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ పార్థసారది అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాల 11వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై విసి మాట్లాడారు. తాను స్వతాహాగా చేపట్టిన పెయింట్‌ యువర్‌ డ్రీమ్స్‌ గురించి వివరించారు. మనలో ఉన్న ప్రతిభ కలల్ని సాకారం ...

Read More »

కరాటే పోటీల్లో గోల్డ్‌ మెడల్‌సాధించిన మాస్టర్‌ కృతిక్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని బ్రిలియంట్‌ హైస్కూల్లో 4వ తరగతి చదువుతున్న మాస్టర్‌ కృతిక్‌ రాష్ట్ర స్థాయి కుంఫు చాంపియన్‌షిప్‌ అండర్‌-14 టారింగ్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్తాయి పోటీల్లో బంగారు పతకం సాధించడం పట్ల కామారెడ్డి కరాటే మాస్టర్‌ తో పాటు కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. దీంతోపాటు వేసవిలో భూటాన్‌లో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీల్లో కృతిక్‌ అర్హత సాధించినట్టు తెలిపారు.

Read More »

గ్రంథాలయ తనిఖీ

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి నర్సింలు ఆదివారం మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా గ్రంథాలయంలోని రికార్డులు, పుస్తకాలను తనిఖీ చేశారు. బకాయిలు ఉన్న పుస్తకాలను వెంటనే తెప్పించి వసూలు చేయాలన్నారు. గ్రంథాలయంలోని పుస్తకాల జాబితా సక్రమంగా నిర్వహించాలన్నారు. పలు సూచనలు చేశారు. వసతులు, ప్రాంగణాన్ని పరిశీలించారు. పాఠకుల, సందర్శకుల జాబితాను పరిశీలించారు. ఆయన వెంట గ్రంథపాలకుడు బాలకిషన్‌, ఉప గ్రంథ పాలకుడు వెంకటేశ్వర్‌ ఉన్నారు.

Read More »

వూర మాస్‌

అల్లు అర్జున్‌ అంటే అందరికీ ఆయన స్టైలే గుర్తుకొస్తుంది. అందుకే దర్శకులంతా ఆయన్ని ఎప్పటికప్పుడు కొత్త స్టైల్స్‌తో చూపిస్తుంటారు. ఈసారి బోయపాటి శ్రీను స్టైల్‌గానే కాదు… మాస్‌గానూ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తెల్ల తోలు కదా స్టైల్‌గా ఉంటాడనుకొన్నావేమో, మాస్‌… వూరమాస్‌’ అంటూ ఇటీవల విడుదలైన ‘సరైనోడు’ ప్రచార చిత్రంలో అల్లు అర్జున్‌ అదరగొట్టాడు. దీన్నిబట్టి ఆయన తెరపై ఎలా కనిపించబోతున్నాడో వూహించొచ్చు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరైనోడు’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ కథానాయికలు. గీతా ఆర్ట్స్‌ ...

Read More »

కంగారుపడ్డా కొట్టేశారు… 83 పరుగులకే కుప్పకూలిన పాక్‌

బహుశా పాకిస్థాన్‌ వికెట్లు టపటపా పడిపోతుంటే.. భారత అభిమానులు కూడా బాధపడే ఉంటారు..! ఆ జట్టు 83 పరుగులే చేసినపుడు నిట్టూర్చి ఉంటారు..! 84 పరుగులు కూడా ఓ లక్ష్యమా అని తేలిగ్గా తీసుకుని ఉంటారు..! 10 ఓవర్లలోనే ఛేదన పూర్తయిపోతుందని అంచనా వేసి ఉంటారు.. కానీ ఈ అభిప్రాయాలు మారిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ 83 పరుగులే ఓ దశలో భారత్‌కు కొండంత స్కోరులా మారింది. ఒక్క పరుగు తీయడమూ గగనమైంది. బంతిని కాచుకోవడమే కష్టమైంది. ఛేదన అసాధ్యంలా కనిపించింది.ఇలాంటి విపత్కర ...

Read More »

మాతాశిశు మరణాలపై క్రిమినల్ కేసులు

మోర్తాడ్: ప్రసూతి సమయంలో మాతా శిశుమరణాలు సంభవిస్తే సంబంధిత ఏఎన్‌ఎం, సూపర్‌వైజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ఎస్సీ, ఎస్టీలు ఉంటే అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని డీఎంహెచ్‌వో వెంకట్ హెచ్చరించారు. మోర్తాడ్ క్లస్టర్ వైద్యశాలలో శుక్రవారం క్లస్టర్ పరిధిలోని కమ్మర్‌పల్లి, భీమ్‌గల్, వేల్పూర్ మం డలాలకు సంబంధించి వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. సిబ్బంది పని తీరుపై డీఎంహెచ్‌వో ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు పథకానికి సంబంధించి సిబ్బంది ఏ మాత్రం వివరాలు సేకరించడం లేదని, సమావేశం ఉందంటే ఇంటి దగ్గర ...

Read More »

డబ్బులకు ఆశపడి కన్న బిడ్డను అమ్మిన తల్లి

నందిపేట్ రూరల్ : అభం శుభం తెలియని రెండు నెలల పసి వాడిని డబ్బుల కోసం అమ్మేసింది కన్న తల్లి ఆర్మూర్ పట్టణానికి చెందిన గంగు అని తేలింది. డబ్బులకు కక్కుర్తి పడి కన్న బిడ్డనే రూ.35 వేలకు అమ్మినట్లు పోలీసుల ద్వారా తెలిసింది. బాబును నందిపేట్ మండలం వన్నెల్(కె) గ్రామానికి చెందిన గట్టడి రాజు, ఇందిర దంపతులకు విక్రయించేందుకు మధ్యవర్తిత్వం వహించి ఇరువురి మధ్య బేరం కుదిర్చింది ఆర్‌ఎంపీ సంతోష్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారంలో బాబును కొనుగోలు చేసిన ...

Read More »

డిగ్రీ దశ ఎంతో కీలకమైంది

శక్కర్‌నగర్ : బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి డిగ్రీ క ళాశాలలో శనివారం డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల కరస్పాండెంట్ ఆర్.కామశాస్త్రి మాట్లాడారు. విద్యార్థులకు డిగ్రీ దశ ఎంతో కీలకమైందన్నారు. డిగ్రీ అనంతం లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లక్ష్యం కోసం కఠోర శ్రమ, క్రమశిక్షణ, సత్ప్రవర్తన ఎంతో అవసరమన్నారు. తమ కళాశాలలో విద్యార్థులకు సాంకేతికపరమైన విద్య అందిస్తున్నట్లు చెప్పారు. జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థుల అనుభవాలను అ డిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జయరాం, భీంరెడ్డి, మేనేజర్ ...

Read More »

కష్టాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు

వినాయక్‌నగర్ :అంగన్‌వా డీ కేంద్రాలకు సరుకులు సక్రమంగా సరఫరా చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో కార్యకర్తలు ఇబ్బందు లు పడుతున్నారు. మరోవైపు వేతన, అద్దె బిల్లుల చెల్లింపులో కూడా ఇదే ధోరణి కనిపించడంతో ఆ ర్థిక కష్టాలు పడుతున్నారు. జిల్లాలో 26 అంగన్‌వాడీ సెంటర్లు ఉండగా, అర్బన్‌లో 151 ఉన్నాయి. కొంతకాలంగా బి య్యం, నూనె, పప్పులు సరిగ్గా సరఫరా కాకపోవడంతో కార్యకర్తలు సతమతమవుతున్నారు. ఐసీడీఎస్ అధికారులను అడిగితే వచ్చి తీసుకొని పొ మ్మని సమాధానాలు ఇస్తున్నారని వారు చెబుతున్నారు. ...

Read More »

షటిల్ టోర్నీ నిర్వహించడం ఆనందంగా ఉంది

శక్కర్‌నగర్ : బోధన్ పట్టణంలోని ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి షటిల్ టోర్నమెంట్ ని ర్వహించడం ఆనందంగా ఉందని ఆర్డీవో శ్యామ్‌ప్రసాద్‌లాల్ అన్నారు. శనివారం రాత్రి ఆఫీసర్స్ క్లబ్‌లో నిర్వహించిన క్రీడల ముగింపు కార్యక్రమా నికి ఆయన హాజరై మాట్లాడారు. రెండు రోజుల పాటు పోటీలు కొనసాగాయని, ఇందులో 55 సం వత్సరాలపైబడిన వారికి పోటీలు నిర్వహించేందు కు తమకు అవకాశం రావడం ఆనందంగా ఉం ద ని తెలిపారు. పుతుంబాక జననీ మెమోరియల్ ట్ర స్టు నిర్వాహకుడు పి.సీతారాం తమ వంతుగా ప్ర ...

Read More »

కలప విక్రయంలో ప్రభుత్వానికి రూ.లక్ష ఆదాయం

ఎల్లారెడ్డి,  : ఎల్లారెడ్డి అటవీ శాఖ ప్రాంగణంలో శనివారం కలప విక్రయం కోసం వేలం పాట నిర్వహించారు. కామారెడ్డి డివిజన్ అటవీ శాఖ అధికారి జోజి కలప విక్రయానికి వేలం పాట పాడారు. విలువైన టేకు కలపను కొనుగోలు చేయడానికి పలువురు ఆసక్తి చూపారు. వేలం పాటలో ప్రభుత్వానికి రూ.లక్ష 600 ఆదాయం వచ్చింది. వేలం పాటలో 16 టేకు కలప లాట్‌లను పలువురు తీసుకున్నారు. వేలం పాట కార్యక్రమంలో స్థానిక అటవీ శాఖ రేంజ్ అధికారి రాధా కిషన్, సెక్షన్ అధికారి రమేశ్ ...

Read More »

70 మైనార్టీ విద్యాలయాల ఏర్పాటు

ఆర్మూర్, : రాష్ట్ర వ్యాప్తంగా 70 మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించి నట్లు మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ రాష్ట్ర ప్రాజెక్ట్ మేనేజర్ హజిద్ అహ్మద్ అన్నారు. శనివారం ఆయన ఆర్మూర్‌లో మైనార్టీ రెసిడెన్సియల్ విద్యాలయ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు ఐదు మైనార్టీ రెసిడెన్షి యల్ విద్యాలయాలు మంజూరవుతున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా కేంద్రంలో, ఎల్లారెడ్డి, ఆర్మూర్, బానువాడల్లో బాలుర, బోధన్‌లో బాలి కల రెసిడెన్షియల్ విద్యాలయాలు ప్రారంభమవుతాయన్నారు. అంకా పూర్ ...

Read More »

జనన మరణ నమోదును తప్పకుండా చేయాలి

కామారెడ్డి, : ప్రతి శాఖ అధికారులు సమన్వయంతో జనన మరణ నమోదు తప్పకుండా జరిగేలా చుడాలని రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి పట్టణంలోని ఐఎంఏ హాల్‌లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. పంచాయతీ కార్యదర్శులు ఎమ్మార్వో, ఎంపీడీవోలు పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు జననం, మరణ నమోదు అయ్యేలా చూడాలన్నారు.

Read More »

బోధన్, ఎడపల్లిలో భారీ వర్షం

బోధన్, : బోధన్ పట్టణం, ఎడపల్లిలో శనివారం రాత్రి 8.30 గంటలకు భారీ వర్షం కురిసింది. ఒ క్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బోధన్ పట్టణం లో అంధకారం నెలకొంది. సుమారు 20 నిమిషాల పాటు వర్షం కురిసింది. బోధన్ మండలం సాలూర, జాడిజమాల్‌పూర్, పెగడాపల్లి తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసిం ది. అనేక గ్రామాల్లో వర్షం కారణంగా కరెంట్ సరఫరాను నిలిపివేశారు. వర్షంతో ఎటువంటి నష్టం వాటిల్లలేదు.

Read More »