Breaking News

Daily Archives: February 29, 2016

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నర్సింహనాయుడు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాలెం గ్రామంలో పిప్పెర నర్సయ్య, పిప్పెర శంకర్‌ బాధిత కుటుంబాలను పసుపు రాష్ట్ర రైతు అద్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు, ఉపాధ్యక్షుడు ముత్యాల మనోహర్‌రెడ్డిలు సోమవారం పరామర్శించారు. బాదిత కుటుంబాలను పరామర్శించి వారి ఆర్థిక పరిస్థితులను, మృతికి గల కారణాలు అడిగి తెలుసుకొని మనోధైర్యం అందించారు. ఆయనవెంట కుంట గంగారెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు, రైతులు, విడిసి సభ్యులు ఉన్నారు.

Read More »

వడ్డి రాయితీ రుణాలు వెంటనే అందించాలి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహకార సంఘాలకు వడ్డి రాయితీ రుణాలు వెంటనే అందించాలని మోర్తాడ్‌ మండల సహకార సంఘం అధ్యక్షుడు సోమ చిన్న గంగారెడ్డి, లింగారెడ్డి, ఎలాల రాజేందర్‌రెడ్డి, లింబాద్రి, రాజేందర్‌రెడ్డి, రైతు నాయకులు గడ్డం లింగారెడ్డి, ప్రతాప్‌రెడ్డిలు కోరారు. సోమవారం మండలంలోని సొసైటీ ఛైర్మన్లు, రైతు నాయకులు వాహనాల్లో కరీంనగర్‌ తరలివెళ్ళి తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవిందర్‌రావుకు వినతి పత్రం అందించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు దీర్ఘకాలిక రుణాలు ...

Read More »

అభివృద్ది పనులు సకాలంలో పూర్తిచేయాలి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం కింద, స్వచ్ఛభారత్‌ కింద ప్రభుత్వం చేపడుతున్న ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం ఇంటింటికి ఇంకుడు గుంతలు పనులు త్వరిత గతిన పూర్తిచేయించాలని జిల్లా డ్వామా పిడి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలోగల ఇజిఎస్‌ కార్యాలయాన్ని డ్వామా పిడి ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఉపాధి హామీ పతకం కింద అధిక సంఖ్యలో కూలీలను నియమించి ఉపాధి కల్పించాలని, గ్రామాల్లో ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు పనులను ఈనెల ...

Read More »

ఎమ్మెల్యే సహకారంతో తాగునీటి సౌకర్యం

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్టు సుంకెట్‌ సర్పంచ్‌ మధుసూదన్‌గౌడ్‌ తెలిపారు. సోమవారం మండలంలోని సుంకెట్‌ గ్రామంలో గ్రామాల్లోని నీరున్న బోరుబావులకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఫ్లషింగ్‌ పనులు చేపట్టారు. 4 బోర్లను ఫ్లషింగ్‌ చేయించిన తర్వాత, ఎమ్మెల్యే కోటా కింద 3 కొత్త బోర్లను మంజూరు చేశారని వాటిని కూడా త్వరలోనే ప్రారంభించి పైప్‌లైన్‌ నిర్మాణాలు చేపట్టి తాగునీరు అందిస్తామని సర్పంచ్‌ తెలిపారు. నిధులు మంజూరు ...

Read More »

ఎస్‌ఎప్‌ఐ ఆద్వర్యంలో టాలెంట్‌ టెస్ట్‌

  కామారెడ్డి, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని గౌతమ్‌ హైస్కూల్లో గత పదిహేను రోజుల క్రితం 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్‌ టెస్టు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకురాలు, 24వ వార్డు కౌన్సిలర్‌ రేణుక చంద్రశేఖర్‌ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిభ పరీక్షలు విద్యార్థులకు పరీక్షలకు సమాయత్తమయ్యేందుకు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికితీయడంలోటాలెంట్‌ టెస్టులు ఉపకరిస్తాయన్నారు. ఇలాంటి పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గెలుపొందిన ...

Read More »

బల్దియా ఎదుట కార్మికుల ధర్నా

  కామారెడ్డి, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి బల్దియా కార్యాలయం ఎదుట సోమవారం మునిసిపల్‌ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంలో మునిసిపల్‌ కార్మికులకు చోటు కల్పించి కార్మికులందరికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెంచిన వేతనాలు వర్తింపజేసి కార్మికులను క్రమబద్దీకరించాలని కోరారు. సాధారణ సెలవులు, ఇఎస్‌ఐ కార్డులు తదితర డిమాండ్లు పరిష్కరించని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ...

Read More »

మల్లికార్జున స్వామి ఆలయంలో పూజలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని గొల్లవాడలోగల మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం గొల్లకుర్మ కులస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలు సమృద్ధిగా ఉండాలని, రోగాల బారిన పడకుండా ప్రజలు కాపాడబడాలని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ముగ్గులతో పూజలు చేశారు. కార్యక్రమంలో గొల్లకుర్మలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More »

కళాజాత ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమవుతాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా పేర్కొన్నారు. జిల్లాలోని 78 ఓడిఎప్‌ గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధి, వైద్య, ఆరోగ్య, ఐసిడిఎస్‌, విద్య, పంచాయతీరాజ్‌ కార్యక్రమాలను అనుసంధానం చేసి అమలు చేసేందుకు రూపొందించిన ప్రణాళిక పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించే కళాజాత ప్రదర్శనలను కలెక్టరేట్‌ నుంచి సోమవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. కళాకారులు ప్రదర్శించిన కళాజాత కార్యక్రమాలను ...

Read More »

చెట్లకిందే సమావేశాలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలకు, చిన్నారులకు సేవలందిస్తున్న అంగన్‌వాడి కార్యకర్తలకు భవనం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజాంసాగర్‌మండల కేంద్రంలో సమావేశాలు నిర్వహించుకోవడానికి స్వంత భవనం లేకపోవడంతో చెట్లకిందే సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీ పరిధిలో 54 అంగన్‌వాడి కేంద్రాలున్నాయి. వీటిలో మెయిన్‌ అంగన్‌వాడి కేంద్రాలు 47, మినీ కేంద్రాలు 7 ఉన్నాయి. మొత్తం కలిపి 54 కేంద్రాలుండగా వీటిలో అంగన్‌వాడి కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతినెల ...

Read More »

కరువు మ్యాన్‌వల్‌ను అర్థం చేసుకోండి

  – మండల అధికారులకు జిల్లా కలెక్టర్‌ దిశానిర్దేశం నిజామాబాద్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులలో కూడా ప్రజలకు ఇబ్బందులు రాకుండా తాగునీటిని సరఫరా చేసేందుకు అంకితభావంతో పనిచేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా స్పష్టం చేశారు. కరువు మ్యాన్‌వల్‌ను అర్థం చేసుకొని వ్యవహరించాలని మండల అదికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నీటి ఎద్దడి నివారణకు నిధుల కొరత లేదని, ...

Read More »

రోడ్డు విస్తరణ పనులకు బ్రేక్‌

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అడుగుకో గుంత, రోజుకో ప్రమాదం అన్న చందంగా తయారైంది ఈ రోడ్డు పరిస్థితి. దశాబ్ద కాలం నుంచి ప్రమాదకరంగా మారిన నిజాంసాగర్‌- నర్సింగ్‌రావుపల్లి రోడ్డు పరిస్థితి ఇది. ఈ రోడ్డు విషయమై జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంత్రి కెటిఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిజాంసాగర్‌-నర్సింగ్‌రావుపల్లి రోడ్డు విస్తరణ పనుల కోసం రూ. 8 కోట్లు మంజూరు చేసింది. దీంతో మూడునెలల కిందట విస్తరణ ...

Read More »

డయల్‌ యువర్‌ ఎస్పీకి 15 ఫిర్యాదులు

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఎస్పీకి నేడు 15 ఫిర్యాదులు వచ్చినట్టు జిల్లా పోలీసు శాఖాధికారి వెల్లడించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం ఎస్‌పి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధి నుంచి వివిధ రకాల సమస్యలపై మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్టు ...

Read More »

నిజాంసాగర్‌ ఎంపిడివోగా రాములు బాధ్యతల స్వీకరణ

  …, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ఎంపిడివోగా రాములు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా నిజాంసాగర్‌ ఇన్‌చార్జి ఎంపిడివోగా బాల్‌సింగ్‌ కొనసాగుతున్నారు. కాగా రాములు పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీరు, సాగునీరు ఇతరత్రా సమస్యలుంటే తనకు తెలియజేయాలని, పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఆయన వెంట మండల అధికారులు ఉన్నారు.

Read More »

తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి పలు ప్రణాళికలు సిద్దం చేశామని ఎంపిపి మల్లెల మీణ హన్మంతు అన్నారు. మండల కేంద్రంలో తాగునీటి సమస్య అదికంగా ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అందులో భాగంగానే కస్తూర్బా పాఠశాల, 3, 4 వార్లుల్లో బోర్లు వేస్తున్నామన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృస్ట్యా మండలంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, దీన్ని నివారించడానికి పలు పరిష్కారచర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ నర్సయ్య, ...

Read More »

నీటి ఎద్దడిపై దద్దరిల్లిన మునిసిపల్‌ కౌన్సిల్‌

  -అధికారులు, ఛైర్‌పర్సన్‌ తీరుపై నిలదీత కామారెడ్డి, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశం నీటి ఎద్దడి సమస్యపై దద్దరిల్లింది. కౌన్సిల్‌ సభ్యులు అధికారులు, ఛైర్‌పర్సన్‌ తీరుపై మండిపడ్డారు. వాగ్వాదాలతో సమావేశం రసాభాసగా మారింది. బడ్జెట్‌ కోసం నిర్వహించిన సమావేశం కాస్తా వాయిదా పడింది. సమావేశంలో ప్రధానంగా నీటి ఎద్దడిపైనే వాగ్వాదం చోటుచేసుకుంది. కౌన్సిలర్లు రామ్మోహన్‌, జమీల్‌, వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీలు నీటి ఎద్దడి ...

Read More »

రేషన్‌ సరుకులు ఇప్పించండి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బొప్పాస్‌పల్లి గ్రామానికి చెందిన యువకుడు సంగ్రాంకు నాలుగు నెలలుగా ప్రభుత్వం నుంచి వచ్చే నిత్యవసర సరకులు అందడం లేదని సంబంధిత విషయమై గత నాలుగు నెలలుగా అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని, సోమవారం తహసీల్‌ కార్యాలయం ముందు కుటుంబీకులతో కలిసి ధర్నా చేపట్టారు. రేషన్‌ కార్డు తొలగించడానికి కారణం అడిగినా అధికారులు సరైన సమాధానం ఇవ్వడంలేదని, సరుకులు ఇప్పించకపోతే కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని భీష్మించుకు కూర్చున్నాడు. ...

Read More »

అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు వెనక ఉన్న ఆంతర్యం ఏంటి ?

శబరిమల అయ్యప్ప ఆలయానికి చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకుని తరిస్తారు. ఏడాదికి ఏడాది శబరిమల భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 18 మెట్లు. ఆయన శ్లోకంలో కూడా 18 మెట్ల ప్రస్థావన ఉంటుంది.అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే.. ఖచ్చితంగా 18 మెట్లు ఎక్కాల్సిందే. అది కూడా తలపై ఇరుముడి పెట్టుకుని 18 మెట్లు ఎక్కితేనే ఆ అయ్యన్ అయ్యప్ప స్వామి దర్శనభాగ్యం కలుగుతుంది. ఆలయ దర్శనానికి ముందు అనేక నియమాలు, పద్ధతులు పాటించాలి. 41 ...

Read More »