Breaking News

కళాజాత ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌

 

నిజామాబాద్‌, ఫిబ్రవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమవుతాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా పేర్కొన్నారు. జిల్లాలోని 78 ఓడిఎప్‌ గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధి, వైద్య, ఆరోగ్య, ఐసిడిఎస్‌, విద్య, పంచాయతీరాజ్‌ కార్యక్రమాలను అనుసంధానం చేసి అమలు చేసేందుకు రూపొందించిన ప్రణాళిక పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించే కళాజాత ప్రదర్శనలను కలెక్టరేట్‌ నుంచి సోమవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.

కళాకారులు ప్రదర్శించిన కళాజాత కార్యక్రమాలను కలెక్టర్‌ పరిశీలించారు. ఓడిఎఫ్‌ గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు 3 నెలల గర్భిణీల రిజిస్ట్రేషన్‌, ఇమ్యునైజేషన్‌, వైద్య పరీక్షలు, ఆహార లక్ష్మి పథకం కింద పోషకాహారం అందించడం, నూరుశాతం ఆసుపత్రుల్లో ప్రసవాలు, గర్భిణీలు, బాలింతలు, శిశువులకు పోషకాహారం అందించుట, అందరికి విద్య, హైస్కూల్‌లో డిజిటల్‌ బోధన, గ్రంథాలయాల అభివృద్ది, అంగన్‌వాడి కేంద్రాల్లో వసతులు, ప్రతి కుటుంబంకు మరుగుదొడ్ల వాడకం పట్ల అవగాహన, ఉపాధి నిధులతో భూగర్భ జలాల సంరక్షణ, పారిశుద్య పనుల ప్రాధాన్యత పట్ల ప్రజలను చైతన్యపరచాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మట్లాడుతూ రాష్ట్ర సాంస్కృతిక శాఖకు చెందిన 25 మంది కళాకారులతో పాటు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఆరుగురు కళాకారులను నాలుగు బృందాలుగా చేసి 20 రోజుల పాటు కళా ప్రదర్శనలకు షెడ్యూల్‌ రూపొందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో డ్వామా పిడి వెంకటేశ్వర్లు, సమాచారశాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు, డిప్యూటి డిఇవో కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

28, 29 తేదీల్లో సూపర్ స్పైడర్స్ కు వ్యాక్సినేషన్

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రేషన్ షాప్ డీలర్లు, ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్లు, పెట్రోల్ బంకులు, ...

Comment on the article