Breaking News

Monthly Archives: March 2016

భారత్‌పై విజయంతో ఫైనల్‌కు చేరిన వెస్టిండీస్

(31 Mar) ముంబై: టి20 వల్డ్ కప్ పోటీల్లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న సెమీఫైనల్‌లో వెస్టిండీస్ విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించారు. 193 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గేల్ 5, శామ్యూల్స్ 8, చార్లెస్ 52, సిమన్స్ 83, రస్సెల్ 43 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ ...

Read More »

తెలంగాణ మాడల్‌ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

  రెంజల్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తెలంగాణ మాడల్‌ స్కూల్లో 7,8,9,10 తరగతులకు ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 12వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, రాత పరీక్ష ఏప్రిల్‌ 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 వరకు ఉంటుందన్నారు. 7వ తరగతిలో 3 సీట్లు, 9వ తరగతిలో 7 సీట్లు, 10వ తరగతిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు బోనోఫైడ్‌ సర్టిఫికెట్లు, కులదృవీకరణ ...

Read More »

సకాలంలో ఇంటిపన్ను బకాయిలు చెల్లించాలి

  మోర్తాడ్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో పేరుకుపోయిన ఇంటిపన్ను బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాభివృద్దికి గ్రామస్తులు సహకరించాలని మండల కార్యదర్శులు అన్నారు. గురువారం మండలంలోని తొర్తి గ్రామంలో ఇంటిపన్ను బకాయిల వసూలుపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో 60 వేల 387 రూపాయలు వసూలు చేసినట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యదర్శులు నాగరాజు, సుభాష్‌ చంద్రబోస్‌, సాజన్‌, స్వప్న, కారోబార్లు తదితరులున్నారు.

Read More »

బ్యాంకులను గ్రామ ప్రజలే కాపాడుకోవాలి

  మోర్తాడ్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత సేవలందించేందుకే గ్రామాల్లో ఎస్‌బిహెచ్‌ బ్యాంకు శాఖలను ఏర్పాటు చేస్తున్నామని, బ్యాంకులను గ్రామ ప్రజలే కాపాడుకోవాలని బ్యాంక్‌ మేనేజర్‌ దేవిదాస్‌ అన్నారు. గురువారం మండలంలోని సుంకెట్‌ గ్రామంలో ఎస్‌బిహెచ్‌ బ్యాంక్‌ శాఖ ఏర్పాటుకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. స్తానిక సర్పంచ్‌ మధుసూదన్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ అంజిరెడ్డి, ఎంపిటిసిలు శిరీష, నవీన్‌గౌడ్‌, గ్రామ కమిటీ సభ్యులు తీగల సుభాష్‌, శ్రీనివాస్‌లు ఏర్పాటుకు కృషి చేశారని వారిని అభినందించారు. ...

Read More »

డైరీ, పౌల్ట్రీ గొర్రెల పెంపకం దారులు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

  మోర్తాడ్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహకార సంఘ పరిధిలోని సభ్యులు వ్యవసాయ పంటలతో పాటు డైరీ, పౌల్ట్రీ గొర్రెల పెంపకం దారులు రుణాలు సద్వినియోగం చేసుకొని అభివృద్ది చెందాలని డిసిసిబి డైరెక్టర్‌, తాళ్ళరాంపూర్‌ ఛైర్మన్‌ సోమ చిన్నగంగారెడ్డి, ఏర్గట్ల సహకార బ్యాంకు మేనేజర్‌ శర్మలు అన్నారు. గురువారం మండలంలోని ఏర్గట్ల సహకార సంఘ బ్యాంకులో సభ్యులకు 16 యూనిట్లకు గాను 16 లక్షల రుణాల చెక్కులను గొర్రె పెంపకం దారులకు అందజేసినట్టు వారు తెలిపారు. సహకార సంఘ ...

Read More »

ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజం

  రెంజల్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగరీత్యా పదవీ విరమణ సహజమని జడ్పిటిసి నాగభూషణం రెడ్డి అన్నారు. రెంజల్‌ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యదర్శి శ్యాంరావు పదవీవిరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. గత 11 నెలలుగా రెంజల్‌ గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా సేవలందించి అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక వ్యక్తి శ్యాంరావు అని అన్నారు. ఉద్యోగరీత్యా పదవీ విరమణ ...

Read More »

వ్యవసాయరంగ సంక్షోభంతోనే రైతుల ఆత్మహత్యలు

  – విసి పార్థసారధి డిచ్‌పల్లి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ రంగంలో ఏర్పడిన సంక్షోభం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌, వ్యవసాయశాఖ సెక్రెటరీ సి.పార్ధసారధి అన్నారు. జన్మనిచ్చిన తల్లిని, అన్నం పెట్టే రైతును ఎప్పుడూ మరువకూడదని ఆయన అన్నారు. రైతుల ఆత్మహత్యలు, కారణాలు, ప్రభావాలు, నివారణ మార్గాలు అనే అంశంపై డాక్టర్‌ పున్నయ్య కన్వీనర్‌గా జరుగుతున్న రెండ్రోజుల జాతీయ సెమినార్‌ ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా విసి పాల్గొని ప్రసంగించారు. రైతుఆత్మహత్యల కారణాలు ...

Read More »

మార్కెట్‌ కమిటీలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయం

  బీర్కూర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన సిఎం కెసిఆర్‌కు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి, నిజామాబాద్‌ జిల్లా తెరాస మహిళా అధ్యక్షురాలు దుర్గం శ్యామల, బీర్కూర్‌ ఎంపిపి మల్లెల మీణ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పించబడుతుందని వారన్నారు. బంగారు తెలంగాణ కొరకు కెసిఆర్‌, వ్యవసాయశాఖ మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహిళలకు, ఇతర సామాజిక ...

Read More »

ఏప్రిల్‌ 2 నుంచి పించన్ల పంపిణీ

బీర్కూర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకం పింఛన్లు ఫిబ్రవరి నెలకు సంబంధించి ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నట్టు మండల అభివృద్ది అదికారి భరత్‌కుమార్‌ తెలిపారు. వృద్దాప్య, వితంతు, వికలాంగ, బీడీ, చేనేత, గీత కార్మికులకు ఆధార్‌ కార్డు కలిగినవారికి ఏప్రిల్‌ 2 నుంచి 5వ తేదీ వరకు బీడీకార్మికులకు 6 వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పోస్టాఫీసులో అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఆధార్‌ కార్డు నెంబరు ...

Read More »

స్వప్నకు ఎకనామిక్స్‌లో ఓయు నుండి డాక్టరేట్‌

  డిచ్‌పల్లి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న స్వప్నకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌ సబ్జెక్టులో డాక్టరేట్‌ లభించింది. ఆర్మూర్‌కు చెందిన స్వప్న తెలంగాణ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ టిఎల్‌ఎన్‌ స్వామి పర్యవేక్షణలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తన పిహెచ్‌డి పూర్తిచేశారు. భారతదేశంలో ఐటి పరిశ్రమలు సంస్కరణలకు పూర్వం, తర్వాత సవాళ్లు అవకాశాలు అనే అంశంపై తన పరిశోధనా గ్రంథాన్ని సమర్పించారు. తన పరిశోధనలో భాగంగా దేశీయంగా ...

Read More »

నట్టల నివారణ చేసి నాణ్యత గల మాంసఉత్పత్తే లక్ష్యం

  నందిపేట, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 14 లక్షల మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు వేయడమే తమ లక్ష్యమని జిల్లా పశు సంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎల్లన్న తెలిపారు. గురువారం నందిపేట మండలంలోని కొండూరు, బాద్గుణ గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారన మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోవిడత నట్టల నివారణ మందు పంపిణీలో భాగంగా జిల్లాలో ఉన్న 20 వేల 547 గొర్రెలు, 4 లక్షల 77 ...

Read More »

కనుమరుగవుతున్న సమర్‌బాగ్‌

  నిజాంసాగర్‌ రూరల్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండ్ల తోటలు పక్షుల కిలకిలరావాలతో పచ్చని చెట్లతో పర్యాటకుల మదిని దోచిన సమర్‌బాగ్‌ నేడు కనుమరుగవుతోంది. నిజాం కాలంలో సాగర్‌ ప్రాజెక్టు దిగువన నవాబ్‌ అలీ నవాద్‌ జంగ్‌ బహదూర్‌ సమర్‌బాగ్‌ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన ఇంజనీర్లు, కార్మికులు చల్లదనంతో పాటు ఆరోగ్యానికి దోహదపడే విధంగా పండ్లతోటలు పెంచారు. అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని సమర్‌బాగ్‌ అని పిలుచుకునేవారు. సమర్‌బాగ్‌లో చెట్ల పోషణను నీటిపారుదల శాఖాదికారులు పట్టించుకోకపోవడంతో ...

Read More »

బస్టాండ్‌లో చుక్కనీరు కరవు

  నిజాంసాగర్‌ రూరల్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని స్తానిక ఆర్టీసి బస్టాండ్‌లో తాగునీటి సమస్య తీవ్రమైంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు గమ్యస్థానాలకు ఈ బస్టాండ్‌మీదుగా చేరుకుంటారు. మార్చి నెలాఖరులో జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో బస్టాండ్‌లో తాగుదామంటూ చుక్కనీరు దొరకడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసి అధికారులు బస్టాండ్‌కు ఆనుకొని మినీ వాటర్‌ట్యాంకును గతంలో కుళాయి ద్వారా నీటిని ట్యాంకులోంచి ప్రయాణీకులకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం అధికారులు వాటర్‌ ట్యాంకులో ...

Read More »

ఎండనుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎండలు తీవ్రంగా ముదిరినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐకెపి ఎపిఎం నారాయణగౌడ్‌ అన్నారు. మండలంలోని సుంకిపల్లి గ్రామంలో ఐకెపి ఆద్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎపిఎం మాట్లాడుతూ ఉదయాన్నే ఎండలు తీవ్రంగా ముదురుతున్నందున ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగవద్దని సూచించారు. పనులున్నట్టయితే 11 గంటల్లోపు, సాయంత్రం 4 గంటల తర్వాత చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లచ్చవ్వ, ...

Read More »

కోల్ కతాలో ఫ్లైఓవర్ కూలి 10 మంది మృతి

కోల్ కతాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రాంతంలోని గిరీష్ పార్క్ సమీపంలో నిర్మాణంలో ఉన్న వివేకానంద ఫ్లైఓవర్ కుప్పకూలడంతో  10 మంది మృతి చెందారు. శిథిలాల కింద సుమారు 150 మందికి పైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పారామిలటరీ బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలకితీసేందుకు గ్యాస్ కట్టర్లను వినియోగిస్తున్నారు.  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా సిమెంటు, కాంక్రీట్ ను నిన్ననే వేశారని అక్కడి స్థానికులు ...

Read More »

పవన్ కళ్యాణ్ కి బాలిహుడ్ లో ఫాన్స్ లేరా ?????

  టాలిహుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక పేరు తెచుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తో బాలిహుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతునాడు . తెలుగు ఇండస్ట్రీ లో తనకి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. పవనిజం అంటూ తన అభిమానులు ఒక వ్యవస్థనే సృష్టించారు. అయితే పవన్ కళ్యాణ్ కి బాలిహుడ్ ప్రేక్షకులకి మాత్రం తెలియదు అన్నట్టు కొన్ని పరిస్థితులు తెయియజెస్తునాయి. కొద్ది రోజుల క్రితం దర్శకుడు రాంగోపాల్ వర్మ పవన్ ఇలాంటి సినిమా ...

Read More »

తెలంగాణ స‌ర్కార్‌ను ఎండ‌గ‌ట్టిన కాగ్‌

2015-16 ఆర్ధిక సంవత్సరానికి కాగ్‌ నివేదికను తెలంగాణా అసెంబ్లీలో సమర్పించారు. ప‌లు శాఖ‌ల నిర్వాకాన్ని… అందులో జ‌రుగుతున్న అక్రమాలను కాగ్ ఎత్తిచూపింది. వైద్య, ఆరోగ్యశాఖతో నాటు.. విద్యాశాఖలోని లోపాలను కాగ్‌ తప్పుబట్టింది. ఓవ‌రాల్‌గా 2014-15 బడ్జెట్‌ అంచనాలు అవాస్తవికంగా ఉన్నాయ‌ని కాగ్ తేల్చింది. తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ శాఖల వైఫల్యాలను కాగ్‌ నివేదిక తప్పుబట్టింది. మద్యం షాపుల లైసెన్స్‌ ఫీజును తక్కువగా నిర్ణయించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని ఎక్సైజ్‌ శాఖ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక బీబీనగర్‌ నిమ్స్‌ పనుల్లో జాప్యం కారణంగా ...

Read More »

ప్రత్యేక రైల్లో తిరుపతికి కెసిఆర్‌ – 10 జిల్లాల తెలంగాణ ప్రజలతో పూజలు…

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఏది చేసినా వెరైటీగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడూ భిన్నంగా నడుచుకోవడమే ఆయనకున్న అలవాటు. ప్రస్తుతం తిరుమల విషయంలో కూడా కొత్త సాంప్రదాయానికి కెసిఆర్‌ తెరతీయనున్నారు. అదేంటో మీరే చూడండి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తాను తిరుమలకు వచ్చి మ్రొక్కులు తీర్చుకుంటానని కెసిఆర్‌ ఉద్యమకారుడిగా ఉన్న సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన సంధర్భంగా మ్రొక్కు చెల్లించుకోవడానికి తిరుపతికి ప్రత్యేక రైల్లో కెసిఆర్ రానున్నారు. తాజాగా ఈ విషయాన్ని కెసిఆరే స్వయంగా ప్రకటించారు. శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ...

Read More »

ఓ పెళ్లి ఖర్చు రూ. 6,800 కోట్లు

మాస్కో: ఎవరైనా విలాసవంతంగా వివాహం జరిపిస్తే ఆకాశమంత పందిరివేసి, భూదేవంత పీట వేసి అంగరంగ వైభవంగా చేశాడంటాం అతిశయోక్తిగా. అదే తరహాలో కజక్‌లో పుట్టి రష్యాలో ప్రపంచ చమురు, మీడియా దిగ్గజంగా ఎదిగిన మిహాయిల్ గుత్సరీవ్ తన 28 కుమారుడి పెళ్లిని అంతకంటే వైభవోపేతంగా జరిపించారు. మాస్కోలోని లగ్జరీ రెస్టారెంట్, సఫియా బాంక్వెట్ హాల్లో పుష్పాలంకృత భారీ వేదికపై శనివారం జరిగిన ఈ పెళ్లికి 6,800 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయన్నది ఓ అంచనా. వజ్రాలు పొదిగిన పెళ్లి కూతురు శ్వేతవర్ణపు వెడ్డింగ్ డ్రెస్‌కే 16.20 ...

Read More »

కివీస్‌ ఇంటికి.. ఇంగ్లాండ్‌ ఫైనల్‌కి

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో వరుస విజయాలతో సెమీస్‌లోకి దూసుకొచ్చిన న్యూజిలాండ్‌ జైత్రయాత్రకి సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌ చెక్‌ పెట్టింది. దిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో 154 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ జట్టు.. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (78: 44 బంతుల్లో 11×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో 17.1 ఓవర్లలోనే 159/3తో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఫైనల్లో అడుగు పెట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ జట్టులో మన్రో ...

Read More »