Breaking News

Daily Archives: April 2, 2016

గోదావరి పై వంతెన: నందిపేట్ మండల ప్రజల చిరకాల వాంచ .

ఆదిలాబాద్- నిజామాబాద్ జిల్లాలకు సరిహద్దు గ వున్న గోదావరి నది వేరు చేస్తోంది, అయితే రెండు జిల్లాలను కలుపుతూ బాసర్ వద్ద ఒక వంతెన మరియు అక్కడి నుండి 80 కి.మీ. దూరంలో సోన్ వద్ద మరో వంతెన వుంది. నవీపేట్ మండల ప్రజలు బాసర్ వంతెన ద్వార, బాల్కొండ మండల ప్రజలు సోన్ వంతెన ద్వార ఆదిలాబాద్ జిల్లాకు రాకపోకలు సాగిస్తారు కాని నందిపేట్, మాక్లూర్, ఆర్మూర్ మండల ప్రజలకు ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా, నిర్మల్ పట్టణాలకు వెళ్ళాలంటే 100 కి.మీ. కంటే ...

Read More »

చలివేంద్రం ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కొత్త బస్టాండ్‌ ఆవరణలో శనివారం ఆర్టీసి డిఎం ప్రణీత్‌ చలివేంద్రం ప్రారంభించారు. స్వయంభూ బుగ్గ రామేశ్వరస్వామి దేవాలయ ప్రధాన పూజారి ప్రభాకర్‌ స్వామి ఆద్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆర్టీసి ప్రయాణీకుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఉపకరిస్తుందని డిఎం అన్నారు. కార్యక్రమంలో స్టేషన్‌ మేనేజర్‌ రాంచందర్‌, యూనియన్‌ నాయకులు హరినాథ్‌, వై.గిరి, ఎ.ఆర్‌.రెడ్డి, ఎ.ఎస్‌.రావు, డిపో కంట్రోలర్‌ యాదగిరి, తదితరులున్నారు.

Read More »

సరస్వతి శిశుమందిర్‌లో ప్లే స్కూల్‌ ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని భగత్‌సింగ్‌ నగర్‌లోగల సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో శనివారం ప్లేస్కూల్‌ ప్రారంభించారు. వైద్యులు శ్యాంసుందర్‌రావు పూజలు నిర్వహించి ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభించారు. సరస్వతి పూజ, భూమిపూజ చేశారు. నర్సరీతోపాటు 1వ తరగతి ప్రారంభించి విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో పాఠాలు బోధించేందుకు సన్నద్దమయ్యామని తెలిపారు. పాఠశాల నిర్వహణ కోసం సమితిని ఏర్పాటు చేశామన్నారు. అద్యక్షునిగా ముప్పారపు ఆనంద్‌, ఉపాధ్యక్షునిగా సూర్యప్రకాశ్‌, పబ్బ శ్రీనివాస్‌, సహ కార్యదర్శిగా చింత శ్రీనివాస్‌, కోశాధికారిగా గందె ఆంజనేయులును ...

Read More »

వైభవంగా ఆంజనేయస్వామికి అభిషేకం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ఆర్‌బినగర్‌లోగల ఇష్టకార్యసిద్ది ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మన్మధ నామ సంవత్సరం పాల్గుణ మాసంలోని చివరి శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష అభిసేకం, చందనం, సిందూరం అలంకరణ చేశారు. వేదమూర్తులు గంగవరం ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్‌, సంతోష్‌కుమార్‌, సూర్యకాంత్‌రావు, నిత్యానందం, పర్వయ్య, బాల్‌కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

వైద్యుని హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఢిల్లీలో దంత వైద్యుడు పంకజ్‌ నారజ్‌ను విచక్షణ రహితంగా కొట్టి హత్యచేసిన హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ కామారెడ్డి సభ్యులు డిమాండ్‌చేశారు. శనివారం కామారెడ్డిలో పంకజ్‌ నారన్‌ సంస్మరణ సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్యుడు పంకజ్‌ నారన్‌ను కొందరు దుండగులు క్రికెట్‌ బ్యాట్‌లతో విచక్షణ రహితంగా కొట్టి హత్య చేశారన్నారు. వారిని వెంటనే పట్టుకొని శిక్షించాలని పేర్కొన్నారు. ...

Read More »

నిజాంసాగర్‌కు పూర్వవైభవం

  – సిఎం కెసిఆర్‌ బాన్సువాడ, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని, కోటి ఎకరాలకు సాగునీరు అందించి తెలంగాణను హరిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళిక సిద్దం చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు శనివారం బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ తెలంగాణ తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగసభలో సిఎం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అన్ని ...

Read More »

ట్యాంకు ఉన్నా ఉపయోగం సున్నా…

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల వ్యాప్తంగా చాలా పాఠశాలల్లో తాగునీటి కోసం నిర్మించిన ట్యాంకులు బోరు కనెక్షన్‌ లేక నిరుపయోగంగా మారాయి. మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో పాఠశాల వద్ద మినీ వాటర్‌ ట్యాంకు నిర్మించారు. కానీ ఏళ్ళుగా తాగునీటి కనెక్షన్‌ మరిచిపోయారు. దీంతో విద్యార్థులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిదులు స్పందించి ట్యాంకును ఉపయోగంలోకి తీసుకొచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read More »

వికలాంగ విద్యార్థులకు ఫిజియోథెరఫి

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని స్థానిక ఎంఆర్‌సి భవనంలో వికలాంగ విద్యార్థులకు ఫిజియోథెరఫి వైద్య పరీక్షలు శనివారం నిర్వహించారు. మండలంలోని ఆయా పాఠశాలలకు చెందిన 12 మంది వికలాంగ విద్యార్థులకు ఫిజియోథెరఫి వైద్య పరీక్షలు చేయిస్తున్నారన్నారు. వైద్యాధికారి డాక్టర్‌ వెంకటస్వామి విద్యార్థులకు ఫిజియోథెరఫి పరీక్షలు నిర్వహించి వారు చేయాల్సిన వ్యాయామాల గురించి చేసి చూపించారు. ప్రతిరోజు వికలాంగ విద్యార్థులు ఉపశమనం కోసం వ్యాయామం తప్పకుండా చేయాలన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అన్నారు. ...

Read More »

నిప్పంటించుకొని మహిళ ఆత్మహత్య

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్డేపల్లి గ్రామానికి చెందిన జోషి శైలజ (52) ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుందని స్థానిక ఎస్‌ఐ అంతిరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం… గ్రామానికి చెందిన శైలజ ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుందన్నారు. శైలజ గత కొంతకాలంగా మానసికంగా ఆందోళన చెందుతుందని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందన్నారు. శైలజ భర్త జోషి మధుకర్‌ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని ...

Read More »

కరువులో ప్రభుత్వం విఫలం

02.04.1   నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాభావ పరిస్థితుల నేపత్యంలో ప్రజలు అల్లాడుతున్నారని కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వైకాపా జిల్లా అద్యక్షుడు సిద్ధార్థరెడ్డి అన్నారు. మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఎండలు మండుతుండడంతో తాగునీటి సమస్య పరిష్కారంలో అదికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్‌ భగీరథ పథకింద ఇంటింటికి నీరు ఇస్తామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా నీటి ...

Read More »

రివ్యూ: ఎటాక్‌

నటీనటులు: మంచు మనోజ్‌.. ప్రకాష్‌రాజ్‌.. జగపతిబాబు.. వడ్డే నవీన్‌.. అభిమన్యుసింగ్‌.. సురభి.. పూనమ్‌కౌర్‌.. మంజుభార్గవి తదితరులు సంగీతం: రవిశంకర్‌, కూర్పు: అన్వర్‌ అలీ, ఛాయాగ్రహణం: అంజి, నిర్మాతలు: శ్వేతలాన.. వరుణ్‌.. తేజ.. సి.వి.రావు, కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం: రాంగోపాల్‌ వర్మ సంస్థ: శ్రీ శుభశ్వేత ఫిలింస్‌, విడుదల: 01-04-2016 మనకున్న ప్రతిభావంతమైన దర్శకుల్లో రాంగోపాల్‌ వర్మ ఒకరు. మనసు పెట్టి తీస్తే.. వర్మ అద్భుతాలు సృష్టిస్తాడన్నది అందరి నమ్మకం. అయితే ఆ నమ్మకం చాలాఏళ్లుగా ప్రతీసారీ పల్టీలు కొడుతూనే ఉంది. ‘ఈసారైనా…’ అని ఆశపడి ...

Read More »

ప్రజలకు నిజంగా ‘అచ్చే దినే’నా..!

అచ్చెదిన్‌.ఇది ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ నినాదం. అచ్చెదిన్‌ అంటే మంచి రోజులు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల మోడీ ప్రధాన మంత్రిగా ఉండటం వల్ల ప్రజలకు మంచిరోజులే అని అచ్చెదిన్‌ నినాదంతో ప్రజలను నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు. నిజానికి ఈ నినాదానికి వాస్తవంలో జరుగు తున్నదానికి ఎక్కడ పొంతన లేదు. మోడీ అధికారం చేపట్టినత ర్వాత నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా పెట్రోల్‌ ఉత్పత్తుల ధర తగ్గి నప్పటికీ తగ్గిన ధర ఫలితాన్ని ...

Read More »

స్వదేశానికి వెళ్లేందుకు ఆశ పడుతున్న కార్మికులు

సిత్ర లో ఒక కార్మిక శిబిరంలో నివసిస్తున్న అసంతృప్త కార్మికుల సమూహం బాధాకరమైన జీవితం నుండి తప్పించుకోవడానికి తమ సొంత దేశానికి వెళ్ళడానికి ఎంతో  ఆత్రుతతో ఉన్నారు.ఈ భారత కార్మికులు అత్యంత అనారోగ్యమైన పరిస్థితుల నడుమ దుర్భర జీవనంల్ వారిని  నివసించమని  బలవంతంగా ఇక్కడ ఉంచుతున్నారు.వారి నివాసంలో 67 మందికి  అక్కడ ఒకే బాత్రూమ్ ఉంది. విపరీతమైన మురికితో చెడ్డ వాసన వెదజల్లుతూ వారి బెడ్ రూములు మరియు వంటగది  ఉన్నాయి.భారతదేశం లో ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా మోసానికి గురైన ఈ కార్మికులకు ...

Read More »

ధోనీ, కోహ్లీ, రైనాలను రేప్ చేస్తా!: అర్షిఖాన్ హెచ్చరిక

న్యూఢిల్లీ: ప్రముఖ నటి, మోడల్ అర్షిఖాన్ గురువారం నాడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వెస్టిండీస్‌తో భారత్ మ్యాచ్‌కు ముందు.. ఆమె భారత ఆటగాళ్లను హెచ్చరించింది. ఐసీసీ ప్రపంచ కప్ ట్వంటీ 20 గెలవకుంటే మిమ్మల్ని రేప్ చేస్తానని పేర్కొంది. టీమిండియా ప్రపంచ కప్ గెలవకుంటే నేను కెప్టెన్ ధోనీ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, సురేష్ రైనాలను రేప్ చేస్తానని చెప్పింది. అర్షి ఖాన్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఆ పోస్ట్ పెట్టింది. కప్ గెలవకుంటే రేప్ చేస్తానని చెప్పింది. అయితే, రేప్ ...

Read More »

మంత్రిగారికి ట్వీట్‌.. 20 నిమిషాల్లో సహాయం

న్యూదిల్లీ: ట్విట్టర్‌ ద్వారా సమస్య తెలియజేస్తే రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆపదలో ఉన్న ఓ ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించి 20 నిమిషాల్లో సహాయం అందించింది. దిల్లీ నుంచి వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న రైలులో బిభుటి అనే ప్రయాణికుడి ఆరేళ్ల కుమారుడు పైబెర్త్‌ నుంచి కిందపడడంతో తల కు తీవ్రగాయమైంది. దీంతో బిభుటి రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు, రైల్వే మంత్రిత్వశాఖను ట్విట్టర్‌ ద్వారా సహాయం ...

Read More »

ఈసారి ఎండలు అదిరిపోతాయి… వాతావరణ శాఖ

ఈసారి మార్చి నుంచే మాడ్చిపారేస్తున్న ఎండలు మరింతగా ముదరనున్నాయట. ఈ విషయాన్ని సాక్షాత్తు వాతావరణ శాఖ అధికారులే వెల్లడిస్తున్నారు. అంతేకాదు! సాధారణం కంటే ఒక డిగ్రీ అదనంగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత వాతావరణం తీరు, సముద్రం మీద ఉన్న ఉష్ణోగ్రతల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంచనా వేస్తున్నారట. తెలంగాణ నుంచి మొదలుకొని ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా వేడికి అదిరిపోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాలలో కూడా మంటలు కురిపించనున్నాయట.   ఇప్పటికే 2015లో నమోదైన ఉష్ణోగ్రతలు ...

Read More »

తిరుపతిలో హైటెక్‌ బెగ్గింగ్‌.. అడిగినంత డబ్బులిస్తే సరేసరి.. లేదంటే బూతులేబూతులు…

వారు అచ్చం శ్రీవారి భక్తుల్లానే ఉంటారు. కానీ అలా భావిస్తే మాత్రం పప్పులో కాలేసినట్టే. ప్రతిరోజు పరిశుభ్రంగా తయారై తిరుపతిలోని అలిపిరి పాదాల మండపంకు చేరుకుని భక్తుల నుంచి బెగ్గింగ్‌ చేస్తుంటారు. వీరి ఆదాయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రతిరోజు 2,500 నుంచి 3 వేల వరకు వీరు సంపాదిస్తున్నారంటే వీరు ఎంతపెద్ద హైటెక్‌ బెగ్గర్సో ఇట్టే అర్థమైపోతుంది. మెడలో పెద్దపెద్ద బంగారు చైన్లు భక్తులకు అనుమానం రాకుండా ఉండేందుకు అచ్చం శ్రీవారి భక్తుల్లాగే నటిస్తారు. కానీ చేసేది యాచక వృత్తి. తిరుపతిలోని అలిపిరి పాదాల ...

Read More »

ఇకపై ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ లపై నిషేదం

ప్రస్తుత కాలంలో సోషల్ నెటవర్కింగ్ జీవితంలో ఓ భాగమైపోయింది. ఎవరు ఏం చెప్పాలనుకున్నా ఈ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు చెప్పుకునే రోజులు ఇవి. అయితే ఇప్పుడు ఉత్తర కొరియా సోషల్ వెబ్ సైట్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ తదితర సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లను నిషేదించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు వాటితో పాటు దక్షిణ కొరియా వెబ్‌సైట్లను నిషేధిస్తున్నామని ఉత్తరకొరియా ప్రకటించింది. కాగా చైనా కూడా ఫేస్ బుక్ పై నిషేదం విధించిన సంగతి తెలిసిందే.

Read More »

ముచ్కూర్‌లో దాహం.. దాహం

భీమ్‌గల్ : మండలంలోని ముచ్కూర్ గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడు గంటి పోయాయి. భూగర్బ జలాలు ఏరోజు కారోజు మరింత పాతాలానికి చేరుకుంటున్నాయి. బోరుబావులు ఎత్తి పోవడం తో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. మండలంలోని ముచ్కూ ర్ గ్రామంలో పరిస్థితి దారుణంగా ఉంది. గ్రామంలో జనాభా కు అనుగుణంగా వేయించిన ఎనిమిది చేతిపంపులు ఉండగా అందులో కేవలం మూడు మాత్రమే పని చేస్తున్నాయి. గ్రా మంలో నాలుగు ...

Read More »

ఉప్పల్‌వాయిలో వసతి గృహంపై నుంచి పడి విద్యార్థి మృతి

సదాశివనగర్ : మండలంలోని ఉప్పల్‌వాయి గ్రామంలో ఎస్సీ ప్రభుత్వ వసతి గృహంలో ఏడో తరగతి చదువుతున్న సద్దుల సాయికుమార్ గురువారం హాస్టల్ భవనంపై నుంచి కిందపడి మృతి చెందాడు. పోలీసులు, వార్డెన్ సోమశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన సద్దుల యాదగిరి, మున్నిల కుమారుడు సాయికుమార్ ఉప్పల్‌వాయి వసతి గృహంలో ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వసతి గృహంపైకి ఎక్కిన సాయికుమార్ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. వెంటనే వసతి గృహం ...

Read More »