Breaking News

Daily Archives: April 4, 2016

గర్భం ముఖద్వార క్యాన్సర్‌ పరీక్షలు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో సోమవారం ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు మహిళలకు గర్భం ముఖ ద్వారా క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించారు. 30 – 60 సంవత్సరాలలోపు మహిళలకు 42 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 8 మందికి వ్యాధి సంబంధిత లక్షణాలను గుర్తించామని, ప్రస్తుతం నమూనాలను జిల్లా స్థాయి అధికారులకు పంపుతున్నామని, అక్కడ సాంకేతికంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. మండలంలో ప్రతి గురువారం ఈ క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహిస్తామని, మహిళలు ...

Read More »

పోలీసు స్టేషన్‌ వద్ద చలివేంద్రం ప్రారంభం

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ పోలీసు స్టేషన్‌ వద్ద పోలీసులు సోమవారం చలివేంద్రాన్ని ఏఎస్‌ఐ మజిద్‌ఖాన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీర్కూర్‌ పోలీసు స్టేషన్‌నుంచి మంజీర నదిమీదుగా ఇతర మండలాలు అతి సమీపంలో ఉన్నాయని, ఇతర మండలాల ప్రజల రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయని, అదేవిధంగా పోలీసు స్టేసన్‌ ప్రాంతం నుంచి మంజీర నదిలో ప్రభుత్వ ఇసుక క్వారీలు నడుస్తున్నాయని, ప్రయాణీకులకు, లారీ డ్రైవర్ల కోసం తాగునీటి సదుపాయం కల్పించే ఉద్దేశంతో ...

Read More »

ఈనెల 7న తెవివిలో ఆచార్య బీనా ప్రసంగం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు మానసికమైన వికాసాన్ని సాధించే క్రమంలో అవలంబించవలసిన పద్ధతులను గురించి ప్రముఖ మానసిక శాస్త్రవేత్త ఆచార్య బీనా ప్రసంగిస్తారని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఈనెల 7న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగే కార్యక్రమంలో ఆచార్య బీనా విద్యార్థులు మానసిక వికాస అభివృద్దికి సంబంధించిన అనేక అంశాలపై విశ్లేషణలు నిర్వహిస్తారని చెప్పారు. తెలంగాణ యూనివర్సిటీ గ్రంథాలయ సెమినార్‌ హాల్‌లో కార్యక్రమంలో జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ...

Read More »

విద్యార్థులు ఆంగ్లభాషపై పట్టుసాధించాలి

  – కామారెడ్డి డిప్యూటి డిఇవో బలరాం కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టుసాధించాలని కామారెడ్డి ఉప విద్యాధికారి బలరాం అన్నారు. న్యూ సక్సెస్‌ పాలిటెక్నిక్‌, టిఎస్‌ ఆర్‌జేసి, స్పోకెన్‌ ఇంగ్లీష్‌ కోచింగ్‌ సెంటర్‌కు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆయన కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగంలో స్థిరపడాలన్నా, ఏ ఉద్యోగం సాధించాలన్నా ఆంగ్ల భాషలో పట్టు అవసరమన్నారు. న్యూ సక్సెస్‌ ప్రతినిధులు మాట్లాడుతూ 10వ తరగతి పూర్తిచేసి ...

Read More »

అంబలి కేంద్రం ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అంబలి కేంద్రం ప్రారంభించారు. వినాయక్‌నగర్‌ ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో అంబలి కేంద్రం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అద్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌రావు, కౌన్సిలర్‌ కైలాష్‌ లక్ష్మణ్‌రావు, నాయకులు పిప్పిరి వెంకటి, శంకరయ్య, చంద్రశేఖర్‌, ఆంజనేయులు, కౌన్సిలర్‌ నిమ్మ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

వైభవంగా గణపతి హోమం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంల దేవునిపల్లి గ్రామంలోని గౌరీ శంకర్‌ ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. వేద పండితులు సంపత్‌కుమార్‌ శర్మ, ప్రణీత్‌ శర్మ, సాయి, శ్రీకాంత్‌, నర్సింహారావు, వేణు ఆధ్వర్యంలో శ్రీ గణపతి, లక్ష్మీ, నవగ్రహ, వాస్తు హోమాలను వేదమంత్రోచ్చారణల మధ్య వైభవంగా జరిపారు. అనంతరం పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కిరణ్‌, బాలరాజు, నర్సాగౌడ్‌, అంజాగౌడ్‌, వెంకటేశ్‌, అనిల్‌, రాజాగౌడ్‌ ...

Read More »

నీటి ఎద్దడి నివారణకు సత్వర చర్యలు

  నిజామాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ స్థాయి ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల్లో నివసించే తాండా వాసులకు నీటి సౌకర్యం కల్పించడానికి దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా, నిజామాబాద్‌, బోదన్‌, కామారెడ్డి రెవెన్యూ డివిజనల్‌ అధికారులతో 36 మండలాల్లో తహసీల్దార్‌లతో మండల అభివృద్ది అధికారులతో, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులతో మంచినీటి వసతిపై సమీక్షించారు. ప్రజలు నీటికి ఇబ్బందులు పడకుండా కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ, పారదర్శకంగా ఉంటున్న ...

Read More »

డయల్‌ యువర్‌ ఎస్పీకి 25 ఫిర్యాదులు

  నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఎస్పీకి నేడు 25 ఫిర్యాదులు వచ్చినట్టు జిల్లా పోలీసు శాఖాధికారి వెల్లడించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం ఎస్‌పి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధి నుంచి వివిధ రకాల సమస్యలపై మొత్తం 25 ఫిర్యాదులు వచ్చినట్టు ...

Read More »

రోడ్డుప్రమాదంలో ఇద్దరికి గాయాలు

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దాస్‌నగర్‌ క్రాసింగ్‌ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నిజామాబాద్‌ నుంచి ఆర్మూర్‌ వైపు వెళ్తున్న ఆర్టీసి బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్తానికులు గమనించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Read More »

తెరాసలో చేరిక

04.04.6   మాక్లూర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్లడి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకురాలు, ఎంపిటిసి లత సోమవారం తెరాసలో చేరారు. ఈ మేరకు ఆర్మూర్‌లోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో జడ్పిటిసి లత పీర్‌సింగ్‌ ఆధ్వర్యంలో సుమారు 50 మందితో కలిసి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువాలతో పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. కార్యక్రమంలో సుధాకర్‌, మల్లేశ్‌, సుమలత, తదితరులున్నారు.

Read More »

చలివేంద్రం ప్రారంభం

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని చిన్నాపూర్‌ గ్రామంలో సోమవారం సర్పంచ్‌ చెలిమెల ప్రమీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండలు మండుతున్నందున బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో వార్డుమెంబర్లు, గ్రామస్తులు ఉన్నారు.

Read More »

తాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి

  పిట్లం, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్సులో సోమవారం మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్సులో తాగునీరు, కార్పొరేషన్‌ లోన్‌, ఉపాధి పనులు, మిషన్‌ కాకతీయ, వడదెబ్బ వివిధ అంశాలపై మండల స్థాయి అధికారులతో కాన్పరెన్సులో మాట్లాడారు. ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, సమస్యలున్నచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని తెలిపారు. మండలంలోని ...

Read More »

ముగిసిన 10వ తరగతి పరీక్షలు

  పిట్లం, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల పాఠశాలలో జరిగిన 10వ తరగతి పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయని అధికారి పన్నాలాల్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రెండు పరీక్షా కేంద్రాల్లో 534 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మార్చినెల 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలు జరిగాయన్నారు. పరీక్షలు ముగియడంతో హాస్టల్‌ విద్యార్థులు సంతోషంగా తమ తమ ఇళ్ళకు బయల్దేరారు.

Read More »

వెండి వ్యాపారస్తుల ర్యాలీ

  బోధన్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన సుంకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ బోధన్‌ పట్టణంలో సోమవారం బంగారు, వెండి వర్తకులు ర్యాలీ నిర్వహించారు. సుంకం విధించడం వల్ల తమ వ్యాపారంపై అధిక భారం పడి ఆర్థికంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విధించిన సుంకాన్ని వెంటనే రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు దాము, ప్రహ్లాద్‌, ప్రసాదప్ప, మల్లికార్జునప్ప, తదితరులు ఉన్నారు.

Read More »

బోధన్‌ శివాలయాన్ని సందర్శించిన ఎంపి బిబి.పాటిల్‌

  బోధన్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌ సోమవారం బోధన్‌ పట్టణంలో ప్రసిద్ది చెందిన ఏకచక్రేశ్వర శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరశైవ లింగాయత్‌ సమాజం వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరశైవ సమాజ్‌ నాయకులు ఎంపిని ఘనంగా సన్మానించారు. సమాజ్‌ నాయకులు వెంకటేశ్వర్లు దేశాయ్‌, మాధవరావు, శివరాజప్ప తదితరులున్నారు.

Read More »

కతర్ లో 50 వాతావరణ కేంద్రాలు

రానున్న రెండేళ్ళ కాలంలో  దేశవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు  ఇటీవల ముగిసిన దోహా ఇంటర్నేషనల్  నౌ కాశ్రాయ రక్షణ ఎగ్జిబిషన్ ( డిమ్దెక్ష్  2016) వద్ద కతర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ యొక్క మెట్రోలజి (మెట్) శాఖ ఉన్నతాధికారులు గల్ఫ్ టైమ్స్ తో మాట్లాడుతూ, నవీనకరీంచబడిన సాంకేతికత అంచనా మరియు ఇతర కార్యకలాపాలు మెరుగుపరచడానికి వాతావరణ పరిశీలన, అంచనా జారీ దాని వివిధ కార్యకలాపాల్లో నాణ్యతను పెంచడానికి శాఖ కార్యక్రమాలు వివరించడానికి డిమ్దెక్ష్  వద్ద ...

Read More »

పెద్దబోయిడు

రేయికి చంద్రుడు పగటికి సూర్యుడు అధిపతులైతే మా వృత్తి ఆకాశానికి రెండూ పెద్దబోయిడే మా కుల సంద్రానికి విష్ణువు మాకు సంప్రదాయాన్ని నేర్పే గురువు పనేదైనా పొద్దుగాల పొద్దుగాల్నే పలకరించే మాటవుతడు గొడవేదైనా బతుకుల్ని బాగుచేసే పంచాయతి కోర్టుకు జడ్జవుతడు కార్యమేదైన అందరిని కలుపుకొని ఐదుగుర్ని కుండకాడేసి కార్యమెల్లదీసే బాధ్యతవుతడు వాడకట్టుకు బాధొస్తే కన్నీటి మేఘమవుతడు ఆనందమొస్తే సినుకులల్ల తడిసే సిన్నపిల్లోడవుతడు కొత్తాలనో, కొత్త తోపలనో నాన్పేటప్పుడు తోలెమొసలి చేసి పాలారం పంచిపెట్టే పూజారవుతడు ఏడాదికోసారి ఎదలనిండ నిలుపుకొని చేసుకునే మైసమ్మను వాడకు ఏ ...

Read More »

శాంతి దూతలే మహిళల్ని వివస్త్రలను చేసి వారిపై కుక్కలతో రేప్ చేయించారా?

ఆఫ్రికా దేశాల్లో శాంతిని కాపాడేందుకు వెళ్ళిన ఫ్రాన్స్ దళాల అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. శాంతి దళాల చేతిలో చిత్రహింసలు అనుభవించే బదులు తీవ్రవాదుల చేతిలో చనిపోవడమే మేలని ప్రజలు వాపోతున్నారు. ఓ వైపు జాతుల పోరాటం.. మరోవైపు తీవ్రవాదుల దాడులతో సెంట్రల్ ఆఫ్రికన్ దేశాలు అట్టుడికిపోతున్నాయి. దీంతో అక్కడ శాంతిని కాపాడేందుకు ఐక్యరాజ్య సమితి సంయుక్త దళాలను సెంట్రల్‌ ఆఫ్రికాకు పంపింది. అమెరికా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాల జవాన్లు సెంట్రల్‌ ఆఫ్రికన్‌ దేశాల్లో శాంతి పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు. తీవ్రవాదులపై మెరుపుదాడులు ...

Read More »

చివరి ఓవర్లో వరస సిక్సులు..వరల్డ్ కప్పు వెస్టిండీస్ దే..!

వెస్టిండీస్ ను ఎందుకు ప్రమాదకర టీం అంటారో ఫైనల్లో మరోసారి ప్రూవ్ అయింది. చివరి ఓవర్లో 19 పరుగులు కొట్టాల్సి ఉండగా, వరస నాలుగు సిక్సులు కొట్టి మరో రెండు బంతులు మిగిలుండగానే చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది విండీస్ సేన. దీంతో టి20 వరల్డ్ కప్ రెండు సార్లు అందుకున్న మొదటి టీం గా నిలిచింది.156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో 85 పరుగులతో నాటౌట్ గా నిలిచిన మార్లోన్ ముఖ్య పాత్ర పోషించాడు. అతనికి బ్రేవో, బ్రాత్ వైట్ నుంచి మాత్రమే సహకారం లభించినా, ...

Read More »

2015లో అత్యంత చెత్త సినిమా ఏదో తెలుసా?

షారుఖ్‌ ఖాన్‌, కాజోల్‌ జోడీ ఐదేళ్ల తర్వాత వెండితెర మీద తళుక్కుమన్న సినిమా ‘దిల్‌వాలే’. బాలీవుడ్‌లోనే సూపర్‌ హిట్‌ జోడీగా పేరొందిన ఈ జంట ‘దిల్‌వాలే’ చిత్రంలో ఆ మ్యాజిక్‌ చూపించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద భారీగానే కలెక్షన్లు రాబట్టినా.. ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరిచింది. తాజాగా ‘దిల్‌వాలే’ సినిమా 2015 సంవత్సరానికిగాను అత్యంత చెత్త సినిమాగా గోల్డెన్‌ కేలా పురస్కారాన్ని అందుకొంది. భారీ అంచనాలతో విడుదలైన ‘ప్రేమ్‌ రతన్ ధన్‌పాయో’ సినిమాకుగాను సోనం కపూర్‌ అత్యంత చెత్త నటి పురస్కారానికి ...

Read More »