Breaking News

Daily Archives: April 5, 2016

బాధిత కుటుంబాలను పరామర్శించిన తెరాస నాయకులు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లో గత నాలుగు రోజుల క్రితం వడదెబ్బకు గురై మృతి చెందిన బాధిత కుటుంబాన్ని, పాలెం గ్రామంలో అనారోగ్యానికి గురైన బాధిత కుటుంబాన్ని తెరాస రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్‌కుమార్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్య అభ్యసించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నవీన్‌, బిజెపి నాయకులు ముత్యాల మనోహర్‌రెడ్డి, అనిల్‌, తదితరులున్నారు.

Read More »

మోర్తాడ్‌లో ఘనంగా బాబుజగ్జీవన్‌ రామ్‌ జయంతి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌ గ్రామంలోగల బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద తెరాస రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్‌కుమార్‌రెడ్డి, స్తానిక సర్పంచ్‌ దడివె నవీన్‌, వార్డు సభ్యులు నవీన్‌, డాక్టర్‌ మురళీలు జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాలులు అర్పించారు. మోర్తాడ్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, ఎంపిటిసి ఎమ్మాజి మురళీగౌడ్‌ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల బిజేపి అద్యక్షుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు రాము, ...

Read More »

ఇసుక లారీలు అడ్డగింత

  – జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు – స్పందించని రెవెన్యూ యంత్రాంగం – ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం – ఆగ్రహించిన గ్రామస్తులు, రాస్తారోకో బీర్కూర్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామ శివారులోగల మంజీర పరివాహక ప్రాంతంలో నడుస్తున్న ప్రభుత్వ ఇసుక క్వారీ నుంచి రవాణా అవుతున్న ఇసుక లారీలను బీర్కూర్‌ గ్రామంలోగల పోచారం కాలనీవాసులు అడ్డుకొని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతనెల 21వ తేదీన పోచారం ...

Read More »

ఒడ్డేపల్లిని సందర్శించిన ఎంపిడివో

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్డేపల్లి గ్రామాన్ని స్తానిక ఎంపిడివో రాములు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏ.ఇ. లక్ష్మణ్‌లు మంగళవారం సందర్శించారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన బోరుబావిలో నీరు తగ్గాయని గ్రామ సర్పంచ్‌ రేఖ ఇచ్చిన సమాచారం మేరకు గ్రామాన్ని సందర్శించారు. ఈసందర్భంగా బోరుబావిని వారు పరిశీలించారు. బోరుబావిలో నీరు తగ్గినట్టయితే మరమ్మతు చేయించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎంపిడివో తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తితే ముందు జాగ్రత్తలు చేపడతామన్నారు. ఎండాకాలం పూర్తయ్యేంత వరకు దాహాన్ని ...

Read More »

ప్రతి ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్లు

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోమలంచ గ్రామంలో ప్రతి ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కోమలంచ గ్రామంలో 325 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు లబ్దిదారులు పూర్తి చేసుకున్నారు. ప్రతి లబ్దిదారుడు 900 రూపాయల కంట్రిబ్యూషన్‌ చెల్లించి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం 11 వేలుతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. గ్రామంలో అధికారలు ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చి ...

Read More »

అంబలి కేంద్రం ప్రారంభం

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని స్తానిక ఆర్టీసి బస్టాండ్‌ సమీపంలో స్వర్గీయ అలక్‌నంద కిషన్‌లాల్‌ జ్ఞాపకార్థం అంబలి కేంద్రాన్ని మాజీ జడ్పిటిసి వినయ్‌కుమార్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణీకుల సౌకర్యార్థం అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసి, వారికి దాహాన్ని తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. ఎండలు తీవ్రం కావడంతో చల్లదనానికి అంబలి ఎంతో దోహదపడుతుందన్నారు. అంబలిలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయని, తద్వారా ఎండతీవ్రత తట్టుకోగలుగుతారన్నారు. తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ...

Read More »

కులరహిత సమాజమే లక్ష్యం

  సిరికొండ, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కులరహిత సమాజం మన అందరి లక్ష్యం కావాలని, విద్యార్థి జీవితం నుంచే ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని, ఒడిదొడుకులు ఎదురైనా వెనుదిరగకుండా తన జీవితం సమాజానికి అంకితం చేసిన మహానుభావుడు బాబుజగ్జీవన్‌రామ్‌ అని సత్యశోధక్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ నర్సయ్య అన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సమతామూర్తి భారత అమూల్యరత్న బాబు జగ్జీవన్‌రామ్‌ 108వ జయంతి వేడుకలు మండలంలోని సత్యశోధక్‌ పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు ...

Read More »

 ఘనంగా బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి

  బోధన్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశ మాజీ ఉప ప్రధాని, దళిత శ్రేయోభిలాషి బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతిని బోధన్‌ పట్టణంతోపాటు మండలంలోని వివిద గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శక్కర్‌నగర్‌ చౌరస్తాలోగల జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బోధన్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ ఎల్లయ్య, దళిత నాయకులు విద్యాసాగర్‌, మొగులయ్య, సాయప్ప, డప్పుల చంద్రయ్య, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Read More »

దళిత చిన్నారులపై దాడి; నగ్నంగా ఊరేగింపు

ఆధునిక యుగంలో భారత్ దూసుకెళుతున్నా… కొన్ని ప్రాంతాల్లో మాత్రం కులవివక్ష కొనసాగుతూనే ఉంది. రాజస్థాన్ లో ముగ్గురు దళిత పిల్లలను మండుతున్న ఎండలో నగ్నంగా ఊరేగించిన ఘటన ఆలస్యంగా బయట పడింది. చిత్తోర్ ఘఢ్ లోని బస్సీ గ్రామంలో ముగ్గురు దళిత పిల్లలు ఓ అగ్రకులానికి చెందిన వ్యక్తి బైక్ దొంగలించారన్న ఆరోపణలపై వారిని చెట్టుకు కట్టి  చితకబాది ఊరిలో నగ్నంగా ఊరేగించారు. బాధతో బాధితులు  హాహాకారాలు చేసినా, వదిలిపెట్టమని వేడుకున్నా కనికరించలేదు. వారి ఆగడాలతో చుట్టూ ఉన్న  ప్రజలు కూడా  ప్రేక్షకుల్లా మిగిలిపోయారు. ...

Read More »

స్పైసీ బెండీ ఫ్రై

ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ బోరుకొట్టవచ్చు. కాస్త వెరైటీగా కొన్ని స్పైసీ స్నాక్స్ తీసుకోవడం టేస్ట్ బడ్స్ ను సాటిస్ఫై చేయెచ్చు . మరి అలాంటి స్నాక్ రిసిపి ఒకటి మీకోసం ఈ రోజు పరిచయం చేస్తున్నాము. కరకరలాడే బేండీ ఫ్రై . ఈజీ స్నాక్ రిసిపి. చాలా రుచికరమైన స్నాక్ రిసిపి . దీన్నీ ఈవెనింగ్ సమయంలో తీసుకోవచ్చు. దీన్ని తయారుచేయడం చాలా సింపుల్ మరియు ఈ స్నాక్ రిసిపి టేస్టీ మాత్రమే కాదు, తయారుచేయడం కూడా సులభమే , ఇంకా హెల్తీ ...

Read More »

ప్రచారం కోసం కాంగ్రెస్ తప్పటడుగులు

తెలంగాణ నీటి పథకాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో ఇచ్చిన ప్రజంటెషన్‌ను కాంగ్రెస్ వారు బహిష్కరించడాన్ని చూసినప్పుడు, తెలంగాణలో కొన్ని రోజులుగా ఈ పవర్ పాయిం ట్ ప్రజంటేషన్ గురించి విస్తృతంగా జరుగతున్న చర్చలో, కాంగ్రెస్ వైఖరికి సంబంధించిన ప్రశ్న అనివార్యంగా ముందుకు వస్తున్నది. మనకు తెలుస్తున్నదానిని బట్టి నగరాల నుంచి గ్రామాల వరకు ఇదే పరిస్థితి ఉంది. తాము ఎందుకు బహిష్కరించారో కాంగ్రెస్ శాసనసభాపక్షం వారు కొన్ని కారణాలు చెప్పారు. కాని వాటిలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఆమోదించగల విధంగా లేదు. బహిష్కరించడం టిడిపి ...

Read More »

ఆర్ష సంస్కృతిపై అన్నివైపులా దాడులు

1835, ఫిబ్రవరి 3న ఒక బ్రిటీషు ఆఫీసర్, లండన్‌కు ఒక జాబు రాశాడు. ”మనం ఎంత కష్టపడ్డా మన సంస్కృతిని ఈ జాతిలో నాటడం కష్టం. అందుకు అర్ష సంస్కృతి అడ్డం వస్తున్నది. అందుకని ఈ జాతివారికి ఇంగ్లీషు మీద ప్రేమ, ఆర్ష సంస్కృతి మీద ద్వేషం వ్యాపింపజేయాలి.” అదీ లేఖ సారాశం. ఆ తరువాత రాజమండ్రి వుడ్ వర్డ్ డిస్పాచ్ ప్రకారం ఆంగ్లవిద్యా ప్రణాళిక రూపొందింది. ఎఫ్.ఎ, బి.ఎ, ఎం.ఎ. విధానం అమల్లోకి వచ్చింది. సంస్కృతం చదువుకున్న వారిని అవమానకరంగా చూడటం మొదలు ...

Read More »

ఆలోచనా స్రవంతి

అక్షరాంకిత విలసితమగును జగతి ప్రణవ సంభూత నాదసంపర్క సార విభ్రమాద్భుత వేద సంవేద్యమద్ది సద్గురూక్తులు జ్ఞానవిజ్ఞాన ఖనులు. “యత్ర నార్యంతు పూజ్యంతే”, యనెడు సూక్తి వినగలేదా సమున్నత ప్రేమమీర ఆదుకొను మక్కచెల్లెళ్ళ నాదరమున సద్గురూక్తులు జ్ఞానవిజ్ఞాన ఖనులు.   –బొగ్గరం వేంకట వాణిహనుమత్ భుజంగ ప్రసాదరావు

Read More »

దుబాయ్ మెట్రో స్టేషన్లో చిక్కుకుపోయిన ప్రయాణీకులు

పలువురు దుబాయ్ మెట్రో ప్రయాణీకులు ఒక సాంకేతిక సమస్య కారణంగా రెడ్ లైన్ రైలు సేవలు ఆలస్యం కావడంతో ఆదివారం సాయంత్రం వరకు రద్దీ సమయంలో ఒంటరిగా మిగిలారు.కనీసం 100 మంది ప్రయాణికులు రాశిదియ బిజినెస్ బే మెట్రో స్టేషన్ యొక్క వేదికపై ఒంటరిగా మిగిలారు. వీరు తాము ఎక్కవలసిన రైలు కోసం  గత 7 గంటలకు నుండి ఎదురుచూస్తున్నారు. జెబెల్ ఆలీ నుండి వస్తూ ఉన్న రైలు కోసం వేచి చూడడం .భారీ గుంపు కల్గిన ప్రయాణికులు అప్పటికే నిండిపోయిన రైలు లోపల ...

Read More »

వికలాంగ శాఖ అధికారికి షోకాజ్ నోటీస్

  వినాయక్ నగర్ : వికలాంగుల శాఖ అధికారి చెన్నయ్యకు సోమవారం కలెక్టర్ యోగితారాణా షోకాజ్‌నోటీస్ జారీచేశారు. ఈ మేరకు సోమవారం వికలాంగుల కల్యాణవేదిక ప్రధాన కార్యదర్శి సుభాష్‌గుప్తా మాట్లాడుతూ వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల కోసం భర్తీ ప్రక్రియ నిర్వహించారన్నారు. దీనికి ఎంపికైన దీపిక, నవీనను భర్తీ చేయకుండా అధికారుల చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు. వారికి అండగా ఎవరూ లేకపోవడంతో ప్రతిసారి అధికారులకు విన్నవించుకోవడం తప్ప మరేమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించి వెంటనే ఏడీకి షోకాజ్ నోటీసులు ...

Read More »

ముగిసిన పదిపరీక్షలు

  నిజామాబాద్ అర్బన్,  : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. మార్చి 21న జిల్లాలో 206 కేంద్రాల్లో ప్రారంభమైన పరీక్షలు సోషల్ పేపర్-2 ముగిశాయి. చివరి రోజు 37,570 మందికి గాను 37,455 మంది హాజరు కాగా 115 మంది గైర్హాజరయ్యారు. సోషల్ పేపర్-2 పరీక్షలో మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి కే. లింగయ్య తెలిపారు. డీఈవో 3, వరంగల్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ లకా్ష్మరెడ్డి, జిల్లా పరీక్షల పరిశీలకుడు రమణకుమార్ 4 పరీక్షా కేంద్రాలను, ఫ్లయింగ్ స్కాడ్ ...

Read More »

బోధన్ ప్రభుత్వ దవాఖానలో రోగుల ఆందోళన

  బోధన్, : పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో వైద్యుల నిర్లక్ష్యానికి నిరసనగా రోగులు, వారి బం ధువులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇద్దరు పీడీయాట్రీషియన్లు దవాఖానలో లేకపోవడంతో పసిపిల్లలతో వచ్చిన రోగు లు విసిగిపోయారు. పీడీయాట్రీషియన్లలో ఒకరైన శివదాస్ ఆలస్యంగా రావడం, మ రో వైద్యుడు రాజేశ్వర్ సెలవులో ఉండటంపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దవాఖానలో సిబ్బందితో గొడవకు దిగిన వారు వైద్యశాల ఎదుట బోధన్ – నర్సి రోడ్డుపై రాస్తారోకోకు ఉపక్రమించారు. సమాచారం అందుకున్న బో ధన్ ఎస్సై ...

Read More »

ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు ముగింపు

  నిజామాబాద్ రూరల్ : మండలంలోని నర్సింగ్ పల్లి గ్రామ మాపల్లె చారిట్రబుల్ ట్రస్టు ప్రాంగ ణంలో ఉన్న ఇందూరు తిరుమల ఆలయ బ్ర హ్మోత్సవాలు సోమవారం ముగిశాయి. ఆలయ అర్చకులు, త్రిదండి చినజీయర్ శిష్యుడు సీతా రామశాస్త్రి నేతృత్వంలో వేద మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారికి అభిషేకం చేశారు. మంగళ శాసనం, తీర్థప్రసాద గోష్టి, విష్ణుసహస్త్రనామ స్తోత్ర పారాయణం, సప్తావరణం, విశేష ఏకాం త సేవ, మహాదాశీర్వచనం, కవాట బంధనం ని ర్వహించారు. సినీ నిర్మాత దిల్‌రాజు, ఆలయ ధర్మకర్తలు నర్సింహరెడ్డి, శిరీష్‌రెడ్డి, విజయసిం ...

Read More »

బోధన్ శివాలయంలో ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక పూజలు

  బోధన్, : పట్టణంలోని ప్రముఖ శివాలయం శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో సోమవారం జహీరాబాద్ పార్లమెంట్‌సభ్యుడు బీబీ పాటిల్ దంపతులు, కుటుంబసభ్యులు అన్నపూజ చేశారు. సతీమణి అరుణాబాయి, కుటుంబ సభ్యులతో మొక్కు తీర్చుకునేందుకు శివాలయానికి వచ్చిన ఎంపీ సుమారు నాలుగు గంటలపాటు ఆలయంలోని వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గడిపారు. పార్లమెంట్ సభ్యుడి హోదాలో తొలిసారిగా శివాలయానికి వచ్చిన బీబీ పాటిల్‌కు ఆలయ కమిటీ చైర్మన్ బీర్కూర్ బుజ్జి, ధర్మకర్తలు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో అభిషే కం చేశారు. ...

Read More »

ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో సెంచరీకి రెండడుగుల దూరంలో డిబార్లు

  నిజామాబాద్ అర్బన్,  : తెలంగాణ ఓపెన్‌స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షల్లో డిబార్ల సంఖ్య సెంచరీకి రెండడుగుల దూరంలో నిలిచింది. సోమవారం జరిగిన ఇంటర్ పరీక్షల్లో 20 మంది విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు. జిల్లాలో సోమవారం వరకు ఓపెన్ పరీక్షల్లో డిబార్ల సంఖ్య 98. ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల డిబార్ల పర్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే జిల్లా ఫస్ట్‌గా ఉందని విద్యాశాఖ వర్గాల సమాచారం. స్టడీ సెంటర్ నిర్వాహకులు విద్యార్థులతో లాలూచీ పడటంతో జోరుగా చూచిరాతలు జరుగుతున్నాయి. జిల్లాలో ఓపెన్‌లో మాస్‌కాపీయింగ్ నిరోధానికి ...

Read More »