Breaking News

Daily Archives: April 7, 2016

‘ఆయనతో శృంగారంలో పాల్గొనలేదు’

వాటికన్ సిటీ: వాటికన్ చర్చికి చెందిన మత గురువుతో తాను శృంగారంలో పాల్గొనలేదని నిందితురాలు ఫ్రాన్సిస్కా షావ్‌కీ బుధవారం ‘హోలీ సీ’ కోర్టుకు వెల్లడించారు. ‘అతనితో తనకు లైంగిన అనుబంధం లేదు’ అని ప్రస్తుతం గర్భవతి అయిన 35 ఏళ్ల ఆమె తెలిపారు. వాటికన్ చర్చికి సంబంధించిన రహస్య ప్రత్రాలు లీకైన వ్యవహారంలో మాజీ పబ్లిక్ రిలేషన్ కన్సల్టెంట్ అయిన షావ్‌కీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెతోపాటు మతగురువు స్పానిష్‌ మొన్సిగ్నర్ లువియో వాలెజో బాల్డా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. ‘వాటిలీక్స్‌ -2’ పేరొందిన ...

Read More »

రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్‌ నిర్దారణ శిబిరం

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని బస్టాండ్‌ ఆవరణలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఆర్మూర్‌ ఆద్వర్యంలో ఉచిత డయాబెటిస్‌ నిర్దారణ శిబిరాన్ని రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఆర్మూర్‌ వారు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీహరి నారాయణ మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవన విధానంలో పని ఒత్తిడి, ఆహార విధానాల వల్ల ప్రజల్లో రక్తంలో షుగర్‌ స్తాయి పెరిగి మధుమేహ వ్యాధికి కారణమవుతుందనిచెప్పారు. డయాబెటిస్‌ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు ...

Read More »

అక్రమ నిర్మాణం తొలగింపు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని 21వ వార్డు సంతోష్‌నగర్‌లో ప్రభుత్వ 10 శాతం భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న మజీద్‌ నిర్మాణాన్ని గురువారం టిపివో దేవానంద్‌, టిపిడివో రాజేంద్రప్రసాద్‌లు తొలగించారు. ప్రబుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని పట్టణ బిజెపి, భజరంగ్‌దళ్‌, శివసేన నాయకులు వ్యతిరేకించి ఆందోళనలు నిర్వహించారు.దీంతో అధికారులు స్పందించి మజీద్‌ నిర్మాణాన్ని తొలగించారు.

Read More »

జంబి హనుమాన్‌ ఆలయంలో ఉగాది పంచాంగ శ్రవణం

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఆర్మూర్‌ జంబి హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్టు ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ సుంకరి రంగన్న, ఆలయ మేనేజర్‌ సుదర్శన్‌రావు తెలిపారు. పంచాంగ శ్రవణం కిషన్‌రావు మహరాజ్‌ చేస్తారని చెప్పారు.

Read More »

8 కిలోల అస్త్రజోలం, 120 కిలోల ఫ్లోరల్‌ హైడ్రేట్‌ మత్తు పదార్థాల స్వాధీనం

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎక్సైజ్‌ పోలీసులు జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్‌ వద్ద రూట్‌ వాచ్‌ నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనంపై వస్తున్న రవిందర్‌గౌడ్‌ అనే వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద ఒక కిలో అస్త్ర జోలం అనే మత్తు పదార్థం లభించిందని ఆర్మూర్‌ ఎక్సైజ్‌ సిఐ లక్ష్మణ్‌ సింగ్‌ తెలిపారు. రవిందర్‌గౌడ్‌ను విచారించగా భిక్కనూరు మండలం తలమడ్ల గ్రామంలో అంజాగౌడ్‌ వద్ద 3 కిలోల అస్త్రజోలం లభించిందని, అతన్ని విచారించగా రామారెడ్డి గ్రామంలో గంగాధర్‌గౌడ్‌, రాజేందర్‌గౌడ్‌ల వద్ద ...

Read More »

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన మచ్చర్ల చిన్న రాజేశ్వర్‌ (50) ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకోగా అతన్ని 108 అంబులెన్సులో జిల్లా ప్రభత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆర్మూర్‌ ఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. అతని కుమారుడు మచ్చర్ల కాంత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Read More »

శుక్రవారం ఒడ్డేటమ్మ జాతర

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్యాట్‌పల్లి గ్రామంలో శుక్రవారం ఒడ్డేటమ్మ అమ్మవారి ఆలయం వద్ద జాతర నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిదులు సత్యం, మహిపాల్‌ తెలిపారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాలు, నైవేద్యం సమర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, షామియానాలు తదితర వసతులు కల్పించినట్టు తెలిపారు.

Read More »

చలివేంద్రం ప్రారంభం

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కల్లడి గ్రామంలో జడ్పిటిసి లత, పీర్‌సింగ్‌ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండలు తీవ్రమవుతున్న వేళ ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. వేసవిలో తాగునీరు అందించి ప్రజల దాహార్తి తీర్చడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పోశెట్టి, వార్డుమెంబర్లు తదితరులున్నారు.

Read More »

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గంగరమంద గ్రామంలో దేవేందర్‌ (45) అనే ఉపాధి కూలీ వడదెబ్బతో మృతి చెందాడు. గురువారం ఉదయమే ఉపాధి కూలీ పనులకు వెళ్ళి 12.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. వడదెబ్బకు గురైన దేవేందర్‌ అవస్థ పడుతుండడంతో గమనించిన కుటుంబీకులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు తెలిపారు.

Read More »

ఉపాది పనుల కోసం వినతి

  ఎడపల్లి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో ఉపాధి పనులు ప్రస్తుతం జరుగకపోవడంతో పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఎంపిపి రజిత యాదవ్‌కు ఉపాధి కూలీలు వినతి పత్రంసమర్పించారు. ఈ సందర్బంగా కూలీలు మాట్లాడుతూ మండలంలోని అన్నిగ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయని, కానీ తమ గ్రామంలో ఎందుకు పనులు జరిపించడం లేదని అధికారులను అడగాలని కోరారు. గ్రామంలో ఇప్పటికే కూలీలు కరువు పరిస్థితిలో ఉన్నప్పటికి ఉపాది పనులు కల్పించడం లేదని వాపోయారు. ఈ విషయమై ...

Read More »

14న జిల్లా రైతులతో మాట్లాడనున్న ప్రధానమంత్రి

  – వీడియో కాన్ఫరెన్సులో మంత్రి హరీష్‌రావు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14న అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని దేశంలోని వ్యవసాయ మార్కెటింగ్‌ యార్డులను అనుసంధానం చేసే ఏకీకృత మార్కెటింగ్‌ విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి.హరీష్‌రావు తెలిపారు. అందులో భాగంగా నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లోని పసుపు రైతులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రధానమంత్రి మాట్లాడతారని తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ...

Read More »

సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ ఉద్యోగులకు శాపంగా మారిన సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ పెన్షన్‌ పథకాలను పునరుద్దరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్మూర్‌ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాద్యాయ ఫెడరేషన్‌ ఆద్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎస్‌యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సురేశ్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు సేవారంగాల ప్రయివేటీకరణ, సంక్షేమ రంగ కోతలు ప్రారంభమయ్యాయని, దీనివల్ల ఉద్యోగులకు నష్టం ...

Read More »

పోస్టాఫీసు ముందు పింఛన్‌దారుల పడిగాపులు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌లో పింఛన్‌ లబ్దిదారులు ఎండలో సైతం పడిగాపులు కాస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పోస్టాఫీసు మేనేజర్‌ రాకపోవడం, కనీసం సమాచారమిచ్చే నాథుడు లేకపోవడంతో వృద్దులు, మహిళలు, పోస్టాఫీసు అదికారుల, సిబ్బంది తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదురోజులుగా పించన్ల కోసం పోస్టాఫీసు చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నామని, కొందరు సిబ్బంది డబ్బులిచ్చే వారి ఇళ్ళకు వెళ్లి నేరుగా పింఛన్లు అందిస్తున్నారని లబ్దిదారులు ఆరోపించారు. ముడుపులివ్వని వారికి బయోమెట్రిక్‌ ...

Read More »

శుక్రవారం సుంకెట్‌లో వెంకటేశ్వరస్వామి జాతర

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సుంకెట్‌ గ్రామంలో శుక్రవారం శ్రీవెంకటేశ్వర స్వామివారి జాతర నిర్వహిస్తున్నట్టు విడిసి సభ్యులు తీగల సుబాష్‌, ఎదురుగట్ల శ్రీనివాసులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం రోజున శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వేద పండితులతో పలు పూజా కార్యక్రమాలు, శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. శుక్రవారం రాత్రి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రథోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. స్వామివారి జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పెద్ద ...

Read More »

రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెరాస కృషి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఆర్‌ అదిక ప్రాధాన్యత నిచ్చి కృషి చేస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని దోంచంద గ్రామంలో మిషన్‌ కాకతీయ పథకం కింద 14 లక్షల 40 వేల నిధులతో నీటి కుంట పునరుద్దరణ పనులను భూమిపూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు. గత 60ఏళ్ళుగా ఆంధ్రా పాలనలో చెరువులు, కుంటలు నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరాయన్నారు. సిఎం ...

Read More »

పహణీలను పొందుపరచాలి  

నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 7  నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ వ్యవస్థలో అన్ని విషయాలను కంప్యూటరీకరణ చేసి ఆన్‌లైన్‌ ద్వారానే కార్యకలాపాలు నిర్వహించాలని రెవెన్యూ ముఖ్యకార్యదర్శి రేమండ్‌ పీడర్‌ సూచించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా గురువారం మాట్లాడుతూ పహణీలు ఆన్‌లైన్‌లోనే పొందుపరచాలని, వీటితోపాటు రైతుల పూర్తి వివరాలు, వారికి చెందిన భూముల వివరాలన్నింటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సయ్యద్‌ హైమద్‌ మస్రూల్‌, ఆర్‌ఐ సయ్యద్‌ హుస్సేన్‌, రెవెన్యూ కార్యదర్శులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More »

కూలీలకు పనులు కల్పించాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఎలాంటి పనులు లేకపోవడం వల్ల వారి కుటుంబాల పోషణ భారంగా మారిందని, ప్రతి గ్రామంలో కూలీలకు ఖచ్చితంగా పనులు కల్పించాలని ఉపాధి హామీ ఎపివో సుదర్శన్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్షేత్ర సహాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో కూలీలతో గ్రామ సభలు ఏర్పాటు చేసి పనులు గుర్తించాలని, ప్రతి కూలీకి పని కల్పించాలన్నారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండడం ...

Read More »

చలివేంద్రం ప్రారంభం

  నందిపేట, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని డొంకేశ్వర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ ఉపసర్పంచ్‌ మహ్మద్‌ బషీర్‌ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ తెరాస అధ్యక్షుడు మిట్టాపల్లి మల్లారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ హరిదాస్‌, తెరాస గ్రామ కోశాధికారి రహమాన్‌, నాయకులు నాగన్న, సాయిరెడ్డి, బిపి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

జమాతె ఇస్లామి హింద్‌ ఆధ్వర్యంలో ఉగాది కార్డుల పంపిణీ

  నందిపేట, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో గురువారం జమాతే ఇస్లామి హింద్‌ ఆద్వర్యంలో ముస్లిం యువకులు మండల స్తాయి అధికారులైన తహసీల్దార్‌, ఎంపిడివో, ఎస్‌ఐ ఇతర అధికారులకు ఉగాది సందర్భంగా నూతన సంవత్సర గ్రీటింగ్‌ కార్డులు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ బావయ్య మాట్లాడుతూ ముస్లిం యువకులు మతాలకు అతీతంగా పండగలు జరుపుకొని మత సామరస్యం పాటించడం సంతోషదగ్గ విషయమని, నందిపేట మండలంలో హిందూ, ముస్లింలు కలిసిమెలిసి పండగ జరుపుకోవడం చాలా ...

Read More »

సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

  బోధన్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎం కెసిఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఎన్‌డిఎస్‌ఎల్‌ రక్షణ కమిటీ కన్వీనర్‌ రాఘవులు డిమాండ్‌ చేశారు. ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపించాలని డిమాండ్‌ చేస్తూ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ద్షీలు గురువారం 142వ రోజుకు చేరుకున్నాయి. గురువారం దీక్షలు ప్రారంభించి కన్వీనర్‌ మాట్లాడారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీకి పూర్వవైభవం తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడంతో ఫ్యాక్టరీ పూర్వవైభవాన్ని పొందలేక, ప్యాక్టరీని అంధకారంలోకి నెట్టివేస్తున్నారని ...

Read More »