Breaking News

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

 

మాక్లూర్‌, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గంగరమంద గ్రామంలో దేవేందర్‌ (45) అనే ఉపాధి కూలీ వడదెబ్బతో మృతి చెందాడు. గురువారం ఉదయమే ఉపాధి కూలీ పనులకు వెళ్ళి 12.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. వడదెబ్బకు గురైన దేవేందర్‌ అవస్థ పడుతుండడంతో గమనించిన కుటుంబీకులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు తెలిపారు.

Check Also

బిల్లులపై రైతులకు అవగాహన కల్పించాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును విపక్షాలైన కాంగ్రెస్‌ ...

Comment on the article