Breaking News

శుక్రవారం ఒడ్డేటమ్మ జాతర

 

మాక్లూర్‌, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్యాట్‌పల్లి గ్రామంలో శుక్రవారం ఒడ్డేటమ్మ అమ్మవారి ఆలయం వద్ద జాతర నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిదులు సత్యం, మహిపాల్‌ తెలిపారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాలు, నైవేద్యం సమర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, షామియానాలు తదితర వసతులు కల్పించినట్టు తెలిపారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article