Breaking News

Daily Archives: April 11, 2016

దేశానికి జ్యోతి వెలిగించిన మహాత్ముడు జ్యోతిబాఫూలే

  – రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు, బలహీన వర్గాలకు సేవలు అందించి స్త్రీలకు విద్యాలయాన్ని ప్రారంభించిన గొప్ప సంఘ సంస్కర్త, విప్లవజ్యోతి మహాత్మా జ్యోతిబాఫూలే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శ్లాఘించారు. మహాత్మాజ్యోతి బాఫూలే 190వ జయంతిని పురస్కరించుకొని సోమవారం స్తానిక ప్రగతిభవన్‌లో ఉత్సవాన్ని బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. కట్టుబడులను చేదించి మొట్టమొదటగా తన భార్యను ...

Read More »

తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేసిన ఎంపిపి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దొన్‌కల్‌ గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, స్తానిక సర్పంచ్‌ పడాల సత్యం, హనుమాగౌడ్‌, తెరాస మండల అధ్యక్షుడు కల్లడ ఏలియా తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేశారు. సోమవారం దోన్‌కల్‌ గ్రామంలో టిఆర్‌ఎఫ్‌ నిధుల కింద లక్ష రూపాయలు వెచ్చించి పైప్‌లైన్‌ నిర్మాన పనులు ఏర్పాటు చేసినట్టు, నూతన బోరుమోటారు బిగించి తాగునీటి సౌకర్యం కల్పించినట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు, తెరాస నాయకులు, ...

Read More »

ఎట్టకేలకు ప్రారంభమైన పాలెం, తొర్తి బిటిరోడ్డు నిర్మాణ పనులు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాలెం, తొర్తి గ్రామాల మధ్య సోమవారం బిటి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది అక్టోబరు 12, 2015న ఎంపి కల్వకుంట్ల కవిత, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చేతుల మీదుగా బిటి రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. ఎట్టకేలకు ఏడునెలల తర్వాత బిటి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Read More »

మహనీయుల ఆశయాల మేరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచంలోనే భారతదేశంలో అంటరానితనం, సతీసహగమనం నిర్మూలనతోపాటు మహిళలకు, పురుషులకు మొట్టమొదటి సారి విద్యనందించి ప్రతి ఒక్కరికి స్వేచ్చ హక్కులు కల్పించిన మహనీయులు జ్యోతిరావుఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్‌ అంబేడ్కర్‌, బిఎస్పీ వ్యవస్థాపకులు మాన్యులు కాన్షీరామ్‌ ఆశయాల మేరకు ప్రతి ఒక్కరు వారి అడుగుజాడల్లో ముందుకు సాగాలని బిసి సంక్షేమ సంఘం నాయకులు, మోర్తాడ్‌ సర్పంచ్‌ దడివె నవీన్‌, దోన్‌పాల్‌ మాజీ సర్పంచ్‌ కర్స దేవన్న, సాయన్న, ఎల్‌.కె.ఆసుపత్రి వైద్యులు అశోక్‌, మోర్తాడ్‌ ...

Read More »

అంగన్‌వాడి ఆయాల బిల్లులు ఇప్పించాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి ఆయాలకు సంబంధించి వంటల బిల్లులు ఇప్పించాలని సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయాలకు రావాల్సిన పెండింగ్‌ వంట, కూరగాయల బిల్లులు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ఐసిడిఎస్‌ వ్యవస్థలోని అంగన్‌వాడి కార్యకర్తలకు ఆయాలకు మధ్య విభేదాలు సృష్టించే చర్యలకు దిగుతున్నారని, దీన్ని మానకోవాలన్నారు. అంగన్‌వాడిలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్లు వెల్లడించారు. కార్యక్రమంలో సిఐటియు డివిజన్‌ ...

Read More »

ఘనంగా మహాత్మ జ్యోతిబాఫూలే జయంతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మాజ్యోతిబా ఫూలే 190వ జయంతిని సోమవారం కామారెడ్డిలో ఫనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మునిసిపల్‌ కార్యాలయం వద్దగల జ్యోతిబాఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలకు పూలమాలలువేసి ఘనంగా నివాలులు అర్పించారు. వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, టిడిపి, టిజివిపి నాయకులు, మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌, కౌన్సిలర్లు ఆద్వర్యంలో కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాఫూలే బడుగు, బలహీన వర్గాలకు, స్త్రీలకు నూతన యుగోదయాన్ని ప్రకటించిన మొదటి భారతీయుడని కొనియాడారు. అంటరానివారికి, బాలికల ...

Read More »

సిఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కు పంపిణీ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సహాయనిధి కింద విడుదలైన చెక్కును కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సోమవారం బాధిత కుటుంబానికి అందజేశారు. క్యాసంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌ ఖతర్‌లోగత ఏడాది చనిపోయారు. మృతి భార్య పద్మకు ఎమ్మెల్యే చెక్కు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాజయ్య, భారతి, రాజిరెడ్డి, నర్సరెడ్డి, రాజు, సిద్దిరాములు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

దండోరా మహాసభ విజయవంతం చేయండి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 23న హైదరాబాద్‌లో నిర్వహించనున్న దండోరా మహాసభ విజయవంతం చేయాలని ఎంఆర్‌పిఎస్‌ టిఎస్‌ ప్రతినిధులు అన్నారు. సోమవారం కామారెడ్డిలో వీటికి సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వేముల బలరాం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కృషి చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగలు గజ్జకట్టి దరువుకొట్టి ప్రాణాలు సైతం బలిదానం చేశారన్నారు. డప్పు కొట్టే ప్రతివారికి 2 వేల పింఛన్‌ ...

Read More »

కొండగట్టుకు హనుమాన్‌ స్వాముల పాదయాత్ర

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన ముగ్గురు హనుమాన్‌ స్వాములు సోమవారం ఉదయం గ్రామం నుంచి కాలినడకన కరీంనగర్‌ జిల్లా కొండగట్టుకు బయల్దేరారు. మధ్యాహ్నం నిజాంసాగర్‌, ఎల్లారెడ్డి మీదుగా కాలినడక కరీంనగర్‌ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్తున్నట్టు సందీప్‌గౌడ్‌, నారాయణ, ఇ.సందీప్‌గౌడ్‌ తెలిపారు. మూడురోజుల్లో అక్కడికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటామని చెప్పారు.

Read More »

బల్దియా సమావేశంలో నీటి సమస్యపై నిలదీత

  ప్రగతి పనుల్లో పక్షపాత వైఖరిపై గుస్సా కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అధ్యక్షతన సోమవారం జరిగిన మునిసిపల్‌ పాలకవర్గ సమావేశం రసాభాసగా మారింది. నీటి సమస్యపై ప్రగతి పనుల్లో వివక్షపై అధికారులు, ఛైర్‌పర్సన్‌ తీరును నిరసిస్తూ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరునుదుయ్యబట్టారు. సమావేశం ఆద్యంతం నిలదీతలు, నిరసనలతో సాగింది. నీటి సమస్య నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై, వాటి కేటాయింపులపై జరిగిన సమావేశం కాస్త పక్కదారి పట్టి దూషణల ...

Read More »

అలరించిన కుస్తీ పోటీలు

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోమలంచ గ్రామంలో నల్లపోచమ్మ ఆలయ ఉత్సవాలను పురస్కరించుకొని కుస్తీపోటీలు నిర్వహించారు. విజయం సాదించిన మల్లయోధులకు బహుమతులు స్థానిక సర్పంచ్‌ సాదుల సత్యనారాయణ, నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు గంగారెడ్డి, ఎస్‌ఐ అంతిరెడ్డి ప్రదానం చేశారు. 10 రూపాయల నుంచి కుస్తీపోటీలు ప్రారంభించి, చివరి కుస్తీ 2 వేలకు నిర్వహించామని తెలిపారు. నల్లపోచమ్మ ఆలయ ఉత్సవాలు నిర్వహించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపిపి సునంద, ...

Read More »

ఘనంగా ఎమ్మెల్యే పెళ్ళిరోజు వేడుకలు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పెళ్లిరోజు వేడుకలను పట్టణంలోని తెరాస నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరిపారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు విచ్చేసిన ఎమ్మెల్యే సోమవారం పెళ్లిరోజు కావడంతో పట్టణంలోని రాంమందిర్‌ పాఠశాలలో ఎమ్మెల్యేచేత కేక్‌ కేటాయించి శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

ఎడపల్లిలో రెండోవిడత మిషన్‌ కాకతీయ ప్రారంభం

  ఎడపల్లి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కుర్నాపల్లి, ఎడపల్లి గ్రామాల్లో సోమవారం రెండోవిడత మిషన్‌ కాకతీయ పనులను ఘనంగా ప్రారంభించారు. కుర్నాపల్లి గ్రామంలో సర్పంచ్‌ సావిత్రి, రవిందర్‌గౌడ్‌, ఎంపిటిసి అనిత మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. చెరువు పునరుద్దరణ పనులకు 84 లక్షల నిధులు మంజూరైనట్టు వారు తెలిపారు. అలాగే మండల కేంద్రంలోని చెరువులో ఎంపిపి రజిత యాదవ్‌, సర్పంచ్‌ శంకర్‌ నాయుడులు, మండల ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. చెరువు పునరుద్దరణ ...

Read More »

ఘనంగా సరస్వతి మాత విగ్రహ ప్రతిష్టాపన

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని రాంమందిర్‌పాఠశాలలో సరస్వతిమాత విగ్రహ ప్రతిస్టాపన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల ఆవరణలో బాగేపల్లి సుబ్బారావు పంతులు ఆధ్వర్యంలో సరస్వతి హోమం నిర్వహించారు. అనంతరం పాఠశాల అధ్యాపకులు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. పాఠశాలకు అదనంగా 6 గదులను మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, విద్యార్థులు, అద్యాపకులు పాల్గొన్నారు.

Read More »

కెనడా ఆచార్యునితో ట్రిప్‌ విద్యార్థుల స్కైప్‌ సంభాషణ

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ రిసెర్చ్‌ ఇంటర్న్‌షిప్‌ ట్రిప్‌ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్న 20 మంది విద్యార్థులతో కెనడాలో కార్ల్‌టన్‌ యూనివర్సిటీలో చరిత్ర ఆచార్యునిగా పనిచేస్తున్న డాక్టర్‌ చిన్నయ్య జంగం ముఖాముఖి సంభాసించారు. ఆయన స్కైప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ట్రిప్‌ ఇంటర్న్‌లతో స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల గురించి ఉపన్యాసించారు. జీవితంలో గొప్పగా ఎదగాలనుకుంటే ఖచ్చితంగా డబ్బున్నోడే కానవసరం లేదని, దీక్ష, పట్టుదల లక్ష్యశుద్ది, ప్రణాళిక బద్దమైన కృషి ఉండాలని ఆయన ...

Read More »

ఘనంగా జ్యోతిబాఫూలే జయంతి వేడుకలు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌పట్టణంతోపాటు మండలంలోని అన్నిగ్రామాల్లో మహాత్మా జ్యోతిబాఫూలే 190వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ (ఎం) ఆధ్వర్యంలో : ఆర్మూర్‌ సిపిఐ (ఎం) ఆద్వర్యంలో శాస్త్రీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి వెంకటేశ్‌ ఫూలే చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫూలే చేసిన సేవలను స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే అని ...

Read More »

హత్య కేసులో నిందితుల రిమాండ్‌

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 5వ తేదీన మండలంలోని పెర్కిట్‌ గ్రామంలోగల విద్యానగర్‌లో జరిగిన హత్యకేసులో నిందితులను సోమవారం ఆర్మూర్‌ పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. డిఎస్పీ ఆకుల రాంరెడ్డి కథనం ప్రకారం… దయా అజయ్‌కుమార్‌, సుష్మలు ప్రేమ వివాహం చేసుకొని ఆర్మూర్‌లో కాపురం ఉంటున్నట్టు చెప్పారు. సుష్మ ఆర్మూర్‌ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుందన్నారు. అయితే సుష్మ, అజయ్‌కుమార్‌లు కులాంతర వివాహం చేసుకున్నారు. సుష్మ భర్త అజయ్‌కుమార్‌ ఎస్సీ మాల కులస్తుడు కావడంతో ...

Read More »

గ్రామ గస్తీదళాలు శాంతిభద్రతలకు సహకరించాలి

  – డిఎస్పీ వెంకటేశ్వర్లు బీర్కూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామస్తుల సహకారంతో గస్తీ దళాలు ఏర్పాటుచేసి పోలీసులకు సహకారం అందించాలని, బోధన్‌ డిఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు అన్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలోని పోలీసు ఠానాను సోమవారం ఆయన తనికీ నిర్వహించారు. నెలవారి తనిఖీలో భాగంగా పోలీసు స్టేషన్‌కు విచ్చేసినట్టు ఆయన తెలిపారు. స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించారని సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో క్రైం రేటు మామూలుగా ఉందని, లా అండ్‌ ఆర్డర్‌ అదుపులో ...

Read More »

మహాత్మా పూలేకు భారతరత్న ఇవ్వాలి

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో బడుగుల, దళితుల, మహిళల విద్యకు ఆద్యుడైన మహాత్మా జ్యోతిబాఫూలేకు భారతరత్న ఇవ్వాలని లా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జెట్లింగ్‌ ఎల్లోసా డిమాండ్‌ చేశారు. మహాత్మా జ్యోతిబాకు గౌరవంగా భారతరత్న ప్రదానం చేస్తే ఆయన చేసిన సంస్కరణలకు, ఆయన సేవలకు సరైన గుర్తింపు ఇచ్చినట్లు అవుతుందని డాక్టర్‌ యెల్లోసా అన్నారు. జ్యోతిబాఫూలే 190వ జయంతి ఉత్సవాల సందర్భంగా లా కళాశాల భవనంలో బిసి యూత్‌ జేఏసి ఛైర్మన్‌ యెండల ప్రదీప్‌ ఆధ్వర్యంలో ...

Read More »

డయల్‌ యువర్‌ ఎస్పీకి 17 ఫిర్యాదులు

  నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఎస్పీకి నేడు 17 ఫిర్యాదులు వచ్చినట్టు జిల్లా పోలీసు శాఖాధికారి వెల్లడించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం ఎస్‌పి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధి నుంచి వివిధ రకాల సమస్యలపై మొత్తం 17 ఫిర్యాదులు వచ్చినట్టు ...

Read More »