Breaking News

Daily Archives: April 13, 2016

కొనసాగుతున్న సైలానిబాబా దర్గా ఉత్సవాలు

  నందిపేట, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో సైలాని బాబా దర్గా ఉత్సవాలు మంగళవారం సాయంత్రం పాతూరు నుంచి ప్రారంభమైన ఊరేగింపు దర్గా వరకు కొనసాగింది. ఒంటెలపై గంధం అలంకరించి ప్రధాన వీధుల గుండా సందల్‌ ఊరేగింపు జరిగింది. రోడ్డు వెంట పెద్ద సంఖ్యలో భక్తులు నిలబడి తిలకించారు. బుధవారం సాయంత్రం అన్నదాన కార్యక్రమం, ఖవాళి కార్యక్రమం కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ జాన్‌రెడ్డి ఆద్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Read More »

నేడు బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో విఘ్న పూజ

  బాన్సువాడ, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో గురువారం అయ్యప్ప విఘ్న పూజ నిర్వహించనున్నట్టు అయ్యప్పసేవాసమితి అధ్యక్షుడు విఠల్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిసేకాలు, మహాపడిపూజ, మహాభిక్ష, హనుమాన్‌ దీక్షా స్వాములకు ప్రత్యేక భిక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు, గురుస్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

Read More »

కార్మిక సమస్యలపై పోరాటం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మిక సమస్యలపై అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తామని ఐఎన్‌టియుసి డివిజన్‌ కార్యదర్శి వై.సంపత్‌కుమార్‌ అన్నారు. కామారెడ్డిలో బుధవారం ఐఎన్‌టియుసి 327 డివిజన్‌ సర్వసభ్యసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎన్‌టియుసి నాటినుంచి నేటివరకు కార్మికుల సమస్యలపై ఎనలేని పోరాటం చేస్తుందన్నారు. కార్మికుల పక్షాన నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామనిపేర్కొన్నారు. అనంతరం డివిజన్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా రీజినల్‌ అద్యక్షుడు జిక్రియా, కార్యదర్శి గంగాదర్‌లు హాజరయ్యారు. ...

Read More »

బల్దియా ఎదుట సిపిఎం ధర్నా

  కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి బల్దియా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్‌ కార్యదర్శి కె.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ పట్టణంలో 95 వేలకు పైగా జనాభా ఉంటే మునిసిపల్‌ కమీషనర్‌, ఛైర్‌పర్సన్‌లు నీటి ఎద్దడి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గర్హణీయమన్నారు. గోదావరి జలాల సరఫరా ఆగిపోయినా ...

Read More »

నేడు అంబేడ్కర్‌ 125వ జయంతి

  రెంజల్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను గురువారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కార్యదర్శులు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉత్సవాలు నిర్వహించాలని ఎంపిడివో చంద్రశేఖర్‌ సూచించారు. కార్యదర్శులు లేని పంచాయతీల్లో సర్పంచ్‌లు నిర్వహించాలన్నారు.

Read More »

పనుల్లో నాణ్యత లేకుంటే వేటు తప్పదు

  -జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా రెంజల్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌ కాకతీయ పనుల్లో అధికారుల జాప్యం జరిగితే వేటు తప్పదని జిల్లా కలెక్టర్‌ యోగితా రానా హెచ్చరించారు. రెంజల్‌ మండలంలోని బాగేపల్లి, కూనేపల్లి గ్రామాల్లో చేపడుతన్న మిషన్‌ కాకతీయ పనులను ఆమె పరిశీలించారు. కూనేపల్లి గ్రామంలో సదరు కాంట్రాక్టరు నాణ్యత రహితంగా పనులు చేపడుతున్నారని గ్రామస్తులు కలెక్టర్‌ దృస్టికి తేవడంతో పనులు పరిశీలించారు. అసంపూర్తిగా నిర్మాణ పనులు చేపట్టడంతో సదరు కాంట్రాక్టరు ...

Read More »

అధికారులు జరభద్రం

  నందిపేట, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేటలోని మాయాపూర్‌ గ్రామంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత సిసిరోడ్డు కొరకు భూమిపూజ చేసిన తర్వాత స్థానిక ఎంపిటిసి వెంకటేశ్‌ అద్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డిసిసి మాజీ అధ్యక్షుడు గడుగు గంగాదర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యంత్రలక్ష్మి, మిషన్‌ కాకతీయ పనులు తెరాస కార్యకర్తలకే ప్రయోజనం చేకూరుస్తున్నాయని విమర్శించారు. మండలంలోని అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపిటిసి స్థానాలు గెలిచి ఎంపిపి, జడ్పిటిసి ...

Read More »

అభివృద్ది పనులు ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆకుల లలిత

  నందిపేట, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఆకుల లలిత నందిపేట మండలంలో ఎమ్మెల్సీ నిధుల నుంచి నందిపేట, కంఠం, మాయాపూర్‌ గ్రామాల్లో సిసిరోడ్డు పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. నందిపేట మండల కేంద్రంలో సప్తగిరి బట్టల దుకాణం నుంచి కొత్తూరు వెళ్లే రోడ్డుకు సిసి రోడ్డుగా మార్చడానికి 3 లక్షలు, కంఠం గ్రామ స్కూలు పక్కనగల రోడ్డు కొరకు 2 లక్షలు, మాయాపూర్‌ గ్రామంలో సొసైటీ గోదాముకు వెళ్లే దారిలో రోడ్డుకొరకు 3 లక్షలతో భూమిపూజ చేసి ...

Read More »

అభివృద్ది కాంగ్రెస్‌తోనే సాధ్యం

  నందిపేట, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం కంఠం గ్రామంలో 2 లక్షల రూపాయలతో ఎమ్మెల్సీ కోటా కింద మంజూరుచేసిన సిసిరోడ్డుకు ఎమ్మెల్సీ ఆకుల లలిత బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ది చేయలేదని, తెరాస ప్రభుత్వమే అభివృద్ది చేస్తుందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చెప్పుకోవడం సబబుకాదని హితవుపలికారు. గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అంచెలంచెలుగా ...

Read More »

భారతీయ విద్యార్థులపై కూడా త్వరలోనే చర్యలు …

అక్రమంగా దేశంలో ఉండాలని చూస్తున్న 306 మంది భారత విద్యార్థులపై తగిన చర్యలు తీసుకుంటామని అమెరికా స్పష్టం చేసింది. వీసా పొడగింపునకు అర్హత సాధించని.. 306 మంది విద్యార్థులు నకిలీ విశ్వవిద్యాలయాల ద్వారా ప్రవేశాలు పొంది దేశంలో ఉండిపోవాలని చూస్తున్నారని ఇటీవల ఓ స్టింగ్‌ ఆపరేషన్‌లో తేలిన సంగతి తెలిసిందే. హోంల్యాండ్‌ సెక్యూరిటీ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో అక్రమంగా ఉంటున్న విద్యార్థుల వివరాలు బయటపడ్డాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. విద్యార్థులకు ప్రవేశాలు కల్పించిన 32 మంది ...

Read More »

బెంగళూరు.. బూమ్‌.. బూమ్‌

చెలరేగిన డివిలియర్స్‌, కోహ్లి హైదరాబాద్‌పై ఘన విజయం బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో బెంగళూరు రాయల్స్‌ ఛాలెంజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లపై విరుచుకుపడి ఐపీఎల్‌-9 సీజన్‌లో అత్యధిక స్కోరు 227 పరుగులు సాధించారు. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. ఆదిలోనే విధ్వంసక క్రిస్‌గేల్‌(1) వికెట్‌ కోల్పోయినా.. ఏబీ డివిలియర్స్‌ (81; 42 బంతుల్లో 7×4, 6×6), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (75; 51 బంతుల్లో 7×4, 3×6) అర్ధశతకాలు బాది మైదానంలో పరుగుల వరద పారించడంతో నిర్ణీత 20 ...

Read More »

యువసేద్యం.. ఆదాయ మార్గం

ఏడాది పాటు కూరగాయల సాగు తక్కువ పెట్టుబడితో…అధిక దిగుబడులు   ధర్పల్లి మండలకేంద్రానికి చెందిన కొట్టల రాజేశ్వర్‌. చదువు 10వ తరగతి వరకే చదివారు. తనకున్న 10 ఎకరాల వ్యవసాయ భూమిలో పంటలు పండించేందుకు సరిపడా నీళ్లు లేవు. కేవలం ఒక ఎకరంలోనే బిందు సేద్యంతో ఏడాది పాటు మూడు కాలాల్లో కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. కాలం, మార్కెట్‌లో వినియోగదారుల డిమాండ్‌ ఆధారంగా కూరగాయల సాగు చేస్తుంటారు. ప్రస్తుతం తక్కువ నీరు ఉండడంతో తీగ జాతి కూరగాయలు బీర, కాకరకాయ వంటి వాటిని ...

Read More »

పవన్‌ థియేటర్‌ యాజమాన్యంపై కేసు నమోదు

నిజామాబాద్‌ నేరవార్తలు, : మహిళల అశ్లీల చిత్రాలను బహిరంగంగా అతికించినందుకుగాను పవన్‌ థియేటర్‌ యాజమాన్యంపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌వో రవీందర్‌ వెల్లడించారు. ఈ విషయమై తాము పలుమార్లు యాజమాన్యాన్ని హెచ్చరించామని, అయినప్పటికీ మార్పులేకపోవడంతో చట్టపరంగా కేసు నమోదు చేశామన్నారు.

Read More »

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

కొట్టాల్‌(ఎల్లారెడ్డి), : మండలంలోని కొట్టాల్‌ గ్రామంకు చెందిన బోదాసు నర్సింలు(30) అనే యువకుడు మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ పూర్ణేశ్వర్‌ తెలిపారు. నర్సింలు మూడేళ్ల కిత్రం దుబాయ్‌కు వెళ్లినట్లు తెలిపారు. అక్కడ పని దొరకకపోవడంతో తిరిగి స్వగ్రామం చేరుకున్నాడు. ఇక్కడ వ్యవసాయం, కూలీ పనులు చేస్తున్న కాలం కలిసి రాకపోవడంతో చేసిన అప్పులు అధికమై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. రైలు కింద పడి ...

Read More »

సందీప్ బోధన్కర్‌కు జాతీయనృత్య రత్న అవార్డు

  నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్‌కు చెందిన అంతర్జాతీయ నృత్య కళాకారుడు డాక్టర్ సందీప్ బోధన్కర్‌కు మంగళవారం ఓడిషాలోని కటక్‌లో జాతీయ నృత్యరత్న అవార్డును బహూకరించారు. కటక్‌లో వారం రోజుల పాటు శతశహే కటక్ నృత్యోత్సవ్ కార్యక్రమం ప్రారంభమైంది. కట క్ నగర మేయర్ మీనాక్షి బేహరా, జిల్లా కలెక్టర్ నిర్మ ల్ చంద్ర మిశ్రా, ఉత్సవ కమిటీ చైర్మన్ దేబాశిష్ సమంత్రే, ఎమ్మెల్యే రంజన్ బన్వల్, ఎంపీ భర్తుహరి మహతబ్, అనుభబ్ మెహంతి, దీపేష్ మొహపాత్ర, బైస్నాబ చరణ్ పరిడాలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ ...

Read More »

వడదెబ్బతో ఒకరి మృతి

  నిజాంసాగర్ మండలంలోని ముగ్దుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గిర్ని తండాకు చెందిన కడావత్ బన్సీ (55) వడదెబ్బ తగలడంతో సోమవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బన్సీ వ్యవసాయం పనులు చేస్తూ ప్రతిరోజు గేదెలు కాసేవాడని ఎప్పటి లాగే సోమవారం కూడా ఉదయం వెళ్లిన బన్సీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడని తెలిపారు. తల నొప్పి వస్తుందని తెలిపిన బన్సీ రాత్రి నిద్రలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య పట్ని, కుమారులు వినోద్, కిరణ్, కూతురు స్వప్న ఉన్నారు.

Read More »

ఆర్మూర్ బస్టాండులో గుర్తు తెలియని మృతదేహం

  ఆర్మూర్: ఆర్మూర్ బస్టాండులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సీతారాం తెలిపారు. ఆర్మూర్ బస్టాండులో పది రోజులుగా తిరుగుతున్నాడని చెప్పారు. బస్టాండు కాంప్లెక్స్ ఎదుట మంగళవారం మృతి చెంది ఉండడంతో ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీతారాం తెలిపారు. మృతుడికి 50 సంవత్సరాలు ఉంటాయని, నల్ల ప్యాంటు, గీతల షర్టు ధరించి ఉన్నాడని చెప్పారు.

Read More »

వాలీబాల్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం

  డిచ్‌పల్లి,  : ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాలీబాల్ టోర్నీ నిర్వహించగా, విజేతలకు రిజిస్ట్రార్ లింబాద్రి అధ్యక్షతన మంగళవారం బహుమతులను ప్రదానం చేశారు. టోర్నీ గెలుపొందిన మ్యాథమెటిక్స్ డిపార్ట్‌మెంట్ విద్యార్థులను అభినందించారు. రెండో బహుమతి ఎంసీఏ డిపార్ట్‌మెంట్ విద్యార్థులు గెలుచుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఆర్వో రాజారాం, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పంచరెడ్డి చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. విద్యార్థులను, క్రీడలు నిర్వహించిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులను అభినందించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు రాజ్‌కుమార్, శ్రీధర్, సాయి, భవన్‌సింగ్, ఓంకార్, ...

Read More »

న్యాయవాదిపై దాడికి నిరసనగా ఆందోళన

  నిజామాబాద్ లీగల్ : ఒక కేసు విషయమై నిజామాబాద్ రెండో టౌన్ పోలీ స్ స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాది ఆల్గొట్ రవీందర్‌పై కానిస్టేబుల్ భౌతికదాడి చే యడం అమానుషమని, సదరు పోలీస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ డి మాండ్ చేసింది. బార్ అధ్యక్షుడు బిర్లా రామారావు అధ్యక్షతన మంగళవారం బార్ సమావేశపు హాల్‌లో అత్యవసర స మావేశం నిర్వహించారు. సీనియర్ న్యా యవాదులు తుల గంగాధర్, ఎర్రం గణపతి, చల్ల మధుకర్, గొర్రెపాటి మాధవరావు, రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ...

Read More »

సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

  లింగంపేట : మండలంలోని భవానీపేట లో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అతి పెద్ద విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవ డంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ముఖ్య మంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న కేసీఆ ర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో జడ్పీటీసీ నాగ్లూరి శ్రీలత, సర్పంచి కమ్మరి పండరి, నాయకులు నాగ్లూరి సాయిలు, ఆకుల మహేందర్, పోశయ్య, చిన్న ...

Read More »