Breaking News

Daily Archives: April 14, 2016

ఆర్యవైశ్యుల పోటాపోటీ ప్రచారం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పీఠానికి జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో పోటీచేస్తున్న అభ్యర్థులు తమ అనుచరులతో పట్టణంలో ప్రచారం చేస్తున్నారు. అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న కొండ భైరయ్యతోపాటు కస్తూరి నరహరి, ఇతరులు పట్టణాన్ని చుట్టేస్తున్నారు. ప్రచార కార్యక్రమంలోపాల్గొని తమకు ఓటువేస్తే ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తామని చెబుతున్నారు. గురువారం అశోక్‌నగర్‌, ఎన్జీవోస్‌ కాలనీ, హౌజింగ్‌బోర్డు, బృందావన్‌ కాలనీ తదితర ప్రాంతాల్లోని ఆర్యవైశ్యుల ఇళ్లలో ప్రచారం చేశారు.

Read More »

విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రైట్‌ ఇన్సిట్యూట్‌లో గురువారం శిక్షణ పొందిన విద్యార్థినిలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన పిఆర్‌టియు జిల్లా అద్యక్షుడు మనోహర్‌రావు మాట్లాడుతూ అంబేడ్కర్‌ 125వ జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అంటరానితనాన్ని రూపుమాపి, బడుగు, బలహీనవర్గాల అభివృద్దికి అంబేడ్కర్‌ ఎనలేని కృషి చేశారన్నారు. కుల, మతాల ప్రస్తావన లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా కంప్యూటర్‌, కుట్టుమిసన్‌లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారన్నారు. తద్వారా తమ కాళ్లపై తాము ...

Read More »

అలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన

  కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని లిటిల్‌ స్కాలర్స్‌ పాఠశాలలో గురువారం చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశం పురస్కరించుకొని చిన్నారులు పలు ప్రదర్శనలు ఇచ్చారు. పలు సినీ, జానపద గేయాలతోపాటు భరత నాట్యం లాంటి సంప్రదాయ నృత్యాలతో విశేషంగా అలరించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

అంబేడ్కర్‌జీవితం ప్రపంచానికి ఆదర్శం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జీవితం ప్రపంచానికే ఆదర్శమని ప్రజాసంఘాలు నాయకులు, పలువురు కొనియాడారు. కామారెడ్డి పట్టణంలో గురువారం అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి, రైల్వేకమాన్‌ వద్దగల అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాలు, పార్టీలు, కమ్యూనిస్టులు, కులసంఘాలు, దళిత సంఘాలు, యువజన సంఘాలు, పాఠశాలలు, కళాశాలల ప్రతినిధులు మాట్లాడారు. అంబేడ్కర్‌ ప్రపంచ మేధావి అని, విశాల భారతదేశానికి ...

Read More »

లోకకళ్యాణం కోసం యజ్ఞం

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు పుష్కలంగా పండాలని కోరుతూ లోక కల్యాణం కోసం గురువారం మండల కేంద్రంలోని గాయత్రి షుగర్‌ ఫ్యాక్టరీలో వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ఘనంగా యజ్ఞం నిర్వహించారు. గత రెండేళ్ళుగా సరిగా వర్షాలు కురియకపోవడంతో పంటలు సరిగా పండడం లేదని ఇందుకోసం యజ్ఞం నిర్వహిస్తున్నట్టు ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపారు. కార్యక్రమానికి నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యజ్ఞ కార్యక్రమం గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ...

Read More »

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గురువారం అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ అంతిరెడ్డి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో పాఠశాల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి అంబేడ్కర్‌ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బేగరి రాజు, పిఆర్‌టియు అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్‌, తెరాస నాయకులు సందీప్‌, ప్రధానోపాద్యాయులు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రామాలయంలో డిఎస్పీ ప్రత్యేక పూజలు

  రెంజల్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కందకుర్తి గ్రామంలోని రామాలయంలో బోధన్‌ డిఎస్పీ వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీరామనవమి పురస్కరించుకొని ముందురోజు ఏర్పాట్లు పరిశీలించి పూజలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో 30 యాక్టు అమల్లో ఉన్నందున కందకుర్తి గ్రామంలో ప్రతి శ్రీరామనవమికి నిర్వహించే కుస్తీపోటీలను ఈసారి నిర్వహించరాదని డిఎస్పీ స్పష్టం చేశారు. ఒకవేళ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డిఎస్పీ వెంట ఎస్‌ఐ రవికుమార్‌, ...

Read More »

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

  రెంజల్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో డాక్టర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడ్‌బిలోలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంబేడ్కర్‌ చిత్రపటంతో వాడవాడలా ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలువేసి నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు. దళిత నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో జడ్పిటిసి నాగభూషణం రెడ్డి, ఎస్‌ఐ రవికుమార్‌, ఎంపిడివో ...

Read More »

బోరుదాత మల్లారెడ్డి

  నందిపేట, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో మునుపు ఎన్నడూలేనివిదంగా కరువు కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోయి నీళ్ల కోసం ఎవరికి వారే అల్లాడుతున్న ఈ రోజుల్లో తన సొంత పొలాన్ని పడీతుగా ఉంచి గ్రామ ప్రజలకు నీటి సరఫరా చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు నందిపేట మండలంలోని డొంకేశ్వర్‌ గ్రామ తెరాస అధ్యక్షుడు మిట్టాపల్లి మల్లారెడ్డి. గత కొన్ని నెలలుగా గ్రామపంచాయతీ బోర్లలో నీరు అడుగంటిపోయి దానిద్వారా సరఫరా అయ్యే మినీ ట్యాంకులు ...

Read More »

మండలంలో గ్రామసభలు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మోర్తాడ్‌, గాండ్లపేట్‌, తిమ్మాపూర్‌, పాలెం, తొర్తి గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌ల అధ్యక్షతన మండల ఎంపిడివో శ్రీనివాస్‌ గ్రామ సభలు నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. గ్రామసభల్లో అంబేడ్కర్‌ ఆశయాలు, ఆయన కన్నకలలుపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అంతేగాకుండా దేశ ప్రధాని నరేంద్రమోడి అమలు చేస్తున్న ముద్ర, గ్రామ్‌ ఉదయ్‌ పథకాలపై గ్రామసభల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు దడివెనవీన్‌, రాజేశ్వర్‌, ఉగ్గెర భూమేశ్వర్‌, ...

Read More »

కార్యకర్తలను అన్నివిధాలుగా ఆదుకుంటా

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస నాయకులకు, కార్యకర్తలకు ఎళ్లవేళలా అండగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకుంటానని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని షెట్పల్లి గ్రామంలో నర్సారెడ్డి అనే నాయకుని పరామర్శించారు. గాయపడ్డ బాధితున్ని ఆరోగ్య పరిస్తితి, ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వైద్యచికిత్సల నిమిత్తం ఆర్థిక సహాయం అందిస్తామని, అవసరమైతే తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని, అధైర్యపడవద్దని బాధిత కుటుంబీకులకు మనోధైర్యాన్ని అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లింబన్న, ఎంపిటిసి ...

Read More »

అంబేడ్కర్‌ స్ఫూర్తితో అభివృద్దే ధ్యేయంగా తెరాస కృషి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే తెరాస సిఎం కెసిఆర్‌ కృషి చేస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ధర్మోరా గ్రామంలో 5 లక్షల నిధులతో నిర్మించిన అంబేడ్కర్‌ సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్‌ 3 మేరకు, బోధించు, సమీకరించు, పోరాడు అనే భావనతో సిఎం కెసిఆర్‌ రాష్ట్ర సాధనకై ప్రజల్ని సమీకరించి, ఉద్యమించి సాధించారన్నారు. అంబేడ్కర్‌ అందరివాడని, అన్ని ...

Read More »

మండలంలో ఘనంగా అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో స్థానిక సర్పంచ్‌లు, వార్డుసభ్యులు, పాలకవర్గ సభ్యులు అన్ని మండల కార్యాలయాల్లో అధికారులు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు డాక్టర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మోర్తాడ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి దళితసంఘాల నాయకులు, సభ్యులు, అంబేడ్కర్‌ సంఘ సభ్యులు భారీ పూలమాలలతో నివాళులు అర్పించారు. మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, జడ్పిటిసి ఎనుగందుల అనిత, పూర్ణానందం, ఎంపిటిసిలు, సర్పంచ్‌ దడివె నవీన్‌, ...

Read More »

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

  నందిపేట, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలో గురువారం అంబేడ్కర్‌ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రం, డొంకేశ్వర్‌, తల్వేద గ్రామాల్లో ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. తల్వేద గ్రామంలో ఎంపిపి అంతంపల్లి యమున అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు, తెరాస, బిజెపి, తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ ఆధ్వర్యంలో ...

Read More »

సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేయాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయులందరికి కంట్రిబ్యూటరీ పించన్‌ స్కీం విధానాన్ని రద్దుచేసి పాత పింఛన్‌ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ పిఆర్‌టియు ఆధ్వర్యంలో ఉత్తరాల ఉద్యమం చేపట్టారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిఆర్‌టియు అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి బాస్కర్‌గౌడ్‌, సంతోష్‌కుమార్‌లు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికి కొత్త పించన్‌ విధానాన్ని రద్దుచేసి పాత పించన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాసి పంపడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులందరికి కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యసేవలు ...

Read More »

ఇంకుడు గుంతల నిర్మాణంపై చొరవ చూపాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ జాబ్‌ కార్డులు కలిగిఉన్న ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున్నవారికి ఇంకుడుగుంత నిర్మాణాల కోసం చొరవ చూపాలని క్షేత్ర సహాయకులకు ఎంపిడివో సూచించారు. నిజాంసాగర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడివో రాములు నాయక్‌ మాట్లాడుతూ నీటి వనరులు సమృద్ధిగా ఉండేందుకు ఇంకుడుగుంత నిర్మాణం కోసం క్షేత్ర సహాయకులు ముందుకుసాగాలని అన్నారు. అలాగే గ్రామాల్లో ...

Read More »

అంబేడ్కర్‌ ఆదర్శప్రాయుడు

  పిట్లం, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజానికి అంబేడ్కర్‌ ఆదర్శప్రాయుడని ఏబివిపి మండల అధ్యక్షుడు సందీప్‌ సాగర్‌ అన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా పిట్లం చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి జలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మనదేశ రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్‌ ఆశయాలను సాదించాలని కోరారు. కులాల పునాదులను కూల్చేద్దాం, అంబేడ్కర్‌ ఆశయాలను సాధిద్దాం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రవి, రాము, రంజిత్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

  పిట్లం, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని చిన్నకోడప్‌గల్‌ గ్రామంలో అంబేడ్కర్‌ జయంతి ఘనంగా జరుపుకున్నారు. జయంతి సందర్భంగా అంబేడ్కర్‌ యూత్‌ అధ్యక్షుడు సంటోని నారాయణ జెండా ఆవిష్కరించారు. యూత్‌ కార్యదర్శి బాబు మాట్లాడుతూ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నప్పటికి విగ్రహ ఆవిష్కరణకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిష్కరణ కార్యక్రమం త్వరలోనే ఘనంగా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ యూత్‌ సభ్యులు, సర్పంచ్‌ అంజలి, సంతోష్‌, పిఏసిఎస్‌ ఛైర్మన్‌ సీతారామరావు, నర్సింహారెడ్డి, ...

Read More »

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

  ఎడపల్లి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా పోచారం గ్రామంలో గురువారం అంబేడ్కర్‌ 125వ జయంతిని నిర్వహించారు. అంబేడ్కర్‌ సంఘం పోచారం గ్రామ అధ్యక్షుడు బాజన్నోల్ల గంగారాం జెండా ఆవిష్కరించగా, కోశాధికారి విజయ్‌ చందర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేడ్కర్‌ సంఘం మండల అద్యక్షుడు నీరడి రవికుమార్‌ మాట్లాడుతూ యువకులందరు అంబేడ్కర్‌ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా ...

Read More »

మాక్లూర్‌లో అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామంలో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో సర్పంచ్‌ సత్తమ్మ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పేర్కొన్నవిధంగా ప్రజలందరు కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని అన్నారు. అంబేడ్కర్‌ జాతీయభావాలు గల గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈరోజు ప్రపంచంలోని చాలా దేశాల్లో అంబేడ్కర్‌ జయంతి జరుపుకోవడం ...

Read More »