Breaking News

మాక్లూర్‌లో అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు

 

మాక్లూర్‌, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామంలో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో సర్పంచ్‌ సత్తమ్మ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పేర్కొన్నవిధంగా ప్రజలందరు కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని అన్నారు. అంబేడ్కర్‌ జాతీయభావాలు గల గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈరోజు ప్రపంచంలోని చాలా దేశాల్లో అంబేడ్కర్‌ జయంతి జరుపుకోవడం ఎంతో గొప్పవిషయమన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ బాబ్జి, ఎంపిటిసిలు వినోద, అహ్మద్‌, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, ఆయా పార్టీలనాయకులు పాల్గొన్నారు.

Check Also

బిల్లులపై రైతులకు అవగాహన కల్పించాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును విపక్షాలైన కాంగ్రెస్‌ ...

Comment on the article