Breaking News

Daily Archives: April 15, 2016

సిపిఎం కరువు యాత్ర ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డినుంచి కరువుయాత్రను ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ డివిజన్‌ కార్యదర్శి కె.చంద్రశేఖర్‌ తెలిపారు. కరువు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల తాగునీరు, సాగునీరు, సంక్షేమపథకాలు, కరువు ,నివారణ చర్యల కోసం యాత్ర ప్రారంభించినట్టు తెలిపారు. తీవ్ర కరువు ఏర్పడి ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం గర్హనీయమన్నారు. దీన్ని సహించలేక ప్రజాక్షేత్రంలోకి కరువుయాత్ర రథంతోవెళుతున్నట్టు తెలిపారు. కేంద్రం ప్రకటించిన 780 కోట్లను ఎమ్మెల్యేల అభివృద్ది నిధులు 35 ...

Read More »

ఘనంగా సీతారాముల కళ్యాణం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. పండగ నేపథ్యంలో పట్టణంలోని ఆలయాన్ని భక్తులతో కిక్కిరిసాయి. పట్టణంలోని సాయిబాబా ఆలయం, గంజ్‌ రామాలయం, శ్రీసీతారామచంద్ర ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంతోపాటు వివిధ ఆలయాల్లో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సీతారాములకు ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీసీతారామచంద్ర ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండువగా జరిపారు. భక్తులు కళ్యాణ వేడుకలు తిలకించి ఆనంద పరవశులయ్యారు.

Read More »

భక్తి శ్రద్దలతో అమ్మవారికి కుంకుమ పూజలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీకాళికా దేవి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి భక్తిశ్రద్దలతో కుంకుమపూజలు నిర్వహించారు. మంగళహారుతులు సమర్పించి, పసుపు, కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున మహిళలు పూజల్లో పాల్గొన్నారు. అదేవిధంగా శనివారం అమ్మవారికి మహానైవేద్యం సమర్పించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కిష్టయ్య, కార్యదర్శి పోశాద్రి, శ్రీధరాచారి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కన్నుల పండువగా శ్రీరామనవమి ఉత్సవాలు

  ఎడపల్లి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరావనవమి వేడుకలు న్నుల పండువగా నిర్వహించారు. ఎడపల్లిలోని శ్రీరామమఠంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిపించారు. అలాగే పోచారం గ్రామంలో శ్రీరామాలయంలో నవమి ఉత్సవాలను, కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారు సీతాదేవికి మాంగళ్యధారణ చేశారు. ఈ సందర్భంగా అన్నదానం చేపట్టారు. సాయంత్రంవేళ ఉత్సవ మూర్తులను ఊరేగించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ ఛైర్మన్‌ కట్ట సుదర్శన్‌, కార్యదర్శి పోత దేవన్న, సర్పంచ్‌ అశోక్‌సింగ్‌, ...

Read More »

ముగిసిన అఖండ హరినామ సప్తాహ

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నెమ్లి గ్రామంలో అకండ హరిసప్తాహ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన ఆలయంలో విఠోబా మహరాజ్‌, దేవుని గురించి గత ఏడురోజుల నుంచి ఉదయం సాయంత్రం ప్రవచనాలు చెప్పారు. శుక్రవారం దిండి కార్యక్రమంలో భాగంగా విగ్రహ మూర్తులను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు నీరడి పెంటయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలాగే ఈయేడు కూడా అఖండ హరినామసప్తాహ ఘనంగా నిర్వహించామని, దిండి కార్యక్రమంలో ...

Read More »

ఉపాధి కూలీలకు సౌకర్యాలు కరువు

  బోధన్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోదన్‌ మండలంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ఎండతీవ్రత నుంచి కాపాడేందుకు కల్పించాల్సిన సౌకర్యాలు అధికారులు కల్పించడం లేదు. ఎండతీవ్రంగా ఉండడంతో మండలంలోని అనేక గ్రామాల్లో ఉపాధికూలీలు వడదెబ్బకు గురవుతున్నారు. పనిజరిగేచోటా టెంట్లు వేసి నీడను కల్పించాలని, అలాగే ఉపాధి కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలున్నప్పటికి అధికారులు వాటిని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ...

Read More »

ఆర్టీసి స్థలం కబ్జా

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్‌ ఆవరణలో కొందరు వ్యాపారులు బస్టాండ్‌ స్థలాన్ని కబ్జాచేస్తున్నారు. అక్రమంగా కబ్జాచేసిన స్థలాలో మొరం వేయించుకొని ఏకంగా షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు ఏకంగా దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ఆర్టీసి అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు. 1988లో అప్పటి ప్రభుత్వం గ్రామీణ కాంతి పథకం కింద లక్షల రూపాయలు వెచ్చించి ఆర్టీసి బస్టాండ్‌ను నిర్మించి అప్పట్లో ...

Read More »

శనివారం కుస్తీ పోటీలు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరామనవమి పురస్కరించుకొని మండలంలోని నాచుపల్లి, రాములగుట్ట ఆలయంలో శనివారం కుస్తీపోటీలు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పోటీల సందర్భంగా మల్లయోధులు మండలం చుట్టు పక్క లప్రాంతా లనుంచే కాకుండా నాందేడ్‌, గుల్‌బర్గా తదితర ప్రాంతాల నుంచి విచ్చేస్తారని, విజేతగా నిలిచిన మల్లయోధుడికి ఆలయ సంప్రదాయం ప్రకారం శాలువాతో సత్కరించి ప్రకటించిన నగదును అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల కేంద్రంలోని రామాలయంలో శుక్రవారం అత్యంత వైభవంగా శ్రీరావనవమి వేడుకలు నిర్వహించారు. ఉదయంనుంచే ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్ష్మినారాయణ, ఉపాధ్యక్షులు రమణారావు, సభ్యులు, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

Read More »

రైతులకు మరితం లాభదాయకంగా మోడీ “నామ్”

అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (‘నామ్’) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మరితం లాభదాయక ధరను దగ్గర చేయడమే దీని లక్ష్యమని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాదా మోహన్ సింగ్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులకు ఒకే ధరను అందించే ఆలోచనతో తయారైన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ ఈ నామ్.. 8 రాష్ట్రాల్లోని, 21 ప్రధాన మండీ( వ్యవసాయ మార్కెట్)లను 585 రెగ్యులేటెడ్ హోల్ సేల్ మార్కెట్లను భాగం ...

Read More »

బిచ్చమైనా ఎత్తుకుంటా గానీ టీఆర్ఎస్ లో చేరను: డీకే అరుణ

హైదరాబాద్: కష్టాలు వస్తే బిచ్చమైనా ఎత్తుకుంటా గానీ టీఆర్‌ఎస్‌లో చేరేది లేదని మాజీ మంత్రి, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ స్పష్టం చేశారు. గురువారం గాంధీభవన్‌లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన తమ్ముడు, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడం దారుణమన్నారు. పైగా నియోజకవర్గ అభివృద్ధి, బీమా ప్రా జెక్టు కోసమే పార్టీ మారుతున్నాననడం సిగ్గుచేటన్నారు. ‘‘కాంగ్రెస్ హయాంలోనే బీమా 90 శాతం పూర్తయింది.ఇప్పుడు కొత్తగా టీఆర్‌ఎస్ చేసేదేమిటి? నా తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ప్రతిష్టకు, నా ప్రతిష్టకు ...

Read More »

కట్టప్ప చేతిలో బాహుబలి చనిపోలేదా?-కొత్త ట్విస్ట్

దేశమంతటా సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ బాహుబలి. ఈ సినిమా వచ్చి తొమ్మిది నెలలైనా ఇంకా దీని వైబ్రేషన్స్, వేవ్స్ ఇప్పటికీ అలానే ఉన్నాయి. టాలీవుడ్ మూవీస్ లో ఇది ఒక రోల్ మోడల్ గా మారింది. ట్రెండ్ సెట్టర్ అయింది. హాలీవుడ్ మూవీ రేంజ్ లో వచ్చిన ఈ సినిమా చూసిన వారికి కొన్ని సందేహాలూ ఉన్నాయి. అవి బాహుబలి 2 లో తీరవచ్చనుకుంటున్నారు. అంతకంటే ముందు ఈ సినిమాలో కట్టప్ప, బాహుబలి పాత్రలపై చిన్న ట్విస్ట్ వచ్చింది. బాహుబలి కోసం డైరెక్టర్ ...

Read More »

ఆంధ్ర కంటే తెలంగాణ బెస్ట్!

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే పరిపాలన సంతృప్తికరమని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇది తెలంగాణ ప్రజలు వెలిబుచ్చిన అభిప్రాయం కాదు! ఏపీ వాసులే స్వయంగా ఆ రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే పరిపాలన బాగుందని అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఏపీ కంటే తెలంగాణ ప్రభుత్వమే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నదని సర్వేలో పాల్గొన్న వారు అన్నారు. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ గతనెల రెండోవారం నుంచి పదిరోజుల పాటు ఏపీలో నిర్వహించిన సర్వేలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఇక ...

Read More »

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే శవాల గదికి పంపిస్తారట!

బ్యాంకాక్‌: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ అనేది ఏ దేశంలోనైనా ప్రమాదకరమే. కాకపోతే ఈ కేసులకు ఒక్కో దేశంలో ఒక్కోలా శిక్ష విధిస్తారు. అయితే థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో ఎలాంటి శిక్షలు విధించినా, ఎంత హెచ్చరించినా అక్కడ మాత్రం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గడం లేదు. ఆ దేశంలో ప్రతీ ఏడాది దాదాపు 24 వేల మంది రోడ్డు ప్రమాదాల్లోనే మరణిస్తున్నారు. అందుకే తాగి వాహనం నడిపే వారికి భయంకరమైన శిక్షలు విధించాలని భావిస్తోంది థాయ్‌ ప్రభుత్వం. ఇకపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ...

Read More »

శ్రీరామనవమి ప్రసాదాలు

శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుంది కాబట్టి ప్రసాదాలు కూడా శరీరంలో వేడిని తగ్గించి చలువచేసేవే ఉంటాయి. శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. దీని వెనుక ఆరోగ్య, వైద్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉంది. భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. శరద్ ఋతువు, వసంత ఋతువు యముడి కోరలు లాంటివే అని దేవీ భాగవతం చెబుతోంది. పానకంలో ఉపయోగించే ...

Read More »

తాగునీటి కోసం తంటాలు..

మద్నూర్ : భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ప్రజ లు తాగునీటి కోసం తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నా రు. మండల కేంద్రంలోని వై ఎస్సార్ కాలనీవాసులు తాగు నీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం పరుగు లు తీస్తున్నారు. కాలనీలో వంద కుటుం బాలు నివసిస్తున్నాయి. కాలనీ లో ఉన్న మూడు బోర్లలో సైతం నీళ్లు అడుగంటి పోవడంతో వారు ప క్కన ఉన్న ఇందిరానగర్ కాలనీ నుంచి నీళ్లను తెచ్చుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం మండల కేంద్రంలోని ...

Read More »

నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు

నిత్యపెళ్లికొడుకు జూబ్లీహిల్స్: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న  ఓ ప్రబుద్ధుడు మూడు నెలలు తిరగకుండానే నాల్గవ భార్యను వదిలి పరారయ్యాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం…. టోలిచౌకి, పారామౌంట్ కాలనీలో నివసించే సిమ్రాన్ సయీద్(19) వివాహం గతేడాది నవంబర్ 13న సయ్యద్ యాసర్ అహ్మద్‌తో జరిగింది. పెళ్లి సమయంలో రూ. 30 లక్షల నగదు, 20 తులాల బంగారు నగలు కట్నంగా ఇచ్చారు. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచే ఆమెను అత్తగారు వేధించడం మొదలుపెట్టింది.  దీంతో సిమ్రాన్ వేరు కాపురం పెట్టింది. అయినాసరే ...

Read More »

చక్కెర వ్యాధికి ఇక చెక్‌ పెట్టొచ్చు!

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని కబలిస్తున్న వ్యాధి డయాబెటిస్‌. దీనిని నియంత్రణలో ఉంచుకోవడం తప్ప పూర్తిగా నివారించడమన్నది సాధ్యం కాదనేది అందరి భావన. అయితే ఇకపై దీనిని పూర్తిగా నివారించవచ్చని చెబుతున్నారు సాల్క్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకుడు రోనాల్డ్‌ ఇవాన్స్‌. మానవ శరీరంలోని క్లోమ గ్రంథిలో ఉండే బీటా కణాలు దెబ్బతిని ఇన్సులిన్‌ను స్రవించలేకపోవడం వల్ల మధుమేహం వస్తుంది. అయితే మానవ మూల కణాలను ఇన్సులిన్‌ ఉత్పత్తి చేసే బీటా కణాలుగా మార్చే ప్రోటీన్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ప్రోటీన్‌ ద్వారా బీటా కణాలుగా పనిచేసే ...

Read More »

హనీమూన్‌ జంటల వల్లే కేదార్‌నాథ్‌ విపత్తు!

హనీమూన్‌కు వచ్చిన జంటలు, పిక్నిక్‌కు వచ్చిన వాళ్ల మూలంగానే 2013లో కేదార్‌నాథ్‌ విపత్తు సంభవించింది. పవిత్ర యాత్రలో హనీమూన్‌ జంటలు అపవిత్ర కార్యకలాపాలకు దిగడంతోనే ప్రకృతి ప్రకోపించింది. ఇక, వాళ్లేమో(ఆర్‌ఎ్‌సఎస్‌) తాము హిందూయిజం కోసం పనిచేస్తున్నామని చెప్పుకొంటారు. కానీ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తలు బీఫ్‌ తింటారు. – స్వరూపానంద సరస్వతి

Read More »

అర్ధరాత్రి వచ్చిన వ్యక్తి ఎవరు?

ఇదేదో హారర్‌ సినిమా పేరనుకుంటే పప్పులో కాలేసినట్టే! చెన్నైలో వాస్తవంగా జరిగిందని చెప్పుకుంటున్న సంఘటన. వివరాల్లోకి వెలితే… నయనతార చెన్నైలో ఓ అపార్ట్‌ మెంట్‌లో ఉంటోంది. మొన్నీమధ్య అర్థరాత్రి సమయంలో ఆమె ఫ్లాట్‌లోకి ఓ వ్యక్తి ప్రవే శించాడు. అతగాడిని చూసి నయనతార కేకలు వేసింది. దాంతో అతడు పారిపోయాడు. ఇదీ కథ. ఇంత పక్కాగా అల్లిన కథలో చిన్న ట్విస్ట్ట్‌ ఏమిటంటే… గత కొన్ని రోజులుగా నయనతార చెన్నైలో ఉండడంలేదు. తెలుగు సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో ఉంటోందట! నయనతార ఇక్కడ ఉంటే ...

Read More »