Breaking News

Daily Archives: April 16, 2016

నీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు

  పిట్లం, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం పట్టణంలో అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద మహిళలు నీటికోసం రోడ్డెక్కారు. గ్రామ పంచాయతీ వేయించిన బోరుబావులు ఎండిపోవడంతో ప్రజలు కష్టాలపాలవుతున్నారు. గ్రామపంచాయతీ ట్యాంకర్లు కూడా సరిపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. తమ కష్టాన్ని అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read More »

వైభవంగా శ్రీరాములవారి జాతర

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాళ్లరాంపూర్‌ గ్రామంలోగల శ్రీరామాలయంలో గ్రామాభివృద్ది కమిటీ ఆద్వర్యంలో శ్రీసీతారామచంద్రస్వామి జాతర వైభవంగా జరిగింది. గత నాలుగురోజులుగా శ్రీరామనవమి పురస్కరించుకొని వేదపండితులతో బ్రహ్మూెత్సవాలు నిర్వహించారు. శుక్రవారం సీతారాముల కళ్యాణం నిర్వహించారు. శనివారం చక్రతీర్థం, అన్నదానం ఏర్పాటు చేశారు. జాతరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత, సర్పంచ్‌ మారుత, ఎంపిటిసి దిబ్బ సరస్వతి ప్రత్యేక పూజలు జరిపించారు.

Read More »

ఎమ్మెల్యే కృషితోనే తాగునీటి సౌకర్యం కల్పిస్తాం

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గ్రామాల్లో నీటి ఎద్దడి ప్రాంతాలను గుర్తించి తమ దృస్టికి తీసుకొస్తే వెంటనే ఎమ్మెల్యేకు సమాచారం అందించి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత అన్నారు. మండలంలోని తిమ్మాపూర్‌గ్రామంలో మహిళా సంఘం భవనం ముందు బోరుబావికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. బోరుబావి, మోటారు పైప్‌లైన్‌కు ఎమ్మెల్యే నిదులు మంజూరు చేశారని అన్నారు. గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఉగ్గెర భూమేశ్వర్‌, ఎంపిటిసి లత, రాజేశ్వర్‌, ...

Read More »

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

  రెంజల్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన ఉపాధి కూలీ గూండ్ల సాయవ్వ (48) వడదెబ్బతో మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. ప్రతిరోజు లాగే శనివారం కూడా ఉపాధి పనులకు వెళ్లగా పని ముగించుకొని ఇంటికి చేరుకుంది. ఇంట్లోనే కూలబడి మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

Read More »

గడ్డివాము దగ్దం – లక్ష ఆస్తినష్టం

  రెంజల్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన రైతులు గురడి సాయిరెడ్డి, గుజ్జుల సాయిరెడ్డిలకు చెందిన గడ్డివాములు శనివారం దగ్దమైనట్టు బాధితులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాములకు నిప్పంటించినట్టు స్థానికులు తెలిపారు. తమ పశువుల కోసమని పది ఎకరాల్లో గడ్డివాము తయారుచేసిపెట్టామని చెప్పారు. గడ్డి దగ్దమవడంతో సుమారు లక్ష రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్టు చెప్పారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలు ఆర్పేశారు. విఆర్వో అయుపటేల్‌ పంచనామా నిర్వహించి నష్టం అంచనా వేశారు.

Read More »

చలివేంద్రం ప్రారంభం

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మదన్‌పల్లి గ్రామంలో తెరాస కార్యకర్త ఒడ్డెన్న ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని శనివారం తహసీల్దార్‌ లత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండలు తీవ్రమవుతున్నవేళ బాటసారుల దాహం తీర్చేందుకు ఇటువంటి చలివేంద్రం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లత, ఎంపిటిసి సుశీల, గ్రామ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆర్టీసి బస్సు ఢీ – ఒకరు మృతి

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి బస్సు ఢీకొని యువకడు మృతి చెందిన సంఘటన మండలంలోని బొమ్మన్‌దేవుపల్లి ఎక్స్‌రోడ్డులో చోటుచేసుకుంది. స్తానికులు, పోలీసుల కథనం ప్రకారం… కోటగిరి మండలం పోతంగల్‌ గ్రామానికి చెందిన నాగరి అనిల్‌, నాగరి గంగన్నలు టిఎస్‌ 16 ఇసి 4034 నెంబరుగల ద్విచక్రవాహనంపై సిలిండర్‌ వెంట బెట్టుకొని శనివారం వర్ని వైపు వెళుతున్నారు. కాగా బాన్సువాడ ఆర్టీసి డిపోకు చెందిన ఎపి 28 జెడ్‌ 1003 నెంబరుగల బస్సు నిజామాబద్‌ నుంచి బాన్సువాడకు ...

Read More »

అమెరికాతో జట్టు…

మన దేశానికీ అమెరికాకూ మధ్య రక్షణ సదుపాయాల సహకారపు ఒప్పందం-లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ కుదరడం అనివార్యమైన దౌత్య పరిణామం. 2014 మే 26న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం పాలనా బాధ్యతలను స్వీకరించినప్పటినుంచి దేశ రక్షణకు పెరుగుతున్న ప్రాధాన్యం ఈ అపూర్వ పరిణామానికి ప్రాతిపదిక! చైనా వారి యుద్ధ నౌకలు మనదేశానికి చుట్టూ ఉన్న బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్ ఓడరేవులలో తిష్ఠ వేసి ఉండడం మన దేశ భద్రతకు ముంచుకొస్తున్న ప్రమాదం. ఈ దురాక్రమణ వహ్నిని నిరోధించడానికి ...

Read More »

ఎన్నారైలకు మరియు పరదేశీయులకు శుభవార్త

విదేశీయులు, ఎన్నారైలకు శుభవార్త! ఇకపై తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో రైల్వే టికెట్లను విదేశాల నుంచే కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కొత్తగా భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) కల్పిస్తోంది. ఇప్పటివరకూ ఎన్నారైలు, విదేశీయులు భారత్ పర్యటనకు వచ్చేముందు రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడం కోసం ఇండియాలోని తమ బంధువులు, టూర్ ఆపరేటర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఐఆర్ సీటీసీ ఈ పరిస్థితిలో మార్పులు చేర్సులు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం వెబ్ సైట్ లో అంతర్జాతీయ లావాదేవీలకు అవకాశం ...

Read More »

బహ్రెయిన్ లో ఘనంగా ‘శ్రీ రామ నవమి’ వేడుకలు

శ్రీ కృష్ణ టెంపుల్,మనామా లో తెలుగు వారంతా కలిసి శ్రీ రామ నవమిని పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా శ్రీ సీతారామ కల్యాణోత్సవం, శ్రీ రామ పట్టాభిషేక కార్యక్రమాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బహ్రెయిన్ లో శుక్రవారం సెలువు దినం కావడంతో పండుగను మరింత ఉత్సహాంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ  కార్యక్రమములో భక్తులు గణనీయమైన సంఖ్యలో హాజరయ్యారు.మైలవరపు శ్రీనివాస రావు గారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.ఈ కళ్యాణ మహోత్సవం మురళి కృష్ణ,ఆర్.వి రావు ,అశోక్ రావు గార్ల ఆధ్వర్యం లో వైభవంగా నిర్వహించబడినది.

Read More »

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబడులు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అసెట్ బేస్ 13 శాతం పెరిగి రూ. 3.45 లక్షల కోట్లకు చేరుకుంది. రిటైల్ ఇనె్వస్టర్లు ఈ పథకాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడమే వీటి అసెట్ బేస్ ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణం. 2015 మార్చిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అసెట్ బేస్ రూ. 3.05 లక్షల కోట్లు ఉండగా, అది ఈ ఏడాది మార్చి చివరికి రూ. 3.45 లక్షల కోట్లకు ...

Read More »

తెలుగింట ఐపీఎల్‌ సందడి

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ నేడు తెలుగింట పొట్టి క్రికెట్‌ సందడికి తెరలేవనుంది. ఐపీఎల్‌-9లో తొలి సాయంత్రపు మ్యాచ్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. శనివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. ఈనాడు – హైదరాబాద్‌ ఓ టమితో ఈ సీజన్‌ను ఆరంభించిన సన్‌రైజర్స్‌ కోల్‌కోతాతో మ్యాచ్‌తోనైనా బోణీ కొట్టాలని చూస్తుండగా.. గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి మళ్లీ గెలుపు బాట పట్టాలని గంభీర్‌ సేన భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో 45 పరుగుల ...

Read More »

ఆలిండియా ఆక్వాటిక్స్ పోటీలకు జిల్లా పోలీసులు

  నిజామాబాద్ స్పోర్ట్స్ : ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో జరుగనున్న అఖిల భారత పోలీసు ఆక్వాటిక్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లాకు చెందిన నలుగురు పోలీసులు ఎంపికయ్యారు. నవాతె శ్రీనివాస్, పి.సురేశ్, మహ్మద్ అఫ్సర్, కె.నరేశ్ కుమార్ ఎంపికైనవారిలో ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని పోలీసు శాఖకు చెందిన 11 మంది ఉండగా జిల్లాకు చెందిన వారు నలుగురు ఎంపిక కావడం విశేషం. ఈ 11 మంది క్రీడాకారుల బృందానికి నవాతె శ్రీనివాస్ నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 17 నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని ...

Read More »

గుడిసె దగ్ధం

  మాచారెడ్డి : మండలంలోని భవానీపేట గ్రామపంచాయతీ పరిధిలోని భవానీపేట తండాలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుడిసెకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైంది. బాధితుడు బానోత్ దేవ్ తెలిపిన ప్రకారం తన కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి ఆరుబయట నిద్రిస్తుండగా అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు గుడిసెకు నిప్పటించి వెళ్లారన్నారు. ఒకే సారి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని తాము తేరుకొనే లోపు పూర్తిగా దగ్ధమైనట్లు వాపోయాడు. గుడిసెలో ఉన్న వంటసామగ్రితో పాటు బట్టలు పూర్తిగా కాలిపోయినట్లు తెలిపాడు. ఈ ...

Read More »

నిప్పు కణికలా నిజామాబాద్

  నిజామాబాద్ అర్బన్, : జిల్లాలో సూ ర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. శుక్రవారం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 44.9 డిగ్రీలుగా నమోదైంది. వారం రోజులుగా వడగాల్పులతో భయపెడుతున్న భానుడు త న ప్రతాపాన్ని మరింత చూపుతున్నాడు. శుక్రవారం మ ధ్యాహ్నం వరకు 43.6 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు సా యంత్రం వరకు 44.9 డిగ్రీలకు చేరడంతో ఎండలతో ప్రజలు విలవిల్లాడారు. రాష్ట్రం వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల్లో జిల్లా మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో ఎండ తీవ్రతల దృష్ట్యా కలెక్టర్ చైర్మన్‌గా హీట్‌వేవ్ కమిటీ ఏర్పాటు ...

Read More »

రైతులకు వరం

  జుక్కల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం రైతన్నకు వరంగా మారిందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. శుక్రవారం మహ్మదాబాద్ గ్రామంలో రూ.26.40 లక్షలతో నిర్మిస్తున్న వాగ్మల్ కుంట చెరువు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… మిషన్ కాకతీయ పథకం ద్వారా పంట పొలాలకు సాగునీరంది రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా పొలాలకు సాగునీరు అందడంతోపాటు భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. చెరువులోని ...

Read More »

పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి

  -ఎంపీ కల్వకుంట్ల కవిత -డిచ్‌పల్లి రామాలయంలో వైభవంగా సీతారాముల కల్యాణం -పాల్గొన్న ఎంపీ దంపతులు -పోచారంలో పాల్గొన్న మంత్రి డిచ్‌పల్లి : రాష్ట్రంలో అద్భుత కళాఖండాలు, కట్టడాలు కలిగిన దేవాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం డిచ్‌పల్లి రామాలయంలో జరిగిన కల్యాణ వేడుకల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాగు, సాగు నీటి రంగాలు ఒక దశకు వచ్చాయని, ఇక దేవాలయాలను అభివృద్ధి చేయాల్సి ఉందని ...

Read More »

శ్రీరాముని అనుగ్రహంతో విస్తారంగా వర్షాలు: మంత్రి

తిర్మలాపూర్‌, పోచారం (బాన్సువాడ గ్రామీణం): శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసి చెరువులు, కుంటలు నిండి పొలాలు పచ్చదనంతో కళకళలాడాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని తిర్మలాపూర్‌, పోచారం గ్రామాలలో శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవ కార్యక్రమానికి మంతి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయంలో భక్తునుద్దేశించి మంత్రి మాట్లాడారు. భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య శ్రీరామనవమి వేడుకలు ప్రజలు జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి ...

Read More »

పాతాళ గంగ కాదు … పైపులైన్‌ లీకేజీ

బాల్కొండ, : బాల్కొండ శివార్లలో ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకు వద్ద శుక్రవారం మధ్యాహ్నం కామారెడ్డి మంచి నీటి పథకం పైప్‌లైన్‌ లీకేజీ అయింది. తాగునీరు వృథాగా పోవడంతో సమీప ప్రాంతం జలమయమైంది. బాల్కొండ మండలం జలాల్‌పూర్‌ శివార్లలో నుంచి గోదావరి నది జలాలను తరలించే పైప్‌లైన్‌ పగిలి ఒక్కసారిగా శబ్ధం చేస్తూ నీరు పైకి ఎగిసి పడింది. గత నెలన్నర రోజుల్లో ఇది మూడో లీకేజీ. కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పట్టణంతో పాటు, నియోజకవర్గంలోని మండలాలకు నీటిని అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ...

Read More »

బెల్లం నిల్వలపై ప్రభుత్వం ఆరా

రైతుల వద్ద పేరుకుపోయి ఉన్న బెల్లం నిల్వలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. బెల్లం నిల్వల్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపట్టాలని ఇటీవల జిల్లాకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కామారెడ్డి డివిజన్లో రైతుల వద్ద ఉన్న బెల్లం నిల్వలపై లెక్కలు తీస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న నిల్వలపై ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లిన తర్వాతే కొనుగోళ్లు చేపట్టనున్నారు. బెల్లం రవాణాపై ఆంక్షల దృష్ట్యా కొనుగోళ్లు లేక రైతులు ...

Read More »