Breaking News

Daily Archives: April 17, 2016

బ్రిలియంట్‌ పాఠశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సహస్ర హోటల్‌లో బ్రిలియంట్‌ పాఠశాల 10వ తరగతి మొదటి బ్యాచ్‌ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యార్థులు, గురువులు ఒకేచోట కలిసి అలనాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఆత్మీయంగా కలిసిమెలిసి మాట్లాడుకున్నారు. ఉపాధ్యాయుల లాగా తాము కూడా ఉన్నత చదువులు చదివి ఎదగగలుగుతునామన్నారు. తమ విజయం వెనక ఉపాధ్యాయులే కారణమని కొనియాడారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ కృషి, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. విద్యార్థులు ఉన్నత స్తానాలకు ఎదిగితే అదే ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 1వ వార్డులో సిసి రోడ్డు పనులను మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ ఆదివారం ప్రారంభించారు. నాన్‌ప్లాన్‌ నిధులు లక్ష రూపాయలతో సిసి రోడ్డు పనులు చేపట్టినట్టు ఆమె తెలిపారు. పనులు నాణ్యతతో చేపట్టాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కాంట్ట్రారును, అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ జమీల్‌, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Read More »

అట్టహాసంగా ఆర్యవైశ్య అధ్యక్షుని ఎన్నికలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు ఆదివారం అట్టహాసంగా ముగిశాయి. ఆర్యవైశ్య అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసినవారు పోటీని ప్రతిష్టగా తీసుకొని పట్టణంలోని వార్డులన్ని కలియతిరిగారు. ఆర్యవైశ్య సోదరులను కలిసి తమ భవిష్యత్తు కార్యాచరణ వివరించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని హామీలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం పట్టణంలోని ఆర్యవైశ్య ఓటర్లు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఓటువేసేందుకు భారీగా తరలివచ్చారు. ఎన్నికల అధికారుల సమక్షంలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆర్యవైశ్య ...

Read More »

పసిపిల్లల ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓ వివాహేతర సంబంధం పచ్చని కాపురంలో చిచ్చురేపింది. భార్యాభర్తల మధ్య అగాధాన్ని పెంచి, గొడవలు కావడంతో చిన్నారుల ప్రాణాలు బలిగొంది. హృదయ విదారకర సంఘటన కామారెడ్డి మండలం గర్గుల్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…. కామారెడ్డి మండలం గర్గుల్‌ గ్రామానికి చెందిన రజితకు అదే గ్రామానికి మహేశ్‌గౌడ్‌తో ఐదేళ్ళ క్రితం వివాహమైంది. కొన్నేళ్లపాటు సంసారం సవ్యంగానే సాగింది. మహేశ్‌గౌడ్‌ మరో మహిళతో వివాహేతర సంబందం పెట్టుకోవడంతో ఈవిషయం రజితకు తెలిసింది. దీంతో ...

Read More »

కారు, బైక్‌ ఢీ – ఇద్దరికి గాయాలు

  బాసర, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదిలాబాద్‌ జిల్లా బాసర రైల్వేస్టేషన్‌ కమాన్‌ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక ఎస్‌ఐ నర్సింలు కథనం ప్రకారం… బాసర అమ్మవారి ఆలయం నుంచి రైల్వేస్టేషన్‌ వైపు వెళ్తున్న బైక్‌, ఆలయం వైపు వస్తున్న కారును ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న మచ్చేందర్‌, దతాద్రిలకు తీవ్రగాయాలయ్యాయి. స్తానికులు గమనించి చికిత్సనిమిత్తం క్షతగాత్రులను ముధోల్‌ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్‌ఐ నర్సింలు ...

Read More »

ఐక్యంగా సమస్య పరిష్కరించాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామస్తులందరం ఐక్యంగా గ్రామ సమస్యలు పరిష్కరిద్దామని బంజేపల్లి సర్పంచ్‌ బేగరి రాజు అన్నారు. ఆదివారం జరిగిన గ్రామసభలో సర్పంచ్‌ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గ్రామస్తులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. మండల కేంద్రంలో భవన సముదాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్‌ సభ్యుడు హైమద్‌ హుస్సేన్‌, ఎంపిటిసి లక్ష్మి, బిక్యానాయక్‌, ఇజిఎస్‌ టిఎ సజ్జద్‌ అలీ, తదితరులు ...

Read More »

కుస్తీపోటీలు

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఇందులోభాగంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కుస్తీ పోటీలు ఏర్పాటుచేశారు. మండలంలోని మల్లయోధులతో పాటు మెదక్‌జిల్లాలోని పలు గ్రామాల నుంచి మల్లయోదులు పాల్గొన్నారు. 10 రూపాయల నుంచి పోటీ ప్రారంభమై వెయ్యి రూపాయల వరకు కొనసాగింది. కార్యక్రమంలో సర్పంచ్‌ మణమ్మ, ఎంపిటిసి ఇందిర, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ...

Read More »

వైభవంగా మత్తడిపోచమ్మ ఉత్సవాలు

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడ్లబండ్ల ప్రదర్శన, శివసత్తుల పూనకాలు, భక్తుల మొక్కులతో మత్తడి పోచమ్మ ఆలయ ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. మండలంలోని నర్వ, గున్కుల్‌, కోమలంచ ఆలయాల్లో మత్తడి పోచమ్మ ఉత్సవాలు భక్తులు భక్తిశ్రద్దలతో జరుపుతున్నారు. ఉగాది తర్వాత ప్రతియేటా దశమి రోజున ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పెద్ద సంఖ్యలు భక్తులు విచ్చేయడంతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఎండ్లబండ్ల ప్రదర్శనలు నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కొండగట్టుకు హనుమాన్‌ స్వాముల పాదయాత్ర

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలకేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో హనుమాన్‌ మాల స్వాములు ఆదివారం ఉదయం కరీంనగర్‌ జిల్లా కొండగట్టుకు పాదయాత్రగా బయల్దేరారు. 41 రోజులు దీక్షలు పాటించి, హనుమాన్‌ చాలీసా నిత్యం పఠిస్తూ, నియమాలు పాటించిన స్వాములు గురుస్వామి ద్వారా ఇరుముడులు కట్టించుకొని ఆదివారం కొండగట్టుకు బయల్దేరారు. సుమారు 200 కి.మీ.ల పాదయాత్ర చేయనున్నారు. బీర్కూర్‌ నుంచి ఆరుగురు, కిష్టాపూర్‌ నుంచి ఐదుగురు స్వాములు బయల్దేరినట్టు గురుస్వామి సాయాగౌడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా స్వాములు, మహిళలు ...

Read More »

సోమవారం బోధన్‌లో మంత్రుల పర్యటన

  బోధన్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఎంపి కల్వకుంట్ల కవిత సోమవారం బోధన్‌ నియోజకవర్గంలోని బోదన్‌ మండలంలో పర్యటించనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే షకీల్‌ తెలిపారు. బోదన్‌ మండలంలో సోమవారం ఉదయం పట్టణ కేంద్రంలో బస్టాండ్‌ నిర్మాణానికి భూమిపూజ చేస్తారని, అలాగే మండలరలోని చక్కి క్యాంపు వద్ద ఏర్పాటు చేయనున్న నూతన విద్యుత్తు సబ్‌స్టేషన్‌కు భూమిపూజ, అలాగే జాడిజమాల్‌పూర్‌ గ్రామంలో చెరువు అభివృద్దికి ...

Read More »

22న మోర్తాడ్‌లో షటిల్‌ టోర్నమెంట్‌

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌లో ఈనెల 22న ఇండోర్‌ షటిల్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు పబ్బం సంజీవ్‌ ఆదివారం తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులు ఈనెల 20వ తేదీ లోపు పేర్లు నమోదు చేయించుకోవాలని, మరిన్ని వివరాలకోసం 9912219365 నెంబర్లో సంప్రదించాలన్నారు. టోర్నమెంట్‌ను తెరాస రాష్ట్ర రైతువిభాగం అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు తెలిపారు.

Read More »