Breaking News

Daily Archives: April 18, 2016

మిషన్‌ భగీరథ – నిజామాబాద్‌ జిల్లా ముఖ్యాంశాలు

  నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటి బయటికి వచ్చి ఏ వ్యక్తి కూడా నీటిని పట్టుకోకూడదనే సంకల్పంతో ఇంటింటికి నల్లా ద్వారా కుటుంబ అవసరాలకు సరిపడ నీటిని అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వినూత్న ఆలోచనతో చేపట్టిన పథకమే మిషన్‌ భగీరథ. – జిల్లాలో ప్రధాన పనులను చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 2611 కోట్లు నిధులు మంజూరు చేసింది. – గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి 100 లీటర్లు, మునిసిపల్‌ ప్రాంతాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 ...

Read More »

డయల్‌ యువర్‌ ఎస్పీకి 17 ఫిర్యాదులు

  నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఎస్పీకి నేడు 17 ఫిర్యాదులు వచ్చినట్టు జిల్లా పోలీసు శాఖాధికారి వెల్లడించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం ఎస్‌పి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధి నుంచి వివిధ రకాల సమస్యలపై మొత్తం 17 ఫిర్యాదులు వచ్చినట్టు ...

Read More »

వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి సెలవుల్లో జిల్లాలోని 2200 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు పటిష్టమైన మానిటరింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. సోమవారం వేసవిలో మధ్యాహ్న భోజనం అమలుపై ప్రభుత్వ విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలకు కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ...

Read More »

రవాణా వ్యవస్థలో 40 కోట్లతో 150 ఏసి బస్సులు కొనుగోలు

  – రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి బోదన్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణీకుల సౌకర్యార్థం 40 కోట్ల రూపాయల ఖర్చుతో 150 ఏసీ బస్సులను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం బోధన్‌ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోధన్‌ పట్టణంలో కోటి రూపాయల అంచనాతో బస్టాండ్‌ విస్తరణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మండలంలోని చక్కి క్యాంపు ...

Read More »

20న ఈ – కామర్స్‌ వర్క్‌షాప్‌

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 20వ తేదీన ‘డైనమిక్‌ ఆఫ్‌ ఈ-కామర్స్‌’ అనే అంశంపై ఒకరోజు వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్టు వర్క్‌షాప్‌ కన్వీనర్‌ డాక్టర్‌ రాంబాబు గోపిశెట్టి తెలిపారు. ఇంటర్నెట్‌ వ్యవస్థ ఎక్కువ మందికి అందుబాటులోకి రావడం ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఊపందుకోవడం, ఈ-కామర్స్‌ వాణిజ్యం అనూహ్యంగా విస్తరించిందని డాక్టర్‌ రాంబాబు అన్నారు. ఈ విషయాలకు సంబంధించి కామర్స్‌ విద్యార్థులతో అవగాహన పెంచడానికి వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. ఈ వర్క్‌షాప్‌, కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలోని ...

Read More »

మే 9 నుంచి ఫైనల్‌ పరీక్షలకు సిద్దం కావాలి

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మే 9వ తేదీ నుంచి సెమిస్టర్‌ ఫైనల్‌ పరీక్షలు పిజి కోర్సులకు మొదలవుతాయని ప్రిన్సిపాల్‌ ఆచార్య కనకయ్య తెలిపారు. పరీక్షలు అనుకున్న తేదీ ప్రకారం నిర్వహించడానికి అనువుగా ఏప్రిల్‌ 30 వరకు సిలబస్‌ పూర్తి చేయాలని ఆయన అన్ని విభాగాల అధ్యాపకులకు సూచించారు. ఏప్రిల్‌ 30 నుంచి మే 8వ తేదీ లోపు అన్ని ప్రాక్టీకల్స్‌ పరీక్షలు పూర్తికావాలని, అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ తయారు చేసుకోవాలని ఆచార్య కనకయ్య తెలిపారు. పరీక్షలకు ...

Read More »

ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనుల్లో అధిక సంఖ్యలో కూలీలకు పనులు కల్పించాలని మండల ప్రత్యేకాధికారి శంకరయ్య, ఎంపిడివో శ్రీనివాస్‌లు అన్నారు. సోమవారం మండలంలోని వడ్యాట్‌, తొర్తి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానిక సర్పంచ్‌ పోశన్న, వెంకమ్మ అద్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. గ్రామాల్లో మండలాధికారులు పర్యటించి గ్రామసభలనుద్దేశించి మాట్లాడారు. గ్రామాల్లో జరుగుతున్న మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న ...

Read More »

జిఓ 727 రద్దు చేయాలి

  – బీడీకట్టలపై 85 శాతం పుర్రెగుర్తు మానుకోవాలి మోర్తాడ్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ పరిశ్రమపై ఆధారపడి తెలంగాణలో 7 లక్షల మంది, దేశ వ్యాప్తంగా కోటి 50 లక్షల మంది ఆధారపడి ఉపాధి పొందుతూ జీవనం కొనసాగిస్తున్నారని, బీడీ కార్మికుల పొట్టకొట్టే జీవో 727 కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలని, 2015లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన సిక్టోరియల్‌ వార్నింగ్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని బీడీ పరిశ్రమను కాపాడాలని తెలంగాణ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి సత్తక్క, ఏఐకెఎంఎస్‌ ...

Read More »

దళితులకు మూడెకరాల భూమి ఇప్పించండి

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రగతిశీల యువజన సంఘంఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి అభిలాష్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం మాక్లూర్‌ మండలంలోని మాణిక్‌ బండార్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు చెప్పడానికి మాత్రమే పరిమితమయ్యాయని, వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. సమావేశంలో పివైఎల్‌ మండల అద్యక్షుడు లక్ష్మినారాయణ, దత్తు, గంగాధర్‌, గోవర్దన్‌, చిన్నయ్య, తదితరులు ...

Read More »

దేవి ఆలయానికి ఎంపి 2 లక్షల విరాళం

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలంలోని మాణిక్‌బండార్‌ గ్రామం నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత దత్తత గ్రామం. కాగా మాణిక్‌ బండార్‌పరిధిలోని మాణిక్‌బండార్‌ తాండాలోని దేవి ఆలయానికి ఎంపి కవిత 2 లక్షల రూపాయలు విరాళాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు సోమవారం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆకుల రాంకిషన్‌, ఎంపిటిసి దేవి, జడ్పిటిసి లత, పీర్‌సింగ్‌, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌, నాయకులు ...

Read More »

గదిలో బంధించి.. మద్యం తాగించి..గ్యాంగ్‌ రేప్

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో అబల ఆక్రందన ఇది. ముంబైకి చెందిన 26 ఏళ్ల యువతిని సెంట్రల్‌ ఢిల్లీ రాజేందర్‌ నగర్‌లోని ఓ గదిలో ఇద్దరు వ్యక్తులు బంధించారు. ఆమెతో బలవంతంగా మద్యాన్ని తాగించి.. గత గురువారం మధ్య రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకడైన కాంట్రాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు స్థానిక మున్సిపాలిటీలో ఎగ్గిక్యూటివ్ ఇంజినీర్‌ అని తెలుస్తోంది. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రైవేటు అంగాలలో తీవ్ర గాయాలు కావడంతో బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స ...

Read More »

‘తెలుగు కళా స్రవంతి-అబుధాబి’ వారి ఉగాది వేడుకలు

తెలుగు కళా స్రవంతి అబుధాబి వారు ఉగాది వేడుకలు 15న ఏప్రిల్ శుక్రవారం అబుధాబి లో నిర్వహించారు.ఈ కార్యక్రమములో యం.పి శ్రీ మురళి మోహన్ గార్కి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.అబుధాబి లో తెలుగు కళా స్రవంతి చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమములో ప్రముఖ కవి,గాయకులూ గోరేటి వెంకన్న,చైతన్య,జెబర్దస్త్ రాకింగ్ రాకేష్ సినీ నటి పింకీ,లతా చౌదరి,చందు,అలీం ఖాన్ సుమదుర ఆర్ట్స్ అకాడమీ వారు ఇండియా నుంచి వచ్చి దాదాపు 1500 మంది హాజరైన వారిని అలరింప జేసారు.అబుధాబి లోని చిన్నారులు చేసిన ...

Read More »

టిసిఎస్‌కు అమెరికా కోర్టు భారీ జరిమానా

వాషింగ్టన్, ఏప్రిల్ 16: భారత ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), దాని అమెరికా విభాగమైన టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్‌పై అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. అనుమతి లేకుండా ఎపిక్ సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్‌ను తీసుకున్నందుకుగాను ఎపిక్ సిస్టమ్స్‌కు నష్టపరిహారంగా 240 మిలియన్ డాలర్లను చెల్లించాలని టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్‌ను విస్కాన్సిన్‌లోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ఆదేశించింది. అంతేగాక శిక్షగా మరో 700 మిలియన్ డాలర్లను చెల్లించాలని టిసిఎస్‌ను ఆదేశించింది. దీంతో మొత్తం 940 మిలియన్ డాలర్లను ఎపిక్ సిస్టమ్స్‌కు ...

Read More »

మహాకూటమికి నితీశ్ గ్రీన్ సిగ్నల్

పలువురు ఊహిస్తున్నది చివరకు జరగనే జరిగింది. బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ 2019 ఎన్నికలకోసం జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నించనున్నట్టు బహిరంగంగా ప్రకటించారు. భాజపా తిరిగి అధికారంలోకి రాకుండా నిలువరించడం తమ ఉద్దేశమని, అందుకోసం కాంగ్రెస్,వామపక్షాలతో సహా వీలైనన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. చివరకు ఎంత పెద్ద కూటమి తయారవుతుందో, వారి లక్ష్యం నెరవేరుతుందో లేదో ఈ దశలో ఎవరైనా తమకు తోచిన ఉహాగానాలు చేయగలరు తప్ప, నిర్థారణగా చెప్పగలగడం అసాధ్యమైన పని. వచ్చే సాధారణ ...

Read More »

కుక్కల దాడిలో పది గొర్రెలు మృతి

  రెంజల్ : బోర్గాం గ్రామంలో ఆదివారం ఉదయం పిచ్చి కుక్కలు 10 గొర్రెలపై దాడి చేయడంతో ఆరు అక్కడిక్కడే మృతి చెందగా మిగతా వాటిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ పశువుల దవాఖానకు తరలించిగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బాధితుడు మోత్రి రాజు తెలిపారు. గ్రామ సమీపంలో ఉన్న గొర్రెల పాకపై ఆదివారం పిచ్చి కుక్కలు దాడి చేయడంతో సుమారు రూ. 30వేలు నష్టం జరిగిందని బాధితుడు రాజు తెలిపారు. పిచ్చికుక్కల కారణంగా ఈనెలలో సుమారు 50 గొర్రెలు మృతి చెందాయి. బాగేపల్లి సాయిలు, ...

Read More »

జోరుగా ఐపీఎల్ బెట్టింగ్

  నిజామాబాద్ అర్బన్: ఐపీఎల్ సీజన్ ప్రారంభంతోనే జిల్లాలో క్రికెట్ బెట్టింగులు షురూ అయ్యాయి. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన బెట్టింగులు ఇప్పుడు పల్లెలకు పాకాయి. బుకీలు సెల్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. స్టార్ హోటళ్లు, లాడ్జిలు, ఫామ్‌హౌస్, ప్రైవేటు అపార్ట్‌మెంట్‌ల నుంచి బెట్టింగ్‌లు నిర్వహించేవారు. ప్రస్తుతం సెల్‌ఫోన్ ద్వారా రన్నింగ్ కామెంటరీపైనా పందెం కాసే పందెం రాయుళ్లకు కొదవలేదు. జిల్లాలో బెట్టింగ్ జాడ్యం ఎంతగా విస్తరించిందంటే ఒకనాడు ఇంటర్‌నేషనల్ వన్డే సిరీస్‌లకు పరిమితమైన ఈ వ్యవహారం టీ 20 మొదలు, రంజీ, ...

Read More »

నేడు డయల్‌ యువర్‌ ఎస్పీ

నిజామాబాద్‌ నేరవార్తలు: జిల్లా పోలీసు శాఖ పక్షాణ ఉండే సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సమస్యలున్న వారు నేరుగా 08462-228433 నంబరుకు కాల్‌చేసి తమ సమస్యలపై విన్నవించవచ్చన్నారు.

Read More »

ఈ నెలలో చక్కెర సరఫరా లేదు

నిజామాబాద్‌ సిటీ,: ఆహార భద్రత కార్డుదారులకు ఈ నెలలో చక్కెర సరఫరా చేయడం లేదని డీఎస్‌వో కృష్ణప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అనుకోని కారణాల వల్ల సరఫరా కావడం లేదని, మే నెలలో సరఫరా చేస్తామని తెలిపారు. బియ్యం ఆలస్యంగా దుకాణాలకు చేరిన దృష్ట్యా నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ మండలం, మాక్లూర్‌ మండలంలో ఈ నెల 19వ తేదీ వరకు పంపిణీ ఉంటుందని, ఆయా ప్రాంతాల కార్డుదారులు ఈ విషయం గమనించాలని చెప్పారు. ఎవరైనా డీలర్లు సరకులు పంపిణీ చేయకుంటే తమకు ఫిర్యాదు చేయాలని ...

Read More »

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఘన్‌పూర్‌(ఎం) (మాచారెడ్డి) : మండలంలోని ఘన్‌పూర్‌(ఎం) శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై కామారెడ్డి నుంచి కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కామారెడ్డి పట్టణంలోని ఇంద్రానగర్‌ కాలనీకి చెందిన కృష్ణవేణు (36) మృతిచెందినట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు. అయితే వాహనం అదుపు తప్పడం వల్లనే కృష్ణవేణు మృతి చెంది ఉంటాడని ఎస్సై అన్నారు.

Read More »

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

రాజంపేట (భిక్కనూరు), : మండలంలోని రాజంపేట గ్రామంలో కడుపు నొప్పి భరించలేక ఆదివారం ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకార.. గ్రామానికి చెందిన పాశం ప్రశాంత్‌ (19) కామారెడ్డిలో ఇటీవలే ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. గతేడాది నుంచి అప్పుడప్పుడు కడుపు నొప్పితో బాధపడేవాడు. ఆసుపత్రికి వెళ్లడానికి నిరాకరించేవాడు. తల్లిదండ్రులు హన్మంతు-వినోద ఆలయాల్లో మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్లిన సమయంలో ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు ఎస్సై రాంబాబు సంఘటన స్థలాన్ని సందర్శించి ...

Read More »