Breaking News

Daily Archives: April 19, 2016

స్పైసీ మష్రూమ్ మంచూరియన్

చైనీస్ ఫుడ్ అంటే అందరకీ చాలా ఇష్టమైన ఆహారం. ఒరిజినల్ చైనీస్ ఫుడ్ మనకు అందుబాటులో ఉండదు కాబట్టి, చైనీష్ స్టైల్లో మనం ఇండియన్ ఫుడ్ ను తయారుచేసుకోవచ్చు. అటువంటి వంటల్లో మష్రుమ్ మంచూరియన్ ఒకటి. వీటికి ఎక్కువ మసాలాలతో మరియు కారంగా ఉండే సాస్ తో రుచికరంగా తయారుచేస్తారు. ఈ ఇండో చైనీ రిసిపి స్పెషల్ ట్రీట్ చేస్తుంటారు . మన ఇండియన్స్ కు చాలా ఇష్టమైన స్నాక్ రిసిపి మంచూరియన్. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లో చికెన్ మంచూరియన్ ఒకటి . ...

Read More »

మైనార్టీ రుణాలు పొందేవారికి ఇంటర్వ్యూలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి ఈనెల 20న మునిసిపల్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు మునిసిపల్‌ ఇన్‌చార్జి కమీషనర్‌ పఠాభి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 20న ఉదయం 11 గంటలకు దరకాస్తు ఫారాలు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.

Read More »

ఇంకుడు గుంతల ఏర్పాటుపై అవగాహన కల్పించాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంకుడు గుంతల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పట్టణ కౌన్సిలర్లు కోరుతున్నారు. ఈ విషయమై మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌, కమీషనర్‌లకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటి మట్టం పూర్తిగా తగ్గిపోవడంతో బోరుబావులు ఎండిపోయాయని, దీనివల్ల తీవ్ర నీటి ఎద్డడి నెలకొందన్నారు. ప్రజల్లో ఇంకుడుగుంతల ఏర్పాటుపట్ల అవగాహన లేకపోవడం వల్లే బూమిలో నీటి మట్టం తగ్గుతోందని చెప్పారు. ప్రజల్లో అవగాహన కల్పించి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే నీటి ...

Read More »

తెరాస ప్లీనరీ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27న ఖమ్మంలో నిర్వహించనున్న తెరాస ప్లీనరీకి సంబంధించిన గోడప్రతులను మంగళవారం ఆ పార్టీ నాయకులు కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టన అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ 27న ఖమ్మంలో తెరాస 15వ ప్లీనరీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఉంటుందన్నారు. తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ముప్పారపు ఆనంద్‌, రవి, భూమేశ్‌ ...

Read More »

వడదెబ్బతో వృద్దుని మృతి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంటకు చెందిన ఠాకూర్‌ సూర్యాసింగ్‌ (60) అనే వృద్దుడు వడదెబ్బతో మంగళవారం మృతి చెందాడు. సూర్యాసింగ్‌ కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండ్రోజుల క్రితం వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

Read More »

అక్రమ కలప పట్టివేత – అరెస్టు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం నుంచి కామారెడ్డికి అక్రమంగా కలపను ఆటోలో తరలిస్తున్న ఓవ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్టు ఫారెస్టు రేంజ్‌ అధికారి సుజాత తెలిపారు. మాచారెడ్డి మండలంలోని వివిధ అటవీప్రాంతాల నుంచి అక్రమంగా కలప సేకరించి ఆటోలో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు దాడిచేసి మార్గమధ్యంలో ఆటోను పట్టుకున్నామన్నారు. అందులోంచి 50 వేల విలువచేసే అక్రమ కలపను స్వాదీనం చేసుకుని, నిందితుని అరెస్టు చేశామని, ఆటోస్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Read More »

ప్రైవేటు కళాశాలల నూతన కార్యవర్గాన్ని అభినందించిన రిజిస్ట్రార్‌

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్‌ డిగ్రీ, పిజి కళాశాలల అసోసియేషన్‌కు కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అభినందించారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు గంగామోహన్‌, జనరల్‌ సెక్రెటరీ ఎ.హరిప్రసాద్‌, కోశాధికారి రవిపటేల్‌, ఇతర సీనియర్‌ నాయకులు రాజు, హరిస్మరణ్‌ రెడ్డి, సూర్యప్రకాశ్‌, లక్ష్మారెడ్డి, ఇతరులు రిజిస్ట్రార్‌ను కలిసిన వారిలో ఉన్నారు. వారికి పుష్పగుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలిపిన రిజిస్ట్రార్‌ వర్సిటీకి యాజమాన్యాలు అసోసియేషన్‌ పూర్తిగా సహకరించాలని, ప్రమాణాలు ...

Read More »

స్పాట్‌ కేంద్రాన్ని తనిఖీ చేసిన రిజిస్ట్రార్‌

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ లా కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల స్పాట్‌ వాల్యుయేషన్‌ను రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తనిఖీ చేశారు. ఫిజిక్స్‌ పేపర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రంలో అధ్యాపకులతో మాట్లాడారు. ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా మూల్యాంకనం చేయాలని ఆయన ఆదేశించారు. స్పాట్‌కేంద్రంలో అధ్యాపకులకు వడదెబ్బ తగలకుండా కూలర్లు ఏర్పాటు చేయాలని వాటర్‌ ప్యూరిఫైయర్స్‌ పెట్టాలని రిజిస్ట్రార్‌ ఆదేశించారు. మొత్తం స్పాట్‌ కేంద్రం ఏర్పాట్లను క్షుణ్నంగా పరిశీలించారు. సిఓఈ డాక్టర్‌ ...

Read More »

త్రివేణి పుస్తకాలు తెలంగాణ సాహిత్యచరిత్రలో నిలిచిపోతాయి

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెవివి తెలుగు అధ్యయనశాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ త్రివేణి రాసిన ఆరుపుస్తకాలు తెలంగాణ సాహిత్యచరిత్రలో నిలిచిపోతాయని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు డాక్టర్‌ త్రివేణి ఎంపి కవితను తెలంగాణ భవన్‌లో కలిసి ఆరుపుస్తకాలను అందజేశారు. ఇటీవల తెవివిలో పుస్తకావిష్కరణ జరిగిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఎంపి రాలేకపోయినందుకు ప్రత్యేకంగా కలిసి పుస్తకాలు అందజేసినట్టు పేర్కొన్నారు. పుస్తకాలు స్వీకరిస్తూ ఎంపి మాట్లాడుతూ తెలుగు, తెలంగాణ ప్రాచీన, ఆధునిక కవిత్వం, ...

Read More »

ఈనెల 21 వరక బిసిఎ పరీక్ష పీజు గడువు

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో బిసిఎ చదువుతున్న విద్యార్థుల ప్రాక్టీకల్స్‌, థియరీ పరీక్షలు మే నెలలో నిర్వహిస్తారని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. వీటికి సంబంధించి ఫీజు చెల్లింపు చివరి తేది ఏప్రిల్‌ 21 అని వంద రూపాయల అపరాధ రుసుముతో ఫీజు చెల్లింపు గడువు చివరి తేది ఏప్రిల్‌ 23 అని ఆయన పేర్కొన్నారు. రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ థియరి, ప్రాక్టీకల్స్‌ పరీక్షలకు ఈ గడువు వర్తిస్తుందని వివరించారు. బిఇడి రీవాల్యుయేషన్‌ ...

Read More »

బుధవారం బోధన్‌లో ఎంపి పర్యటన

  బోధన్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ నియోజకవర్గంలో బుధవారం నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత పర్యటించనున్నట్టు బోదన్‌ ఎమ్మెల్యే షకీల్‌ తెలిపారు. మండలంలోని పెంటాకుర్దు గ్రామంలో మిషన్‌ కాకతీయ రెండో విడతలో భాగంగా చెరువు పూడికతీత పనులను ఆమె ప్రారంభించనున్నట్టు తెలిపారు. అనంతరం కల్దుర్కి గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఎంపి ప్రారంభిస్తారు. అలాగే ఖండ్‌గాం నుంచి చిన్నమావంది గ్రామం వరకు చేపట్టిన రోడ్డు వెడల్పు పనులను ఎంపి కవిత ప్రారంభిస్తున్నట్టు ...

Read More »

తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తున్న తెరాస ప్రజాప్రతినిదులు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌లో ఎక్కడా లేనివిధంగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఈవిషయమై మోర్తాడ్‌ ఉపసర్పంచ్‌ గంగారెడ్డి, ఎంపిటిసిలు పాపాయి పవన్‌, ఎమ్మాజి మురళీగౌడ్‌, లక్ష్మిలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందించి తాగునీటి ఎద్దడి నివారణకు ఎన్ని నిదులైనా అందిస్తామని, ప్రయివేటు బోర్లతో నీరున్న బోర్లను ఫ్లషింగ్‌ చేయించి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తూ నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో మోర్తాడ్‌ ఉపసర్పంచ్‌, ఎంపిటిసిలు ప్రయివేటు బోర్లతో ...

Read More »

బట్టాపూర్‌ ఇందిరమ్మ కాలనీలో తాగునీటి సౌకర్యం కల్పించండి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బట్టాపూర్‌ గ్రామంలోగల ఇందిరమ్మ కాలనీలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని కాలనీ మహిళలు మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, మండల ప్రత్యేకాధికారి శంకరయ్యకు, ఎంపిడివో శ్రీనివాస్‌కు వినతి పత్రం మంగళవారం అందజేశారు. తమ కాలనీలో నీటి ఎద్దడి తీర్చాలని, కనీసం వాటర్‌ ట్యాంకులు కూడా లేవని, రెండు బోర్లలో నీరున్నప్పటికి వృధాగా ఉన్నాయని మండల అధికారులకు, ప్రజాప్రతినిదులకు మొరపెట్టుకున్నారు. ఎంపిపి, మండల అధికారులు స్పందించి కాలనీలోని రెండు బోర్లను ఫ్లషింగ్‌ ...

Read More »

అక్రమ ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తడపాకల్‌ గ్రామ శివారులోగల పెదవాగు నుంచి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను మంగళవారం పట్టుకున్నట్టు మోర్తాడ్‌ ఎస్‌ఐ అశోక్‌రెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి చేరుకొని పెదవాగులో ఇసుక ట్రాక్టర్‌ నింపుకొని రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను సీజ్‌చేశామని తెలిపారు. ఈవిషయమై మోర్తాడ్‌ తహసీల్దార్‌కు నివేదించినట్టు తెలిపారు.

Read More »

కంటి అద్దాల పంపిణీ

  రెంజల్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి గ్రామంలో మంగళవారం డిఎం అండ్‌ హెచ్‌వో వెంకట్‌ కంటి అద్దాల పంపినీ చేశారు. గత 15 రోజుల క్రితం ఎంపి దత్తత గ్రామమైన కందకుర్తిలో కంటి పరీక్షలు నిర్వహించిన రోగులకు కళ్లద్దాలు పంపినీ చేశారు. ఆయన వెంట వైద్యాధికారి నస్రీన్‌ ఫాతిమా, ఉపసర్పంచ్‌ యాదవరావు, సూపర్‌వైజర్లు రమేశ్‌, సాయిలు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

గడ్డివాము దగ్దం – లక్ష ఆస్తి నష్టం

  రెంజల్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన రైతు వెల్మల రాజేశ్వర్‌, వెల్మల్‌ సుధాకర్‌లకు చెందిన 15 ఎకరాల గడ్డివాము దగ్దమవడంతో లక్ష ఆస్తినష్టం వాటిల్లినట్టు విఆర్వో ఆయుబ్‌ పటేల్‌ తెలిపారు. పశుగ్రాసం కోసమని పశువుల కొట్టం వద్ద గడ్డివాము ఏర్పాటు చేయగా ప్రమాదవశాత్తు నిప్పంటుకున్న సమాచారం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా పూర్తిగా కాలిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. పశుగ్రాసం కోసం కూడబెట్టుకున్న గడ్డివాము చేతికందకుండా పోవడంతో పశువులకు ...

Read More »

ఏపీలో మూతపడనున్న పెట్రోల్ బంకులు

ఏపీలో వ్యాట్‌ ‘స్ర్టోక్‌’..! అల్లాడుతున్న డీజిల్‌ బంకులు దేశంలోనే ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో వ్యాట్‌ విధింపు లీటర్‌ డీజిల్‌పై రూ.13 వసూలు వ్యాట్‌, పన్నుల పోటు లీటర్‌కు రూ.33.32పై. రాష్ట్రంలో డీజిల్‌ కొనాలంటే హడలెత్తిపోతున్న వాహన యజమానులు పొరుగు రాష్ర్టాల్లో భారీగా కొనుగోళ్ళు ఏపీలో పడిపోయిన డీజిల్‌ వినియోగం వాహనాలు పెరిగినా.. తగ్గిన డీజిల్‌ వ్యయం ఇదే పరిస్థితి కొనసాగితే వందల బంకులు మూతపడటం ఖాయం రాష్ట్రంలో వ్యాట్‌ దెబ్బకు డీజిల్‌ బంకులు అల్లాడుతున్నాయి. దేశంలో డీజిల్‌ అమ్మకాలపై ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో వ్యాట్‌ ...

Read More »

బాహుబలి-2కు వేసవి సెలవు

వేసవి సెలవులు స్కూళ్లు, కాలేజీలకు ఇవ్వడం మనం ఇప్పటివరకూ చూశాం. కానీ ఓ సినిమాకు కూడా వేసవి సెలవులు ఇవ్వడం ఇప్పుడు విశేషంగా మారింది. ‘బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజవౌళి ఇప్పుడు బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా ‘బాహుబలి-2’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ది కంక్లూషన్ పెరుతో తెరకెక్కే ఈ సినిమా అత్యున్నత సాంకేతిక విలువలతోపాటు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సమ్మర్ కష్టాలు మొదలయ్యాయట. ఎండలు తీవ్రమవడంతో నెలరోజులపాటు ...

Read More »

బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు

  బీర్కూర్ : మండలంలోని సంగెం గ్రామపంచాయతీ పరిధిలోని హాజీపూర్ గ్రామంలో సోమవారం మండలానికి చెందిన అధికారులు బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీర్కూర్ ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి, ఎంపీడీవో భరత్‌కుమార్ మాట్లాడుతూ మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన బాలికను పిట్లం మండలం చీమన్‌పల్లి గ్రామానికి చెందిన అబ్బాయితో ఈ నెల 25వ తేదీన వివాహం చేసేందుకు ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారని అన్నారు. ఈ సమాచారం తెలుసుకొని బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. దీంతో వారు అమ్మాయి మేజర్ అయ్యేవరకు పెళ్లి ...

Read More »

లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో హోమం

  సిరికొండ : మండల కేంద్రంలో ని కొండ కింద భాగాన వెలిసిన శ్రీలక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఉత్సవాలు ముగిశా యి. సోమవారం ఆలయంలో హోమం నిర్వహించారు. భక్తుల కోసం అన్నదాన కార్యక్రమ ం ఏర్పాటు చేశారు. ఆలయ క మిటీ సభ్యులు లింబాద్రి, గంగారెడ్డి, చిన్న గంగయ్య, భూషణ్‌రెడ్డి, రంజిత్, బాలరాజు, శ్రీకాంత్, గంగాధర్, మురళి తదితరులు పాల్గొన్నారు.

Read More »