Breaking News

Daily Archives: April 23, 2016

కామారెడ్డి సెంట్రింగ్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సెంట్రింగ్‌ అసోసియేసన్‌ 2016-18 నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నట్టు సంఘ సభ్యులు తెలిపారు. అసోసియేషన్‌ అధ్యక్షునిగా పుల్లూరి సతీష్‌, ఉపాధ్యక్షునిగా ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శిగా షాదుల్లా, కార్యదర్శిగా లింగం, కోశాధికారిగా ఉస్మాన్‌, సలహాదారుగా కొమురయ్య, సజ్జద్‌, అన్వర్‌, అన్సారీ గౌరవ అధ్యక్షులుగా ఉప్పు సాయికుమార్‌లు ఎన్నుకున్నట్టు తెలిపారు.

Read More »

ఇంటర్మీడియట్‌ టాపర్లకు అభినందన

  కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సాందీపని కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్‌ 2016 పరీక్ష ఫలితాల్లో టాపర్లుగా నిలవడంతో వారిని శనివారం సాందీపని సంస్థల యాజమాన్యం అభినందించారు. కామారెడ్డి డివిజన్‌లో అన్ని గ్రూపుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. ఎంపిసి విభాగంలో 988 మార్కుల్లో సన్నిత్‌ రెడ్డి రాష్ట్ర స్థాయి ర్యాంకు పొందినట్టు తెలిపారు. ఆయనతోపాటు ర్యాంకులు సాదించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల సిఇవో హరిస్మరణ్‌రెడ్డి ప్రతినిధులు బాలాజీరావు, రాజ్‌గంభీర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశానుసారం కామారెడ్డి పట్టణంలోని సిడిసి ఓరియంటల్‌ ఎయిడెడ్‌ పాఠశాలలో శనివారం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. వార్డు కౌన్సిలర్‌ కుంభాల రవి పథకాన్ని ప్రారంభిస్తూ మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలనే ప్రభుత్వ ఆదేశానుసారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నామన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు అన్నిరకాల వసతులు కల్పించాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ భద్రయ్య, ప్రధానోపాద్యాయుడు ...

Read More »

అక్రమ ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తొర్తి గ్రామ శివారులోగల పెదవాగునుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్నట్టు మోర్తాడ్‌ ఎస్‌ఐ అశోక్‌రెడ్డి తెలిపారు. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించామన్నారు. తహసీల్దార్‌కు సమాచారమిచ్చినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Read More »

ఆదివారం గ్రామసభలు

  రెంజల్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు, ఈ గ్రామసభలను ప్రతి సర్పంచ్‌ తప్పక నిర్వహించాలని ఎంపిడివో చంద్రశేఖర్‌ తెలిపారు.

Read More »

తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి

  రెంజల్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చడంతో తాగునీటి సమస్య సత్వరమే పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. మండలంలోని తాడ్‌బిలోలి, వీరన్నగుట్ట గ్రామంలో సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌, శంకర్‌ల ఆద్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామాల్లో ముందుగా తాగునీటిపై దృష్టి సారించి, సమస్య పరిష్కరించాలని, డ్రైనేజీ సమస్య అధ్వాన్నంగా ఉందని, వీధి దీపాలు ఉదయం నుంచి రాత్రి వరకు అలాగే ఉంటున్నాయని, వాటిని అదుపుచేయాలన్నారు. అలాగే గ్రామంలోని వివిధ సమస్యలపై పరిష్కారం కోసం ...

Read More »

హత్య కేసులో నిందితుల అరెస్టు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండల కేంద్రంలో ఈనెల 18న హత్యకు గురైన శీల శంకర్‌ కేసులో నిందితున్ని అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్టు కామారెడ్డి రూరల్‌ సిఐ కోటేశ్వర్‌రావు తెలిపారు. సిఐ కథనం ప్రకారం… సదాశివనగర్‌ మండలానికి చెందిన రాజు, శీల శంకర్‌లు స్నేహితులు. శంకర్‌ నిజామాబాద్‌ జిల్లా తన్కోల్‌ గ్రామానికి చెందిన వ్యక్తి కాగా ఇల్లరికంగా సదాశివనగర్‌ మండలానికి వచ్చాడు. వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. శంకర్‌ వద్ద డబ్బులున్నాయని గమనించిన ...

Read More »

తమిళనాడులో పసుపు, అరటి సాగుపై శిక్షణ పొందుతున్న బాల్కొండ నియోజకవర్గ రైతులు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమిళనాడు రాష్ట్రంలోని పెని జిల్లాలో పసుపు, అరటి పంటల సాగువిధానంపై బాల్కొండ నియోజకవర్గానికి చెందిన 35 మంది రైతులు శిక్షణ పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే పసుపుపంట సాగును బాల్కొండ నియోజకవర్గంలో అధికంగా సాగుచేస్తారు. పసుపు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని తమిళనాడులో నిర్వహించే పసుపు, అరటి సాగు నూతన విధానంపై శిక్షణ పొందేందుకు 35 మంది రైతులను ఎంపిక చేయించారు. గత ...

Read More »

మోర్తాడ్‌లో నెమలి మృతి – మాయం

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌ బద్దంవాడకు చెందిన ఓ రైతు వ్యవసాయ పొలాల్లో శనివారం ఉదయం నెమలి మృతి చెందిన విషయాన్ని రైతు గమనించాడు. ఈవిషయం స్థానికులకు తెలియజేసి అటవీశాఖాధికారులకు సమాచారం అందించేందుకు ప్రయత్నించగా, రైతు తోటలోకి వెళ్లేసరికి నెమలి కనిపించలేదు. నెమలిని కుక్కలు ఎత్తుకెళ్లి ఉంటాయని రైతు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

Read More »

వ్యవసాయ బావిలో మొసలి లభ్యం

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దోంచంద గ్రామానికి చెందిన గంగారెడ్డి అనే రైతు వ్యవసాయ బావిలో శనివారం మొసలి లభ్యమైంది. గంగారెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం తోటలోకి వెళ్లి బావిలోకి నీటిని నిలువ చూస్తుండగా మొసలి కనిపించింది. ఈవిషయం తోటి రైతులకు తెలియజేయడంతో గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి తిలకించారు. స్థానిక సర్పంచ్‌ రాధా గంగారాం, ఎంపిటిసి దిబ్బ సరస్వతి, కమ్మర్‌పల్లి అటవీశాఖ రేంజ్‌ అధికారులకు సమాచారం అందించారు. రేంజ్‌ డిప్యూటి అధికారి సందీప్‌ సిబ్బందితో విచ్చేసి ...

Read More »

డిజిటల్‌ అక్షరాస్యతా గ్రామంగా నర్సింగాపూర్‌

  – తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్సింగాపూర్‌ గ్రామం జిల్లాలోనే మొట్టమొదటి డిజిటల్‌ అక్షరాస్యతా గ్రామంగా అవతరించింది. మొత్తం 20 గంటల పాటు డిజిటల్‌ తరగతులు ఆ గ్రామ ప్రజల కోసం నిర్వహించిన తెయు కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాన్ని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అభినందించారు. ఆ గ్రామస్తులకు 20 గంటలలోని చివరి డిజిటల్‌ క్లాస్‌ను శనివారం కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ముగించారు. నర్సింగాపూర్‌ ఈ ఘనతతో రాష్ట్రంలోనే రెండవ డిజిటల్‌ ...

Read More »

25న బాసరకు ఉపముఖ్యమంత్రి రాక

  బాసర, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయానికి విచ్చేస్తున్నట్టు ఆలయ ఇవో వెంకటేశ్వర్లు తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించడంలో గత రెండ్రోజుల క్రితం ఇంజనీర్ల బృందం విచ్చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆలయ అభివృద్ది కోసం తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలు పరిశీలించేందుకు ఉపముఖ్యమంత్రి విచ్చేస్తున్నట్టు అన్నారు.

Read More »

చెరువులకు పూర్వవైభవం

  నందిపేట, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏళ్ల తరబడి పునరుద్దరణకు నోచుకోక కళాహీనంగా మారిన చెరువులకు పూర్వవైభవం తేవడానికే రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఖుదావన్‌పూర్‌, నందిపేట, బిబి నడ్కుడ, గాదేపల్లి, నూత్‌పల్లి, ఐలాపూర్‌, కొండూరు గ్రామాల చెరువులకు రెండోవిడత మిషన్‌ కాకతీయ పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతోనే చెరువులు పూడికతో నిండిపోయాయన్నారు. ...

Read More »

ఒమన్ లో అనైతిక కార్యకలాపాలలో 150 మందికి పైగా అరెస్టు

అసభ్య బట్టలు ధరించి అనైతిక కార్యకలాపాలను జరిపేందుకు ప్రయత్నించిన 150 పైగా పురుషులు మరియు మహిళలను అరెస్టు చేయడంతో మస్కట్ లో ఒక గది వారితో నిండిపోయిందని రాయల్ ఒమన్ పోలీస్ నివేదించారు . 155 మందిని అరెస్టు చేయగా వీరిలో 121 థాయ్ మహిళలు మరియు ఒక పురుషుడు , 11 మంది  ఫిలిప్పియన్ మహిళలు, ఆరుగురు  ఫిలిప్పియన్ పురుషులు ,10 మంది టాంజానియా మహిళలు, మరియు ఇతర దేశాలకు చెందిన నలుగురు సభ్యులు ఇందులో ఉన్నారు.మరిన్ని వైద్య పరీక్షల కోసం రాయల్ ...

Read More »

సరైనోడు రివ్యూ

అల్లు అర్జున్, రాకుల్ ప్రీతీ సింగ్ , కేథరీన్, శ్రీకాంత్ , ఆది బోయపాటి శ్రీను అల్లు అరవింద్ తమన్ సరైన హీరో అల్లు అర్జున్ , సరైన డైరెక్టర్ బోయపాటి శ్రీను , సరైన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇలా ఈ ముగ్గురు కాంబినేషన్లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరైన చిత్రం ‘సరైనోడు’. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. గన (అల్లు అర్జున్ ) మిలిటరీ లో పనిచేస్తూ, ...

Read More »

చైనాను దెబ్బకు దెబ్బ తీసిన భారత్

ఐక్యరాజ్యసమితిలో జరిగిన అవమానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడికి కీలక సూత్రధారి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను తీవ్రవాదిగా గుర్తించాలంటూ భారత్ ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనను చైనా తన వీటో పవర్‌తో అడ్డుకుంది. అంతేకాకుండా అతడు నిషేదం ఎదుర్కొనేంతటి తీవ్రవాది కాదంటూ చైనా తన పనిని వెనకేసుకు వచ్చింది. పైగా ఇలాంటి ప్రతిపాదనలు చేసేటప్పుడు సరైన కారణాలు చూపాలంటూ భారత్‌ను దెప్పిపొడిచింది. అజార్ తన దేశంలో హాయిగా విహరించేందుకు, తన ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు కావల్సినంత స్వేచ్ఛను పాకిస్తాన్ అందిస్తోంది. ...

Read More »

వీర హనుమాన్‌ విజయయాత్ర

బోధన్‌ పట్టణం : బోధన్‌ పట్టణంలో బజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని వీర హనుమాన్‌ విజయయాత్ర శుక్రవారం సాయంత్రం జయప్రదంగా నిర్వహించారు. మారుతి మందిర్‌ నుంచి అంబేడ్కర్‌చౌరస్తా, కొత్త బస్టాండు, శక్కర్‌నగర్‌ చౌరస్తా, అక్కడి నుంచి కొత్తబస్టాండు, అంబేడ్కర్‌చౌరస్తా వరకు విజయయాత్ర కొనసాగింది. అక్కడ నిర్వహించిన సభలో అఖిల భారత బజరంగ్‌దళ్‌ సంయోజక్‌ రాజేశ్‌పాండే మాట్లాడారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. అదేవిధంగా ఈ దేశంలో పుట్టి పౌరసత్వంతో రాజ్యాంగ పదవిలో ఉండి భారత్‌మాతాకు జై అనకపోవడం ...

Read More »

మానవత్వం మరిచిన వేళ…

నిజాంసాగర్‌: కొమలంచ గ్రామంలో ఐదు సంవత్సరాల బాలికపై అదే గ్రామానికి చెందిన మత్తుముల బాలయ్య(66) అనే వృద్ధుడు శుక్రవారం అత్యాచారం చేశాడు. ఎఎస్సై గాంధీగౌడ్‌ తెలిపిన కథనం ప్రకారం గ్రామానికి చెందిన బాలిక మరో ఇద్దరితో కలిసి ఆడుకుంటుండగా నిందితుడు అక్కడికి వచ్చి ముగ్గురు బాలికలకు ఒక్కొక్కరికి రెండు రూపాయలు చాక్లెట్లు కొనుక్కోవాలని ఇచ్చి పంపాడు. వారందరు వాటిని కొనుకున్నారు. అందులో ఒక బాలికను ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారం చేశాడు. ఇంతలో తమ కుమార్తె కోసం వెదుకుతున్న తల్లిదండ్రులకు ...

Read More »

రెండింటా… మెరిశారు..!

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో కాస్త మెరుగు ప్రథమంలో ఏడు నుంచి మూడో స్థానం ద్వితీయంలో నాలుగో స్థానంలో జిల్లా మూడు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో కాకతీయ విద్యార్థుల ప్రభంజనం నిజామాబాద్‌ విద్యావిభాగం, ఇందూరు సిటీ, న్యూస్‌టుడే : ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఫర్వాలేదనిపించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఫలితాలను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఏకకాలంలో విడుదల చేసింది. ఈ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమంలో మూడో స్థానం.. ద్వితీయంలో నాలుగో స్థానంలో జిల్లా నిలిచింది. నిరుడు ఫలితాలతో పోలిస్తే ప్రథమంలో ఏడో ...

Read More »

వ్యక్తి సజీవ దహనం

  బాన్సువాడ టౌన్ : మండల కేంద్రంలోని మేకల సంత వద్ద శుక్రవారం ప్రమాదవశాత్తు పూరి గుడిసెకునిప్పంటుకుని కమ్మరి శంకర్ (28) అగ్ని ప్రమాదంలో సజీవ దహనమయ్యాడు. ఎ స్సై సంపత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన కమ్మరి శంకర్ కుల వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మధ్యాహ్నం ప్రమాదవశాత్తు పూరి గుడిసె కు నిప్పంటుకోవడంతో ఇంట్లో ఉన్న శంకర్ సజీవదహనం అయ్యాడు. మృతుడి భార్య నాలుగేళ్లుగా తల్లిగారింట్లో ఉంటుందన్నారు. మృతుడికి నలుగురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. శవపంచనామా నిర్వహించి ...

Read More »