Breaking News

Daily Archives: April 26, 2016

ఫార్మసీలో పరిశోధనలకై అమెరికాకు డాక్టర్‌ శిరీష బోయపాటి

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ శిరీష బోయపాటి ఫార్మసీ రంగంలో పరిశోధనలు చేయడానికి ఒక సంవత్సరం పాటు అమెరికా వెళ్తున్నారు. ఆమె అమెరికాలోని మేరిల్యాండ్‌ రాష్ట్రంలో ఉన్న నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌లో హృద్రోగానికి సంబంధించిన ఔషధాల అభివృద్దిపై పరిశోదనలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం, యుజిసిచే ఆమె ప్రతిష్టాత్మక రామన్‌ ఫెలోషిప్‌ కింద వచ్చే గ్రాంట్‌తో అమెరికాలో యేడాదిపాటు పరిశోదనలు చేస్తారు. ఈనెల 28న ఆమె అమెరికా వెళ్లనున్నారు. ...

Read More »

ఉద్యోగ సాధనలో నైపుణ్యాలు కీలకం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ సాదనలో ఇంటర్వ్యూ నైపుణ్యాలు కీలకమని తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. సమర్థవంతంగా మంచి విషయ పరిజ్ఞానంతో ఇంటర్వ్యూ ఎదుర్కోవడం ఉద్యోగాల వేటలో అత్యంత ప్రాధాన్యమని ఆయన తెలిపారు. మంగళవారం సమాన అవకాశాల విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ కె.అపర్ణ ఆద్వర్యంలో నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘ఇంటర్వ్యూ స్కిల్స్‌ అండ్‌ టెక్నిక్స్‌’ అన్న అంశంపై కార్యశాల నిర్వహించారు. ఇంటర్వ్యూలో విషయ పరిజ్ఞానంతో పాటు అభ్యర్థి ...

Read More »

మెటల్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని 6వ వార్డు రాజానగర్‌ కాలనీలో నిర్మిస్తున్న మెటల్‌రోడ్డు పనులను మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ సుష్మ ప్రారంభించారు. నాన్‌ ప్లాన్‌ గ్రాంట్‌ నిధులు రూ. 1.75 లక్షలతో రోడ్డు నిర్మిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ సరోజ, గంగాగౌడ్‌, కాంట్రాక్టర్‌ శివరాత్రి నర్సింలు, వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు అయాజ్‌, కిషన్‌, రవిందర్‌, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సమాచార ప్రదర్శన

  – ప్రారంభించిన నగర మేయర్‌ ఆకుల సుజాత నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయని నగర మేయర్‌ ఆకుల సుజాత పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని ఆర్టీసి బస్టాండ్‌ ఆవరణలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన దృశ్య ప్రకటనల విభాగం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మేయర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రదర్శన మే 2వ తేదీ వరకు వారం రోజుల ...

Read More »

స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాల తనిఖీ

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌ లా కళాశాలలో జరుగుతున్న డిగ్రీ స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాలను రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్పాట్‌ వాల్యుయేషన్‌లో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా మూల్యాంకనం చేయాలని, ఎలాంటి చిన్న పొరపాట్లు చేసినా విద్యార్థులకు భవిష్యత్‌కు గొడ్డటి పెట్టవుతుందన్నారు. వాల్యుయేషన్‌లో పాల్గొంటున్న ప్రతి అధ్యాపకుడు జాగ్రత్తగా మూల్యాంకనం చేయాలని ఆచార్య లింబాద్రి సూచించారు. ఈ సందర్భంగా ఆయన కామర్స్‌, ఎకనామిక్స్‌, ఫిజిక్స్‌, బొటని, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ...

Read More »

నిర్మించారు.. వదిలేశారు…

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటి పారుదల శాఖాధికారుల నిర్వహణ లోపం వల్ల రైతాంగానికి శాపంగా మారింది. జిల్లా రైతాంగానికి వరప్రదాయిని అయిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ దశలో అప్పట్లో ఇంజనీరింగ్‌ అధికారులు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే ఇసుక మేటలను తొలగించేందుకు ప్రాజెక్టు మధ్యలో ఫిల్ట్‌ గేట్లను నిర్మించారు. ఆ గేట్లు ఇప్పటివరకు పైకెత్తి మట్టిని తొలగించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. నిజాంసాగర్‌ ప్రాజెక్టును మంజీరనదిపై 1921లో కోట్ల రూపాయలు వెచ్చించి ...

Read More »

నూడిల్స్ తిని చనిపోయిన బాలిక

విజయవాడ యనమలకుదురులో ముగ్గురు అక్కా చెల్లెళ్లు.. నూడిల్స్ వండుకొని తిన్నారు. తిన్న కొద్దిసేపటికే పెద్ద అమ్మాయి మానసకు వాంతులు, కడుపులో నొప్పి వచ్చినట్లు చెబుతున్నారు బంధువులు. ఆమెను హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ఆమె పరిస్ధితి సీరియస్ గా ఉండడంతో.. ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మిగిలిన ఇద్దరు అమ్మాయిలకు కూడా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో వారిని దగ్గర్లోని ప్రైవేటు హాస్పిటల్ తీసుకెళ్లారు. నూడిల్స్ తిని కూల్ డ్రింక్ తాగామని హాస్పిటళ్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న అక్కాచెల్లెల్లు చెబుతున్నారు. ...

Read More »

దావుద్ కు నూక‌లు చెల్లాయా..!

అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కువ రోజులు బతకడం కష్టమే అంటున్నారు డాక్టర్లు. అతని రెండు కాళ్లలో కండర కుళ్లు వ్యాధి సోకిందని CNN-NEWS18  ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దీనివల్ల  కాలి వేళ్లు, పాదాల్లో కండరాలు పూర్తిగా కుళ్లిపోయాయని కథనం లో వివరించింది. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం నడవలేని స్థితిలో ఉన్నాడని CNN తెలిపింది. దావూద్ కు బ్లడ్ షుగర్, హై బీపీ వల్ల కాళ్లలోకి రక్తప్రసరణలో సమస్యలు ఏర్పడ్డాయని.. దీంతో  కాళ్లలో మాంసం పాడైందనేది CNN కథనం సారాంశం. దావూద్ ...

Read More »

వివాహేతర సంబంధం కేసులో మూడేళ్ల జైలు శిక్ష

నిజామాబాద్‌ న్యాయవిభాగం: వివాహేతర సంబంధం కేసులో వినాయక్‌నగర్‌కు చెందిన ఇస్రాపు మహేశ్‌కు మూడేళ్ల జైలుశిక్ష రూ. 5 వేల జరిమానా విధిస్తూ స్పెషల్‌ మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి కారీంగుల యువరాజా సోమవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. 2012లో ఆర్యనగర్‌కు చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం కోసం ఆ ఇంట్లోకి చొరబడి బెదిరించిన విషయంలో బాధితులు నాలుగో ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి నిందితుడు మహేశ్‌పై ఐపీసీ 497,448,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు పంపారు. పోలీసుల ...

Read More »

రెండేళ్ల బాలుడు మృతి

తూంపల్లి (సిరికొండ): సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో రెండేళ్ల బాలుని మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన కథనం ప్రకారం నాగేష్‌, రుక్క దంపతుల రెండో కుమారుడు నాగేంద్ర(2) రజకుల దోభీగాట్‌ నీటితొట్టిలో పడి పసిప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులు బట్టలు ఉతకటానికి వెళ్లటంతో వాళ్లతోధోబీఘాట్‌కు వెళ్లారు. ఉతికిన బట్టలను ఆరవేసిందుకు తల్లిదండ్రులు వెళ్లగానే బాలుడు నీటితొట్టీని పట్టుకొని ఆడుతుండగా అనుకోకుండా అందులో పడిపోయాడు. తల్లిదండ్రులు గమనించలేదు. బట్టలు ఆరేసి వచ్చేసరికి విగత జీవిగా కుమారుడు కనిపించడంతో తల్లిదండ్రులతో పాటు అక్కడున్న వారందరూ కన్నీటి ...

Read More »