Breaking News

గాయత్రీ మందిర నిర్మాణానికి భూమిపూజ

 

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని 13 వందల ప్లాట్ల ఆవరణలో బ్రాహ్మణ సేవాసమితి ఆద్వర్యంలో శనివారం గాయత్రీ మందిరం, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి, రాంపూర్‌ మహరాజ్‌, ఆర్మూర్‌ తెరాస నియోజకవర్గ రాజేశ్వర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ స్వాతిసింగ్‌ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. మందిరం, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం త్వరగా పూర్తికావాలని వారు ఆకాంక్షించారు.

సేవాసమితికి చెందిన స్థలంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వంత కమ్యూనిటీ హాల్‌ లేక కలిగిన ఇబ్బందులను అధ్యక్షుడు మధుకర్‌రావు వివరించారు. వీటి నిర్మాణాలకు సహకరిస్తామని ప్రజాప్రతినిదులు చెప్పారు. కార్యక్రమంలో వైస్‌ ఛైర్మన్‌ లింగాగౌడ్‌, కౌన్సిలర్‌ వన్నెల్‌ దేవి లత, రాము, పండిత్‌ ప్రేమ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు పోల మదుకర్‌, జాగిర్దార్‌ శ్రీనివాస్‌, లింగన్న, బ్రాహ్మణ సంఘం ప్రతినిదులు, విఠల్‌రావు, రాజేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

భూ కబ్జాపై విచారణ జరపాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌ లో 9 కోట్ల టిఎండిపి నిధుల‌ ...

Comment on the article