Breaking News
Diwali Background

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపన

బోర్గాం(రెంజల్‌): రెంజల్‌ మండలంలోని బోర్గాం గ్రామంలో సోమవారం మహలక్ష్మి, మహంకాళి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

గ్రామంలో ్ఘ 15 లక్షల గ్రామాభివృద్ధి కమిటీ నిధులతో మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించగా గతమూడు రోజులుగా యజ్ఞం నిర్వహించారు. సోమవారం విగ్రహ పున:ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వేదపండితుల మధ్య నిర్వహించారు. ఆలయంలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు గ్రామీణ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ రవికుమార్‌ బోరుబావి తవ్వించగా విగ్రహ పున:ప్రతిష్టాపన కార్యక్రమంలో వారు సతీసమేతంగా పాల్గొని మహాలక్ష్మి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article