Breaking News

మే 5న యూనివర్సిటీ కళాశాల వార్షికోత్సవం

 

డిచ్‌పల్లి, మే 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌ కళాశాల వార్షికోత్సవం మే 5వ తేదీ గురువారం సాయంత్రం నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి వెల్లడించారు. వార్షికోత్సవానికి అతితులుగా ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న, జెఎన్‌టియు మొదటి వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి.ఎన్‌.రెడ్డి, జాతీయ బాలికల టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌ నైనాజైశ్వాల్‌, ఎవరెస్టు అదిరోహించిన మాలావత్‌ పూర్ణలు పాల్గొంటారన్నారు. ముఖ్య అతిథిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విసి పార్థసారధి విచ్చేయనున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీల విజేతల పేర్ల జాబితాను రిజిస్ట్రార్‌ విడుదల చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది క్రీడా, సాంస్కృతిక పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనడం పట్ల ఆయన వారిని అభినందించారు. ఇదే సందర్భంగా వర్సిటీ దశాబ్ది ఉత్సవాలను కూడా ఘనంగా జరపనున్నామని ఆచార్య లింబాద్రి తెలిపారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చేయవలసిన ఏర్పాట్లపై రిజిస్ట్రార్‌, ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కనకయ్య, ప్రొఫెసర్‌ సత్యనారాయణచారి, స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ మమత, కల్చరల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ త్రివేణి, కంట్రోలర్‌ డాక్టర్‌ పాతనాగరాజు, పిఆర్‌ఓ డాక్టర్‌ రాజారాం, డాక్టర్‌ ఆర్తీ, డాక్టర్‌ రవిందర్‌రెడ్డి, ఇతర పరిపాలనా సిబ్బందితో సమీక్షించారు. ఏర్పాట్లు ఘనంగా ఉండాలని పేర్కొన్నారు. విజేతలకు బహుమతి ప్రదానం, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.

Check Also

31వరకు టీఎస్ ఈసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడగింపు..

హైద‌రాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ఈ సెట్‌–21 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గడువును మ‌రోమారు ...

Comment on the article