Breaking News

బ్రిటన్ హిందువైన సిద్ధార్థ ఐసిస్ కొత్త జిహాదీ జాన్‌గా..

భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు సిద్ధార్థ ధర్ ఉగ్రవాద సంస్థ ఐసిస్లో సీనియర్ కమాండర్గా ఉన్నట్లు తాజాగా కథనాలు వస్తున్నాయి. ఐసిస్ ఉగ్రవాదుల చేత చిక్కి, లైంగిక బానిసగా నరకయాతన అనుభవించిన ఓ యువతి తెలిపిన వివరాలను ఉటంకిస్తూ.. కథనాలు వస్తున్నాయి.

బ్రిటన్ హిందువైన సిద్ధార్థ ఇస్లాంను స్వీకరించి అబూ రుమయ్సాహ్గా పేరు మార్చుకున్నాడు. బ్రిటన్లో తన పైన పలు కేసులు ఉన్నప్పటికీ… పోలీసులకు చిక్కకుండా 2014లో తన భార్య, పిల్లలతో కలిసి సిరియా చేరుకొని ఐసిస్లో చేరాడు.కొత్త జీహాదీ జాన్గా అతడు పేరొందాడు. ఐసిస్‍లో ప్రస్తుతం అతను సీనియర్ కమాండర్ హోదాలో ఉన్నాడు. కొత్త జిహాదీ జాన్ సిద్దార్థ ధర్.. మంచినీళ్లు తాగినంత సులభంగా మనుషుల గొంతు కోసి చంపే జిహాజీ జాన్గా భారతీయ హిందువు వ్యవహరిస్తున్నాడని తేలడం గమనార్హం.

Check Also

‘బాత్రూంలో నీళ్లు తాగుతున్నా.. మీకు పుణ్యం ఉంటాది కాపాడండి సార్’

  నన్ను కాపాడి ఇండియాకు చేర్చండి సార్..: సౌదీలో తెలుగు మహిళ    దుబాయ్‌కి పంపుతామని చెప్పి ఏజెంట్ల చేతిలో ...

Comment on the article