Breaking News

Daily Archives: May 22, 2016

కెప్టెన్ విజయ్‌కాంత్ పార్టీ గుర్తింపు రద్దు

చెన్నై : తమిళనాడు సినీ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. డీఎండీకే పార్టీ గుర్తింపును రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించింది. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే ఆరుశాతం ఓట్లు సంపాదించాలి. కాగా తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికల పోలింగ్‌లో కెప్టెన్ పార్టీ 2.4 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. దీంతో పార్టీ గుర్తింపు రద్దు అయింది.

Read More »

హిమాచల్‌ప్రదేశ్‌లో రెండు ఘోర ప్రమాదాలు

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 22 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన ఆర్డీసీ బస్సు బజోలీ వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం శనివారం ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో 13 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం కిన్నూరు ...

Read More »

ప్రమాదం అంచున 4కోట్ల మంది భారతీయులు

భారతదేశంలో పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా కోట్లాది మంది భారతీయులకు ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక పేర్కొంది. 2050 నాటికి దాదాపు 4 కోట్ల మంది ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించింది. సమీప భవిష్యత్తులో ముంబై, కోల్‌కతాల్లో వరదలు ముంచెత్తే అవకాశం ఉందని ఐరాస పర్యావరణ తాజా నివేదిక పేర్కొంది. పెరుగుతున్న పట్టణీకరణ, ఆర్థిక అభివృద్ధే దీనికి కారణమని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ముప్పు పొంచిఉన్న పది దేశాలలో ఏడు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే ఉన్నాయని, 2050నాటికి ఆయా ...

Read More »

70 ఏళ్ల తర్వాత బయటపడిన గుప్తనిధి!

70 ఏళ్ల కిందటి ఓ పాత్ర (మగ్గు)లో దాచిన గుప్తనిధి ఇన్నాళ్లకు బయటపడింది. జర్మనీలో నాజీల దురాగతాల కాలంనాటి ఓ మగ్గులో అతి జాగ్రత్తగా, రహస్యంగా ఎవరికీ కనపడకుండా ఓ బంగారు ఉంగరాన్ని, నగ (నెక్లెస్‌)ను దాచారు. మగ్గు అడుగున బంగారాన్ని ఉంచి దానిపై ఓ పొర లాంటిది ఏర్పాటుచేసి.. అదే అడుగుభాగమన్న భ్రమను కల్పించారు. జర్మనీలోని ఆష్‌విట్జ్‌ మ్యూజియంలో ఉన్న ఈ మగ్గులో లోపల గుప్తబంగారం ఉన్న విషయాన్ని తాజాగా సిబ్బంది కనుగొన్నారు. రెండోప్రపంచ యుద్ధకాలంలో జర్మనీలో నాజీలు కాన్‌సెంట్రేషన్‌ క్యాంపులు ఏర్పాటుచేసిన ...

Read More »

ఇక యాపిల్ మేకిన్ ఇండియా!

ప్రధాని మోదీతో టిమ్ కుక్ భేటీ – యాపిల్ ఉత్పత్తుల తయారీ అవకాశాలపై చర్చ న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్  సీఈఓ టిమ్ కుక్… శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య దేశంలో యాపిల్ ఉత్పత్తుల తయారీ అవకాశాలపై, యువత నైపుణ్యాలు, ఉపాధి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే సైబర్ సెక్యూరిటీ, డేటా ఎన్‌స్క్రిప్షన్ విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. టిమ్ కుక్ భారతీయ యువతను మెచ్చుకున్నారు. భారతీయ యువతలో మంచి ...

Read More »

టిఫిన్ పెట్టలేదని..కోడల్ని చంపిన మామ

  విజయవాడలో దారుణం జరిగింది. ఓ కోడలిని మామ అత్యంత కిరాతకంగా గొంతునులిమి చంపాడు. అది కూడా టిఫిన్ పెట్టలేదన్న చిన్న కారణంతో.. విజయవాడ రూరల్ మండలం నున్నకు చెందిన జూలిపూడి సత్యనారాయణ కుమారుడు శివాజీ పెట్రోల్ బంకు‌లో పనిచేస్తాడు. సుమతి అనే వ్యక్తిని శివాజీ ప్రేమించాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితమే ఆ యువతిని వివాహం చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు.   ఈ క్రమంలో ఇవాళ ఉదయం శివాజీ యధావిధిగా బంక్‌లో విధులకు వెళ్లాడు. సుమతి పక్కనే ఉన్న బంధువుల ఇంటికి ...

Read More »

ఫేస్‌బుక్‌తో దొరికిపోతారు

ఒక్కోసారి పర్సనల్‌ విషయాలు కూడా మీ వృత్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తుంటాయి. కుటుంబంలో చికాకులు, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపితే.. ఫేస్‌బుక్‌ వాడకం ఏకంగా వారికొచ్చే ఉద్యోగ అవకాశాల మీద కూడా ఎఫెక్ట్‌ చూపిస్తున్నాయి. కార్పొరేట్‌ కల్చర్‌లో వ్యక్తి తెలివితేటలు, మార్క్‌షీట్స్‌, వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఫేస్‌బుక్‌ హిస్టరీపై కూడా ఓ కన్నేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో మీ పోస్టింగ్స్‌ సరళిని బట్టి మీరెలాంటివారో ఓ అంచనాకు వస్తున్నారు. అందుకే కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగం ఆశిస్తున్న వారు సోషల్‌ మీడియాలో కాస్త ...

Read More »

గుమాస్తా కుమార్తె టాపర్

ఎంసెట్ మెడికల్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన హేమలత విజయవాడ(గుణదల)/కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రతిభకు ఆర్థిక స్థితిగతులు అడ్డంకి కాదని మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థిని రుజువు చేసింది. బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసే ఓ సాధారణ వ్యక్తి కుమార్తె ఎంసెట్-2016 మెడికల్ విభాగంలో తొలి ర్యాంకు సాధించి స్ఫూర్తిదాయకం గా నిలిచింది. శనివారం విడుదలైన ఎంసెట్ మెడికల్ ఫలితాల్లో కర్నూలు జోహరాపురానికి చెందిన మాచాని హేమలత మొదటి ర్యాంకు సాధించింది. కర్నూలులోని శ్రీనివాస క్లాత్ స్టోర్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న మాచాని వీరన్న, చంద్రకళ దంపతుల ...

Read More »

ఆ భిక్షగాడి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!

పాట్నా: అతను పాట్నా వీధుల్లో అడుక్కునే ఓ సాధారణ భిక్షగాడు. పేరు పప్పు కుమార్‌. వయసు 33 సంవత్సరాలు. అతను బెగ్గింగ్‌ ద్వారా సంపాదించింది ఎంతో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఓ ఎగువ మధ్య తరగతి కుటుంబీకుడికి కూడా అన్ని ఆస్తులు ఉండవేమో. అతనికి దాదాపు 1.25 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి. అలాగే నాలుగు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి. వాటిల్లో ఎప్పుడూ ఐదు లక్షల రూపాయల డబ్బు ఉంటుంది. అతను పాట్నాలో వ్యాపారం చేసే ఓ మోస్తరు వ్యాపారస్తులందరికీ వడ్డీకి అప్పులిస్తుంటాడు. దాదాపు ...

Read More »

నీటి కోసం తప్పని తిప్పలు

డిచ్‌పల్లి : మండలంలోని ఘన్‌పూర్ గ్రా మంలోని కాలనీ వాసులకు తా గునీటి కోసం తిప్పలు తప్పడం లేదు. గ్రామంలో తాగునీరు స రఫరా చేసే బోర్లలో భూగర్భ జ లాలు ఇంకిపోవడంతో తాగునీటికి కష్టాలు మొదలయ్యాయి. వేసవి ఆరంభం నుంచే కాలనీ వాసులు బిందెడు నీటి కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి న పరిస్థితి నెలకొంది. ఘన్‌పూర్‌లోని మూడు కాలనీలో ఉద యం నుంచి రాత్రి వరకు మ హిళలు నీటికోసం బిందెలతో క్యూ కడుతున్నారు. రెండు బోర్లవద్ద నీటికోసం పడిగాపులు ...

Read More »

మక్కా సమీపంలో బాల్కొండ వాసి మృతి

బాల్కొండ : సౌదీలోని పవిత్ర మక్కా దర్శనానికి హజ్ (ఉమ్రా) యాత్రకు వెళ్లి అక్కడ అనారోగ్యంతో బాల్కొండకు చెందిన ఒకరు మృతి చెందారు. బాల్కొండ బస్టాండ్‌కు చెందిన ఓకే సైకిల్ టాక్సీ యాజమాని ఉస్మాన్(62) తన భార్యతో కలిసి మక్కా దర్శనానికి ఐదు రోజుల క్రితం వెళ్లాడు. మక్కాకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో జెద్దాలో తీవ్ర అస్వస్థతతో శనివారం సాయంత్రం మృతి చెందాడు. ఉస్మాన్ 40 ఏళ్లుగా తన వృత్తితో గ్రామస్తులతో ఆప్యాయంగా మెలిగేవాడని సన్నిహితులు తెలిపారు. కాగా మృతదేహాన్ని బాల్కొండకు తెప్పించేందుకు ...

Read More »

సరిహద్దు పోలీసులు స్నేహభావంతో మెలగాలి

మద్నూర్ : రాష్ట్ర సరిహద్దు పోలీసులు స్నేహభావంతో మెలగాలని దెగ్లూర్ డీఎస్పీ ప్రశాంత్ స్వామి అన్నారు. శనివారం దెగ్లూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ గ్రౌండ్‌లో ఇంటర్‌స్టేట్ బోర్డర్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బిచ్కుంద సర్కిల్ పరిధిలోని పోలీసులు,దెగ్లూర్ సర్కిల్ పరిధిలోని పోలీసులకు వాలీబాల్ టోర్నీ నిర్వహించారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన డీఎస్పీ సరిహద్దు పోలీసులు ఒకరినొకరు సహకరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దెగ్లూర్ సీఐ సంపత్ షిండే,మద్నూర్ ఎస్సై కాశీనాథ్ ఉన్నారు.

Read More »

తప్పు ఒకరిది శిక్ష మరొకరికి

మద్నూర్ : ఇటీవల జరిగిన నవోద య ప్రవేశ పరీక్ష 2016లో మండలకేంద్రానికి చెందిన హర్షిత ఎంపికైంది. అధికారుల తప్పిదంతో విద్యార్థినికి అడ్మిషన్ దొరికే అవకాశాలు కనబడ డం లేదు. దరఖాస్తుతో సహా మిగతా అన్ని ఫారాలలో అర్బన్ ఏరియాగా టిక్ చేశారు. హాల్ టికెట్ N04073 అర్బన్ ఏరియాగానే వచ్చింది. ప్రస్తు తం హర్షిత రూరల్‌గా ఎంపికైందని అధికారులు తెలిపారు. రూరల్‌లో హ ర్షితకు అవకాశం లేదు. హర్షిత తండ్రి హన్మాండ్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వెళ్లగా ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం విద్యార్థిని ...

Read More »