Breaking News

Daily Archives: May 30, 2016

ఆవిర్భావ వేడులు ఘనంగా నిర్వహించాలి

  రెంజల్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆవిర్భావ వేడుకలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, మండలంలోని అన్ని శాఖల కార్యాలయాల్లో జూన్‌ 2న సాంస్కృతిక పోటీలు, జాతీయ పతాకావిష్కరణ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని ఎంపిడివో చంద్రశేఖర్‌ తెలిపారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యక్రమాల ఫోటోల రూపంలో సంబంధిత అధికారులకు పంపించాలని అన్నారు. ప్రతి గ్రామ ...

Read More »

తెవివి విసి, రిజిస్ట్రార్‌ చిత్రపటాలకు పాలాబిషేకం

  కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు సౌత్‌ క్యాంపస్‌ విద్యార్థులు సోమవారం తెలంగాణ యూనివర్సిటీ విసి పార్థసారధి, రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్దికి నోచుకోని దక్షిణ ప్రాంగణం నేడు విసి చొరవతో నూతన వసతి గృహాలతోపాటు, సెరీ కల్చర్‌కు సంబంధించిన 12 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని నూతన కళాశాల భవనం ఏర్పాటుకు మోక్షం లభించిందన్నారు. పార్ధసారది విసిగా బాధ్యతలు ...

Read More »

యూనివర్సిటీ టాపర్‌ను సన్మానించిన డిఎస్పీ

  కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని సోమవారం కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ సన్మానించారు. మంజీర డిగ్రీ, పిజి కళాశాలకు చెందిన బిఏ హెచ్‌ఇపి విద్యార్థి దశరథ్‌ కుమార్‌, తెలంగాణ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో 92.41 శాతం మార్కులతో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా డిఎస్పీ విద్యార్థిని అభినందించారు. కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. కె.ప్రత్యుష ఎంపిసి నుంచి 96 శాతం మార్కులతో కళాశాల ...

Read More »

నీటి ఎద్దడిపై బల్దియా కమీషనర్‌ నిలదీత

  కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 7వ వార్డులో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని వార్డు వాసులు ఆందోళన చేపట్టారు. సోమవారం పట్టణంలోని నీటి సరఫరా కార్యాలయాన్ని ముట్టడించారు. ఇన్‌చార్జికమీషనర్‌ పఠాభి, నీటి సరఫరా బాధ్యుడు అతీక్‌లను నిలదీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7వ వార్డులో మునిసిపల్‌కు సంబంధించిన ఒక బోరు, ఒక వాటర్‌ పంపు సైతం లేదని, ఒకే ట్యాంకర్‌ను కేటాయించడంతో వార్డు మొత్తానికి నీటి సరఫరా కావడం లేదన్నారు. ఇది వరకే ...

Read More »

అటవీ అధికారులనుంచి భూములు కాపాడాలి

  కామరెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ అధికారులు తమ భూముల్లో హద్దులు వేస్తూ స్వాధీనం చేసుకుంటున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని సోమవారం కామారెడ్డి ఆర్డీవోకు సిపిఎం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధారి, మాచారెడ్డి మండలాల్లోని పలు ప్రాంతాల్లోగత 30 సంవత్సరాలుగా హక్కు పత్రాలు ఇచ్చిన భూముల్లో పేదలు, దలితులు, గిరిజనులు సాగుచేసుకుంటున్నారన్నారు. ఈ సాగుభూముల్లో అటవీ అధికారులు అవి అటవీ భూమి ...

Read More »

మరుగుదొడ్ల నిర్మాణం వేగంగా జరపాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : .జిల్లాలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం మరింత వేగంగా పూర్తిచేయడానికి మండల స్థాయి అధికారులు ప్రత్యేకంగా కృసి చేయాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎంపిడివోలు, ఏపివోలతో మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక లక్షకు పైగా మరుగుదొడ్లు నిర్మించడాన్ని లక్ష్యంగా పెట్టుకోగా వాటిలో 50 వేలకు మంజూరు ఇచ్చామని, సుమారు ...

Read More »

టిఎస్‌ ఐపాస్‌ ప్రగతిని సమీక్షించిన జిల్లా కలెక్టర్‌

  నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎస్‌ ఐపాస్‌ కింద 59 కోట్ల విలువైన 69 పరిశ్రమలకు సంబంధించిన 116 అనుమతులను నిర్దేశిత కాలంలో జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. సోమవారం టిఎస్‌ ఐపాస్‌ ప్రగతిని సమీక్షిస్తూ ఈ పరిశ్రమల వలన 745 మంది ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. అనుమతులు పొందిన యూనిట్లు సకాలంలో గ్రౌండింగ్‌ అయ్యేందుకు సహకరించాలని అదికారులను ఆదేశించారు. అనుమతులు పొందిన పరిశ్రమల గ్రౌండింగ్‌ ప్రగతిని ఆన్‌లైన్‌ ...

Read More »

అవతరణ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిదులందరు పాల్గొనాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల్లో స్తానిక ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని, బంగారు తెలంగాణ సాధనకు పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి అన్ని మండలల ఎంపిపిలు, జడ్పిటిసిలు, సర్పంచ్‌లు, ఎంపిడివోలు, తహసీల్దార్లు, ఏపివోలు, ఎపిఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సాధించుకున్న రాష్ట్ర ...

Read More »

చురుకుగా సాగుతున్న అమరవీరుల స్థూపం పనులు

  మోర్తాడ్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమంలో జేఏసి గా ఏర్పడిన కొందరు చందాలు పోగుచేసి అమర వీరుల స్థూపాన్ని నిర్మించతలపెట్టారు. అమరవీరుల స్థూపం నిర్మాణం అర్ధాంతరంగా గత ఐదారుసంవత్సరాలుగా నిలిచిపోయింది. దీంతో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని రానున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని స్థూపాన్ని స్వయంగా నిర్మింపజేసేందుకు రెండు లక్షల నిధులు అందజేశారు. దీంతో తెరాస మండల అధ్యక్షుడు కల్లడ ఏలియా అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను చురుకుగా చేయిస్తున్నారు. ...

Read More »

గ్రామాల్లో నాటుసారా అమ్మితే కఠిన చర్యలు

  మోర్తాడ్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో నాటుసారా, కల్తీకల్లు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని మోర్తాడ్‌ ఎక్సైజ్‌ సిఐ సహదేవ్‌ అన్నారు. సోమవారం మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో చిన్నరాజన్న, అతని భార్య చిన్ని సారా విక్రయిస్తుండగా పట్టుకున్నామని, వారి వద్దనుంచి 3 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. సారా విక్రయిస్తున్న నిందితులకు లక్ష రూపాయల సొంత పూచీకత్తుతో తహసీల్దార్‌ ముందు బైండోవర్‌ చేశారు. ఆయన వెంట ఎక్సైజ్‌ సిబ్బంది ఉన్నారు.

Read More »

ఇంటింటికి ఇంకుడుగుంత, మరుగుదొడ్లు నిర్మించుకోవాలి

  మోర్తాడ్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న ఇంటింటికి ఇంకుడుగుంత, మరుగుదొడ్లు ప్రతి ఒక్కరు నిర్మించుకోవాలని మోర్తాడ్‌ సర్పంచ్‌ దడివె నవీన్‌ అన్నారు. సోమవారం ఆయన గ్రామంలో పర్యటిస్తు ఇంకుడు గుంతల నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్రంలోనే బాల్కొండ నియోజకవర్గంలో అత్యధికంగా నిదులు మంజూరు చేస్తు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అమలు చేస్తు, అభివృద్ది ...

Read More »

నిరుపేదలందరికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను వెంటనే అందించాలి

  మోర్తాడ్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన డబుల్‌ బెడ్‌ రూం పథకాన్ని నిరుపేదలందరికి అందించి వెంటనే అమలు చేయాలని సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి జిల్ల, మండల కార్యదర్శులు సారాసురేశ్‌, కిషన్‌లు అన్నారు. సోమవారం న్యూడెమోక్రసి ఆద్వర్యంలో మండల తహసీల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహసీల్దార్‌ వెంకట్రావుకు అందించారు. విడతల వారిగా కాకుండా గతంలో మాదిరిగా ఇళ్లులేని ప్రతి ఒక్కరికి డబుల్‌ బెడ్‌ రూం అందించాలని, ...

Read More »

సాదా బైనామా భూములను ఆన్‌లైన్‌ చేసుకోవాలి

  మోర్తాడ్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు 2014 సంవత్సరం లోపు తెల్లకాగితంపై, స్టాంప్‌ పేపర్లపై కొనుగోలు చేసిన భూములను రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని మోర్తాడ్‌ తహసీల్దార్‌ తెలిపారు. జూన్‌ 2వ తేదీ నుంచి 10 లోపు మీసేవా కేంద్రాల్లోని ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అసైన్‌మెంట్‌ భూములు గాని, లావాని పట్టా భూములకు గాని ఇది వర్తించదన్నారు. పట్టాభూములు కొనుగోలు చేసిన భూములకే వర్తిస్తుందన్నారు. రైతుల భూముల దరఖాస్తుల ఆన్‌లైన్‌లపై అంగన్‌వాడి, కార్యదర్శులు, ...

Read More »

సాలూరాను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి

  బోధన్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోదన్‌ మండలం అతి పెద్ద మండలం ఉన్నందున కొత్తగా ఏర్పడుతున్న మండలాల్లో భాగంగా మండలంలోని సాలూరా గ్రామాన్ని మండల కేంద్రంగా మార్చాలని సాలూరా గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. బోదన్‌ డివిజన్‌ను నిజామాబాద్‌లో కలుపుతూ బాన్సువాడను కొత్త డివిజన్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో భాగంగా బోధన్‌ను రెండు మండలాలుగా ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నతాధికారులకు ఉన్నట్టు తెలుస్తున్నందున బోదన్‌ పట్టనానికి దూరంలో ఉన్న గ్రామాలను విడదీసి సాలూరా ...

Read More »

బడి బయటి పిల్లలు బడిలో చేరిక

  బీర్కూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హాజీపూర్‌, కట్టకింది తాండా ఆవాస ప్రాంతంలో సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో అధికారులు పర్యటించారు. బడి బయటి పిల్లలను గుర్తించారు. ఈ సందర్భంగా దాదాపు 50 మంది పిల్లల వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించారు. కార్యక్రమంలో నెమ్లి పాఠశాల ప్రధానోపాద్యాయులు రమణ, పిఆర్‌టియు అధ్యక్షుడు కె.విఠల్‌, సంతోష్‌, లాల్‌సింగ్‌, మదన్‌సింగ్‌, మహేందర్‌, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ పాల్గొన్నారు.

Read More »

అత్యాచారం చేసి..ఆపై చెట్టుకు ఉరితీశారు

అత్యాచారాలు నిరోధించేందుకు ఎన్ని క‌ఠిన చట్టాలు తీసుకొచ్చిన స‌మాజంలోమార్ప‌రావ‌ట్లేదు. అమ్మాయి ఒంట‌రిగా క‌న‌ప‌డితే చాలు రెచ్చిపోతున్నారు మృగాళ్లు. ఇక ఇలాంటి ఘ‌ట‌న‌లు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా చూస్తున్నాము. తాజాగా ఓ 15ఏళ్ల యువ‌తిపై సామూహిక అత్యాచారం చేసి చెట్టుకు ఉరితీశారు కామాంధులు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని భ‌రాయిచ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. శుక్రవారం క‌నిపించ‌కుండా పోయిన ఆ అమ్మాయి శ‌నివారం చెట్టుకు వేలాడుతూ క‌నిపించ‌డంతో ఆ కుటుంబంలో విషాదం నెల‌కొంది. నాన్‌ప‌రా గ్రామానికి చెందిన అమ్మాయిని అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువ‌కులు ...

Read More »

నలుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

  కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపారు. పట్టణంలోని 24వ వార్డు ఆర్‌బి నగర్‌ ప్రాంతంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టుచేసి కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించామన్నారు. వారి వద్దనుంచి రూ. 4470 స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

Read More »

విద్యార్థులకు సన్మానం

  కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఆర్యక్షత్రియ కులానికి చెందిన 10వ తరగతి విద్యార్థుల్లో 9.0 నుంచి 10.10 గ్రేడులు సాధించిన విద్యార్థులకు ఆదివారం ఛత్రపతి టీచర్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతితోనే కాకుండా పైచదువులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలను వెళ్ళాలని ఆకాంక్షించారు. ఆర్యక్షత్రియ విద్యార్తులకు బాసటగా నిలవాలని సూచించారు. ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. 25 మంది విద్యార్థులకు శాలువా, ...

Read More »

కొనసాగుతున్న వంతెన పనులు

  నందిపేట, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ జిల్లాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గోదావరి వంతెన పనులు చురుకుగా సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వందకోట్లు మంజూరుచేసి కాంట్రాక్టరుకు పనులు అప్పగించిన విషయం తెలిసిందే. నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ జిల్లాలకు సరిహద్దుగా ఉన్న గోదావరి నదిపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభమై శరవేగంగా సాగుతున్నాయి. దీంతో నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండల ప్రజలు, ఆదిలాబాద్‌ జిల్లా లోకేశ్వరం మండల ప్రజలకు దూరబారం తగ్గనుంది. గతంలో లోకేశ్వర మండల ప్రజలు ...

Read More »

విద్యుత్‌ షాక్‌తో వృద్దుడు మృతి

  భీమ్‌గల్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ గ్రామంలో పనిచేస్తున్న సిరికొండ మండలం మైలారం గ్రామానికి చెందిన అట్టిమల్లు నడిపి రాజయ్య (55) అనే వ్యక్తి వాటర్‌ ట్యాంకర్‌ నుంచి నీటిని మోటారు ద్వారా ఖాళీ చేస్తుండగా విద్యుత్‌సాక్‌ తగిలి మృతి చెందినట్టు ఎస్‌ఐ సుకేందర్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం భీమ్‌గల్‌లోని మేళ్ల శంకర్‌ వాటర్‌ ప్లాంట్‌లో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ట్యాంకర్‌ నుంచి నీటిని ఖాళీ చేస్తుండగా మోటారు వైరు తెగి ...

Read More »