Breaking News

Daily Archives: June 1, 2016

పిహెచ్‌డి పలితాల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలి

  కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ విడుదల చేసిన పిహెచ్‌డి పరీక్ష ఫలితాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై విచారణ చేపట్టాలని విద్యార్థి సేన డివిజన్‌ ఇన్‌చార్జి వినయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ తమ దగ్గరివారిని, బంధువులను ఉత్తీర్ణులు చేయడానికి అక్రమ మార్గం ఎంచుకున్నారని ఆరోపించారు. పిహెచ్‌డి పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్‌ పత్రాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సాయిరాం, సురేశ్‌, ...

Read More »

ప్రయివేటు పాఠశాలల్లో ఫీజునియంత్రణ కోసం సామాజికోద్యమం

  – సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దండి వెంకట్‌ కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం సామాజిక ఉద్యమం చేపట్టాలని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దండి వెంకట్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో బుధవారం ప్రయివేటు పాఠశాలలు, ఫీజులపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌తోపాటు పలువురు వక్తలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ ప్రయివేటు విద్యావ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. దీనివల్ల పేద, మధ్య ...

Read More »

కామారెడ్డిలో రక్తదానం

  కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకొని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో చేపట్టిన శిబిరంలో 55 మంది ఔత్సాహికులు రక్తదానం చేశారు. వీరిని ఆర్డీవో నగేశ్‌ అభినందించారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని అన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌, పట్టణ సిఐ శ్రీనివాస్‌రావు, తహసీల్దార్‌ అనిల్‌, రెడ్‌క్రాస్‌ ప్రతినిదులు వెంకట్‌రాజం, బాల్‌రాజు, విజయ్‌కుమార్‌, ఆర్గనైజర్లు రమేశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

బీర్కూర్‌ పోలీసుల ఆధ్వర్యంలో ప్రమాద సూచికల ఏర్పాటు

  బీర్కూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బాన్సువాడ-నిజామాబాద్‌ ప్రధాన రహదారిపై బీర్కూర్‌ మండల సరిహద్దు ప్రాంతమైన నసురుల్లాబాద్‌ వద్ద బీర్కూర్‌ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం ప్రయాణీకులకు తెలిసేవిధంగా ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారిపై ప్రమాదాలు జరగకుండా ప్రయానీకుల సుఖవంతమైన రవాణా కొరకు నెమ్మదిగా వెళ్లాలంటూ ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి తెలిపారు. ఆర్‌అండ్‌బి అధికారులు ఏర్పాటు చేయాల్సిన సూచిక బోర్డులను బీర్కూర్‌ పోలీసులు ఏర్పాటు చేయడం పట్ల మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More »

దామాషా ప్రకారం రెడ్డిలకు రిజర్వేషన్లు కల్పించాలి

  రాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ సంతోష్‌రెడ్డి కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనాభా ఆధారంగా రెడ్డిలకు 17 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ సంతోష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కామారెడ్డి పట్టణానికి బుధవారం హైదరాబాద్‌నుంచి రెడ్డి చైతన్యయాత్ర వచ్చింది. ఈ సందర్భంగా పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గంలో అణగారిన పేదలకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రెడ్డికులాలవారికి 2 వేల కోట్లు బడ్జెట్‌లో ...

Read More »

వైభవంగా వెంకటేశ్వరస్వామి కళ్యాణం

  కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీపంచముఖి హనుమాన్‌ ఆలయంలో బుధవారం శ్రీవెంకటేశ్వరస్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ, అభిషేకం, తిరు ఆరాధన, తిరుమంజన సేవ, అలంకార సేవ, తులసీ అర్చన, కుంకుమార్చన, హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు అదిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిదులు రాజు, కుంభాల రవి, సతీష్‌, లక్ష్మణ్‌, రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌, శ్రీధర్‌, లక్ష్మిపతి ఇవో ...

Read More »

ఇంకుడు గుంత తప్పనిసరి

  బీర్కూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రతి ఒక్కరు విధిగా ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మైలారం గ్రామంలో సర్పంచ్‌ సాయిరాం యాదవ్‌, ఎంపిటిసి మహేందర్‌లతో కలిసి ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం బుధవారం ఆయన పరిశీలించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా భూగర్భజలాలు అడుగంటిపోయాయని, నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతల ద్వారా నిలువచేస్తే రాబోయే తరాలకు నీటి సమస్య తలెత్తే ఆస్కారం ఉండబోదని ఆశాభావం వ్యక్తం ...

Read More »

బంగారు తెలంగాణని కనులారా ఆస్వాదిద్దాం

  – మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ బీర్కూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే బంగారు తెలంగాణను తెలంగాణ ప్రజలం కనులారా వీక్షించి ఆస్వాదిద్దామని బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకొని మండల అభివృద్ది కార్యాలయంలో పెరిక శ్రీనివాస్‌ పైవిధంగా స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు గర్వించదగ్గవని, రాష్ట్ర ప్రజలు త్వరలోనే కనులారా బంగారు తెలంగాణ చూసి ఆస్వాదించాలని ఆయన ...

Read More »

సోయావిత్తనాల పంపిణీ

  బీర్కూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మిర్జాపల్లి పిఏసిఎస్‌ ఆద్వర్యంలో బుధవారం రైతులకు సోయాబిన్‌ విత్తనాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఏఎంసి ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌, ఎంపిపి మీణ, అప్పారావు, పిఏసిఎస్‌ అధ్యక్షుడు సుభాష్‌ పటేల్‌, మండల తెరాస అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఏవో కమల, ఏఇవో శ్రావణ్‌, నాయకులు పురమ్‌ వెంకట్‌, మారుతి పటేల్‌, గంగాధర్‌, జె.శ్రీనివాస్‌, కుర్మ గంగారాం, మావురం గంగారాం, గంట అశోక్‌, జాకీర్‌, విఆర్వో ...

Read More »

అవతరణ వేడుకలకు సర్వం సిద్దం

  బోధన్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎందరో అమరవీరుల త్యాగాల పలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి రెండో సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు బోధన్‌ డివిజన్‌లో అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి. బోధన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రాలతోపాటు డివిజన్‌లోని అన్ని గ్రామాల్లో అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. అలాగే బోధన్‌ పట్టణంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ యానంపల్లి ఎల్లయ్య పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బోధన్‌ ...

Read More »

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి

  మోర్తాడ్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యనభ్యసించే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యబోధన చేస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని జడ్పిటిసి ఎనుగందుల అనిత, సర్పంచ్‌ దడివె నవీన్‌, ఎంపిటిసిలు పాపాయి పవన్‌, ఎమ్మాజి మురళీగౌడ్‌, లక్ష్మి అన్నారు. బుధవారం మోర్తాడ్‌లోని కస్తూర్బా విద్యాలయం ప్రహరీగోడ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పనులు ప్రారంబించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రహరీ గోడ నిర్మాణానికి మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పది ...

Read More »

అలరించిన తెలంగాణ ఆవిర్భావ సంబరాలు

  మోర్తాడ్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కార్యదర్శులు గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మోర్తాడ్‌లో గ్రామ ప్రజలకు, యువకులకు తెలియజేసేవిధంగా మోర్తాడ్‌ సర్పంచ్‌ దడివె నవీన్‌ స్వయంగా క్రికెట్‌ టోర్ని నిర్వహించారు. టోర్నమెంట్‌ ను మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత, ఎంపిపి కల్లడ చిన్నయ్యలు మండలాధికారులు తహసీల్దార్‌ వెంకట్రావు, ఎంపిడివో శ్రీనివాసులు ప్రారంభించారు. క్రీడాకారులను కరచాలనం చేసుకొని బ్యాటింగ్‌ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ ...

Read More »

రైతులు సబ్సిడీ విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలి

  మోర్తాడ్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ ఛైర్మన్‌ పిప్పర లింబాద్రి, వైస్‌ఛైర్మన్‌ శోభన్‌రెడ్డిలు అన్నారు. బుధవారం మండలంలోని రామన్నపేట గ్రామ సొసైటీ కార్యాలయ ఆవరణలో రైతులకు సోయా విత్తనాలు పంపిణీ చేశారు. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించి పంటలు సాగు చేయాలని వారు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి లావణ్య, ఏఇవో గంగాధర్‌, పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి రణవీర్‌, మాజీ సర్పంచ్‌ సాయన్న, మాజీ ఎంపిటిసి ...

Read More »

ఖీమా స‌మోసా…

కావలసినవి మైదా: పావుకిలో, ఖీమా: అరకిలో, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను, గరంమసాలా: ఒకటిన్నర టీస్పూన్లు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, పుదీనా తురుము: 2 టేబుల్‌స్పూన్లు, పెరుగు: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా   తయారుచేసే విధానం * మైదాలో నాలుగు టేబుల్‌స్పూన్ల నూనె, ఉప్పు వేసి కలిపి చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండనీ చపాతీలా చేసి రెండుగా కోసి మూతపెట్టి ఉంచాలి. రెండు టేబుల్‌స్పూన్ల మైదాలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి పేస్టులా చేసి ...

Read More »

ముర్గ్‌ మసాలా

కావల్సినవి: ఆవనూనె – పావుకప్పు, కలోంజీ గింజలు(బజార్లో దొరుకుతాయి), వాము – ఒకటిన్నర చెంచా చొప్పున, వెల్లుల్లి ముక్కలు – రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు – మూడు (సన్నగా తరగాలి), టొమాటోలు – రెండు (సన్నగా తరగాలి), అల్లం తరుగు – చెంచా, పచ్చిమిర్చి – మూడు, కరివేపాకు రెబ్బలు – మూడు, ఎముకల్లేని చికెన్‌ – కేజీ, టొమాటో ముద్ద – టేబుల్‌స్పూను, కారం – మూడు చెంచాలు, మిరియాలపొడి – చెంచా, జీలకర్రపొడి – చెంచా, ధనియాలపొడి – అరచెంచా, ఉప్పు ...

Read More »

లండన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సఫిల్‌గూడ: తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లోని బ్రిటీష్‌ పార్లమెంట్‌లో శనివారం తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో తెలంగాణకు చెందిన ఇద్దరు బ్రిటన్‌ ఎంపీలు, ఇండియన్‌ హైకమిషన్‌ సభ్యులు పాల్గొన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమానికి నగేష్‌రెడ్డి అధ్యక్షత వహించగా తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు అనిల్‌ కూర్మాచలం, అధ్యక్షుడు సిక్కా చంద్రశేఖర్‌గౌడ్‌, ఉపాధ్యక్షురాలు పవిత్రరెడ్డి, సభ్యులు ఉదయ్‌, ప్రవీణ్‌రెడ్డి, రత్నాకర్‌, శ్వేతారెడ్డి, నవీన్‌, ప్రసాద్‌, వెంకటేష్‌, నరేష్‌, ...

Read More »

టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ?

టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పగ్గాలు చేపట్టనున్నాడా ? ధోనీ నుంచి కెప్టెన్సీ కోహ్లీ చేతికి రానుందా ? టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం నిజమనే అనిపిస్తోంది. కోహ్లీ కెప్టెన్సీపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉండుంటే క్షణం ఆలోచించకుండా కోహ్లీకి కెప్టెన్సీ అప్పగించేవాడినని రవిశాస్త్రి చెప్పారు. ఏ ఫార్మాట్‌లో అయినా జట్టును విజయపథంలో నడిపించగల సత్తా కోహ్లీకి ఉందని ఆయన తెలిపారు. కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చినంత మాత్రాన ధోనీని అగౌరవపరిచినట్లు కాదని… ...

Read More »

సెల్ఫీ దిగుతుండగా.. భార్యను కెనాల్ లోకి తోసి

మీరట్ : అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తోన్న ఓ భర్త, ఒక కెనాల్ పక్కన నిలబడి తన భార్య సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఆమెను అందులోకీ తోసేసి చంపేశాడు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కి సమీపంలో ఉన్న సర్ధానా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. అయేషా (24) అనే ఒక వివాహితను భర్త ఆఫ్తాబ్ (30) గంగానదిలోకి తోసి చంపేశాడు. అంతా జరిగాక ఏమి ఎరుగనట్టు తన 8 ఏళ్ల కొడుకును తీసుకుని పోలీస్ స్టేషన్ వెళ్లిన ...

Read More »

22నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

-జూలై 30 నాటికి పూర్తి.. ఆగస్టు 2 నుంచి తరగతులు -డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశంలో నిర్ణయం -అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి హైదరాబాద్:రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జూన్ 22 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఉన్నత విద్యా శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూలై 30 నాటికి తుది విడత కౌన్సెలింగ్ ముగించి, ఆగస్టు నుంచి తరగతులు ...

Read More »

రాష్ట్రమంతా అతలాకుతలం.. ఆ సినిమా కోసం కృష్ణ సాహసం!

శ్రీ విజయకృష్ణా మూవీస్ బేనర్‌పై కృష్ణ హీరోగా ఆయన సమర్పణలోనే విజయనిర్మల నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవుడే గెలిచాడు’. కోరికలు తీరకుండానే చనిపోయిన వాళ్ల ఆత్మలు ఎలా పరిభ్రమిస్తుంటాయి? తీరని కోరికలు తీర్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటాయి? అనే ఇతివృత్తంతో రూపొందించిన విభిన్న చిత్రం ఇది. ఈ తరహా చిత్రాలు తీయడానికి ఇప్పుడైతే గ్రాఫిక్స్ అందుబాటులో ఉన్నాయి కానీ, ఆరోజుల్లో లేవు. అయినా ఆత్మ అస్పష్టంగా కనిపించడానికి ఓ ప్రయోగం చేశారు. ఒక వ్యక్తికి పొడుగాటి తెల్లగౌను తొడిగి కెమెరా ముందు నిలబెట్టారు. ...

Read More »