Breaking News

అవతరణ వేడుకలకు సర్వం సిద్దం

 

బోధన్‌, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎందరో అమరవీరుల త్యాగాల పలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి రెండో సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు బోధన్‌ డివిజన్‌లో అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి.

బోధన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రాలతోపాటు డివిజన్‌లోని అన్ని గ్రామాల్లో అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. అలాగే బోధన్‌ పట్టణంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ యానంపల్లి ఎల్లయ్య పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బోధన్‌ పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు తెలంగాణ ఉద్యమం ప్రారంభం నాటినుంచి రాష్ట్ర అవతరణ వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహించిన అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద రంగురంగుల విద్యుత్‌ దీపాలతో ముస్తాబు చేశారు. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని ఆర్డీవో నియమించారు. వేడుకలు పురస్కరించుకొని ఉపాధి హామీ కూలీలకు సైతం జూన్‌ 2న మిఠాయిలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లుచేసినట్లు ఎంపిడివో మల్లారెడ్డి తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించడంలో అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహించినా, అశ్రద్ద చూపినా సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

Check Also

నిర్జీవంగా ఉన్న దేశాన్ని అభివృద్దివైపు తీసుకెళ్ళారు…

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం పండిత్ జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్భంగా ...

Comment on the article