Breaking News

రైతులు సబ్సిడీ విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలి

 

మోర్తాడ్‌, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ ఛైర్మన్‌ పిప్పర లింబాద్రి, వైస్‌ఛైర్మన్‌ శోభన్‌రెడ్డిలు అన్నారు. బుధవారం మండలంలోని రామన్నపేట గ్రామ సొసైటీ కార్యాలయ ఆవరణలో రైతులకు సోయా విత్తనాలు పంపిణీ చేశారు. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించి పంటలు సాగు చేయాలని వారు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి లావణ్య, ఏఇవో గంగాధర్‌, పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి రణవీర్‌, మాజీ సర్పంచ్‌ సాయన్న, మాజీ ఎంపిటిసి రవి, మాజీ వైస్‌ఛైర్మన్‌ శంకర్‌గౌడ్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని ముసల‌మ్మ చెరువులో బుధవారం ఉపాధిహామీ ...

Comment on the article