Breaking News

అలరించిన తెలంగాణ ఆవిర్భావ సంబరాలు

 

మోర్తాడ్‌, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కార్యదర్శులు గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు.

మోర్తాడ్‌లో గ్రామ ప్రజలకు, యువకులకు తెలియజేసేవిధంగా మోర్తాడ్‌ సర్పంచ్‌ దడివె నవీన్‌ స్వయంగా క్రికెట్‌ టోర్ని నిర్వహించారు. టోర్నమెంట్‌ ను మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత, ఎంపిపి కల్లడ చిన్నయ్యలు మండలాధికారులు తహసీల్దార్‌ వెంకట్రావు, ఎంపిడివో శ్రీనివాసులు ప్రారంభించారు. క్రీడాకారులను కరచాలనం చేసుకొని బ్యాటింగ్‌ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలన్నారు. ఐకెపి కార్యాలయంలో ఐకెపి మండల అధ్యక్షురాలు లక్ష్మి, వివోలు, సిఎలు, సిసిలు సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించి నూతన భవనంలోకి వెళ్లారు. ఇజిఎస్‌ అదికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. గురువారం జరిగే తెలంగాణ వారోత్సవాల్లో భాగంగా సర్వం సిద్దం చేశారు.

Check Also

ఆ ఊర్లో మధ్యాహ్నం లాక్‌ డౌన్‌

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్ మండల‌ కేంద్రంలోని గ్రామ సచివాల‌యం కార్యాల‌యంలో శుక్రవారం ...

Comment on the article