Breaking News

వైభవంగా వెంకటేశ్వరస్వామి కళ్యాణం

 

కామారెడ్డి, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీపంచముఖి హనుమాన్‌ ఆలయంలో బుధవారం శ్రీవెంకటేశ్వరస్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ, అభిషేకం, తిరు ఆరాధన, తిరుమంజన సేవ, అలంకార సేవ, తులసీ అర్చన, కుంకుమార్చన, హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు అదిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిదులు రాజు, కుంభాల రవి, సతీష్‌, లక్ష్మణ్‌, రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌, శ్రీధర్‌, లక్ష్మిపతి ఇవో విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article