Breaking News

Daily Archives: June 2, 2016

తెరాస నాయకుల రక్తదానం

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర 2వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం తెరాస నాయకులు రక్తదానం చేశారు. పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్‌తోపాటు పలువురు దాతలు రక్తం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన రెండేళ్లలో తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. వెయ్యి రూపాయల పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌ రూం తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు ...

Read More »

మహిళలకు ముగ్గుల పోటీలు

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ 2వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, ఇన్‌చార్జి కమీషనర్‌ పఠాభి ఆధ్వర్యంలో పోటీలు ఏర్పాటు చేశారు. మెప్మా పరిధిలోని మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. దత్తేశ్వరి ప్రథమ బహుమతి, అనసూయ ద్వితీయ బహుమతి ఛైర్‌పర్సన్‌ చేతుల మీదుగా అందజేశారు.

Read More »

టిజివిపి సమావేశం గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిజివిపి ఆధ్వర్యంలో ఈనెల 5న ఓయులో నిర్వహించతలపెట్టిన రాష్ట్రస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి సంబంధించిన గోడప్రతులను గురువారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నవీన్‌ మాట్లాడుతూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో విద్యారంగ సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణ, విద్యాహక్కు చట్టం, కెజి నుంచి పిజి ఉచిత విద్య, అధిక ఫీజుల నియంత్రణపై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సమావేశానికి ముఖ్య కార్యకర్తలు భారీగా హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో ప్రకాశ్‌, శ్రవణ్‌రెడ్డి, ...

Read More »

ఆరోగ్యశ్రీ శిబిరం విజయవంతం

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో గురువారం ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని చాట్ల మురారి, చాట్ల సంజీవ్‌లు ప్రారంభించారు. రుద్ర మల్టిస్పెషాలిటి ఆసుపత్రి వైద్యులు రాంప్రసాద్‌, తిరుపతిరెడ్డి, మౌనికలు వైద్యసేవలు అందించారు. రోగులకు రక్తపరీక్షలు, ఇసిజి, తదితర పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అనిల్‌, ఎంపిడివో చిన్నారెడ్డి, ఆరోగ్యశ్రీ సిబ్బంది శ్రీనివాస్‌, ప్రశాంత్‌, వేణు, రాము, ...

Read More »

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర 2వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కామారెడ్డి పట్టణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో, పట్టణ పోలీసు స్టేషన్‌, రూరల్‌ పోలీసు స్టేషన్‌, తహసీల్‌ కార్యాలయం, బల్దియా కార్యాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ఆయా పార్టీల కార్యాలయాల ముందు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమరవీరుల ఆత్మబలిదానాలతోపాటు యావత్‌ తెలంగాణ ప్రజల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ...

Read More »

అవతరణ వేడుకల్లో విజేతలకు బహుమతులు

  నిజామాబాద్‌ రూరల్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉపన్యాస, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా అబినందిస్తూ బహుమతులు ప్రదానం చేశారు. గురువారం పట్టణంలోని నూతన అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాటుచేసిన ఉపన్యాస, వ్యాసరచన పోటీల్లో 7వ తరగతి నుంచి పిజి వరకు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జూనియర్‌ స్థాయి, ఇంటర్‌ నుంచి పిజి ...

Read More »

ముఖ్యమంత్రి దూరదృష్టితోనే ఇరిగేషన్‌ ప్రాజెక్టులు

  – తెవివి విసి పార్థసారధి డిచ్‌పల్లి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని, కోటి ఎకరాలకు నీళ్ళు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దూరదృష్టితో భారీ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు చేపట్టారని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ పార్థసారధి అన్నారు. తెలంగాణ రాష్ట్ర రెండవ అవతరణ దినోత్సవ సంబరాల సందర్భంగా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి గొప్ప విజనరి అని, ఆయన ముఖ్యమంత్రి కావడం తెలంగాణ రాష్ట్ర అదృష్టమన్నారు. అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ...

Read More »

బంగారు తెలంగాణ సాధన దిశగా వడివడిగా అడుగులు

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర సాధన అనంతరం బాలారిష్టాలను అధిగమించి అభ్యుదయ పథంలో పురోగమిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల ద్వారా మానవీయకోణంలో పేదలకు చేయుత అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ముందుగా వినాయక్‌నగర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు ఘనంగా నివాళులు అర్పించి స్థానిక ...

Read More »

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు

  బాన్సువాడ, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అధికార పార్టీ నాయకులతోపాటు వివిద పార్టీలకు చెందిన నాయకులు మండల కేంద్రాల్లో, గ్రామాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. బాన్సువాడలో మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేడ్కర్‌ చౌరస్తా వరకు కొనసాగింది. అక్కడ జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ...

Read More »

జై తెలంగాణ నినాదాలతో మారుమోగిన మోర్తాడ్‌

  మోర్తాడ్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా గురువారం మండలంలో జై తెలంగాణ నినాదాలతో మారుమోగాయి. మోర్తాడ్‌ తహసీల్‌, ఎంపిపి, వ్యవసాయశాఖ, స్త్రీనిధి, ఇజిఎస్‌ తదితర కార్యాలయాల ముందు మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత, ఎంపిపి కల్లడ చిన్నయ్య, తహసీల్దార్‌ వెంకట్రావు, ఎంపిడివో శ్రీనివాస్‌, ప్రోగ్రాం అధికారి నర్సయ్య, ఏవో లావణ్య, ఎపిఎం ప్రమీల, విద్యాశాఖ లో ఎంఇవో రాజేశ్వర్‌ జాతీయ జెండాలు ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. మోర్తాడ్‌ పోలీసు స్టేషన్‌, ఎక్సైజ్‌ ...

Read More »

రెంజల్‌లో తెలంగాణ సంబరాలు

  రెంజల్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్ని జాతీయ జెండా ఎగురవేసి ప్రారంభించారు. అంగరంగ వైభవంగా ఊరూరా వాడ వాడ తెలంగాణ సంబరాలు చేస్తూ ర్యాలీలు చేపట్టారు. స్థానిక మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలువేశారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటయ్య, ఎంపిడివో చంద్రశేఖర్‌, జడ్పిటిసి నాగభూషణం రెడ్డి, ఎంపిపి మోబిన్‌ఖాన్‌, ఎపిఎం సరళ, తదితరులు ...

Read More »

కానరాని తెరాస కార్యకర్తల సందడి

  రెంజల్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఒకపక్క ప్రభుత్వం అధికారికంగా అంగరంగవైభవంగా నిర్వహిస్తుంటే రెంజల్‌ మండల తెరాస కార్యకర్తలు మాత్రం సంబరాలకు దూరంగా ఉండడంతో పలువురు విస్తుపోయారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని బంగారు తెలంగాణ కోసం పాటుపడదామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ పదేపదే చెబుతున్నా రెంజల్‌ మండల తెరాస కార్యకర్తలు మాత్రం సంబరాలకు దూరంగా ఉండడంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం సంబరాలు జరుపుకుని మిఠాయిలు పంచిపెట్టినా తెరాస కార్యకర్తలు మాత్రం ...

Read More »

బోధన్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

  బోధన్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బోధన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌, తహసీల్దార్‌ సుదర్శన్‌, ఎంపిపి గంగాశంకర్‌, ఎంఇవో శంకర్‌, తెరాస నాయకులు, కుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద, తహసీల్‌ కార్యాలయం, మునిసిపల్‌ కార్యాలయం, ఎంపిపి కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయజెండాలు ఆవిష్కరించారు. అనంతరం అంబేడ్కర్‌ చౌరస్తాలోఅన్నదాన ...

Read More »

జిల్లా ఉత్తమ అంగన్‌వాడి కార్యకర్తగా గంగాజమున

  రెంజల్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన అంగన్‌వాడి కార్యకర్త కాందారే గంగాజమునకు జిల్లా ఉత్తమ అంగన్‌వాడి కార్యకర్తగా గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా సన్మానించి నగదు బహుమతి అందజేసినట్టు సిడిపివో వెంకటరమణమ్మ, సూపర్‌వైజర్‌ స్వర్ణలత తెలిపారు. ఈ బహుమతిని జిల్లా కేంద్రంలో జరిగిన అవతరణ వేడుకల్లో మంత్రి ప్రదానం చేసినట్టు తెలిపారు. ఈసందర్భంగా గంగాజమునను పలువురు అభినందించారు.

Read More »

పొరుగు దేశాలతో రాదారి బంధం

భారత్‌-మియన్మార్‌-థాయ్‌లాండ్‌ రహదారి ద్వారా ఆగ్నేయాసియాతో పాటు మనదేశంలోని వెనకబడిన ఈశాన్య ప్రాంత ముఖచిత్రం మారిపోనుంది. ఈ రహదారి ఫలితంగా మౌలిక వసతులు పెరిగి చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు అవకాశం కలగనుంది. మూడు దేశాల మధ్య ద్వైపాక్షిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ రహదారి మణిపూర్‌లోని మోరె నుంచి మియన్మార్‌లోని టము, మాండలే నగరం మీదుగా థాయ్‌లాండ్‌లోని మాయోసోట్‌ జిల్లా టాక్‌ వరకు విస్తరించేలా ప్రణాళిక రచించారు. దీనిపై వాహనాల ప్రయాణానికి అవసరమైన త్రైపాక్షిక మోటారు వాహనాల ఒప్పందం ...

Read More »