Breaking News

Daily Archives: June 3, 2016

బాలింతలకు పౌష్టికాహారం అందజేయాలి

  బీర్కూర్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయాలని ఎంపిపి మల్లెల మీణ, హన్మంతు అన్నారు. మండలంలోని మల్లాపూర్‌ గ్రామంలో అంగన్‌వాడి కేంద్రాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. అంగన్‌వాడిలోగల రిజిష్టర్లను తనికీ చేశారు. రోజువారిగా గర్భిణీలకు, బాలింతలకు గుడ్లు అందజేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహార లోపం వల్ల బాలింతలకు, గర్భిణీలకు పుట్టబోయే బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, అంగన్‌వాడి కేంద్రానికి చేరుకొని ప్రభుత్వం అందించే పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట గ్రామ ...

Read More »

బాధితులకు చెక్కు అందజేత

  బీర్కూర్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అంకోల్‌ గ్రామానికి చెందిన నాగేశ్వర్‌రావు, విజయ్‌ కృష్ణలకు శుక్రవారం 8 వేల రూపాయల చెక్కులు ఎంపిపి మల్లెల మీణ హన్మంతు, జడ్పిటిసి కిషన్‌ నాయక్‌, ఎఎంసి ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌, తహసీల్దార్‌ కృష్ణారావులు అందించారు. గత కొన్నిరోజుల క్రితం ప్రమాదవశాత్తు నాగేశ్వర్‌రావు, విజయ్‌ కృష్ణ ఇళ్లు పూర్తిగా దహనం కావడంతో తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 8 వేలు అందజేసినట్టు తహసీల్దార్‌ పేర్కొన్నారు.

Read More »

సోయా విత్తనాల పంపిణీ

  బీర్కూర్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బైరాపూర్‌, దుర్కి సహకార సంఘాల్లో ఆయా సహకార సంఘాల ఛైర్మన్ల ఆధ్వర్యంలోసోయా, పెసర, మినుము విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్‌ పంటకు ముందే మండలంలోని అన్ని సహకార సంఘాల్లో రైతుల సౌలభ్యం కొరకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. సహకార సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాలు పంపినీ చేయడం జరుగుతుందని, రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ...

Read More »

గాలివాన బీభత్సం

బీర్కూర్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మిర్జాపూర్‌ గ్రామ పంచాయతీలోని వీరాపూర్‌ దుబ్బ గ్రామంలో శుక్రవారం గాలివానకు సుమారు 15 ఇళ్ళ రేకులు గాలికి ఎగిరిపోయాయి. గాలివాన బీభత్సం సుమారు గంటపాటు కొనసాగడంతో విద్యుత్‌ స్తంభం విరిగిపోయి ప్రమాదకరంగా మారింది. విద్యుత్‌ తీగలు నేలను తాకాయి. గంట బీభత్సంలో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న బీర్కూర్‌ ఎఎంసి ఛైర్మన్‌ పెరక శ్రీనివాస్‌ సంఘటన స్థలానికి చేరుకొని బాదితులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తామని ...

Read More »

సహ చట్టం దరఖాస్తులపై సకాలంలో స్పందించాలి

  నిజామాబాద్‌ రూరల్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు సకాలంలో సమాచారం అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్‌లాల్‌ తెలిపారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో జిల్లా అధికారులతో సమాచారహక్కు చట్టంపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఫోన్‌ ఒన్‌ బి ప్రతి ఒక అదికార యంత్రాంగం తప్పనిసరిగా తమ కార్యాలయానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో పొందుపరిచినా, ఎవరైనా వారికి కావాల్సిన సమాచారాన్ని అడిగినప్పుడు తక్షణమే సమాచారాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని ...

Read More »

మంజీర కళాశాలకు ర్యాంకుల పంట

  కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో మంజీర కళాశాల విద్యార్థులు ర్యాంకులు సాధించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ విద్యార్థులను అభినందించారు. ఆర్ట్స్‌ విభాగంలో కె.దశరథ్‌ కుమార్‌ యూనివర్సిటీ టాపర్‌గా నిలిచారు. సైన్స్‌ విభాగంలో ప్రత్యూష, సౌమ్య, మౌనిక, దివ్యలు అత్యుత్తమ మార్కులు సాధించారు. వీరందరిని ఎమ్మెల్యే అభినందించారు. యూనివర్సిటీ ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలోప్రిన్సిపాల్‌ సత్యనారాయణ, డైరెక్టర్‌ సురేశ్‌ గౌడ్‌, అధ్యాపక ...

Read More »

సైకాలజిస్టుల మహాసభకు వేదప్రకాశ్‌

  కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజయవాడలో ఈనెల 4,5 తేదీల్లో నిర్వహించనున్న సైకాలజిస్టుల మహాసభ నిర్వహించనున్నట్టు ప్రోగ్రెసివ్‌ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ ఇండియా జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ వేదప్రకాశ్‌ తెలిపారు. ఈ జాతీయ మహాసభల్లో వివిధ అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. సైకాలజిస్టులను ఆర్‌సిఐ గుర్తించే విధంగా చర్యలు చేపట్టాలని, సైకాలజిస్టులకు వృత్తిపరమైన స్పష్టత, భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సైకాలజి అధ్యయనాన్ని వృత్తివిద్యా కోర్సుగా గుర్తించాలని, సైకాలజిస్టులను డాక్టర్లుగా గుర్తించాలని పేర్కొన్నారు. అన్ని శాఖల్లో రెగ్యులర్‌ సైకాలజిస్టులను నియమించాలని ...

Read More »

హత్య కేసు నిందితునికి జీవిత ఖైదు

  కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం కామారెడ్డి 9వ అడిషనల్‌ కోర్టు జడ్జి తీర్పునిచ్చినట్టు రూరల్‌ సిఐ కోటేశ్వర్‌రావు తెలిపారు. ఏడాది క్రితం నాటుసారా అమ్మే పూరి అనే మహిళ నాటుసారా అప్పు ఇవ్వకపోవడంతో కడమంచి రాములు అనే వ్యక్తి ఆగ్రహంతో పూరిని రాయితో తలపై బాది హత్య చేసినట్టు తెలిపారు. ఆమె ఒంటిపైగల నగలను సైతం ...

Read More »

ఇంకుడుగుంత నిర్మాణానికి శ్రీకారం

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని అచ్చంపేట సహకార సంఘం ఆవరణలో సంఘం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఇంకుడు గుంత నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సంఘం ఆవరణలో వృధాగా ప్రవహిస్తున్న నీటిని నిలువ చేసేందుకు ఇంకుడుగుంత నిర్మిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సిఇవో సంగమేశ్వర్‌గౌడ్‌, క్షేత్ర సహాయకులు రాజు, డైరెక్టర్‌ దేవయ్య, అంజాగౌడ్‌ తదితరులున్నారు.

Read More »

50 శాతం సబ్సిడీ దాణా పంపిణీ

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరువు పరిస్తితులు నెలకొన్న దృష్ట్యా మూగజీవాలకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై పశువులకు దాణా సరఫరా చేస్తుందని పశువైద్యాధికారి సయ్యద్‌ యూనుస్‌ తెలిపారు. మండల కేంద్రంలోని పశువైద్యశాలలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పశువులకు దాణా అవసరమున్న ఎస్సీ, ఎస్టీ, బిసి, సన్నకారు రైతులు పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్సులతో పాటు గ్రామ పంచాయతీ ద్వారా జారీచేసిన దృవపత్రాలతో రావాలన్నారు. క్వింటాలుకు రూ. 620 అందజేస్తున్నట్టు తెలిపారు.

Read More »

చింతానగర్‌లో కుస్తీ పోటీలు

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని చింతానగర్‌ గ్రామంలో మల్లయోధులు కుస్తీపోటీలు రసవత్తరంగా కొనసాగాయి. బారేడు పోచమ్మ ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో శుక్రవారం మల్లయోధులకు కుస్తీపోటీలు నిర్వహించారు. చుట్టుపక్కలగ్రామాల నుంచి మల్లయోధులు తరలిరావడంతో హోరాహోరీగా పోటీలు సాగాయి. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్‌ మెంబర్‌ హైమద్‌ హుస్సేన్‌, ఉపసర్పంచ్‌ సాయిలు, నాయకులు మహిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జలాల్‌, సాయిలు, మహమూద్‌ తదితరులున్నారు.

Read More »

కేసీఆర్‌ చేసింది దొంగదీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ చేసింది దొంగ దీక్షని, సంబంధిత సమాచారమంతా నిమ్స్‌ రికార్డుల్లో ఉందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీతో కేసీఆర్‌కు రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీపీసీసీ గాంధీభవన్‌లో సోనియాగాంధీకి కృతజ్ఞత సభ నిర్వహించింది. అంతకు ముందు టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క గాంధీభవన్‌ ఆవరణలో జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతర సమావేశంలో జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్‌ది కాదన్నారు. ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి సోనియా ...

Read More »

కూర కొనేదెలా?

కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తీవ్రమైన ఎండల కారణంగా పంట దిగుబడులు తగ్గడం, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కూరగాయలు సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే ధరలు వందశాతానికి పైగా పెరిగాయి. గత నెలలో కేజీ పచ్చిమిర్చి ధర రూ.10 నుంచి రూ.20 మధ్య ఉండగా, ఇప్పుడు రూ.100ను తాకింది. గత నెలలో ధర లేక రైతులు టమోటాలను రోడ్డుమీదే పారబోసిన దుస్థితి. మదనపల్లి మార్కెట్‌లో వ్యాపారులే కేజీ టమోటాను రూ.40కి కొంటున్నారు. చిల్లరగా రూ.50కు అమ్ముతున్నారు. సాధారణంగా ఉపయోగించే 13 రకాల ...

Read More »

గోవాలో లీటరు పెట్రోల్ ధర రూ.59.65 మాత్రమే!

పణజి: పెట్రోల్ ధరలు దేశవ్యాప్తంగా భగ్గుమంటుంటే, గోవాలో మాత్రం తగ్గిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా సామా న్యుడిపై పెట్రో భారాన్ని మోపుతుంటే, గోవా ప్రభుత్వం మాత్రం బావుల్లో తగ్గిన చమురు ధరల ప్రయోజనం బంకుల్లో కూడా అందాలని అంటోంది. ఇందులో భాగంగా పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను 20 శాతం నుంచి ఒక్కసారిగా 15 శాతానికి తగ్గించింది. రాష్ట్ర ప్రజలకు లీటరు పెట్రోల్ ధరను రూ.60కు దిగువన అందిస్తామని అప్పటి ఎన్నికల మ్యానిఫెస్టోలో ...

Read More »

మ్యాట్రిమోనీ సంస్థలకు కొత్త షరతులు.. హోం పేజీలో అలాంటివి వుండకూడదు..!

మ్యాట్రిమోనీల మోసపూరిత బాగోతాలు బయటపడుతూనే వున్నాయి. వధూవరులకు సంబంధించిన వివరాల్లో మోసపూరిత సమాచారాన్ని అందించే మ్యాట్రిమోనీల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మ్యాట్రిమోనీల్లో మోసపూరిత సమాచారాన్ని ఇస్తున్నారంటూ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, ఐటీ, మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖలకు ఫిర్యాదులు అందడంతో.. మ్యాట్రిమోనీలకు కొన్ని షరతులు విధించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. మ్యాట్రిమోనీల ద్వారా యువత జీవితాల్లో ఆడుకునే సంస్థలపై కన్నేయాలనుకుంటుంది. ఇందులో భాగంగా కేంద్రం మ్యాట్రిమోనీ సంస్థలకు కొత్త నిబంధనలు విధించింది. మ్యాట్రిమోనీ సంస్థలు వధూవరుల ...

Read More »

లవర్ కోసం పోటీపడి కన్న కూతుర్ని..

చంఢీగఢ్: ప్రేమ అంటూ ఓ తల్లి ఘాతుకానికి పాల్పడింది. ప్రేమికుడి కోసం జరిగిన పోరులో కన్న కూతుర్ని బలి తీసుకుంది. సినిమాలో ట్విస్ట్ కంటే కూడా ఎక్కువ నాటకీయత చోటుచేసుకున్నా చివరికి న్యాయమే గెలిచింది. కొన్ని రోజుల కిందట దీక్ష(17) చనిపోయింది. ఆమె తల్లి ఇది ఆత్మహత్య అని అందరినీ నమ్మించింది. కానీ చివరికి దీక్ష మరణం వెనుక అసలు రహస్యాలను తెలుసుకుని పోలీసులు, అధికారులు ఆశ్చర్యపోయారు. ఫేస్ బుక్ లవర్ విజయ్ కుమార్ అలియాస్ సోను కోసం కూతుర్ని అంతం చేసింది. ఈ ...

Read More »

అఆ

మహేశ్, పవన్, అల్లు అర్జున్.. ఒక్కొక్కరితో రెండేసి చొప్పున దర్శకుడిగా ఆయన చేసిన ఆరు సినిమాలనూ ఈ ముగ్గురు స్టార్ హీరోలతోనే చేసిన త్రివిక్రమ్ తొలిసారి నితిన్ లాంటి యువహీరోతో చేసిన చిత్రం ‘అఆ’. నితిన్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నేడు తెరమీదికొచ్చింది. పవన్, బన్నీ లాంటి హీరోలకు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన మాటల మాంత్రికుడు నితిన్‌కి ఏ రేంజ్‌ సక్సెస్‌ని ఇచ్చాడో చూద్దాం. కథ: అనసూయ రామలింగం (సమంత)కు తండ్రి రామలింగం (నరేష్) దగ్గర బాగా చనువు. తల్లి ...

Read More »

తల్లి పాలలో పాము విషం

తల్లికి పాము కాటు.. ఆమె పాలు తాగిన బిడ్డ.. ఇద్దరూ మృతి.. అనంతలో విషాదం గుత్తి రూరల్‌ : పాము కాటుకు ఓ మాతృమూర్తి మరణించగా, ఆమె పాలు తాగిన మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు. హృదయ విదారకమైన ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం కొజ్జేపల్లి గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన లింగన్న భార్య చంద్రకళ (30)ను గురువారం తెల్లవారుజామున పాము కాటువేసింది. దీన్ని గమనించని ఆమె.. కాలి పట్టీ గుచ్చుకుని ఉంటుందని భావించి ఇంటి పనులు చేసుకోవడం ప్రారంభించింది. ...

Read More »

సమంత ‘పెళ్లికొడుకు’ ఇతడేనా?

‘ఐ యామ్ ఇన్ లవ్.. చాలా సంవత్సరాల నుంచి తను పరిచయం.. నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ తను, తనది కూడా నాలా హెల్పింగ్ నేచర్, వంట సూపర్బ్‌గా చేస్తాడు. నాన్‌వెజ్ కూడా. రిస్క్ లేదు.. పెద్దలొప్పేసుకున్నారు’ అంటూ స్టన్నింగ్ బ్యూటీ సమంత ఇటీవల తన ప్రేమ విషయం బయటపెట్టేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి మన ‘జెస్సీ’ మనసు దోచుకున్న ఆ ‘కార్తీక్’ ఎవరా అని అంతటా ఆసక్తి. ఎలాగైనా తెలుసుకోవాలని మీడియా వంద ప్రశ్నలు సంధించినా.. ఎవరో అడగొద్దు, ...

Read More »

బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధికి కృషి

నిజామాబాద్ అర్బన్ : నగరంలో విశిష్టమైన బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. బుధవారం జిల్లా స్వర్ణకారుల సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నాగారంలోని బ్రహ్మంగారి ఆలయ ఆవరణలో నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, నగర మేయర్ ఆకుల సుజాత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ భవనానికి నిర్మాణానికి తన వంతు నిధులు కేటాయించి, బ్రహ్మంగారి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ...

Read More »