Breaking News

Daily Archives: June 4, 2016

రంజాన్‌ సందర్భంగా ఈద్గాలు, మసీదుల వద్ద ఏర్పాట్లు చేయాలి

  నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పండగ సందర్భంగా ఈద్గా, మజీద్‌ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా మునిసిపల్‌ అధికారులకు సూచించారు. శనివారం జిల్లాలోగల గాంధీచౌక్‌ ఈద్గా, ఖిల్లా ఈద్గా, మదీన ఈద్గాలను ఎస్పీ విశ్వప్రసాద్‌, నగర మేయర్‌ ఆకుల సుజాత, ఆర్డీవో యాదిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈద్గాలు, మసీదుల వద్ద గల ప్రహరీగోడలకు, గేట్‌లకు రంగులు వేయించాలని, అక్కడ కాంతులు విరజిమ్మే విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేసి సర్వాంగ ...

Read More »

క్రీడల వల్ల స్నేహభావం పెంపొందుతుంది

  మోర్తాడ్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడల వల్ల క్రీడాకారుల్లో, గ్రామాల మధ్య స్నేహభావం పెంపొందుతాయని ఏర్గట్ల సర్పంచ్‌ వైష్ణవి అన్నారు. శనివారం మండలంలోని ఏర్గట్ల గ్రామంలో ఏర్గట్ల క్రికెట్‌ అసోసియేషన్‌ వారు నిర్వహించిన టీ-20 క్రికెట్‌ టోర్నమెంట్‌ బహుమతి ప్రదాన కార్యక్రమానికి సర్పంచ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఒడ్యాట్‌ గ్రామానికి చెందిన ప్రథమ స్థానం క్రీడాకారులకు, ద్వితీయ స్తానం సాదించిన ఏర్గట్ల క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల వల్ల దేహదారుఢ్యం పెరుగుతుందని, ఆరోగ్యంగా ...

Read More »

లాభాపేక్ష లేకుండా విద్యనందించాలి

  కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు విద్యాలయాల యాజమాన్యాలు లాభాపేక్ష లేకుండా విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా విద్యనందించాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో వివేకవర్ధని పాఠశాల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాభాపేక్షే ధ్యేయంగా పలు విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని విద్యాసంస్థలు విద్యార్థులకు విద్యనందించడానికి వారి శ్రేయస్సుకు పాటుపడాలన్నారు. అప్పుడే ఆ విద్య సంస్థలతో పాటు అందులో చదువుకున్న విద్యార్తులకు సైతం మంచి పేరు లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ...

Read More »

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

  కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కుటుంబాలను శనివారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు సాయాగౌడ్‌ తండ్రి ఇటీవల చనిపోగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. పట్టణానికి చెందిన తెరాస కార్యకర్త రాజాగౌడ్‌ ఇటీవల క్యాన్సర్‌తో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. దేవునిపల్లి మండలం పార్టీ ప్రధాన కార్యదర్శి కమ్మరి శ్రీనివాస్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యారు. ఆయన ఇంటికి వెళ్లి శ్రీనివాస్‌ను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట ఐడిసిఎంఎస్‌ ...

Read More »

ముస్లిం ప్రతినిదులతో సిఐ సమావేశం

  కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూర్‌ గ్రామ పరిధిలోని డ్రైవర్స్‌ కాలనీలో ఓ మసీదుకు సంబంధించిన వివాదం నేపథ్యంలో శనివారం కామారెడ్డి రూరల్‌ సిఐ కోటేశ్వర్‌రావు మైనార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. డ్రైవర్స్‌ కాలనీలోని ఓ మజీదుకు సంబంధించి మైనార్టీలని సన్నివర్గం, సబ్లిక్‌ వర్గం గత కొన్నేళ్ళుగా మజీద్‌ తమదంటే తమదని వాదిస్తున్నారు. ఈ క్రమంలో వారు కోర్టుకు సైతం వెళ్ళారు. పరిస్తితి చేదాటి ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా సిఐ ఇరువర్గాలతో మాట్లాడారు. సమస్య ...

Read More »

ప్రయివేటు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి

  మోర్తాడ్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లోగల ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమయ్యే అన్ని మౌలిక వసతులు ప్రభుత్వ నిబంధనల మేరకు కల్పించాలని మోర్తాడ్‌ ఎంఇవో రాజేశ్వర్‌ అన్నారు. శనివారం మోర్తాడ్‌లోని విద్యావనరుల కేంద్రంలో ప్రయివేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన రికగ్నైజ్డ్‌ సర్టిఫికెట్‌, బస్సుల ఫిట్‌నెస్‌ పత్రాలు విద్యావనరుల కేంద్రంలో అందజేయాలన్నారు. నిబంధనలకు విరుద్దంగా పాఠశాలలు కొనసాగిస్తే శాఖాపరమైన చర్యలు చేపడతారని హెచ్చరించారు. ముందుగా ప్రయివేటు పాఠశాలల మండల యూనియన్‌ ...

Read More »

బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అధ్యాపకులు, పరిశోధకులు పాటుపడాలి

  – తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత మూడురోజులుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ భవనంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం – భవిష్యత్తు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర అబివృద్ధికి అనువైన అంశాలను వక్తలు సూచించారు. అసమానతలులేని తెలంగాణ సాధింపబడాలని తెలిపారు. ముఖ్య అతిథిగా తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ ఆధిపత్యంలేని ...

Read More »

రైతులు పశువుల దాణ సద్వినియోగం చేసుకోవాలి

  మోర్తాడ్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కరువు ఏర్పడిన నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం సబ్సిడీ కింద అందిస్తున్న పశువుల దాణ సద్వినియోగం చేసుకోవాలని మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, మండల సర్పంచ్‌లు దడివె నవీన్‌, ఉగ్గెర భూమేశ్వర్‌, నాగం పోశన్న, ఎంపిటిసి పాపాయి పవన్‌లు అన్నారు. శనివారం మోర్తాడ్‌ మండల కార్యాలయ ఆవరణలో పశు సంవర్ధకశాఖ పశువైద్యాదికారి గంగాధర్‌ ఏర్పాటు చేసిన పశువుల దాణ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి దాణ పంపిణీ చేశారు. అనంతరం ...

Read More »

మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలు వేగవంతం చేయాలి

  మోర్తాడ్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంతల నిర్మాణం పనులను వేగవంతం చేసి ఈనెల 20లోపు పూర్తిచేయాలని ఆర్మూర్‌ హౌజింగ్‌ ఎ.ఇ. సూపర్‌వైజర్‌ గోపాల్‌శర్మ కోరారు. శనివారం మండలంలోని పాలెం, తొర్తి గ్రామాలను సందర్శించి మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలతో మాట్లాడుతూ మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలు నాణ్యతతో చేపట్టాలని సకాలంలో పూర్తయ్యేలా అంగన్‌వాడి, స్వయం సహాయక గ్రూపు మహిళల సహకారాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అనిత, ...

Read More »

5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం

  నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు పర్యావరణ ఇంజనీర్‌ రవికుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 5న ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌ వద్ద జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తారని తెలిపారు. గ్రీన్‌ ర్యాలీ కలెక్టరేట్‌ నుంచి నెహ్రూ పార్కు మీదుగా బాల్‌భవన్‌కు చేరుకుంటుందని, పర్యావరణ ప్రేమికులు, ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్చంద ...

Read More »

యోగ శిక్షకులకు శిక్షణ

  నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శిక్షకులకు ఈనెల 5వ తేదీన శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా యోగ సంఘం అధ్యక్షుడు రాచందర్‌ తెలిపారు. నిజామాబాద్‌ సుభాష్‌నగర్‌లోని దయానంద యోగా కేంద్రంలో 5న ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శిక్షణ అందించే శిక్షకులు ఈ శిక్షణ శిబిరానికి తప్పకుండా సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.

Read More »

రైతుల్లో ఆశలు నింపిన వర్షం

  బాన్సువాడ, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ప్రాంతంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షం రైతుల్లో హర్షం నింపింది. ఇప్పటివరకు వేసవితో తల్లడిల్లుతున్న జనజీవనానికి సైతం ఈ వర్షం ఆహ్లాదానిచ్చింది. వర్షాకాలానికి ముందే తొలకరి పలకరించడం ఖరీఫ్‌ సాగుపై రైతుల్లో ఆశలు నింపింది. శనివారం సాయంత్రం ఈదురుగాలులతో, ఉరుములతో కూడి ఓ మోస్తరుపై వర్షం కురిసింది. ఖరీఫ్‌ సీజన్‌ ఆసన్నమవుతుండడంతో రైతులు సాగుకు సన్నద్దమవుతున్నారు. ఈ సమయంలోవర్షం కురియడం దుక్కులు దున్నడానికి అనుకూలిస్తుంది. రైతులు ఎన్నో రోజులుగా వర్షం ...

Read More »

డుకాటీ సూపర్‌బైక్‌.. రూ. 14.37లక్షలు

ముంబయి: భారత మార్కెట్లోకి మరో సూపర్‌బైక్‌ వచ్చేసింది. ప్రముఖ బైక్‌ల తయారీ సంస్థ డుకాటీ నుంచి 959 పానిగలే సూపర్‌బైక్‌ విడుదలైంది. దీని ధర రూ. 14.37లక్షలు(ముంబయి ఎక్స్‌షోరూం). బాంద్రాలోని డుకాటీ డీలర్‌షిప్‌లో ఈ బైక్‌ అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఇండియా బైక్‌వీక్‌లో ఈ బైక్‌ను ఆవిష్కరించారు. టేల్‌పీస్‌ డిజైన్‌తో రూపొందించిన 959 పానిగలే బైక్‌లో ఎల్‌-ట్విన్‌ మోటార్‌, డుకాటీ ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఇంజిన్‌ బ్రేక్‌ కంట్రోల్‌ తదితర అధునాతన ఫీచర్లున్నాయి.

Read More »

రంజాన్ పని సమయాల ప్రకటన

మనామా : ప్రధాని శ్రీ శ్రీ  ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా శుక్రవారం  రంజాన్ అధికారిక పని సమయాలను  ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు. వృత్తాకార, మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ శాఖలు , ప్రభుత్వ రంగ సంస్థలు  ప్రకారం  ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రకారం ప్రారంభించ పోతోంది.

Read More »

కువైట్‌లో శుక్రవారం దుకాణాలు బంద్!

కువైట్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం ప్రార్థనల సమయంలో వ్యాపార లావాదేవీలను నిషేధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆరోజున పెద్ద ఎత్తున నిర్వహించే ప్రార్థనలకు దుకాణాలు తెరిచి ఉండడం వల్ల ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదను ఫత్వా అండ్ లెజిస్లేషన్ డిపార్ట్‌మెంట్‌కు పంపించింది. ప్రతిపాదన కనుక ఆమోదం పొందితే వచ్చే శుక్రవారం నుంచే దుకాణాలపై నిషేధం అమల్లోకి వస్తుంది. ఎవరైనా నిషేధాన్ని ఉల్లంఘించి దుకాణాలు తెరిచి లావాదేవీలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. 1000 కేడీ(కువైట్ దినార్లు) ...

Read More »

గర్ల్ఫ్రెండ్ మీద పెట్టిన ఖర్చుల కోసం..

మాస్కో: రష్యాలో ఓ యువతికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ లాయర్ను ప్రేమించిన పాపానికి కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఏ అమ్మాయికీ ఇలాంటి పరిస్థితి ఎదురుకావద్దని కోరుకుంటున్న సదరు యువతి వివరాల్లోకి వెళ్తే.. రష్యాలోని క్రాస్నోయార్క్ప్కు ప్రాంతానికి చెందిన జుర్స్కోయా.. ఓ యువ లాయర్తో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలో అతనిపై మనసు పారేసుకున్న జుర్స్కోయా.. లాయర్తో కలిసి విహారయాత్రకు క్రిమియాకు వెళ్లింది. అయితే ఆ విహారయాత్రలో యువ లాయర్ తనకు ప్రపోజ్ చేస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె.. చివరికి అతను ప్రపోజ్ ...

Read More »

సూర్యరశ్మిని ద్రవ ఇంధనంగా మార్చే ఆకు

బోస్టన్‌: ఓవైపు ఇంధన వినియోగం విపరీతంగా పెరిగిపోతుండగా.. మరోవైపు సహజ ఇంధన వనరులు క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిశోధకులు ప్రత్యామ్నాయ వనరులవైపు దృష్టిసారించారు. ఇందులో భాగంగా.. హార్వర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ కృత్రిమ ఆకును అభివృద్ధి చేశారు. ఈ కృత్రిమ ఆకు సాయంతో సూర్యరశ్మిని ద్రవ ఇంధనంగా మార్చవచ్చని ప్రొఫెసర్‌ డేనియల్‌ నొకెరా తెలిపారు. నీటిలోని అణువులను, హైడ్రోజన్‌ను ఆహారంగా స్వీకరించే బ్యాక్టీరియాను ఈ ఆకు వేరుచేస్తుందని చెప్పారు. బయోనిక్‌ లీఫ్‌ 2.0గా వ్యవహరిస్తున్న ఈ ఆకుతో ప్రయోజనాలు కూడా ఉన్నాయని ప్రొఫెసర్‌ పమేలా ...

Read More »

జ‌గ‌న్ దిష్టిబొమ్మ త‌గ‌ుల‌బెట్ట‌బోతే… త‌నకే అంటుకుంది… పాపం తెదేపా కార్పొరేటర్

విజ‌య‌వాడ‌: ప‌్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ దిష్టిబొమ్మ త‌గ‌ుల‌బెట్ట‌బోయిన తెలుగు త‌మ్ముళ్ల‌కు విషాదం మిగిలింది. విజ‌య‌వాడలో ఒక కార్పొరేట‌ర్ ఒళ్ళు కాలి ఆసుప‌త్రి పాల‌య్యాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్‌ వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో తెలుగు తమ్ముళ్లు చేపట్టిన నిరసన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రి సెంటర్‌ వద్ద తెదేపా నేత గన్నె ప్రసాద్‌ నేతృత్వంలో కొందరు టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తెదేపా కార్పోరేటర్‌ జాస్తి సాంబశివరావు దుస్తులపై పెట్రోల్‌ పడి ...

Read More »

కొన్ని హోటల్స్‌లో మీకు తెలియకుండా ఏమేం జరుగుతాయో తెలుసా?

సాధారణంగా పర్యాటకం కోసమో లేదా బిజినెస్‌ ట్రిప్‌ కోసమో వేరే ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చినపుడు అందరూ హోటల్స్‌కు వెళ్తారు. అక్కడ లభించే సాదర స్వాగతం, విపరీతమైన గౌరవ మర్యాదలు, ఆహ్లాదకరమైన వాతావరణం మనసుని కట్టిపడేస్తాయి. ఇక అక్కడ ఉండే హోటల్‌ సిబ్బంది ప్రదర్శించే వినయ విధేయతలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. అయితే ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. హోటల్‌ సిబ్బంది రహస్యంగా ఎలా ప్రవర్తిస్తారో మాత్రం ఎవరికీ తెలియదు. అది తెలుసుకుంటే మాత్రం ఇక హోటల్‌కు వెళ్లాలనిపించదు. ఈ విషయాలని స్వయంగా హోటల్‌ ...

Read More »

ఏడు జిల్లాల్లో జోరువాన

-ఉరుములు, మెరుపులకు తోడైన బలమైన ఈదురుగాలులు -నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు.. నిలిచిన కరెంట్ సరఫరా -విరిగిపోయిన హోర్డింగ్స్, ఎగిరిపోయిన ఇండ్ల పైకప్పులు -కరీంనగర్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం ఉదయమంతా భానుడి భగభగలు.. సాయంత్రానికి వరుణుడి జల్లులతో రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం నెలకొన్నది. పగలు ఎండలు ఎంత తీవ్రంగా ఉంటున్నాయో.. సాయంత్రానికి అంతే తీవ్రతతో ఉరుములు, మెరుపులు బలమై న ఈదురుగాలులతో పిడుగులవాన కురుస్తున్నది. శుక్రవారం హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా ల్లో జడివాన కురియగా మిగతాచోట్ల ...

Read More »