Breaking News

Daily Archives: June 7, 2016

జడ్పి ఛైర్మన్‌, ఎమ్మెల్యేకు ఘన సన్మానం

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎస్సీ కమిటీ ఛైర్మన్‌గా నియామకమైన జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండేను స్థానిక అదికారులు, ప్రజాప్రతినిదులు ఘనంగా సన్మానించారు. మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు హైమద్‌ హుస్సేన్‌ ఇచ్చిన విందుకు ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పరిషత్‌ ఆద్వర్యంలో ఎంపిడివో రాములు నాయక్‌ తదితరులు ఘనంగా సన్మానించారు. ఎస్సీ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన ఎమ్మెల్యేకు స్తానిక ప్రజాప్రతినిదులు అభినందనలు తెలిపారు. ...

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల పరిష్కారానికి విఆర్‌ఏలు కృషి చేయాలని స్థానిక తహసీల్దార్‌ సయ్యద్‌ హైమద్‌ మస్రుర్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన విఆర్‌ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. విఆర్‌ఏలు స్థానికంగా ఉంటూ అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉంటూ రెవెన్యూ కార్యకలాపాలను చూసుకోవాలన్నారు. గ్రామాల్లో పన్నుల వసూలుతోపాటు చెరువులు, కుంటల ...

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరం

  బీర్కూర్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బీర్కూర్‌ గ్రామంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బీర్కూర్‌ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో కంటి సంబంధిత వ్యాదులు కలవారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపినీ చేశారు. మోతిబిందు గలవారికి బోధన్‌, నిజామాబాద్‌ లయన్స్‌ కంటి ఆసుపత్రులకు రిఫర్‌ చేశారు. మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు మండల ప్రజలు ఈ అవకాశాన్ని ...

Read More »

మహిళా సంఘాలు బలోపేతం కావాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ మహిళా సంఘాలు మరింత బలోపేతం కావాలని ఎపిఎం నారాయణగౌడ్‌ అన్నారు. మండలంలోని వెలగనూరు, గున్గుల్‌ గ్రామాల్లో గ్రామసంఘాల మహాజనసభలో ఆయన మాట్లాడారు. బ్యాంకు లింకేజీ రుణాలతో పాటు పావలా వడ్డి రుణాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని సూచించారు. ఈ సమావేశంలో వెలగనూరు గ్రామ సర్పంచ్‌ ఆనంద్‌కుమార్‌, ఐకెపి సిసిలు విఘ్నేశ్వర్‌గౌడ్‌, శ్రీకాంత్‌ తదితరులున్నారు.

Read More »

మద్యం సేవించి వాహనాలు నడపరాదు

  బీర్కూర్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వాహనదారులు మద్యంసేవించి వాహనాలు నడపరాదని ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారులకు, ప్రయాణీకులకు ప్రమాదాలు జరిగే అవకాశముందని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానా, జైలుశిక్ష తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కుటుంబ పెద్ద కోల్పోతే వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురవుతారని అది దృష్టిలో పెట్టుకొని వాహనాలు నడపాలని సూచించారు.

Read More »

బీర్కూర్‌ మండలాన్ని నిజామాబాద్‌ జిల్లాలోనే ఉంచాలి

  బీర్కూర్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎం కెసిఆర్‌ నూతన జిల్లాల ఏర్పాటు సందర్భంగా బీర్కూర్‌ మండలాన్ని నిజామాబాద్‌ జిల్లా నుంచి వేరుచేస్తారన్న ఊహాగానాలతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని అంకోల్‌ గ్రామ ప్రధాన రహదారిపై గ్రామస్తులు నిజామాబాద్‌ జిల్లాలో బీర్కూర్‌ మండలాన్నిఉంచాలంటూ ధర్నా నిర్వహించి రాస్తారోకో చేశారు. తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన బూటకపు హామీలకు అనుగుణంగా నూతన జిల్లాలు ఏర్పాటుచేస్తుందని, బీర్కూర్‌ మండలాన్ని కామారెడ్డి జిల్లాలో కలుపుతామన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అదికారులు వెనక్కి తీసుకొని ...

Read More »

ఎమ్మెల్యేను కలిసిన ఏఎంసి ప్రతినిధులు

  కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు కోసం సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులుజారీ చేసిన నేపథ్యంలో మంగళవారం కామారెడ్డి ఏఎంసి వైస్‌ఛైర్మన్‌ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను హైదరాబాద్‌లో కలిశారు. ఏఎంసి ఛైర్మన్‌గా గట్టగోని రాజమణి, వైస్‌ఛైర్మన్‌గా శెనిశెట్టి గౌరీశంకర్‌, సభ్యులుగా లక్ష్మినారాయణ, రాజాగౌడ్‌, షేక్‌ అజీ, గుగులోత్‌ రమేశ్‌నాయక్‌, లక్ష్మినారాయణ, గంగుల నర్సారెడ్డి, లింగం, కె.ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో వైస్‌ ఛైర్మన్‌ గౌరీశంకర్‌తోపాటు పలువురు నాయకులు ఎమ్మెల్యేను హైదరాబాద్‌లోని ...

Read More »

వైభవంగా బోనాల ఊరేగింపు

  కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో మంగళవారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు భక్తిశ్రద్దలతో బోనాలు సమర్పించారు. గ్రామంలోని పోచమ్మ, పెద్దమ్మ, మైసమ్మ గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. అందంగా అలంకరించిన వందబోనాలను మహిళలు నెత్తినెత్తుకొని గ్రామంలో ఊరేగింపునిర్వహించారు. అనంతరం గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి అందరు చల్లగా ఉండాలని, పంటలు బాగా పండాలని ప్రతియేడు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ...

Read More »

15 నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు

  నిజామాబాద్‌ రూరల్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 10వ తరగతి అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు సంయుక్త కలెక్టర్‌ రాజారాం సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం తన చాంబరులో సంబంధిత అధికారులతో 10వ తరగతి అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాటుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షలు ఈనెల 15 నుంచి 29 వరకు జరుగుతాయని, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ...

Read More »

కొనసాగిన న్యాయవాదుల విధుల బహిష్కరణ

  కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంధ్రా న్యాయమూర్తుల తెలంగాణ ఆప్షన్‌ను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ న్యాయవాదులు విదులు రెండోరోజుకూడా బహిష్కరించారు. మంగళవారం విధులు బహిష్కరించి కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్దంగా ఆంధ్రా న్యాయమూర్తులను తెలంగాణలో కేటాయించడం సమంజసం కాదన్నారు. ఆంధ్రా న్యాయమూర్తులను ఆప్షన్‌ ప్రకారం కేటాయింపు జరిపితే వారి 2042 వరకు ఇక్కడే విదుల్లో ఉంటారన్నారు. అది సమంజసం కాదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం ...

Read More »

రెండోరోజు ఎఎన్‌ఎంల సమ్మె

  మోర్తాడ్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని సంవత్సరాలుగా ఏఎన్‌ఎంలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికి తమకు రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించడం లేదని రెండోరోజు మండల ఏఎన్‌ఎంలు మోర్తాడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమ్మె కొనసాగించారు. తమను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించి అమలు చేయాలని, పిఆర్‌సితో కూడిన వేతనాన్ని, టిఎ, డిఎలను అందించి తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Read More »

ప్రతిభ గల విద్యార్థులు ప్రోత్సాహకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలి

  మోర్తాడ్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో 7, 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు పిజి, డిగ్రీ, ఇంటర్‌, 7వ.10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తిమ్మాపూర్‌ గ్రామాభివృద్ది కమిటీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అధ్యక్ష, ఉపాధ్యక్షులు రాములు, బుచ్చయ్యలు తెలిపారు. ఈనెల 12వ తేదీ లోపు ఉత్తమ ర్యాంకులు సాధించిన తిమ్మాపూర్‌ విద్యార్థులు మార్కుల జాబితా జిరాక్సు కాపీలతో రిటైర్డ్‌ కండక్టర్‌ రాజేశ్వర్‌కు అందజేయాలని ఆయన కోరారు.

Read More »

అతివేగంగా వాహనాలు నడపవద్దు

  మోర్తాడ్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ గ్రామ ప్రజలను దృస్టిలో పెట్టుకొని మిషన్‌ భగీరథ వైస్‌ ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కోటిపై చిలుకు నిధులతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నూతనంగా బిటి రోడ్లు నిర్మించాలని ఎంపిటిసి ఎమ్మాజి మురళీగౌడ్‌ అన్నారు. మంగళవారం జరిగిన మోర్తాడ్‌ గ్రామసభలో ఆయన మాట్లాడారు. కొత్త బిటిరోడ్లపై ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు గ్రామంలో 20-30 కి.మీ. వేగంతో వెళ్లాలని, అతివేగంగా వాహనాలు నడపవద్దని ...

Read More »

గ్రామాభివృద్దికి కృషి చేస్తా

  మోర్తాడ్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ గ్రామ అభివృద్దికి కృషి చేస్తానని సర్పంచ్‌ దడివె నవీన్‌ అన్నారు. మంగళవారం మోర్తాడ్‌ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ గ్రామసభలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను గ్రామస్తులకు చదివి కార్యదర్శి మాజిద్‌ వివరించారు. గ్రామంలోని సమస్యలను, చేపట్టే అభివృద్ది పనులకు గ్రామస్తుల కోరిక మేరకు తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. సర్పంచ్‌ మాట్లాడుతూ మిషన్‌ భగీరథ వైస్‌ ఛైర్మన్‌, ...

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

  మోర్తాడ్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పిఆర్‌సిలు, ప్రధానోపాధ్యాయులు పెంపొందించాలని డిఇవో లింగయ్య అన్నారు. మంగళవారం మోర్తాడ్‌ మండల విద్యావనరుల కేంద్రాన్ని సందర్శించి సిఆర్‌పిలతో సమావేశమయ్యారు. జీరో సంఖ్యలోగల పాఠశాలల్లో కనీసం 20 మంది విద్యార్థులు అబ్యసించేలా సిఆర్‌పిలు, ప్రధానోపాధ్యాయులు చూడాలన్నారు. బడిబాట కార్యక్రమాన్ని షెడ్యూల్‌ ప్రకారం గ్రామాల్లో ర్యాలీలు, ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ...

Read More »

రెండేళ్లలో ప్రభుత్వం చేసిందేమీ లేదు

ప్రజల ఉద్యమ ఆకాంక్షలు నెరవేరట్లేదు రెండేళ్లుగా వేచి చూస్తున్నాం ఇకపై గట్టిగా ఒత్తిడి తేవాలి ప్రజల సంక్షేమమే ఎజెండా వారి కోసం, వారి బాగు కోసమే పోరాటం కోదండరామ్‌ ఉద్ఘాటన హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా తెలంగాణ కోసం ఏమీ చేయలేకపోయిందని, ప్రజలు ఆకాంక్షించిన పథకాలను అమలు చేయలేకపోయిందని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. అయితే.. నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా 60ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు కొద్దిమేర వాటిపై అధికారం దక్కిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ...

Read More »

కువైట్‌లో ‘ఎమర్జెన్సీ లేన్స్’ వినియోగ వేళల్లో మార్పు

కువైట్: పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎడమవైపు ఎమర్జెన్సీ లేన్స్‌ను వాహనదారులు ఉపయోగించుకునే వేళలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సర్దుబాటు చేసింది. కింగ్ అబ్దుల్ అజీజ్ హైవేలో ఆరు నుంచి మూడు రింగ్ రోడ్లు, కింగ్ ఫహద్ హైవేలో ఆరు నుంచి మొదటి రింగ్ రోడ్లు, కింగ్‌ఫైసల్ రోడ్డులో ఆరు నుంచి నాలుగు రింగ్ రోడ్ల‌ను వినియోగించుకోవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖలోని రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అదెల్ ...

Read More »

పంది శరీరంలో అవయవాల పంట

వాషింగ్టన్‌, : అవయవమార్పిడికి అవసరమైన అవయవాలు, దాతలు దొరక్క ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది మరణిస్తున్నారు. దీనికి పరిష్కారమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు ప్రపంచంలోని పలుదేశాల శాస్త్రజ్ఞులు చాలాకాలంగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. తాజగా అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, డేవిస్‌ శాస్త్రవేత్తలు దీనికి ఓ పరిష్కారంతో ముందుకొచ్చారు. అదే.. పంది శరీరంలో మానవ అవయవాలను పెంచడం. ఈ ప్రయోగంలో భాగంగా వారు పంది డీఎన్‌ఏ నుంచి పాంక్రియాస్‌ తయారీకి ఉపయోగపడే కణాలను తీసేశారు. ఆ ఖాళీలోకి మానవ మూలకణాలను ...

Read More »

స్నేహ వారధి!

అమెరికాలో మూడురోజుల పర్యటన ఆరంభానికి ముందు భారతప్రధాని తన ఐదుదేశాల యాత్రలో ఇప్పటికే మూడింటిని పూర్తిచేశారు. ఈ పర్యటనలో ఒబామాతో భేటీ ఎంత ప్రధానమైనదో, ఆఖరు నిముషంలో వచ్చి చేరిన స్విట్జర్లాండ్‌, మెక్సికోలతో వ్యవహారం కూడా అంతే ప్రధానమైనది. స్విట్జర్లాండ్‌ వ్యాపారవేత్తలను భారత్ లో పెట్టుబడులకు ఆహ్వానించడం, నల్లధనం, పన్ను ఎగవేతలు ఇత్యాది అంశాలపై సమష్టి పోరాటానికి సంకల్పించడం వంటివి అటుంచితే, ఏ లక్ష్యంతో ప్రధాని ఈ దేశంలో కాలుమోపారో అది ఇప్పటికే నెరవేరింది. ‘న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌’(ఎనఎ్‌సజీ)లో భారత సభ్యత్వానికి తాను మద్దతు ...

Read More »

కువైట్ వలసదారులకు ‘కోటా’ విధానం!

కువైట్: దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుని కువైట్‌లోని వలసదారులకు కోటా విధానం అమలు చేయాలని ప్రణాళిక శాఖ ప్రభుత్వాన్ని కోరింది. తద్వారా ప్రతీ కమ్యూనిటీకి చెందిన కచ్చితమైన గణాంకాలు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు స్థానిక దినపత్రిక పేర్కొంది. ఇలా చేయడం వల్ల దేశ జనాభాను రక్షించే అవకాశం ఉంటుందని తెలిపింది. కొన్ని దేశాలకు చెందిన వలసదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో కోటా విధానం అవసరమని భావిస్తున్నట్టు పేర్కొంది. కువైట్ లేబర్ మార్కెట్లో అవసరాన్ని భర్తీ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.

Read More »