Breaking News

Daily Archives: June 8, 2016

మైండ్ రేప్

చెవిలో దూది పెట్టుకుని, చెవులు గట్టిగా మూసుకోబుద్ధేస్తోంది! అలా చేస్తే కొందరి మాటలు వినడవు. కానీ ఈ మహానుభావులకు లౌడ్ స్పీకర్లు పెట్టుకోవడానికి పోలీసు పర్మిషన్ కూడా దొరుకుతుంది. ప్రజా ప్రతినిధులూ… ప్రజా సేవకులూ మరి! ఎక్కడైనా దోషిని దుర్భాషలాడాలి కానీ… బాధితులను నిందిస్తామా? జీన్స్ తొడుక్కోవడం వల్ల, కురచబట్టలు వేసుకోవడం వల్ల… రాత్రి పూట తిరిగినందుకో, పదహారేళ్లకే పెళ్లి చేయనందుకో… రేపులు జరుగుతున్నాయట! వీళ్లది నోరా? మురిక్కాలువా? రేప్ తర్వాత రేప్ లాంటిది ఇది. మహిళలపై చిన్నచూపు కలిగేలా పురుషాధిక్య సమాజం ఆడుతున్న ...

Read More »

పూజారి తల నరికిన ఐఎస్‌

బంగ్లాదేశ్‌లో ఐదు నెలల్లో ఇది రెండోసారి మైనారిటీలు, సెక్యులర్లపై పెరుగుతున్న దాడులు ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. జినైగా జిల్లా నోల్డంగా గ్రామంలో ఆనంద్‌ గోపాల్‌ గంగూలీ (70) అనే పూజారిని దారుణంగా హత్య చేశారు. మంగళవారం ఉదయం మోటార్‌ సైకిల్‌పై గంగూలీ గుడికి వెళ్తుండగా… మోటార్‌ సైకిళ్లపైనే అతడిని అనుచరించిన ముగ్గురు ఐఎస్‌ ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరిపారు. అనంతరం, గంగూలీ చనిపోయాడని నిర్ధారించుకునేందుకు కత్తులతో తల నరికారు. పూజారి ఇంటికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ముస్లింలు ...

Read More »

తూంపల్లి అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యం

సిరికొండ : మండలంలోని తూంపల్లి గ్రామ పరిధిలోని పులుసుమామిడి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాం లభ్యమైయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మేకల కాపరి అటవీ ప్రాంతంలో మేకలను మేపడానికి వెళ్లడంతో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనబడంతో వెంటనే స్థానికులకు సమాచారం అందించాడు. సర్పంచి బుసా దేవరాజు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భీమ్‌గల్ సీఐ రమణారెడ్డి ,ఎస్సై ఉపేందర్ రావు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పద ...

Read More »

భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు

సిటీబ్యూరో : రంజాన్ మాసం అనుకున్న దానికంటే ఒక రోజు ముందు ప్రారంభంకావడంతో ముస్లింలు ఆనందోత్సవాలతో సోమవారం ఉపవాస దీక్ష పూర్తి చేశారు. చారిత్రక మక్కా, రాయల్ మసీదుతోపాటు నగరంలోని అన్ని మసీదుల్లో నిర్వహణ కమిటీలు, పలు ధార్మిక సంస్థలు ఇఫ్తార్ ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలు కొనసాగించిన ముస్లింలు అనంతరం సాయంత్రం బంధువులు, స్నేహితులు ఇచ్చే ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మక్కా మసీదులో సామూహిక ప్రార్థనలు చేశారు.

Read More »

అన్ని విధాలా సాయం చేస్తాం

-ఎన్‌పీఏలను పరిష్కరించుకోగలిగేలా పీఎస్‌బీల సాధికారత పెంచుతాం.. -అవసరమైతే ఈసారి అదనపు నిధులు కేటాయిస్తాం -ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ న్యూఢిల్లీ: మొండి బకాయిల సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు(పీఎస్‌బీ) అన్ని విధాలా సాయం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. వాణిజ్యపరంగా నష్టానికి తావులేకుండా సమస్యను జాగ్రత్తగా పరిష్కరించుకునేలా బ్యాంకుల సాధికారతను పెంచడంతోపాటు ఈ ప్రక్రియలో భాగంగా తీసుకునే నిర్ణయాల విషయంలో రక్షణ కల్పిస్తామన్నారు.మొండి బకాయిలు లేదా నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) గండి పూడ్చుకునేందుకు ...

Read More »

అక్కడ గాలి అమ్మబడును

ప్రపంచంలో ఎలాక్ట్రానిక్ వస్తువుల తయారీ రంగంలో చైనా ముందుంది. కానీ, అక్కడి వాతావరణ కాలుష్యం ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తోంది. పారిశ్రామికీకరణ విపరీతంగా పెరగడంతో గాలంతా కలుషితమైపోయింది. దీంతో చైనా ప్రభుత్వం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కావలసిన పథకాలు రూపొందిస్తోందట. ఇదే సమయంలో వాతావరణ కాలుష్యాన్ని తప్పించుకోవడానికి పరిశుద్ధమైన గాలిని డబ్బాలలో నింపి అమ్ముతున్నారు. అక్కడి ప్రజలు ఇప్పుడు పాపం…గాలికోసం ఎక్కువగా ఖర్చుపెడుతున్నారట మరి!

Read More »

ఇస్తాంబుల్‌లో బాంబుపేలుడు

-ఏడుగురు పోలీస్ అధికారులు సహా 11 మంది మృతి ఇస్తాంబుల్: టర్కీ ప్రధాన నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్‌లో జరిగిన బాంబుదాడిలో 11 మంది మరణించారు. టర్కీ పోలీస్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మంగళవారం ఇస్తాంబుల్ హిస్టారిక్ సెంటర్ సమీపాన బాంబు పేలుడు సంభవించింది. దీంతో ఏడుగురు పోలీస్ అధికారులు, నలుగురు పౌరులు మృత్యువాత పడ్డారు. మరో 36 మంది గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సాహిన్ చెప్పారు. సెంట్రల్ బెయాజిత్ జిల్లా నుంచి నగరానికి వస్తున్న పోలీసు ...

Read More »

మొబైల్ ఫోన్స్ ప్రాణాలను కాపాడాయి!

మొబైల్ ఫోన్స్ ఉండటంతో పలువురు విద్యార్థులు ప్రాణాలతో బయటపడగలిగారు. ఈ ఘటన లండన్ ఉత్తర ప్రాంతంలోని స్టామ్‌ఫోర్డ్ హిల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 34 మంది యూదు యువత విహార యాత్రకని సెయింట్ మార్గరెట్‌ఖాతానికి వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో వారంతా బీచ్‌లో ఉండగా భారీగా వచ్చిన ఓ అల వారిని చెల్లాచెదురు చేసింది. అదేసమయంలో సమీపంలోని ఓ కొండ ప్రాంతం నుంచి రాళ్లు విరిగిపడ్డాయి. దీంతో వారంతా తమ మార్గాన్ని తప్పి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారు. అయితే వారి దగ్గరున్న ...

Read More »

కోదండరాం నీకిది తగునా?

-రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించటంలేదా? -దిగిపొమ్మనడానికి ఎన్నికల్లో మాతో కలిసి పనిచేశారా? -గత పాలకుల నిర్ణయాలవల్లే రైతుల ఆత్మహత్యలు -ధ్వజమెత్తిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి నాయిని -మేధావులు సలహాలు, సూచనలివ్వకుండా విమర్శలు చేయడం విడ్డూరం -ప్రొఫెసర్‌పై డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రుల ధ్వజం హైదరాబాద్ : ఉద్యమపోరుతో సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పరుచుకుంటున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ సర్కారుపై ప్రొఫెసర్ కోదండరాం విమర్శలు చేయడం తగదని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ...

Read More »

తాడిసెట్టును వంగవెట్టాలె!

మొత్తానికి విద్యావంతుల వేదిక కడుపులో ఉన్నదంతా కక్కేసింది. కొంత వికృతంగా.. కొంత సకృతంగా.. మరి కొంత అవహేళనాత్మక హావభావాల మధ్య ఎపిసోడ్ ముగించింది. సరే.. వేదిక మీద ఎవరెవరున్నారు? వాళ్ల ఆలోచనలేమిటి? చరిత్రలేమిటి? ప్రభుత్వం లేదా టీఆర్‌ఎస్ పార్టీతో వాళ్ల వ్యవహార లావాదేవీలేమిటి అనేది ఇవాళ కొత్తగా తెలుసుకునేదేమీ లేదు కనుక; మూల్యాంకనం పేరి ట జరిగిన సదరు సమావేశం ఏం తేల్చుతుంది అనే ది అనూహ్యమేం కాదు. వాళ్ల విమర్శలు ఇవాళ కొత్త గా వినిపిస్తున్నవీ కాదు.. ఎటొచ్చీ ప్రధాన ప్రసంగీకుడు వల్లించిన ...

Read More »

చల్లని కబురురేపు కేరళకు నైరుతి

-ఎనిమిది రోజుల్లో రాష్ర్టానికి రుతుపవనాలు! -48 గంటల్లో తమిళనాడుకు భారీ వర్ష సూచన -భారత వాతావరణ విభాగంబులెటిన్ విడుదల -రెండురోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు -హైదరాబాద్ వాతావరణశాఖ డైరెక్టర్ వైకే రెడ్డి వెల్లడి హైదరాబాద్:కొద్ది రోజులుగా ఊరిస్తున్న నైరుతి రుతుపవనాలు గురువారం కేరళ తీరం తాకనున్నాయి. తదుపరి ఎనిమిది రోజుల్లో తెలంగాణలోనూ ప్రవేశించనున్నాయి. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాష్ట్రంపై ఏర్పడిన ద్రోణి కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి ...

Read More »

చేపల మార్కెట్‌లో సందడి

బోధన్‌: మృగశిరకార్తే రోజు చేపలు తినాలనే సంప్రదాయం నేపథ్యంలో మంగళవారం బోధన్‌ చేపల మార్కెట్‌లో కొనుగోలుదారుల కోలాహలం కనబడింది. ఉదయం 10 గంటల నుంచి అమ్మకాలు కొనసాగాయి. ఆచన్‌పల్లి బైపాస్‌, సాత్‌పూల్‌, వారాంతపు సంత, శక్కర్‌నగర్‌లో ప్రజలు చేపల కొనుగోలుకు ఎగబడ్డారు. మంగళవారం పట్టణంలో వ్యాపారులు వారాంతపు సెలవు పాటిస్తారు. దుకాణాలు మూసి ఉండగా చేపల మార్కెట్‌ వద్ద ద్విచక్రవాహనాలు కిక్కిరిసి కనబడ్డాయి. ఒక్క రోజు సుమారు వెయ్యి కిలోల (టన్ను) చేపల అమ్మకాలు జరిగినట్టు అంచనా. రూ. 3 లక్షల విలువ చేపలను ...

Read More »

పంపిణీ చేసిన స్థలాలు కొనుగోలు చేస్తే కేసులు: మంత్రి

బాన్సువాడ పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారిపై కేసులు పెట్టిస్తామని, విక్రయించిన వారి పట్టాను రద్దు చేస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం బాన్సువాడ తహసీల్లారు కార్యాలయం సమీపంలో తాడ్కోల్‌ శివారులో ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాన్సువాడ పట్టణంలో ఇప్పటికే వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినా అర్హులకు దక్కకపోవడం బాధాకరమన్నారు. కొంతమంది నాయకులు అక్రమాలకు పాల్పడటంతోనే అర్హులకు అన్యాయం ...

Read More »

ఏటీఎంలో అగ్నిప్రమాదం

ఆలూర్‌ (పెర్కిట్‌) : ఆర్మూర్‌ మండలం ఆలూర్‌లోని సిండికేట్‌ బ్యాంకు ఏటీఎంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఏటీఎం కేంద్రం ఉంచి పొగలు రావడం గమనించిన స్థానికులు బ్యాంకు మేనేజర్‌ సత్యనారాయణకు సమాచారం ఇచ్చారు. స్థానికులు నీళ్లతో మంటలు ఆర్పారు. అగ్నిమాపక శకటం వచ్చి మంటలు పూర్తిగా ఆర్పివేసింది. ఈ సంఘటనలో ఏటీఎం కేంద్రంలో రూ. 4 లక్షల ఆస్తినష్టం వాటిళ్లినట్లు బ్యాంకు మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే మంటలు లేచి ఉంటాయని భావిస్తున్నారు.

Read More »

ప్రజా ధనానికి లెక్కేది!

బోధన్‌ పట్టణం : మున్సిపల్‌ కమిషనర్లు దయ చేసి అడ్వాన్సుల విధానానికి స్వస్తి పలకాలి. అత్యవసరమైతే తప్పితే అడ్వాన్సుల జోలికి వెళ్లొద్దు. ఇదీ పురపాలక శాఖలో ఉన్నతాధికారులు తరచూ కమిషనర్లకు చెప్పే హితవు. ఇందుకు ఒక కారణం ఉంది. అడ్వాన్సుల పేరిట నిధుల దుర్వినియోగానికి ఆస్కారమెక్కువని పలు సందర్భాల్లో రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో వెలుగు చూసిన అవతవకలు ఒక కారణం. పైగా ఉద్యోగులకు సైతం అడ్వాన్సుల విధానంతో చిక్కులు తప్పవన్నది మరో కారణం. బోధన్‌ మున్సిపాలిటీలో మాత్రం అవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ...

Read More »

కోదండరాం ఉద్యమాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పాటు

ఇందూరు: తెలంగాణ ఉద్యమంలో భాగంగా గ్రామస్థాయి నుంచి ఐకాసల నిర్మాణం చేసిన ఐకాస ఛైర్మన్‌, ప్రొఫెసర్‌ కోదండరాం మిలియన్‌ మార్చ్‌, సాగరహారం, సకల జనుల సమ్మె పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైందని విద్యార్థి ఐకాస ప్రతినిధి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మంగళవారం ఆర్‌అండ్‌బీ విశ్రాంత భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ద్రోహులైన ప్రస్తుతం మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు ఏ పోరాటం చేస్తే ఈ పదవులు కట్టబెట్టారో ప్రజలకు కేసీఆర్‌ సమాధానం ...

Read More »

ఆంధ్ర న్యాయమూర్తులు ఆప్షన్లను రద్దు చేసుకోవాలి

నిజామాబాద్‌ న్యాయవిభాగం: ఆంధ్ర న్యాయమూర్తులు తమ ఆప్షన్లను తెలంగాణాలో రద్దు చేసుకోవాలని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఆశా నారాయణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు డప్పుల దండోరా వేసి నిరసన తెలిపారు. ఇందుకు స్పందించిన న్యాయమూర్తులు తమ ఆప్షన్లను మార్చుకుంటామని సానుకూలంగా స్పందించారు. అలాగే ఇక్కడ ఉన్న ఆంధ్ర న్యాయమూర్తులు ఆంధ్రకు ఆప్షన్లు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ న్యాయమూర్తులందరూ తమ ఉద్యమానికి సహకరించాలని కోరారు. తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ విభజన చేపట్టకుంటే కౌన్సిల్‌ సభ్యుల తీరుపై ...

Read More »

భూములను పరిశీలించిన ఆర్డీవో

భిక్కనూరు: భిక్కనూరు మండలం జంగంపల్లిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ‘ఈనాడు’ మీనిలో మంగళవారం ‘అసైన్డ్‌ భూములపై అక్రమార్కుల కన్ను’అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై కామారెడ్డి ఆర్డీవో నగశ్‌ స్పందించారు. జంగంపల్లి శివారులోని పలు భూములను మంగళవారం ఆయన పరిశీలించారు. 208 సర్వే నెంబరులోని కబ్జాదారులకు వెంటనే నోటీసుల జారీ చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్‌ అంజయ్యను ఆదేశించారు. అలాగే జంగంపల్లి శివారులోని మొత్తం ప్రభుత్వ భూమిని ఎవరెవరికి అసైన్డ్‌ కింద కేటాయించారు, ప్రస్తుతం ఆ భూముల్లో ఎవరుంటున్నారు తదితర వివరాలన్నింటితో సాయంత్రంలోపు ...

Read More »