Breaking News

Daily Archives: June 9, 2016

మంజీర టాపర్‌లను అభినందించిన యాజమాన్యం

  కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో కామారెడ్డి మంజీర డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వీరిని గురువారం కళాశాల యాజమాన్యం అభినందించారు. ఆర్ట్స్‌ విభాగంలో కళాశాలకు చెందిన దశరథ్‌ యూనివర్సిటీ టాపర్‌గా నిలిచారు. ఈయనతోపాటు వందకు వంద మార్కులు సాదించిన విద్యార్థులను అభినందించారు. తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీలత టాపర్‌ విద్యార్థులను మెడల్స్‌తో సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ, డైరెక్టర్‌ సురేశ్‌గౌడ్‌, అధ్యాపకులు నర్సింలు, ...

Read More »

వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

  కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పకుండా పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ సూచించారు. గురువారం డిఎస్పీ కార్యాలయంలో వాహనదారులు, ఆటోడ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ అతివేగం ప్రమాదాలకు దారితీస్తుందని, ఓపిక, సహనంతో వాహనాలు నడిపి తమ కుటుంబంతోపాటు ప్రయాణీకులను సురక్షితంగా చేరవేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో నడపవద్దని సూచించారు. సీటు బెల్టులు, హెల్మెట్లు తప్పకుండా ధరించాలని ...

Read More »

ఎమ్మెల్యే చొరవతోనే ఏఎంసి పదవులు

  కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ చొరవ వల్లే తమకు ఏఎంసిలో వివిధ పదవులు లభించాయని ప్రతినిదుల పేర్కొన్నారు. గురువారం కామారెడ్డికి వచ్చిన ఎమ్మెల్యేను ఏఎంసి ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏఎంసి ఉపాధ్యక్షుడు గౌరీశంకర్‌తో పాటు డైరెక్టర్లు, ప్రతినిధులు రాజమణి, లింగం, లక్ష్మినారాయణ, రాజాగౌడ్‌, షేక్‌ అజీజ్‌, రమేశ్‌ నాయక్‌, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా రైతుల శ్రేయస్సు కోసం పాటుపడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Read More »

ఉత్తమ సామాజిక సేవకునికి సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తమ సామాజిక సేవకునికి ఎంపికైన వైద్యుడు పుట్ట మల్లికార్జున్‌ను గురువారం డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యుడు మల్లికార్జున్‌ అఖిల చారిటబుల్‌ ట్రస్టు ద్వారా సేవ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. రానున్నరోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రాంచందర్‌, శ్రీనివాస్‌, ఏ.రాజు, సి.రాజు, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read More »

4వ రోజు న్యాయవాదుల విధుల బహిష్కరణ

  కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంధ్రా జడ్జిలను తెలంగాణకు ఇచ్చిన ఆప్షన్‌కు నిరసనగా జరుగుతున్న న్యాయవాదుల విధుల బహిష్కరణ గురువారం నాటికి 4వ రోజుకు చేరుకుంది. 11న జరిగే లోక్‌ అదాలత్‌ను సైతం బహిష్కరిస్తున్నట్టు న్యాయవాదులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రా న్యాయమూర్తులు తెలంగాణకు ఇచ్చిన ఆప్షన్‌ను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రా జడ్జిలు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ న్యాయమూర్తులను ఇక్కడనియమించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రతినిదులు ...

Read More »

తెరాసలో పలువురి చేరిక

  కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సమక్షంలో గురువారం పలువురు వివిధ పార్టీల నాయకులు తెరాసలో చేరారు. మాజీ మునిసిపల్‌ కౌన్సిలర్‌ పార్శి కాంశెట్టితోపాటు వ్యాపారస్తులు బొమ్మ రమేశ్‌, పార్శి మధు, గౌరిశెట్టి శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, తదితరులు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న కాంశెట్టి తెరాసలో చేరడం అభినందనీయమని ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ అన్నారు. బంగారు తెలంగాణలో పాలుపంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షుడు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, ...

Read More »

రాష్ట్రంలోని 28,400 ఆవాసాలకు తాగునీరు

  – మిషన్‌ కాకతీయ వైస్‌ఛైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి నిజామాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని 28,400 ఆవాసాలకు సురక్షిత తాగునీటిని ఇంటింటికి అందించేందుకు చేపట్టిన పనులు చురుకుగా కొనసాగుతున్నట్టు మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. గురువారం నిజామాబాద్‌ నుంచి సమాచార పౌర సంబంధాల శాఖచే నిర్వహించిన ప్రెస్‌టూర్‌ సందర్భంగా పోచంపాడ్‌ అతిథి గృహంలో మిషన్‌ భగీరథ పనుల గురించి వేముల ప్రశాంత్‌రెడ్డి వివరించారు. దాదాపు 40 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ...

Read More »

గ్రామాల్లో గ్రామజ్యోతి గ్రామసభలు

  మోర్తాడ్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని షెట్పల్లి, గాండ్లపేట్‌, తడపాకల్‌, గుమ్మిర్యాల్‌ గ్రామాల్లో ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో స్థానిక సర్పంచ్‌లు గుర్జాల లింబన్న, రాజేశ్వర్‌, లావణ్య అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కార్యదర్శులు గ్రామాల్లో చేపట్టిన, చేపట్టే అభివృద్ది పనులను చదివి వినిపించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో గ్రామాలను అభివృద్ది చేస్తామని సర్పంచ్‌లు అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చదివించాలి

  బీర్కూర్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లోగల విద్యార్థులను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలంటూ మీర్జాపూర్‌, మైలారం, నసురుల్లాబాద్‌ గ్రామాల్లో ఆయా గ్రామ పెద్దలతో ఉపాధ్యాయులు గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన విద్యార్థులకు చేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు తదితర సామగ్రి అందించడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రయివేటు పాఠశాలల మోజులోపడి సంపాదించిన మొత్తాన్ని ...

Read More »

20 లోపు అభివృద్ది పనులు పూర్తిచేయాలి

  మోర్తాడ్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాల్లో జరుగుతున్న ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం పనులను ఈనెల 20 లోపు పూర్తిచేయాలని ఎంపిడివో శ్రీనివాస్‌ కోరారు. గురువారం రామన్నపేట్‌, దోన్‌పాల్‌, సుంకెట్‌ గ్రామాల్లో ఎంపిడివో అభివృద్ది పనులను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, ఎంపిటిసిలతో సమీక్షించారు. సకాలంలో అభివృద్ది పనులు పూర్తిచేసే మరిన్ని నిధులు మంజూరవుతాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శులు, గ్రామస్తులు తదితరులు ...

Read More »

హెల్మెట్‌ ధరించాలని ప్రతిజ్ఞ

  పెర్కిట్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ గ్రామంలోని ఆర్టీసి బస్టాండ్‌ ఆవరణలో ఆర్మూర్‌ పోలీసులు వాహనాలు తనికీ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన వాహనాల దృవపత్రాలు, లైసెన్సులు, నెంబరు ప్లేట్లు లేనివారికి జరిమానా విధించారు. అనంతరం హెల్మెట్లు ధరించనివారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సిఐ సీతారాం, ఎస్‌ఐ యాకూబ్‌ మాట్లాడుతూ వాహనాల చోదకులకు హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని, లేనిపక్షంలో జరిమానా విదిస్తామని హెచ్చరించారు. అలాగే మద్యంసేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ...

Read More »

ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్యాబోధన

  మోర్తాడ్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన లభిస్తుందని ఎంఇవో రాజేశ్వర్‌, తెలుగు పండితులు గంగాధర్‌ అన్నారు. గురువారం మండలంలోని పాలెం, తడపాకల్‌ గ్రామాల్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలపై, సౌకర్యాలపై అవగాహన కల్పించారు. బడిలో విద్యార్థులను చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు నాణ్యతతో విద్యాబోధన చేస్తారని, ఉచిత వసతులు కల్పించడం జరుగుతుందని వివరించారు. ఇంగ్లీష్‌ మీడియం కూడా ఉందని ఆయా గ్రామాల్లో ...

Read More »

10న గల్ఫ్‌లో ఉద్యోగాల కోసం జాబ్‌మేళా

నిజామాబాద్ అర్బన్ : గల్ఫ్‌లో పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి బయోడెటాతో ఈనెల 10న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని శాంతినగర్‌లో తెలంగాణ ఓవర్‌సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, ఐటీఐ మల్లేపల్లి క్యాంపస్‌లో హాజరుకావాలని బాలికల ఐటీఐ ప్రిన్సిపాల్ రాంమ్మోహన్‌రావు తెలిపారు. అభ్యర్థులు త మ పాస్‌పోర్టుతో సహ ఎస్సెసీ, ఇంటర్, ఐటీఐ సర్టిఫికెట్లు, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలతో హాజరుకావాలన్నారు. మిగతా వివరాలకు 8886882127, 8886882126 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Read More »

రైతన్నా… ఎరువులు, విత్తనాల కొనుగోలు జాగ్రత్త

రైతులు ఖరీఫ్ పంటల సాగుకు సన్నద్ధం అవుతున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో బిజీగా ఉన్నారు. మార్కెట్‌లో నకిలీల బెడద కూడా ఎక్కువగా ఉంది. కర్షకులు అప్రమత్తంగా లేక పోతే మోసపోయే ప్రమాదం ఉంది. అధిక లాభాల కోసం విత్తనాలు, ఎరువుల దుకాణాలు యాజమానులు కొందరు నకిలీ అంటగట్టే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాలు, ఎరువులపై అవగాహన పెంచుకోవాలని మండల వ్యవసాధికారిని భారతి తెలిపారు. కొనుగోళ్లలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి వివరించారు. విత్తనాల కొనుగోళ్లలో… * వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన అధీకృత డీలర్ల ...

Read More »

అ..ఆ మూవీ థియేటర్‌లో పవన్ కళ్యాణ్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన కామెడీ ఎంటర్ టైనర్ అ..ఆ. నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ చిత్రం తెలుగు రాష్ర్టాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇటు మాస్, అటు క్లాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల ఆడియన్స్ ఈ చిత్రంకు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాను చూసి చాలా ఎంజాయ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రావు రమేష్ చెప్పిన డైలాగులు పవన్‌ని ఎంతగానో ఇంప్రెస్ చేసాయని సమాచారం. ...

Read More »

అంతరిక్షంలోకి వెళ్ళనున్న అమీర్‌ఖాన్!

బాలీవుడ్‌ మిస్టర్ పర్‌ఫెక్ట్‌ అమీర్ ఖాన్ తాజాగా సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ప్రశంసలు పొందిన అమీర్ త్వరలో వ్యోమగామి పాత్ర చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తొలి భారతీయ వ్యోమగామి అయిన రాకేశ్‌ శర్మ పాత్రను అమీర్ పోషించబోతున్నాడట. 1984 ఏప్రియల్‌ 3న రష్యాకు చెందిన సోయజ్‌ టి- 11 ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళాడు రాకేశ్‌ శర్మ. ఆయన చేసిన సాహసాన్ని భారతీయులకు కళ్ళకు గట్టినట్టు చూపించాలని అమీర్ తహతహలాడుతన్నాడట. ఒక వేళ ఇదే కనుక ...

Read More »

లావా ఎక్స్‌46′ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల – రూ.7,999

మొబైల్స్ త‌యారీదారు లావా ‘ఎక్స్‌46’ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. రూ.7,999 ధ‌ర‌కు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్య‌మ‌వుతోంది. లావా ఎక్స్‌46 ఫీచ‌ర్లు… 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే 1280 X 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ 1.3 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్ 2 జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్‌, డ్యుయ‌ల్ సిమ్ 8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ ...

Read More »

మ్యాట్రిమోనీలో పరిచయం.. రూ. 5 లక్షలతో పరార్

హైదరాబాద్ : మ్యాట్రీమోనీ సైట్‌లో పరిచయం అయి, ఓ మహిళకు రూ. 5.3 లక్షలు టోకరా వేసిన సైబర్‌చీటర్‌ను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం బేగంపేట్‌కు చెందిన మహిళకు భారత్ మ్యాట్రిమోనీ.కామ్ సైట్‌లో 2013 సెప్టెంబర్ నెలలో తన్మయి గోస్వామి అలియాస్ హేమంత్ గుప్తా అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ట్యాక్స్ కన్సల్టెంట్‌గా పనిచేసే గుప్తా, తాను సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్స్ కమిషనర్‌గా బెంగళూర్‌లో పనిచేస్తున్నానంటూ నమ్మించాడు. వీరిద్దరు వాట్సాప్, వీడియో కాల్స్‌లో మాట్లాడుతూ ...

Read More »

కూతుర్ని సజీవ దహనం చేసిన తల్లి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. 18 ఏళ్ల జీనత్ రఫీక్‌ను ఆమె తల్లే సజీవ దహనం చేసింది. ఈ ఘటన లాహోర్‌లో జరిగింది. కుటుంబ సభ్యుల కోరికకు విరుద్ధంగా ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న కారణంగానే ఆమెను చంపేసినట్లు తెలుస్తున్నది. కొన్ని రోజుల క్రితం తన బాయ్‌ఫ్రెండ్‌తో జీనత్ ఇళ్లు విడిచి వెళ్లిపోయింది. అయితే ఇంట్లోవాళ్లు తన పెళ్లిని అంగీకరిస్తారన్న భావనతో ఆమె మళ్లీ ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి ఇంటికి రాగానే తల్లి పర్‌వీన్ బీబీ తన కొడుకుతో కలిసి జీనత్‌ను ...

Read More »

రేష్మి ‘అంతం’ ట్రైలర్ విడుదల

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్న రేష్మి ఇటీవల ‘అంతం’ అనే చిత్రంలో నటించింది. కెరీర్ తొలినాళ్ళలో చిన్న చిన్న పాత్రలు వేసిన రేష్మి గుంటూర్ టాకీస్ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నా, సినిమా మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక తాజాగా మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ అమ్మడు రెడీ అయింది. జిఎస్‌ఎస్‌పి కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన అంతం అనే చిత్రంలో రేష్మి లీడ్ రోల్ పోషించింది. చరణ్‌దీప్, రేష్మితో స్క్రీన్ ...

Read More »