Breaking News

Daily Archives: June 10, 2016

తెరాసలో పలువురి చేరిక

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సమక్షంలో శుక్రవారం మాచారెడ్డికి చెందిన పలువురు నాయకులు తెరాసలో చేరారు. మాచారెడ్డి జడ్పిటిసి గ్యార లక్ష్మితోపాటు గ్యార సాయిలు, నర్సయ్య, రాజయ్య, రాములు, రాజనర్సు, రమేశ్‌, రవి, రవికుమార్‌లు తెరాసలో చేరినవారిలో ఉన్నారు. రాష్ట్రంలో కెసిఆర్‌ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తెరాసలో చేరుతున్నట్టు నాయకులు తెలిపారు. స్తానిక ఎమ్మెల్యేతో కలిసి అభివృద్దిలో పాలుపంచుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, తెరాస పట్టణ అధ్యక్షుడు ...

Read More »

సిపిఎంలో పలువురి చేరిక

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డులోగల వీరభద్ర యూత్‌ అసోసియేషన్‌ ప్రతినిదులు శుక్రవారం సిపిఎం పార్టీలో చేరారు. సిపిఎం డివిజన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌ వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సిపిఎం పేద, మధ్యతరగతి వారికోసం చేస్తున్న సంక్షేమ పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు అసోసియేషన్‌వారు తెలిపారు. కార్యక్రమంలో బాబు, సంజీవ్‌, వేణు, రాజేశ్‌, సంతోష్‌, ఆనంద్‌, పార్టీ నాయకులు రాజలింగం, మస్తాన్‌, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

వడ్డెర కాలనీ పాఠశాలలో బడిబాట

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఒడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు బడిబాట నినాదాలు పలుకుతూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మైవిలేజ్‌ మాడల్‌ విలేజ్‌ ఫౌండేసన్‌ అధ్యక్షుడు బాల్‌రాజ్‌గౌడ్‌, శశిధర్‌గౌడ్‌, వార్డు కౌన్సిలర్‌ పద్మ, రాంకుమార్‌, ప్రధానోపాద్యాయురాలు విజయచందన, ఉపాధ్యాయురాలు స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ట్రాన్స్‌ఫార్మర్‌ మార్చాలని వినతి

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కొత్తబస్టాండ్‌ ప్రాంతంలోగల ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చాలని శుక్రవారం ట్రాన్స్‌కో డిఇకి మునిసిపల్‌ కౌన్సిలర్‌ అరికెల ప్రభాకర్‌ యాదవ్‌ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యూ బస్టాండ్‌ పక్కనగల ఎన్జీవోస్‌ కాలనీ ఆర్‌.కె.లాడ్జ్‌ రోడ్డులో రోడ్డును ఆనుకొని ట్రాన్స్‌పార్మర్‌ ఉందన్నారు. రోడ్డుగుండా నిత్యం ప్రజల రద్దీ ఉంటుందని, దీనివల్ల ప్రమాదం జరిగే ఆస్కారముందని ఆయన దృస్టికి తీసుకొచ్చారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరేచోటికి మార్చాలని కోరారు.

Read More »

సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 23వ వార్డు బోయగల్లిలో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను శుక్రవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. నాన్‌ ప్లాన్‌ గ్రాంట్‌ నిధులు రూ. 3.60 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మిస్తున్నట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ జొన్నల నర్సింలు, మునిసిపల్‌ సిబ్బంది కృష్ణయాదవ్‌, పర్వేజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

వైబవంగా బోనాల పండగ

  కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం సరంపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామస్తులు బోనాల పండగను వైభవంగా నిర్వహించారు. మహిళలు అందంగా అలంకరించిన బోనాలు నెత్తిన బెట్టుకొని గ్రామంలోని వీధుల్లో ఊరేగించారు. అనంతరం గ్రామ దేవతలకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు సమృద్దిగా కురవాలని, పంటలు బాగా పండి అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

Read More »

ప్రొఫెసర్‌ కోదండరామ్‌పై అనుచిత వ్యాఖ్యలు తగదు

  ఆర్మూర్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి ఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి వి.ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం కుమార్‌నారాయణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు పరిపాలన కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. తెరాసను విమర్శిస్తే తెలంగాణ ప్రజలను ...

Read More »

స్వశక్తి భవనానికి భూమిపూజ

  ఆర్మూర్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని 19వ వార్డులో స్త్రీ స్వశక్తి భవన నిర్మాణానికి నూతనంగా ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు, వైస్‌ఛైర్మన్‌ మోత్కురి లింగాగౌడ్‌ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎంపి కవితల ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మునిసిపాలిటీ అభివృద్ది పథంలో నడుస్తుందని చెప్పారు. ఇలాగే వారి సహాయ సహకారాలతో మునిసిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సడాక్‌ ...

Read More »

బహిరంగ స్థలంలో మద్యంసేవించిన ఐదుగురి అరెస్టు

  ఆర్మూర్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ శివారులో బహిరంగ ప్రదేశంలో మద్యంసేవించిన ఐదుగురిని గురువారం రాత్రి అరెస్టు చేసినట్టు ఆర్మూర్‌ సిఐ సీతారాం శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి సమయంలో పెట్రోలింగ్‌కు వెళ్లిన పోలీసు సిబ్బంది బహిరంగ స్థలంలో మద్యంసేవించి ప్రజా సౌకర్యానికి భంగం కలిగించిన ఐదుగురు వ్యక్తులను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. పట్టణంలో, మండలంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజా సౌకర్యానికి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ ...

Read More »

ఆటోడ్రైవర్లకు అవగాహన సదస్సు

  ఆర్మూర్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని పోలీసు స్టేషన్‌లో సిఐ సీతారాం, ఎస్‌ఐలు సంతోష్‌కుమార్‌, యాకూబ్‌ల ఆద్వర్యంలో పట్టణం, మండలంలోని ఆటోడ్రైవర్లందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు పాటించాల్సిన నియమ నిబంధనలు వివరించారు. ఆటోడ్రైవర్లు ముందు సీట్లో ప్రయాణీకులను ఎక్కించుకోకుండా ఉండాలని సూచించారు. అలాగే ఆటోల్లో సౌండ్‌ సిస్టమ్‌ వాడకూడదని చెప్పారు. ఆటో వెనక భాగంలో జాలీలు అమర్చుకోవాలని, పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోకుండా నియమ నిబంధనలు పాటించాలని స్పష్టం ...

Read More »

8వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

  ఆర్మూర్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14,15 తేదీల్లో జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర 8వ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టియు ఆర్మూర్‌ ఏరియా కమిటీ ఆద్వర్యంలో శుక్రవారం కుమార్‌ నారాయణభవన్‌లో గోడప్రతులు ఆవిష్కరించారు. అనంతరం ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు ముత్తన్న మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరాయంగా పోరాడుతున్న యూనియన్‌ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ అన్నారు. కార్మికులంతా యూనియన్‌లో జరిగే పోరాటాల్లో ముందుండాలని ...

Read More »

మురికి వాడగా మారిన పెర్కిట్‌, కోటార్మూర్‌ వీధులు

  పెర్కిట్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెర్కిట్‌, కోటార్మూర్‌లోగల వీధి రోడ్లలో, లోతట్టు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో కురిసిన వర్షాల కారణంగా నీరు వచ్చి చేరింది. దీని కారణంగా వీధి రోడ్లు మురికిగా మారాయి. దీంతో ఇక్కడ పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వీటివల్ల ప్రజలు జబ్బుల బారిన పడే అవకాశమున్నందున భయాందోలనకు గురవుతున్నారు. గ్రామాల్లో వీధి రోడ్లను అధికారులుగాని, గ్రామ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, ఎంపిటిసిలు, వార్డుమెంబర్లు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఓట్లు అడిగేటప్పుడు మాత్రమే ప్రజా ...

Read More »

ఆపద్బంధు చెక్కు అందజేత

  రెంజల్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం నీలా గ్రామానికి చెందిన కె.దశరథ్‌ అనే వ్యక్తి 2015 ఫిబ్రవరి 8న గోదావరిలో పడి మృతి చెందగా ఆపద్బందు పథకం ద్వారా రూ. 50 వేల చెక్కును మృతుని భార్య సవితకు తహసీల్దార్‌ వెంకటయ్య అందజేశారు. ఆయన వెంట డిప్యూటి తహసీల్దార్‌ వినయ్‌ సాగర్‌, ఆర్‌ఐ క్రాంతికుమార్‌, విఆర్వో సాయిలు ఉన్నారు.

Read More »

పుర్రె మనిషి ఆచూకీ చెప్పండి

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి శివారులోని కొత్తకుంటలో ఐదు రోజుల క్రితం లభించిన పుర్రెకు సంబంధించిన సమాచారం కోసం ఫ్లెక్సీలు తయారు చేయించినట్లు సీఐ అనిల్ కుమార్ తెలిపారు. ఈ నెల 4న ఎల్లారెడ్డి సమీపంలోని కొత్తకుంటలో పుర్రెతో పాటు నల్లరంగు ప్యాంటు, ఆకు పచ్చని చెక్స్ షర్టు లభించిందన్నారు. మృతుడి వయస్సు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని, ఆరు నెలల క్రితం చని పోయినట్లుగా తెలుస్తోందని అన్నారు. వివరాలు తెలిసిన వారు ఎల్లారెడ్డి ఎస్సై శ్రీధర్ రెడ్డి 9440795463 లేదా సీఐ అనిల్ కుమార్ ...

Read More »

పొంగిన లెండి వాగు

కోటగిరి : ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లెండి వాగులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం 10 గంటల వరకు లెండిలో చుక్కనీరు కనబడలేదు. ఒక్కసారిగా వరద రావడంతో అరగంటలోపే పరిస్థితి మారిపోయింది. ఉదయం 9 గంటల వరకు మహారాష్ట్ర నుంచి సాంగ్వీ, మండిగి, తమ్లూర్, సావర్‌గావ్, నరంగల్, దెగ్లూర్ నుంచి ప్రయాణికులు తెలంగాణ రాష్ర్టానికి వచ్చారు. ఆటోలు, బైక్‌లు నడిచాయి. అరగంట సమయంలోనే వాగు పొంగింది. దీంతో పొతంగల్-సాంగ్వీ మధ్య వాగుపై తాత్కాలికంగా నిర్మించిన మట్టిరోడ్డు ...

Read More »

కేసీఆర్ స్వప్నన్ని సాకారం చేయడమే లక్ష్యం..

కమ్మర్‌పల్లి: ఇంటింటికీ తాగునీటిని అందించి సీఎం కేసీఆర్ స్వప్నన్ని సా కారం చేయడమే తన లక్ష్యమని మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ అన్నారు. గురువారం ఎస్సారెస్పీ వస తి గృహంలో విలేకరులతో ఆయన మాట్లాడా రు. 2018 డిసెంబర్‌లోగా 28,400 గ్రామాలు, ఆవాస ప్రాంతాలకు నీరు అం దించనున్నట్లు చెప్పారు. ఆడపడుచులు అడిగన చోట నళ్లాలు బిగించి నీరు అందించి మిషన్ భగీరథను విజయవంతం చేస్తామన్నారు. భూగర్భ జలాల్లో అనారోగ్య కారకాలు ఉండటం, వేసవిలో నీటి తిప్పలు ఎదురు అవుతుండటం దృష్ట్యా జలాశయాల నుంచి ఉపరితల ...

Read More »

వామ్మో.. జూన్..!

నిజామాబాద్ అర్బన్ : జూన్ 13 సమీపిస్తుండడంతో సామాన్యుడి గుండెలు గుబేల్‌మంటున్నాయి. ఆ రోజు అధికారికంగా విద్యా సంస్థలు ప్రారంభం కావడమే ఇం దుకు కారణం. అనధికారికంగా జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలు తెరుచుకొని నడుస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండడంతో పిల్లలు స్కూల్‌కు వెళ్లవచ్చని సంబుర పడుతుంటే వారి త ల్లిదండ్రులు మాత్రం ప్రైవేట్ విద్యా సంస్థలకు పం పడంపై లబోదిబోమంటున్నారు. తమ చిన్నారులను స్కూల్‌కు పంపి ఆనందపడుదామంటే అడ్మిషన్, డొనేషన్, ఫీజుల పేరిట విద్యాసంస్థలు వసూ లు చేస్తుండడంపై సామాన్య ప్రజలకు పట్ట ...

Read More »

మీ సేవలో అధిక రుసుము వసూలు చేస్తే చర్యలు

-నిర్వాహకులకు జేసీ రవీందర్‌రెడ్డి హెచ్చరిక -నవీపేట్, ఎడపల్లి, రెంజల్‌లో పర్యటన -సాదాబైనామాపై రైతులకు అవగాహన కల్పించాలని తహసీల్దార్లకు ఆదేశం నవీపేట: మీ సేవ కేంద్రాల నిర్వాహకులు రైతులు, ఇతర దరఖాస్తు దారుల నుంచి అధిక రుసుం వసూలు చేస్తే చర్యలు తప్పవని జేసీ రవీందర్‌రెడ్డి హెచ్చరించారు.గురువారం మండల కేంద్రంలో చందు, లక్ష్మణ్‌రావు, మీ సేవ కేంద్రాలను ఆయన అకస్మాత్తుగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మీ సేవ నిర్వాహకులకు పలు సూచనాలు చేశారు. రైతులు చేసుకున్న దరఖాస్తుకు రూ. 35 రుసుము తీసుకోవాలని అంతకంటే ఎక్కువ ...

Read More »

విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చేరాలి

ధర్పల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చేరేందుకు విద్యార్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు. డిగ్రీ ప్రవేశాల కోసం దరఖాస్తుల గడువు ఈ నెల 15 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకే మొదటి ప్రాధాన్యత కేటాయించాలని సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ(హెచ్‌ఈపీ)లో 60సీట్లు, బీకాం(జనరల్)-60, బీకాం(కంప్యూటర్స్)60, బీఎస్సీ(ఎంపీసీఎస్)50 బీజడ్పీ-50 సీట్లు ఉన్నాయని వివరించారు. కళాశాలలో పీహెచ్‌డీ, ...

Read More »

మత్తు పదార్థాల నుంచి యువతను కాపాడాలి

నిజామాబాద్ అర్బన్: జిల్లా లో విచ్చలవిడిగా లభ్యమవుతున్న నిషేధిత మత్తు ప దార్థాలకు బానిస కాకుండా యువతను కాపాడాలని అవినీతి వ్యతిరేక వేదిక కన్వీనర్ డాక్టర్ బీ.కేశవులు కోరారు. ఈ మేరకు ఆయన గురువారం నగరంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ విశ్వప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాలు గంజాయి, కోకైన్, గుట్కా, అంబర్, పాన్‌పరాగ్ లాంటివి మనిషికి తీవ్రంగా హాని కలింగిచే పదార్థాలన్నారు. ఇవి రద్దీ ప్రాంతాలైన బస్టాండ్, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లు, ...

Read More »