Breaking News

Daily Archives: June 11, 2016

గోడకూలి ఇద్దరి మృతి

  నందిపేట, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని పలుగుట్ట సమీపంలోని పాత దాబాహోటల్‌ గోడకూలడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నందిపేట ఎస్‌ఐ జాన్‌రెడ్డి కథనం ప్రకారం..జోర్‌పూర్‌ గ్రామానికి చెందిన ఎర్ర లింగన్న పలుగుట్ట వద్ద సత్యనారాయణ వ్రతం చేశాడని, వారి బంధువులైన రమాదేవి, అఖిల, గూండ్ల సుదర్శన్‌, ప్రవీణ్‌ బోజనాలు ముగించుకొని ద్విచక్ర వాహనాలపై తిరుగు పయనమయేటపుడు అనుకోకుండా ప్రారంభమైన ...

Read More »

నేడు అంబేడ్కర్‌, సాహూ మహారాజ్‌ విగ్రహావిష్కరణ సభ

  కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం బ్రహ్మాజివాడ గ్రామంలో ఈనెల 12న ఆదివారం డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌, ఛత్రపతి సాహు మహరాజ్‌ విగ్రహావిష్కరణ సభ ఏర్పాటు చేయనున్నట్టు అంబేడ్కర్‌ యువజన సంఘం ప్రతినిధులు తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డితోపాటు అంబేడ్కర్‌, బిఎఎం టియుఎస్‌ లప్రతినిధులు హాజరు కానున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి అన్ని గ్రామాల్లోని అంబేడ్కర్‌ యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో రాజలింగం, కొత్తపల్లి ...

Read More »

గుండెపోటుతో వ్యక్తి మృతి

  బాసర, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయ సమీపంలోని వ్యాస గుహ వద్ద శనివారం ఓ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాసర ఎస్‌ఐ నర్సింలు అక్కడికి చేరుకొని ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్‌ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించి శవాన్ని అప్పగించారు. మృతుడిని నాందేడ్‌ జిల్లాకు చెందిన అవినాష్‌గా గుర్తించారు. హఠాత్తుగా ఓ భక్తులు ఇలా మృతి చెందడం పలువురిని మనసులను కలచివేసింది.

Read More »

సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి

  కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీసరస్వతి శిశు మందిర్‌ పాఠశాలల ద్వారా విద్యార్థుల్లో సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్నట్టు శిశుమందిర్‌ ప్రతినిధులు డాక్టర్‌ శ్యాంసుందర్‌, సరోజ, నాగభూషణం తెలిపారు. శనివారం పాఠశాలలో యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఇంగ్లీష్‌ మీడియంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను బోధిస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. కనిష్ట ఫీజులతో కార్పొరేట్‌ స్థాయి విద్యను అందిస్తున్నట్టు వివరించారు. ప్రతి విద్యార్థికి కంప్యూటర్‌శిక్షణ, డిజిటల్‌ ...

Read More »

కామారెడ్డి జిల్లా సరిహద్దులపై స్పష్టత ఇవ్వాలి

  కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణను చేపట్టనున్న నేపథ్యంలోకామారెడ్డి జిల్లా సరిహద్దులపై స్పష్టత ఇవ్వాలని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి జిల్లాను తాము స్వాగతిస్తున్నామని, ఈ క్రమంలో కామారెడ్డి జిల్లాలో కలిపే ప్రాంతాలపై స్పష్టత ఇవ్వకుండా ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేలా ప్రభుత్వం యోచిస్తుందన్నారు. ఓసారి సిరిసిల్లాలో కలుపుతామని, మరోసారి మెదక్‌లో కలుపుతామని కామారెడ్డిజిల్లాకు సంబధించి స్పష్టత కొరవడిందన్నారు. గూగుల్‌ ...

Read More »

ఎంపి, ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ది పరుస్తా

  మోర్తాడ్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ గ్రామాన్ని జిల్లా పార్లమెంటు సబ్యురాలు కవిత, మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో అభివృద్ది పరుస్తానని మోర్తాడ్‌ సర్పంచ్‌ దడివె నవీన్‌ అన్నారు. శనివారం మోర్తాడ్‌లోని దళితవాడలో నూతన పైప్‌లైన్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. దళిత వాడలో పాత పైప్‌లైన్‌ శిథిలావస్థకు చేరాయని, దీంతో దళితవాడలో నీటి ఎద్దడి నెలకొందని, దళితులు తమ దృష్టికి తెచ్చారని అన్నారు. దళితుల కోరిక మేరకు రెండు లక్షల రూపాయల ...

Read More »

పిఎస్‌ఏ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేదప్రకాష్‌

  కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రోగ్రెసివ్‌ సైకాలజిస్టు అసోసియేషన్‌ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ వేదప్రకాష్‌ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు మోత్కురి రాంచందర్‌ నియామక పత్రం అందజేశారు. పిఎస్‌ఏ జాతీయ మహాసభలు ఈనెల 4,5 తేదీల్లో విజయవాడలో నిర్వహించారు. సమావేశంలో కమలాకర్‌ను పిఎస్‌ఏ జాతీయ అద్యక్షునిగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను వేదప్రకాశ్‌కు అప్పగించారు. మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతానని వేదప్రకాశ్‌ తెలిపారు. సైకాలజిస్టుగా, వ్యక్తిత్వ వికాస ...

Read More »

13న ఛలో కలెక్టరేట్‌

  మోర్తాడ్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 13న జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని మండల ఏఎన్‌ఎంల అద్యక్ష, కార్యదర్శులు వీణ, శ్యామలలు కోరారు. శనివారం మోర్తాడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి ముందు 6వ రోజు రిలేనిరాహార దీక్షలో మండల ఏఎన్‌ఎంలు బతుకమ్మలు ఆడుతూ, మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. గత ఆరురోజులుగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని దీక్ష చేస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించకపోవడంతో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. అన్ని గ్రామాల్లోని 2వ ...

Read More »

తెలంగాణ తిరుమల ఆలయంలో ఆర్డీవో ప్రత్యేక పూజలు

  బీర్కూర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో బోధన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌ కుటుంబ సమేతంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం కావడంతో ఉదయం నుంచే ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌ కుటుంబ సభ్యులతో ఉదయం స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుల సదుపాయాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బోదన్‌ డివిజన్‌లో పనిచేయడం ఆనందంగా ఉందని, బదిలీపై కరీంనగర్‌ వెళ్తున్నట్టు చెప్పారు. ఇక్కడ ...

Read More »

సత్సంగ్‌ ఆద్వర్యంలో మొక్కల పెంపకం

  బీర్కూర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హరితహారం పిలుపుమేరకు మండలంలోని సంగం గ్రామంలో సత్సంగ్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం 50 మొక్కలను నాటారు. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షుడు మదన్‌సింగ్‌ మాట్లాడుతూ చెట్లు నరికివేయడం వల్ల గత మూడు సంవత్సరాలుగా కరువును ఎదుర్కొంటున్నామని, ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్ర ప్రభుత్వ పిలుపుమేరకు ప్రభుత్వ కార్యాలయాలు, ఇంటి పరిసరాలు, పొలాల గట్లపై చెట్ల పెంపకం చేపట్టాలని, చెట్ల పెంపకం ద్వారా కాలుష్యం నివారణ అవుతుందని, వర్షాలు ...

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంగ్లీష్‌ మీడియం బోధించాలి

  బీర్కూర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంగ్లీష్‌ మీడియం బోధించాలని దుర్కి గ్రామస్తులు తీర్మానించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు దుర్కి గ్రామంలో బడి బయట పిల్లలను ప్రభుత్వపాఠశాలల్లో చేర్పించాల్సిందిగా తీర్మానించామని పేర్కొన్నారు. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులుఆంగ్ల విద్య మోజులో ఉన్నారని, ప్రభుత్వం 1వ తరగతి నుంచే ప్రభుత్వపాఠశాలల్లోఆంగ్ల మాద్యమం బోధించేలా కృషి చేయాలని గ్రామంలో తీర్మానించినట్టు తెలిపారు. ప్రయివేటు ...

Read More »

ఏఎన్‌ఎంలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదు

  మోర్తాడ్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్న రెండల ఏఎన్‌ఎంలకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలిచి పోరాటం చేస్తుందని ప్రభుత్వ మాజీ విప్‌, బాల్కొండ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ అన్నారు. శనివారం మోర్తాడ్‌లో రిలే నిరాహారదీక్షలు కొనసాగిస్తున్న ఏఎన్‌ఎంల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న గర్భిణీ, బాలింత, చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందిస్తు ...

Read More »

పార్టీ వీడేది లేదు

  ఆర్మూర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి తెరాసలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని మండల ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు షహీద్‌ శనివారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో గత 20 సంవత్సరాలుగా ప్రజలకు ఎనలేని సేవలందించి అనేక పదవులను కైవసం చేసుకున్న మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి తెరాసలో చేరుతారన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, దీన్ని ప్రజలు గమనించాలని అన్నారు.

Read More »

మద్యంసేవించి వాహనాలు నడిపిన ఐదుగురి అరెస్టు

  ఆర్మూర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి చౌరస్తాలో ఎస్‌ఐ యాకూబ్‌ సిబ్బందితో శుక్రవారం రాత్రి వాహన తనిఖీ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. అందులో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సిఐ సీతారాం శనివారం తెలిపారు. వారిని సోమవారం కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు.

Read More »

ప్రతిపాదిత మినీ ట్యాంక్‌బండ్‌ను పరిశీలించిన జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు

  నిజామాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక పాత ఖిల్లా పక్కనున్న రఘునాథ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దనున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిదులు చెరువు, రామాలయం తదితర ప్రాంతాలను పరిశీలించారు. శనివారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా, స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, నగర మేయర్‌ ఆకుల సుజాత, సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి, అదికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి రఘునాథ చెరువును, అక్కడ జరుగుతున్న పనులు, పక్కనే ఉన్న పాత ఖిల్లా, అక్కడ గల రామాలయాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని ...

Read More »

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాబోధన

  ఆర్మూర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఆర్మూర్‌ పట్టణంలోని 10వ వార్డులో స్థానిక కౌన్సిలర్‌ సుజాత, ఆనంద్‌ల ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్‌ రాంమందిర్‌ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్‌ మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల సౌకర్యార్థం అన్ని సౌకార్యలు మెరుగుపరిచినట్టు ఆమె తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో బోధిస్తున్నట్టు ఆమె వివరించారు. కాలనీ వాసులు ...

Read More »

జ్ఞానదంతాల నొప్పికి తక్షణ ఉపశమనం కలిగించే ఆయుర్వేదిక్ రెమెడీస్

జ్ఞానదంతాల నొప్పి అనేది సాధారణంగా 15 నుండి 25 ఏళ్ళలో వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కొంత మంది జీవితంలో 25ఏళ్ల తర్వాత దశలో కూడా జ్ఞానదంతాల నొప్పిని కలిగి ఉంటారు. దీన్ని థర్డ్ మోలార్స్ అని కూడా పిలుస్తారు, అది చివరిగా దంతాలు మరియు ఈ దంతాలు నోట్లో చివరలో ఉంటాయి. ఇవి నాలుగు భాగాలుగా కనబడుతుంటాయి. జ్ఞానదంతం చివరగా వస్తుంటాయి, దంతాలన్ని వచ్చిన తర్వాత ఇవి మొలవడం వల్ల, ఇవి నోట్లో పెరగడానికి వాటికి సరైన స్థలం సరిపోకపోవడం వల్ల జ్ఞానదంతం వచ్చేటప్పుడు ...

Read More »

‘ఉపవాస దీక్షకు పరీక్షలు అడ్డంకి కాదు’

దుబాయ్: కొందరు స్కూలు విద్యార్థులు పరీక్షల పేరుతో ఉపవాస దీక్షల నుంచి తప్పించుకుంటున్నారని, ఇది మంచి పద్ధతికాదని దుబాయ్ ముఫ్తీ డాక్టర్ అహ్మద్ అల్ హడ్డాడ్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం వల్ల చదువులపై ఏకాగ్రత చూపలేకపోతున్నామని విద్యార్థులు చెబుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. లోయర్ గ్రేడ్ విద్యార్థుల వరకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వవచ్చు కానీ హయ్యర్ గ్రేడ్ విద్యార్థులు పరీక్షల పేరుతో దీక్షల నుంచి తప్పించుకోవడం క్షమార్హం కాదన్నారు. ఉపవాస సమయంలో ఆకలి వేయడం, దాహంగా ఉండడం సహజమేనని ...

Read More »

కువైట్‌లో వారు కూడా వర్క్ పర్మిట్ల బదిలీకి అర్హులే..

కువైట్: వ్యవసాయ, పారిశ్రామిక, మత్స్య రంగాల కార్మికులతోపాటు కాపర్లుగా పనిచేస్తున్న వారి వర్క్ పర్మిట్లను వారి స్పాన్సర్ల అనుమతితో బదిలీచేసేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఇందుకుగాను 300 కువైటీ దినార్లు వసూలు చేయాలని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ అధికారులు భావిస్తున్నారు. అయితే ఒక రంగం నుంచి మరో రంగంలోకి బదిలీలను అనుమతించేది లేదని, ప్రస్తుతం పనిచేస్తున్న రంగం నుంచి మళ్లీ అదే రంగానికి మాత్రమే ట్రాన్స్‌ఫర్లు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. పైన పేర్కొన్న కార్మికులు తప్ప ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఏడాది సర్వీసు ...

Read More »

పోలాకిలో సుమిటొమో థర్మల్‌ విద్యుత కేంద్రం

రూ.30 వేల కోట్ల పెట్టుబడితో 4000 మెగావాట్ల విద్యుదుత్పత్తి శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పోలాకిలో భారీ థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. గతంలో స్థానికులు నిరసనకు దిగటంతో భూసర్వే పనులు నిలిచిపోయాయి. తాజాగా భూసర్వే పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రాజెక్టు నిర్మాణం తప్పదని అంతా భావిస్తున్నారు. జపాన్‌కు చెందిన సుమిటొమో.. శ్రీకాకుళం జిల్లాలో 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 4000 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు గత ఏడాది ముందుకు వచ్చింది. జిల్లాలోని ...

Read More »