Breaking News

మోదీ జైత్రయాత్ర

అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ఆ దేశపు చట్టసభ సభ్యులనే కాక, దాన్ని మాధ్యమాల్లో వీక్షించిన వారిని కూడా మంత్రముగ్ధులను చేసింది. అబ్రహం లింకన సూక్తులతో ఆరంభించి భారత-అమెరికా సంబంధాలను, అంతర్జాతీయ పరిణామాలను లోతుగా చర్చిస్తూ, అనుబంధాలను స్పృశిస్తూ, అలవోకగా ఒక ప్రవాహంలాగా సాగిన ఈ ప్రసంగానికి కాంగ్రెస్‌సభ్యులు తొమ్మిదిసార్లు లేచినిలబడి కరతాళధ్వనులతో ప్రశంసించడం గర్వించదగ్గ విషయం. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాల మధ్య స్నేహం, సహకారం ఏ స్థాయికి విస్తరించగలిగే అవకాశాలున్నాయో ఆయన ప్రసంగం విప్పిచెప్పింది. ఇరుదేశాల దీర్ఘకాలిక బాంధవ్యానికి పునాదిదిట్టం చేసింది.

ఈ తరహా సందర్భాల్లో, రాసుకొచ్చిన ప్రసంగపాఠం ముందు పెట్టుకొని, పేజీలు తాపీగా తిప్పుకుంటూ, మధ్యలో కాసిన్ని నీళ్ళు చప్పరిస్తూ, వింటున్నవారికీ చూస్తున్నవారికీ కూడా ఏమాత్రం ఉత్సాహం లేకుండా, నిస్సారంగా ప్రసంగించే నాయకులను చూసినవారికి మోదీ ప్రసంగం అద్భుతమనిపించడం సహజం. అమెరికన పార్లమెంటులోనూ ఆయన ఒక ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతున్నంత అలవోకగా, ఏమాత్రం తొణక్కుండా, ఎక్కడా బెణక్కుండా ఎన్నో కీలకాంశాలను గుదిగుచ్చి చెప్పడం, మధ్యమధ్యలో హస్యోక్తులతో సభికులను రంజింపచేయడం ఆయన వాక్పాటవానికి నిదర్శనం. ఇది ఒక నామమాత్రపు అధికారిక ప్రసంగంలాగా లేనందువల్లనే దేశ ప్రజలను కూడా విపరీతంగా ఆకర్షించి, సామాజిక మాధ్యమాల్లో విశేషమైన ప్రచారానికీ, విస్తృతమైన చర్చకూ కారణమవుతున్నది. ఇంతకీలకమైన దానిని కూడా ప్రధాని కాగితం లేకుండానే కానిచ్చారన్న వాదనకు ప్రతిగా, ఆయన టెలివిజన చానెళ్ళలో యాంకర్లు వార్తలు చదవడానికి వాడే ప్రాంప్టర్లు ఉపయోగించారని నిర్థారించే పనిలో కొందరు పడ్డారు. ప్రాంప్టర్‌లో చూసి చదువుతున్నట్టుగా సభికులకు తెలియకుండా, ప్రసంగపాఠం ఒక అద్దంమీద ప్రతిబింబిస్తూ ప్రసంగించేవారికి మాత్రమే కనిపించే ‘స్టేజ్‌ప్రో ప్రెసిడెన్షియల్‌’ ప్రాంప్టర్‌ను ప్రధాని వినియోగించారంటూ ట్విటర్‌ హోరెత్తుతున్నది. కరతాళధ్వనులకు వీలుగా ప్రసంగం మధ్యలో ఆగినప్పుడు, పాఠం కూడా అక్కడే నిలిచి, ప్రసంగం తిరిగి ఆరంభంకాగానే ముందుకు కదలడం దీని విశిష్టత అంటూ దాని లోతుపాతులను కొందరు వివరిస్తున్నారు. ఇక, గతంలో దీని సహాయం తీసుకున్న కారణంగా నరేంద్రమోదీ సహా, వివిధ దేశ నాయకులు ఏయే పొరపాట్లు చేశారో తెలియచెబుతూ సామాజిక మాధ్యమాలు హాస్యరసపు వరదల్లో అందరినీ ముంచెత్తుతున్నాయి.

ఈ వాద ప్రతివాదాలను అటుంచితే, ప్రధాని తన ప్రసంగంతో అమెరికన కాంగ్రె్‌సను, అమెరికన మీడియాను విశేషంగా ప్రభావితం చేసినమాట వాస్తవం. తన అద్భుత వాగ్ధాటికి తోడుగా ఆయన ఎంపికచేసుకున్న అంశాలు, మనసుల్ని కలిపే ప్రస్తావనలు ప్రసంగాన్ని ఇతోథికంగా పండించాయి. ఇరుదేశాల వ్యత్యాసాలకన్నా పోలికలే అధికమంటూ ఆయన చేసిన ఉటంకింపులు, భారత ప్రజాస్వామిక పునాదులను పటిష్టపరిచిన అత్యున్నత రాజ్యాంగానికి అమెరికాయే ఆదర్శమంటూ అంబేడ్కర్‌ను ప్రస్తావించడం సముచితమైనవి. ఉగ్రవాదం విషయంలో అమెరికా గత వైఖరిని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఈ విధమైన వడబోతలు పనికిరావంటూ చేసిన హెచ్చరికే, ఆ మర్నాడు అమెరికా పాకిస్థానపై మరొకమారు ఒత్తిడి తీసుకురావడానికి దోహదం చేసివుండవచ్చు. అమెరికన కాంగ్రె్‌సలో గాంధీ, వివేకానంద ఇత్యాదుల ప్రస్తావనలు కొత్తవి కాకున్నా, స్ఫూర్తినీ, బంధాన్నీ గుర్తుచేసేవే. ఇరుదేశాల సాన్నిహిత్యం ఈ స్థాయికి చేరడానికి దోహదపడి, ఇప్పుడు క్షిపణి నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్‌)లోనికీ, నూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూపు (ఎనఎ్‌సజీ) ప్రవేశానికీ దారులుపరచిన భారత-అమెరికా పౌర అణు ఒప్పందాన్ని మోదీ రెండు పర్యాయాలు తన ప్రసంగంలో ఉటంకించినా మన్మోహన పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. 2008 సెప్టెంబరులో అమెరికన కాంగ్రెస్‌ దీనిని ఆమోదించిందని గుర్తుచేసిన మోదీకి, జూలైలోనే దీని ఆమోదం కోసం మన్మోహన సింగ్‌ తన ప్రభుత్వాన్నే పణంగా పెట్టిన విషయం తెలియంది కాదు. అప్పట్లో ఈ ఒప్పందాన్ని వామపక్షాలకంటే అధికంగా వ్యతిరేకించినది తన పార్టీయేనని కూడా మోదీకి తెలుసు. మన్మోహన మొండితనం వల్లనే ఈ ఒప్పందం గట్టెక్కిందనీ తెలుసు. 2005లో మన్మోహన ఇదే వేదికమీద ప్రసంగిస్తూ, అంతకు రెండుదశాబ్దాల క్రితం అక్కడ ప్రసంగించిన రాజీవ్‌గాంధీని మాత్రమే గుర్తుచేసుకొని, ఐదేళ్ళక్రితం చేసిన వాజపేయి ప్రసంగాన్నీ, ఆయన కృషినీ విస్మరించినట్టుగా, ఇప్పుడు మోదీ చేసిన ఉద్దేశపూర్వక విస్మరణలను కూడా ప్రశ్నించలేని స్థితి నెలకొన్నది. ‘జెట్‌లాగ్‌ లేని ప్రధాని’ అంటూ మీడియా మోదీని అభివర్ణిస్తున్నది. ముప్పైమూడువేల కిలోమీటర్లు నలభైనాలుగు గంటలపాటు విమానంలో ప్రయాణించి, ఐదురోజుల్లో మూడు ఖండాల్లోని ఐదుదేశాలను చుట్టి వచ్చి ఏ ప్రధాని చేయని ధైర్యం చేశారాయన. అఫ్ఘానతో స్నేహవారధిని నిర్మించి, అమెరికాను మరింతగా అక్కున చేర్చుకొని, స్విట్జర్లాండ్‌తో భారత ఎనఎ్‌సజీ సభ్యత్వానికి సరేననిపించుకొని, ఆఖరున మెక్సికోతోనూ అదే ప్రమాణం చేయించుకొని 21 గంటల ఏకబిగి ప్రయాణంతో తిరిగి భారతలో శుక్రవారం కాలుమోపి ఈ విడత జైత్రయాత్ర ముగించారాయన.

Check Also

ఇళ్ళు దెబ్బతిన్న వారికి తక్షణ సహాయం అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా దెబ్బతిన్న ...

Comment on the article