Breaking News

Daily Archives: June 12, 2016

ఘనంగా బోనాల పండగ

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడలోగల పోచమ్మ ఆలయం వద్ద ఆదివారం భక్తులు బోనాల పండగ నిర్వహించారు. అందంగా అలంకరించిన బోనాలను మహిళలు నెత్తిన బెట్టుకొని ఊరేగించి అమ్మవారిని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదంగా పులిహోర పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు రాజు, లింగం, రాకేశ్‌, హన్మాండ్లు, నరేశ్‌, మహేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గుర్తుతెలియని వృద్దుని మృతి

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో ఆదివారం గుర్తుతెలియని వృద్దుని మృతదేహం లభించినట్టు పట్టణ ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపారు. 60 నుంచి 65 సంవత్సరాల వయసుగల వృద్దుడు రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో మృతి చెంది ఉన్నాడన్నారు. గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుని ఎవరైనా గుర్తిస్తే పట్టణ పోలీసు స్టేషన్లో సంప్రదించాలని కోరారు.

Read More »

వైద్యునికి సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తమ సామాజిక సేవకునిగా అవార్డు అందుకున్న వైద్యులు పుట్ట మల్లికార్జున్‌ను ఆదివారం కామారెడ్డిలో సన్మానించారు. పట్టణ మేదరి సంఘం ప్రతినిధులు, డాక్టర్‌ బాబుజగ్జీవన్‌రాం సంఘం ప్రతినిదులు, బిఎస్‌పి నాయకులు వైద్యుని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యుడు మల్లికార్జున్‌ అఖిల చారిటబుల్‌ ట్రస్టు ద్వారా సమాజ సేవలో ముందుండి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఉచిత ఆరోగ్య శిబిరాలు, క్యాంపుల ద్వారా సేవలందించారన్నారు. తన సంపాదన నుంచి సమాజ సేవకు ఖర్చు ...

Read More »

వరకట్న వేధింపులతో ఆత్మహత్య

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ వరకట్న వేధింపులు తాళలేక ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రూరల్‌ పోలీసుల కథనం ప్రకారం… రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన షహీన్‌ బేగం (28) అత్తింటివారు వరకట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నట్టు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం షహీనా బేగం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువులు అది హత్యేనని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు ...

Read More »

నెరవేరనున్న సహకార కల

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సొంత భవనం లేక అద్దె భవనంలో అరకొర వసతులతో కొనసాగుతున్న సహకార బ్యాంకు కల నెరవేరనుంది. మండల కేంద్రంలోని అచ్చంపేట సహకార సంఘం నిధులతో సహకార బ్యాంకు నిర్మాణంతో పాటు సొసైటీ నిర్మాణం పనులు చేపట్టారు. సహకార సంఘం పాత భవనాన్ని కూల్చివేసి అదే స్థలంలో కొత్తగా సంఘం భవన సముదాయంతో పాటు సహకార బ్యాంకు కార్యాలయాన్ని నిర్మించారు. అన్ని హంగులతో బ్యాంకు సముదాయ నిర్మాణంతోపాటు సొసైటీ కార్యాలయాన్ని ఈనెల ...

Read More »

పోలీసుల శ్రమదానం

  బీర్కూర్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ ఠాణా పోలీసులు ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి ఆద్వర్యంలో ఆదివారం శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసు స్టేషన్‌ ఆవరణలో గల పిచ్చిమొక్కలను ఏరివేసి హరితహారంలో భాగంగా మొక్కల పెంపకానికి నల్లమట్టిని వేసి సిద్దం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ మండల కేంద్రంలోని బీర్కూర్‌ ఠాణా గ్రామానికి చివరగా ఉందని, రాబోయే వర్షాకాలంలో మొక్కలు పెంచడం జరుగుతుందని అన్నారు.

Read More »

జంతువులు పళ్లు తోమక్కర్లేదా?

 ప్రశ్న: మనిషి తప్ప మిగతా జంతువులేవీ బ్రష్‌ చేసుకోవు కదా? మరి వాటి పళ్లు పాడవకుండా ఎలా ఉంటాయి? జవాబు: కేవలం ఆధునిక మానవుడు మాత్రమే పళ్లు తోముకుంటున్నాడు. నాగరికత నేర్చిన మానవుడు పళ్లు తోముకోడానికి కేవలం సూక్ష్మక్రిముల నిర్మూలనే కారణం కాదు. ఇది సౌందర్యపరమైన అంశం కూడా. సంఘజీవులైన మనుషులు చనువుగా, దగ్గరగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దుర్వాసన ఒక సమస్యగా మారుతుంది. పళ్ల మధ్యలో చిక్కుకున్న ఆహారపు అణువులపై సూక్ష్మక్రిములు ఏర్పడ్డం వల్ల దుర్వాసనే కాదు, దంతాలు కూడా పాడవుతాయి. ఇక ...

Read More »

ఎ.టి.యం డబ్బిచ్చేదెలా?

ప్రశ్న: మీటలు నొక్కితే డబ్బులిచ్చే ఏటీఎం ఎలా పనిచేస్తుంది? జవాబు: ఏటీఎం (ATM) అంటే Automatic Teller Machine. ఖాతాదారులు ఈ యంత్రం ద్వారా డబ్బులు తీసుకోడానికి వీలుగా బ్యాంకులు ఏటీఎం కార్డును ఇస్తాయనేది తెలిసిందే. ఆ కార్డుపై ఉండే అయస్కాంతపు బద్దీ(magnetic strip)లో ఖాతాదారుని వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. కార్డును ఏటీఎం యంత్రంలోని స్లాట్‌లో జొప్పించగానే అందులోని PIN (Personal Identification Number) బ్యాంకులోని ఖాతాకు అనుసంధానమవుతుంది. ఖాతాదారునికి మాత్రమే తెలిసిన ఆ నెంబర్‌ను మీటల ద్వారా నొక్కితేనే తదుపరి లావాదేవీలు జరిపేలా ...

Read More »