Breaking News

Daily Archives: June 13, 2016

ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఎస్‌ఎప్‌ఐ నాయకులు కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎప్‌ఐ డివిజన్‌ కార్యదర్శి అరుణ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని, సబ్జెక్టుల వారిగా టీచర్లు లేరని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు తాగడానికినీరులేక, మరుగుదొడ్లు సైతం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టి వాటిలో నెలకొన్న ...

Read More »

న్యాయవాదుల అరెస్టు

  కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంద్రా జడ్జిలు తెలంగాణకు ఇచ్చిన ఆప్షన్‌ను నిరసిస్తూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళన సోమవారం సైతం నిర్వహించారు. ఈక్రమంలో పోలీసులు న్యాయవాదులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ తెలంగాణకు ఇచ్చిన ఆప్షన్‌ను వెంటనే విరమించుకోవాలని, తెలంగాణలో తెలంగాణ న్యాయమూర్తులను నియమించాలని డిమాండ్‌ చేశారు. అరెస్టయిన వారిలో న్యాయవాదులు సిద్దిరాములు, శ్యాంగోపాల్‌రావు, జగన్నాథం, తదితరులున్నారు.

Read More »

వందేభారత్‌ ట్రస్టు చేయూత

  కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన గల్ప్‌ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు వందేభారత్‌ ట్రస్టు ముందుకొచ్చింది. సోమవారం కామారెడ్డి పట్టణంలో వందేమాతరం ట్రస్టు ఆద్వర్యంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు నేతృత్వంలో ఆయన ఆదేశాల మేరకు ఉచితంగా 15 మంది విద్యార్థులను వివిధ ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశం కల్పించారు. వందేభారత్‌ ట్రస్టులోభాగమైన చేయూత ప్రాజెక్టు రాష్ట్ర కన్వీనర్‌ కోటపాటి నర్సింహనాయుడు నేతృత్వంలో కార్యక్రమం జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ...

Read More »

మండప నిర్మాణానికి 41 వేల విరాళం

  కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం మండప నిర్మాణానికి సోమవారం భక్తులు విరాళం అందించారు. కామారెడ్డి మండలం అడ్లూర్‌ గ్రామానికి చెందిన గడ్డమీది నర్సయ్య, మైసమ్మ దంపతులు వీరభద్రయ్య మండప నిర్మాణానికి రూ. 41 వేలు విరాళం అందించారు. ఆలయ అభివృద్ది కోసం విరాళం అందించినట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్‌ లచ్చిరెడ్డి, కార్యదర్శి లింగన్నచారి, అర్చకులు ప్రభాకర్‌స్వామి, గణేష్‌, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆర్థిక ఇబ్బందులతో యువతి ఆత్మహత్య

  కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన ఓ యువతి ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన పనాస శిరీష (21) అనే యువతి పెళ్లి కాకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో మానసిక వేదనకు గురైంది. దీంతో సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపారు.

Read More »

అమ్మో! 148 చక్రాల వాహనం

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒకటి కాదు రెండు కాదు… 148 చక్రాల భారీ వాహనాన్ని చూసి అమ్మో అంటూ నోరువెలబెట్టారు. సోమవారం ఉదయం మండలంలోని మహ్మద్‌నగర్‌, బొగ్గు గుడిసె గ్రామం మీదుగా భారీ వాహనం రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారిపై వెళ్ళవలసిన భారీ వాహనాలు చిన్నపాటి రోడ్లపై నుంచి వెళ్లడంతో ప్రయానీకులతో పాటు వ్యాపారులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంబయి నుంచి నెల్లూరుకు భారీ ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలిస్తున్న 148 చక్రాల వాహనం గ్రామం ...

Read More »

అమ్మా..! చనిపోతున్నాను

  అతనొచ్చేస్తున్నాడు… మమ్మల్ని చంపడానికే వస్తున్నాడు… నేను చనిపోతున్నాను.. ఐ లవ్యూ అమ్మా… బై… ఓ కొడుకు చనిపోయే ముందు క్షణాల్లో తన తల్లికి పంపిన ఆఖరి మెసేజ్ ఇది. ఇక ఆ తల్లి మనసు ఎలా ఉంటుంది.. ? తల్లడిల్లిపోయిన ఆ మాతృహృదయం ఇప్పడు గుండెలవిసేలా విలపిస్తోంది. అమెరికాలో ఓ ముఫ్ఫయ్యేళ్ళ తీవ్రవాది విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 50 మందిలో ఎడీ జస్టిస్ ఒకడు. నైట్ క్లబ్ లో ఆగంతకుడు ఫైరింగ్ స్టార్ట్ చేయగానే జస్టిస్ వెళ్ళి ఓ ...

Read More »

దేవరుణం ఎలా తీర్చుకోవాలి ?

రుణ శేషం, శత్రు శేషం ఉండకూడదు అంటారు. ఈ జన్మలో ఎవరికైనా రుణపడితే, వచ్చే జన్మలో వాళ్ళ ఇంట్లో కుక్కగా పుట్టి ఆ బాకీ తీర్చుకుంటామని పెద్దలు చెప్తుంటారు. ఇంతకీ రుణం అంటే ఇమిటి? బంధుమిత్రుల వద్ద డబ్బు అప్పుగా తీసుకోవడం అని మాత్రమే చాలామందికి తెలుసు. కానీ మరొకరి వస్తువులు లేదా పదార్ధాలు తీసుకుని, తిరిగి ఇవ్వకున్నా అది కూడా బాకీపడటమే అవుతుంది. ఈ సాధారణ రుణాల సంగతి అలా ఉంచితే అనుబంధాల రీత్యా కూడా ఋణపడతాం. ఈ రుణానుబంధాల్లో మొదటిది దేవరుణం. ...

Read More »