Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి

 

కామారెడ్డి, జూన్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఎస్‌ఎప్‌ఐ నాయకులు కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎప్‌ఐ డివిజన్‌ కార్యదర్శి అరుణ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని, సబ్జెక్టుల వారిగా టీచర్లు లేరని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు తాగడానికినీరులేక, మరుగుదొడ్లు సైతం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టి వాటిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రతినిదులు పృథ్వీరాజ్‌, రవికుమార్‌, మణికంఠ, అనిల్‌, శివ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

డబ్బు కోసం హత్యలు

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 26 వ తేదీన బీడీ వర్కర్స్ ...

Comment on the article