Breaking News

Daily Archives: June 15, 2016

రెంజర్లలో షెట్పల్లి గ్రామాన్ని చేర్చాలి

  మోర్తాడ్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న నూతన మండలాల ప్రక్రియలో భాగంగా బాల్కొండ మండలంలోని రెంజర్ల గ్రామాన్ని నూతనంగా ఏర్పాటు చేస్తున్న మండల పరిధిలో మోర్తాడ్‌ మండలంలోని షెట్పల్లి గ్రామాన్ని చేర్చాలని సర్పంచ్‌ గుర్జాల లింబన్న, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు కోరారు. బుధవారం గ్రామ పంచాయతీ, గ్రామస్తులు చేసిన తీర్మానాన్ని మోర్తాడ్‌ ఎంపిడివో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ వెంకట్రావులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌, విడిసి సభ్యులు మాట్లాడుతూ రెంజర్ల గ్రామాన్ని మండలంగా చేయాలని, ...

Read More »

యుక్త వయస్సును నిర్లక్ష్యం చేయొద్దు

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేతి తరం యువతకు ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్య శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా సూచించారు. బుధవారం స్థానిక న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో ప్లాస్టిక్‌ రంగంలో ఉపాధిపై ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా నిరుద్యోగ యువతకు నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం వలన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ...

Read More »

7 లక్షల 20 వేల మొక్కల పెంపకం లక్ష్యం నెరవేరుస్తాం

  మోర్తాడ్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మోర్తాడ్‌ మండలానికి కేటాయించిన 7 లక్షల 20 వేల మొక్కల పెంపకం లక్ష్యాన్ని విజయవంతం చేసి చూపిస్తామని ప్రోగ్రాం అధికారి నర్సయ్య అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్పిటిసిల సహాయ సహకారాలతో హరితహారం పథకం లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. మండలంలోని ఒక్కో గ్రామంలో 40 వేల మొక్కలను నాటి పెంచి సంరక్షిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో, చెరువు గట్లపై రైతుల పంటలు, తోటల్లోకి ...

Read More »

కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి

  బోదన్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యత వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా పిలుపునిచ్చారు. బుధవారం బోధన్‌ పట్టణంలో హరితహారం, జాతీయ ఉపాది హామీ పథకంపై డివిజన్‌ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గత ఏడాది హరితహారం కార్యక్రమం వర్షాభావ పరిస్థితుల వల్ల పూర్తిస్థాయి లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని, ...

Read More »

వేల్పూర్‌లో రామన్నపేట గ్రామాన్ని చేర్చాలి

  మోర్తాడ్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంలో మోర్తాడ్‌ మండలంలోని రామన్నపేట గ్రామాన్ని చేర్చాలని తెరాస రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు వేముల సురేందర్‌రెడ్డి, మండల తహసీల్దార్‌, ఎంపిడివోలకు వినతి పత్రం అందజేసినట్టు స్థానిక సర్పంచ్‌ ఈర్ల లక్ష్మి, కిషన్‌, వైస్‌ ఎంపిపి జాగిరపు మోహన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ శోభన్‌లు తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. రామన్నపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో బాల్కొండ ఎమ్మెల్యే అభివృద్ది పరిచారని అంతేగాకుండా మోతె, రామన్నపేట గ్రామాల మధ్యగల పెద్దవాగుపై వంతెన ...

Read More »

స్పెషల్‌ క్యాటగిరి డిగ్రీ అభ్యర్థులకు 16న దృవపత్రాల పరిశీలన

  బీర్కూర్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌లలో భాగంగా స్పెషల్‌ క్యాటగిరి కింద నమోదుచేసుకున్న అభ్యర్థుల దృవపత్రాల పరిశీలన జూన్‌ 16న గురువారం తెలంగాణ యూనివర్సిటీ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలోఉదయం 10 గంటల నుంచి ఉంటుందని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌, వికలాంగులు, స్పోర్ట్స్‌, ఇంటర్మీడియట్‌ తత్సమాన బోర్డుల్లో చదివిన, ఇతర స్పెషల్‌ క్యాటగిరి అభ్యర్థులందరు కూడా ఈ సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌కు రావాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక ...

Read More »

మహాసభలకు తరలి వెళ్లిన బీడీ కార్మికులు

  ఆర్మూర్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న బీడీ కార్మికుల మహాసభలకు ఆర్మూర్‌ పట్టణం నుంచి ఏఐకెఎంఎస్‌, సిపిఐ (ఎంఎల్‌) నాయకులు బుధవారం భారీగా తరలివెళ్లారు.

Read More »

తెరాసలో భారీ వలసలు

  ఆర్మూర్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని ఖానాపూర్‌లో సర్పంచ్‌ మమత నరేశ్‌, ఎంపిటిసి బాక లక్ష్మి, మల్కన్న, ఉపసర్పంచ్‌ నర్సయ్య, వార్డు సభ్యుల ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివఋద్ది పనులకు ఆకర్షితులై తెలంగాణకు మద్దతు తెలుపుతూ ఖానాపూర్‌ ప్రజలు, వివిధ కుల సంఘాలు, యువజన సంఘాలు, గ్రామ మహిళలు తెరాసకు మద్దతు తెలిపి ప్రతిజ్ఞ తెలిపారు. ముఖ్య అతిథిగా మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మోత్కురి లింగాగౌడ్‌, పిఎంపి మండల ప్రెసిడెంట్‌ డాక్టర్‌ వినయ్‌ పాల్గొన్నారు. ...

Read More »

ఇద్దరు మట్కారాయుళ్ళ అరెస్టు

  ఆర్మూర్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని పంత్‌ రోడ్డులోని విఎన్‌ టేలర్స్‌లో మట్కా ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టుచేసి వారి వద్దనుంచి 4180 రూపాయలు, మట్కా చిట్టీలను స్వాధీనం చేసుకున్నట్టు ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో సీతారాం తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరచగా నేరస్తులకు బుధవారం ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి దత్తయ్య ఐదురోజుల జైలుశిక్ష విధించినట్టు సిఐ వివరించారు.

Read More »

ప్రారంభమైన మిషన్‌ భగీరథ పనులు

  ఆర్మూర్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు మొదలైనట్టు ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటికి నల్లా కనెక్షన్లు కేవలం ఒక్కరూపాయికే ఇస్తున్నట్టు చెప్పారు. లబ్దిదారులు లక్ష రూపాయలలోపు ఆదాయ దృవీకరణ పత్రం, ఆధార్‌కార్డు, ఇంటి పన్ను ప్రస్తుత రసీదు జిరాక్సు కాపీలను జత పరిచి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఇందులో భాగంగా బుధవారం మునిసిపల్‌ అధికారులు, ...

Read More »

షార్జా టవర్‌ నుంచి పడి 4 ఏళ్ళ బాలుడి మృతి

నాలుగేళ్ళ అల్జీరియా బాలుడు షార్జాలోని అల్‌ ముహారియా ప్రాంతంలోని ఓ భవనం 18వ అంతస్తు నుంచి కిందికి పడి అక్కడికక్కడే చనిపోయాడు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే అంబులెన్స్‌ మరియు అల్‌ బుహారియా పోలీస్‌ స్టేషన్‌ పెట్రోల్స్‌ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అప్పటికే తీవ్ర గాయాలతో ఆ బాలుడు చనిపోయాడు. అల్‌ ఖాసిమి ఆసుపత్రికి బాలుడి మృత దేహాన్ని తరలించారు. ఇంట్లోని ఫర్నిచర్‌ ద్వారా విండో చేరుకున్న బాలుడు, అక్కడి నుంచి పడిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రుల్ని పోలీసులు విచారిస్తున్నారు. యూఏఈలోని ...

Read More »

బ్యాంకుల జోష్‌- మార్కెట్లు ఫ్లాట్‌

బులియన్‌ జోరు- రూపాయి బేజారు ముంబై: ఒత్తిడిలో ఉన్న రుణాల నుంచి బయటపడేందుకు ఆర్‌బిఐ కొత్త పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో పిఎ్‌సయు బ్యాంకుల షేర్లు దాదాపు 8 శాతం లాభపడ్డాయి. పిఎన్‌బి 7.90 శాతం, బిఒఐ 3.37 శాతం, ఎస్‌బిఐ 2.65 శాతం దూసుకపోయాయి. అయితే బ్రెక్సిట్‌, ఫెడ్‌ భయాలతో మార్కెట్లు మాత్రం చప్పగా ముగిసాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 1.06 పాయింట్ల నష్టంతో 26,395.71 పాయింట్ల వద్ద, నిఫ్టీ 1.75 పాయింట్ల నష్టంతో 8,108.85 పాయింట్ల వద్ద ముగిసాయి. స్మాల్‌క్యాప్‌ 0.54 శాతం, ...

Read More »

కోదండరామ్‌ను ఎవరెన్ని అన్నా ఆ మంత్రి విమర్శించడం మాత్రం బాగోలేదట !

ప్రొఫెసర్‌ కోదండరామ్‌ చేసిన వ్యాఖ్యలకు డజన్‌ మంది మంత్రులు ఘాటైన కౌంటర్‌ ఇచ్చారు.. ఈ విషయంలో మాత్రం ఓ మంత్రి తప్పులో కాలేశారా…? సొంత పార్టీ నేతలే ఆయన వ్యాఖ్యల పట్ల నారాజ్‌ అయ్యారా..? అంతమంది మంత్రుల విమర్శలను తెలంగాణ సమాజం పట్టించుకోవడం లేదు కానీ.. ఆ ఒక్క మంత్రి కామెంట్లను ఎందుకు సీరియస్‌గా తీసుకుంటోంది.. ఇంతకీ ఎవరా మంత్రి..? ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్న ఒకే ఒక్క మాట రాష్ర్ట మంత్రివర్గాన్ని కదిలించింది.. చేతకాకుంటే దిగిపోండి… మేం చూసుకుంటాం అన్న కోదండరామ్‌ వ్యాఖ్యతో మంత్రులు ...

Read More »

టిఫిన్‌ రూ.1, భోజనం: రూ.5

గుంటూరు: నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో అన్న క్యాంటీన్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ ఇక్కడ భేటీ అయ్యింది. పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ, అమరావతి పరిధిలోని వెలగపూడి, తుళ్లూరు, నవులూరులో క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి క్యాంటీన్‌లో 500 మందికి అల్పాహారం, భోజనం అందించనున్నట్టు పేర్కొన్నారు. రూ.కే టిఫిన్‌, రూ.5కు భోజనం అందిస్తామన్నారు. ఇందుకుగానూ ఏడాదికి రూ.50 లక్షలు ఖర్చుఅవుతుందని అంచనాగా చెప్పారు.

Read More »

మా చెడ్డ ప్రేమ

ఒకప్పుడు ఇంట్లో అందరికీ ఒకే ఫోన్ ఉండేది. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఒక ఫోను! అప్పుడు ఫోన్ మోగితే ఎవరు ఎత్తినా పర్లేదు. ఇప్పుడు ఫోన్ మోగితే ఎవరూ ఎత్తడానికీ వీల్లేదు. పెళ్లి ప్రమాణాల్లో…‘యు అండ్ మీ.. నథింగ్ ఇన్ బిట్వీన్’ – అంటే.. నువ్వు, నేను… మధ్యలో ఇంకేం లేదు అంటాం.. దాపరికాలు, అరమరికలు, రహస్యాలు ఉండవని! తస్సాదియ్యా.. మొగుడికి మేకు, పెళ్లానికి ఏకై… స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. నమ్మకం నుంచి పుట్టాల్సిన ‘కన్‌సర్న్’ కాస్తా… అనుమానం నుండి పుట్టుకొస్తోంది! ఏమైనా… ...

Read More »

తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేయాలి

కామారెడ్డిలీగల్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగినా ఆంధ్రా న్యాయమూర్తులు తెలంగాణ రా ష్ట్రంలో ఇచ్చిన ఆప్షన్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని కామారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయవాదులు మంగళవారం కలెక్టర్ యోగితారాణాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆంధ్రా ప్రాంత న్యాయమూర్తులు తెలంగాణకు ఇచ్చిన ఆప్షన్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ ప్రాంత న్యాయమూర్తులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. చాలా ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంత న్యాయమూర్తుల నియామకాలు జరగవన్నారు. ...

Read More »

చంద్రబాబూ.. నీ బావమరిది సినిమాలే చూడాలా?

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాను భయపెట్టి సొంత డబ్బా కొట్టించుకుంటున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. మంగళవారం విజయవాడలో జరుగుతున్న వైఎస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు అవినీతి, ఆయన చిల్లర రాజకీయాల గురించి చూపిస్తారని సాక్షి టీవీ ప్రసారాలను ఆపేశారని కొడాలి నాని ఆరోపించారు. రాష్ట్రం ఏమైనా మీ జాగీరా? మీ బావమరిది, మీ తమ్ముడి కొడుకు సినిమాలనే టీవీలో చూడాలా? మాకు నచ్చిన చానెల్ను చూడనివ్వరా? అంటూ చంద్రబాబును నిలదీశారు. సాక్షి ...

Read More »

స్నేహితుని అప్రమత్తతో కొద్దిలో తప్పించుకున్నాడు..

హైదరాబాద్: ఓఎల్‌ఎక్స్‌లో పెట్టిన ఓ వాహనాన్ని కొనుగోలు చేయబోయి కొద్దిలో మోసం నుంచి బయటపడ్డాడు రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన సరూన్. 2011 మోడల్‌కు చెందిన ఇన్నోవా కారు కేవలం 5 వేల కిలోమీటర్లే తిరిగిందని, రూ. 6లక్షల 80 వేలకే అమ్ముతామని ప్రకటన పెట్టారు. దీంతో కొనడానికి సిద్ధమైన సరూన్ అందులో ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేయగా నేను అమెరికాలో ఉన్నా. కారును శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని కస్టమ్స్ వీఐపీ పార్కింగ్‌లో పెట్టా అని చెప్పాడు. నీకు బేగం అనే మేడమ్ నెంబర్ ఇస్తా.. ...

Read More »

నేటితో ఎగ్జిబిషన్ ముగింపు

నిజామాబాద్ స్పోర్ట్స్ : నగరంలోని కంఠేశ్వర్‌లో గల పాలిటె క్నిక్ మైదానంలో 45 రోజులుగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పారిశ్రామిక వ్యవసాయ ప్రదర్శన బుధవారంతో ముగియ నుంది. మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి బిగాల కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దశాబ్దాలుగా ఎగ్జిబిషన్ సొసైటీ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలన్నారు. సొసైటీ సభ్యులంతా క లిసి జిల్లా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఇలాంటి ప్రదర్శన లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వివిధ పోటీల్లో వారికి, ...

Read More »