Breaking News

స్నేహితుని అప్రమత్తతో కొద్దిలో తప్పించుకున్నాడు..

హైదరాబాద్: ఓఎల్‌ఎక్స్‌లో పెట్టిన ఓ వాహనాన్ని కొనుగోలు చేయబోయి కొద్దిలో మోసం నుంచి బయటపడ్డాడు రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన సరూన్. 2011 మోడల్‌కు చెందిన ఇన్నోవా కారు కేవలం 5 వేల కిలోమీటర్లే తిరిగిందని, రూ. 6లక్షల 80 వేలకే అమ్ముతామని ప్రకటన పెట్టారు. దీంతో కొనడానికి సిద్ధమైన సరూన్ అందులో ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేయగా నేను అమెరికాలో ఉన్నా. కారును శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని కస్టమ్స్ వీఐపీ పార్కింగ్‌లో పెట్టా అని చెప్పాడు. నీకు బేగం అనే మేడమ్ నెంబర్ ఇస్తా.. ముందు 83 వేలు కడితే వాహనాన్ని చూసుకొని నచ్చితే మిగతా నగదు చెల్లించి తీసుకోవచ్చు వివరించాడు. సరూన్ ఆ యువతికి ఫోన్ చేయగా ముందు రూ. 83 వేలను డిపాజిట్ చేయమని చెప్పింది. తర్వాత విమానా శ్రయంలోని వీఐపీ పార్కింగ్ దగ్గరకు వస్తే మీకు వాహనం చూపిస్తానంది.

దీంతో సరూన్ డబ్బులు కూడా రెడీ చేసుకున్నాడు. అయితే స్నేహితుడి సలహాతో ముందు ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఎంక్వైరీ చేశారు. అక్కడ అలాంటి వాహనం ఉన్నట్టు తెలియలేదు. దీంతో బేగంకు ఫోన్ చేయగా మీరు డబ్బును డిపాజిట్ చేయకుండా ఎయిర్‌పోర్టుకు ఎందుకు వచ్చారు ? అంటూ ఫోన్ కట్ చేసింది. మళ్లీ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. వెబ్‌సైట్‌లో నెంబరుకు చేయగా దాని పరిస్థితి అదే..దీంతో కొద్దిలో తాను మోసం నుంచి బయటపడ్డానని గ్రహించి శంషాబాద్ పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేశాడు.

Check Also

పోలీసువారి హెచ్చరిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ 1వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నకిలీ ...

Comment on the article