Breaking News

ప్రారంభమైన మిషన్‌ భగీరథ పనులు

 

ఆర్మూర్‌, జూన్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు మొదలైనట్టు ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటికి నల్లా కనెక్షన్లు కేవలం ఒక్కరూపాయికే ఇస్తున్నట్టు చెప్పారు.

లబ్దిదారులు లక్ష రూపాయలలోపు ఆదాయ దృవీకరణ పత్రం, ఆధార్‌కార్డు, ఇంటి పన్ను ప్రస్తుత రసీదు జిరాక్సు కాపీలను జత పరిచి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఇందులో భాగంగా బుధవారం మునిసిపల్‌ అధికారులు, ఐకెపి, మెప్మా సభ్యులు ఇంటింటికి తిరుగుతూ నల్లా కనెక్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Check Also

ఎమ్మెల్యేను సన్మానించిన సొసైటీ సభ్యులు

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట్‌ సొసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, వైస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *